హైదరాబాద్లో పుట్టిపెరిగన వారు స్థానికులు కారా? | Seemandhra secretariat employees takes on TRS Chief K. Chandrashekar Rao | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో పుట్టిపెరిగన వారు స్థానికులు కారా?

Published Thu, May 22 2014 4:54 PM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM

హైదరాబాద్లో పుట్టిపెరిగన వారు స్థానికులు కారా? - Sakshi

హైదరాబాద్లో పుట్టిపెరిగన వారు స్థానికులు కారా?

రాష్ట్రానికి సీఎం ఎవరైనా రాజ్యాంగం ప్రకారం పని చేయాల్సిందేని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు అన్నారు. గురువారం సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు సచివాలయంలో మాట్లాడుతు... ఆప్షన్స్ ఇస్తే తమ ప్రాంతంలో పని చేస్తామని స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రాంతాన్ని తామే అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు. 

 

సీమాంధ్ర ఉద్యోగులు ఎవ్వరూ స్థానికత కోసం ఎప్పుడు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించలేదని వెల్లడించారు.  హైదరాబాద్లో పుట్టిపెరిగిన వారు స్థానికులు కాకుండా ఎలా పోతారని సీమాంధ్ర ఉద్యోగులు ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులను సంతృప్తిపరిచేందుకే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అలా మాట్లాడారని వారు ఆరోపించారు.

 

తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగులు తెలంగాణలోనే పని చేయాలని... అలాగే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లోనే పని చేయాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. తమ సచివాలయంలోకి ఆంధ్ర ఉద్యోగులను అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. ఓ వేళ తమ సచివాలయంలోకి వచ్చిన ఆంధ్ర ఉద్యోగులు ప్రవేశించిన బలవంతంగా బయటకు పంపుతామని కేసీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగులు పై విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement