TRS chief
-
అధినేత కేసీఆర్
టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికల్లో ఏకగ్రీవం 24న ప్లీన రీలో అధికారిక ప్రకటన పోటీ లేదని ప్రకటించిన మంత్రి నాయిని 27న పది లక్షల మందితో బహిరంగ సభ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల అధికారిగా వ్యవహరించిన హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సోమవారం తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్లు స్వీకరించారు. మధ్యాహ్నం 2 గంటలకు గడువు ముగిసే వరకు ఇతరులెవరూ నామినేషన్లు వేయకపోవడంతో కేసీఆర్ ఏకగ్రీవమయ్యారు. 24వ తేదీన జరగనున్న పార్టీ ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. కేసీఆర్ తరఫున పార్టీకి చెందిన నాయకులు ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ మంత్రుల తరఫున డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీల నుంచి పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, పార్టీ జిల్లా అధ్యక్షుల తరఫున నల్లగొండ అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేల పక్షాన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జిల్లా పరిషత్ చైర్మన్ల తరఫున ఖమ్మం జెడ్పీ చైర్పర్సన్ కవిత, అడహాక్ కమిటీ నుంచి కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్లు వేశారు. ఇతర నేతలు ఆయన పేరును బలపరిచారు. గడువులోగా దాఖలైన నామినేషన్లను పరిశీలించామని, అన్నీ సక్రమంగానే ఉన్నాయని మంత్రి నాయిని మీడియాతో చెప్పారు. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించుకునే విషయం అధినేత కేసీఆర్ ఇష్టమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా టీఆర్ఎస్ ఎదిగింద ని, అంతా కలసి పార్టీని మరింత పటిష్టం చేసుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతమైందని, కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించామని, వారందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని మంత్రి నాయిని పేర్కొన్నారు. 27వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు 10 లక్షల మందిని సమీకరిస్తున్నామన్నారు. మంగళవారం నుంచి రాజధాని నగరాన్ని గులాబీ మయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే ఉత్సాహంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్తా కృషి చేయాలన్నారు. మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగురామన్న, మహేం దర్‌రెడ్డి, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
కెసిఆర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
-
కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన సోమిరెడ్డి
టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కేసీఆర్ త్వరలో సీఎం అవుతున్నారు. ఈ సమయంలో కూడా బంద్‌కు పిలవడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బంద్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం దారణమని ఆయన ఆరోపించారు. మీరే కాదు వివాదాలు మేము సృష్టించగలమని ఆయన టీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ ఒక్కే ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చావు తప్పి కన్ను లోట్టపోయిన చందంగా ఆ పార్టీ తయారైందని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. -
హైదరాబాద్‌లో పుట్టిపెరిగన వారు స్థానికులు కారా?
రాష్ట్రానికి సీఎం ఎవరైనా రాజ్యాంగం ప్రకారం పని చేయాల్సిందేని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు అన్నారు. గురువారం సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు సచివాలయంలో మాట్లాడుతు... ఆప్షన్స్ ఇస్తే తమ ప్రాంతంలో పని చేస్తామని స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రాంతాన్ని తామే అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగులు ఎవ్వరూ స్థానికత కోసం ఎప్పుడు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించలేదని వెల్లడించారు. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన వారు స్థానికులు కాకుండా ఎలా పోతారని సీమాంధ్ర ఉద్యోగులు ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులను సంతృప్తిపరిచేందుకే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అలా మాట్లాడారని వారు ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగులు తెలంగాణలోనే పని చేయాలని... అలాగే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌లోనే పని చేయాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. తమ సచివాలయంలోకి ఆంధ్ర ఉద్యోగులను అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. ఓ వేళ తమ సచివాలయంలోకి వచ్చిన ఆంధ్ర ఉద్యోగులు ప్రవేశించిన బలవంతంగా బయటకు పంపుతామని కేసీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగులు పై విధంగా స్పందించారు. -
'కేసీఆర్‌కు... సీమాంధ్రపై అక్కసే ఎక్కువగా ఉంది'
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ తనదైన శైలిలో విమర్శించారు. కేసీఆర్ వ్యవహారం చూస్తుంటే తెలంగాణ అభివృద్ది కంటే సీమాంధ్ర ప్రాంతంపై అక్కసే ఎక్కువగా కనిపిస్తుందని ఆమె ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగం శనివారం తెలంగాణ ప్రాంతంలోని మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నిర్వహించిన సభలో సుష్మా స్వరాజ్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో కూడా కేసీఆర్ ఇరు ప్రాంతాలలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన తరువాత కూడా ఆ ప్రాంతంపై కేసీఆర్ దృష్టి సారించకుండా... సీమాంధ్ర ప్రత్యేక రాష్ట్రంపై ఆసూయతో మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ఆమె కేసీఆర్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనతో అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర ప్రాంతాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యమని సుస్మా స్వరాజ్ ధీమా వ్యక్తం చేశారు. -
కారుకు కే‘డర్’
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ తెచ్చిన ఘనత తమదేనంటున్న టీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో కేడర్ కష్టాలు తప్పడం లేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఆ పార్టీకి తెలంగాణవాదుల్లో ఆదరణ ఉన్నప్పటికీ, అనుచరగణం అంతగా లేకపోవడంతో పల్లెపల్లెకు కారును తీసుకువెళ్లడం క్లిష్టతరంగా మా రింది. రెండు, మూడు నియోజకవర్గాలు మినహా జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొంది. నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా వ్యవహరించిన నాయకులు ఇన్నాళ్లు కేడర్‌ను పెంచుకునే ప్రయత్నాలపై దృష్టి సారించలేదు. పైగా కొన్ని స్థానాల్లో ఇన్‌చార్జీలకు కాకుండా, కొత్త వారికి టిక్కెట్లు దక్కడంతో ఆయా చోట్ల ఆ పార్టీకి కొంత ఇబ్బందిగా తయారైంది. ముఖ్యనాయకులు కొందరు కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో వారి అనుచరులు కొందరు పార్టీని వీడారు. ఇన్నాళ్లు ఉద్యమంపైనే దృష్టి పెట్టడంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. పలు నియోజకవర్గాల్లో.. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఉన్న కోవ లక్ష్మి కేడర్ నిర్మాణం కోసం పెద్దగా దృష్టి సారించలేదు. పైగా ఉన్న నాయకులను ఇప్పు డు కలుపుకుని పోవడంలో కొంత వైఫల్యం కనిపిస్తోంది. దీంతో ఆమెతో కలిసి పనిచేయలేమని స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఇటీవల అక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా రాములునాయక్ వ్యవహరించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఆయన బోథ్‌కు వచ్చి వెళుతూ ఉండేవారు. ఇప్పడు ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థిగా రాథోడ్ బాపురావు బరిలో ఉన్నారు. రాములు నాయక్‌కు టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు కొంత మంది కాంగ్రెస్ వైపు వెళ్లారు. ముథోల్‌లో టీడీపీ నుంచి వచ్చిన వేణుగోపాలాచారి కూడా ఆశించిన మేరకు కేడర్‌ను పెంచుకోలేక పోయారు. చాలా ఏళ్లుగా నిర్మల్ నుంచి ప్రాతినిథ్యం వహించిన వేణుగోపాలాచారి, కొంత కాలంగా ముథోల్‌కు వచ్చారు. బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జీగా వినోద్ వ్యవహరించే వారు. వినోద్ రాకతో పలు మండలాల్లో నాయకులు టీఆర్ఎస్లో చేరినప్పటికీ, తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోవడంతో ఆయన అనుచరులు చాలావరకు కాంగ్రెస్‌ను వీడారు. మంచిర్యాలలో నివాసముండే దుర్గం చిన్నయ్య కూడా బెల్లంపల్లిలో పార్టీ కేడర్‌ను పెంచుకునే దిశగా పెద్దగా దృష్టి సారించలేదు. రేఖాశ్యాంనాయక్ ముందుగా ఆసిఫాబాద్ నియోజకవర్గ బాధ్యతల్లో ఉండేవారు. కొంత కాలంగా ఖానాపూర్‌లో కేడర్ నిర్మాణం కోసం దృష్టి సారించినప్పటికీ, తీరా ఎన్నికల సమయానికి మండల నాయకులతో విభేదాలు ఆమెకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇటీవల కడెం మండల పార్టీ నాయకులతో విభేదాలు నెలకొనడంతో ఆ మండలంలోకి కొంత మంది కార్యకర్తలు రేఖ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఖానాపూర్‌లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి నెలకొనడంతోపాటు, పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. మంచిర్యాలలో అరవిందరెడ్డి టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో టీఆర్ఎస్ కేడర్ కొంత అరవిందరెడ్డితో కాంగ్రెస్‌లోకి వచ్చింది. కాంగ్రెస్‌లో ఉన్న దివాకర్‌రావు టీఆర్ఎస్లోకి వెళ్లడంతో ఆయన వెంట కొంత కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ సాధించిన ఘనత ముందు కేడర్ లేమి పెద్ద విషయమేమీ కాదని, ప్రజలు తమనే ఆదరిస్తారని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధినేత కేసీఆర్ పర్యటనతో తమ పార్టీ శ్రేణుల్లో ఊపు వస్తుందని భరోసాలో అభ్యర్థులున్నారు. నేడు కేసీఆర్ సుడిగాలి పర్యటన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి వరకు తొమ్మిది నియోజకవర్గాల్లో జరుగనున్న ప్రచార సభల్లో పాల్గొంటారు. ఈ మేరకు సుడిగాలి పర్యటన షెడ్యుల్ ఇటీవలే ఖరారైన సంగతి విధితమే. హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకుని చెన్నూర్ మినహా మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొంటారు. మొదటి సభ మధ్యాహ్నం భైంసాలో మొదలై చివరి సభ సాయంత్రం మంచిర్యాలలో ముగుస్తుంది. కేసీఆర్ సభ కోసం టీఆర్ఎస్ శ్రేణులు భారీ జన సమీకరణ చేస్తున్నారు. ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. -
కేసీఆర్‌ను ఎవ్వరూ నమ్మరు: జైరాం రమేశ్
సాక్షి, హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు మాట్లాడే మాటలకు.. చేతలకు.. భూమికి, ఆకాశానికి మధ్య ఉన్నంత తేడా ఉందని కేంద్రమంత్రి జైరాం రమేశ్ అన్నారు. మంగళవారం ఆయన వరంగల్ డీసీసీ భవన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చింది ధోకా, ఢక్కా ఇచ్చే పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు కాదని చెప్పారు. కేసీఆర్‌ను ఎవరూ నమ్మరని, తెలంగాణ ఉద్యమాన్ని ఆయున ప్రారంభించడానికి వుుందే తమ పార్టీ నేతలు పోరాడారని గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణలో హంగ్ ఏర్పడే అవకాశమే లేదని, కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ పొత్తు వల్ల తెలంగాణలో కాంగ్రెస్‌కు వచ్చిన నష్టం ఏమీ లేదని, చంద్రబాబు అద్దం ముందు నిలబడితే మోడీ ప్రతిబింబం కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. -
జిల్లాకు బంగారు భవిత
చేవెళ్ల గర్జనలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్ల, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తయితే రంగారెడ్డి జిల్లా భవిత బంగారుమయం అవుతుందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని ఆంధ్రోళ్లు దుష్ర్పచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని ఆయన జిల్లా ప్రజలకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం చేవెళ్లలో నిర్వహించిన గర్జన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రంగారెడ్డి జిల్లాలోని భూముల ధరలు ఎన్నో రెట్లు పెరుగుతాయన్నారు. ప్రస్తుతం రూ.రెండు కోట్లున్న ఎకరం ధర రానున్న రోజుల్లో రూ.20 కోట్లు పలుకుతుందని అన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఐటీఐఆర్ రాబోతున్నదని, దీంతో జిల్లా దశమారుతుందని, హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకోనున్నదని చెప్పారు. జిల్లాలోని భూముల విలువ కూడా బాగా పెరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో కూరగాయలు అధికంగా పండిస్తారని, జిల్లాను కూరగాయల స్పెషల్ జోన్‌గా ప్రకటిస్తామని వెల్లడించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చేవెళ్లలో కూరగాయల పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామని వివరించారు. 500ఎకరాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని రైతులకు 80శాతం సబ్సిడీపై రుణాలు ఇస్తామని పేర్కొన్నారు. గ్రీన్‌హౌస్‌ల ద్వారా సాగుచేసే రైతులకు కమర్షియల్ కింద విద్యుత్‌ను అందిస్తున్నారని, తాము అధికారంలోకివస్తే వ్యవసాయానికి వర్తించేవిధంగా ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని పేర్కొన్నారు. కూరగాయలు, పాలు, పూల రైతులను ప్రోత్సహిస్తామన్నారు. ఈ ప్రాంత ప్రజలకు గుదిబండగా మారిన 111జీఓను పునఃసమీక్షించడమో, అవసరమైతే రద్దు చేయడమో చేస్తామని స్పష్టంచేశారు. శంకర్‌పల్లిలో 4వేల మెగావాట్ల అల్ట్రా విద్యుత్ ప్రాజెక్టు శంకర్‌పల్లిలో ఎన్టీపీసీని ఏర్పాటుచేస్తామని, నాలుగు వేల మెగావాట్ల అల్ట్రా ప్రాజెక్టును ఏర్పాటుచేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టువల్ల 15 వేల నుంచి 16వేల మంది యువకులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. జిల్లా నుంచి ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులు.. హైదరాబాద్‌కు ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలో చాలా పనులు చేయాల్సి ఉందని, టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే జిల్లానుంచి ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులుంటారని కేసీఆర్ చెప్పారు. జిల్లాకు ప్రత్యేకమైన చరిత్ర ఉన్నదని, అవసరాలు కూడా చాలానే ఉన్నాయని పేర్కొన్నారు. ఎంతో మం ది సీనియర్ నాయకులున్నారని, టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పారు. వేది కపై పేర్లు చెప్పడం ఇష్టంలేదుగానీ.. ఇద్దరు ముగ్గురు మం త్రులు ప్రభుత్వంలో ఉంటారని మాత్రం చెప్పగలనన్నారు. వంద టీఎంసీల ప్రాజెక్టు నిర్మిస్తాం పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో వంద టీఎంసీల ప్రాజెక్టును ఏర్పాటుచేసి జిల్లాలోని భూములను సస్యశ్యామలం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. చేవెళ్ల -ప్రాణహిత ప్రాజెక్టు సాధ్యమయ్యేపనికాదని, మన మునిమనవలు కూడా ఈ ప్రాజెక్టును చూడరని ఎద్దేవాచేశారు. షాద్‌నగర్ సమీపాన ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామం 670 మీటర్ల ఎత్తులో ఉన్నదని, అక్కడినుంచి జూరాల ద్వారా రెండు లిఫ్ట్‌లను ఏర్పాటుచేసి నీటిని తీసుకొస్తే జిల్లాలో తాగునీరు, సాగునీటి అవసరాలు తీరుతాయని అన్నారు. తెలంగాణలో ఈ ప్రాజెక్టు మరో నాగార్జునసాగర్ అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టునుంచి హైదరాబాద్ నగరానికి మంచినీటిని కూడా అందించేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకుంటాం ‘మాజీ ఉపముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డి శిష్యుడు భూదాన్ రాంచంద్రారెడ్డి భూదోనోద్యమం ద్వారా వందలాది ఎకరాలు దానం చేశారు.. వాటిని కూడా సీమాంధ్రోళ్లు కబ్జాచేసిండ్రు. నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలోని వక్ఫ్, గురుకుల, పేదలకు ఇచ్చిన భూదానోద్యమ భూములు ఆంధ్రోళ్ల పాలైనై. 763 ఎకరాల గురుకుల భూములను కూడా కబ్జాచేశారు. హుస్సేనీషావలి, వక్ఫ్ భూములను ల్యాంకో సంస్థ కబ్జా చేస్తే టీఆర్ఎస్ పోరాటం చేసింది. చంద్రబాబు బంధువులు, అక్కినేని నాగార్జున తదితరులు జిల్లాలోని భూములను చాలావరకు కబ్జా చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కబ్జా చేసిన భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటాం. ఈ భయంతోనే టీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా పలు పార్టీలు కుట్రపన్నుతున్నాయి’ అని కేసీఆర్ పేర్కొన్నారు. అంతేకాకుండా వక్ప్‌బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలను కట్టబెడతామని కేసీఆర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో యాదిరెడ్డి స్మారక స్థూపం ‘తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో మంది యువకులు ప్రాణత్యాగాలు చేశారు. ఈ నియోజకవర్గంలోని పెద్దమంగళారం గ్రామానికి చెందిన యాదిరెడ్డి పార్లమెంటు భవనం ముందు ఆత్మత్యాగం చేసిండు. యాదిరెడ్డి ఆత్మ శాంతించాలంటే కాంగ్రెస్, టీడీపీలు గెలవకూడదు. నిజమైన తెలంగాణవాదులు గెలవాలి. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఐదు ఎకరాల స్థలంలో అంతర్జాతీయ స్థాయిలో యాదిరెడ్డి స్మారక స్థూపాన్ని ఏర్పాటుచేస్తాం’ అని కేసీఆర్ తెలిపారు. కార్యక్రమంలో చేవెళ్ల లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు కె.హరీశ్వర్‌రెడ్డి, పి.మహేందర్‌రెడ్డి, కేఎస్.రత్నం, సంజీవరావు, మనోహర్‌రెడ్డి, స్వర్ణలతారెడ్డి, శంకర్‌గౌడ్, ఎమ్మెల్సీలు పి.నరేందర్‌రెడ్డి, స్వామిగౌడ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
'నన్ను తిట్టడమే కేసీఆర్ ప్రచారమనుకుంటున్నారు'
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మరోసారి విరుచుకుపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ... మమ్మల్ని సన్యాసులని తిట్టడం కేసీఆర్ దురహంకారానికి నిదర్శనమన్నారు. సన్యాసులకు అధికారం అప్పగించవద్దని కేసీఆర్ ప్రజలను కోరుతున్నారు... అలా అంటే ఆయన తెలంగాణలో ఓటమిని అంగీకరించినట్లే అంటూ విమర్శించారు. తనన్ను తిట్టడమే కేసీఆర్ ప్రచారమనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జలయజ్ఞంలో అవకతవకలు జరిగాయంటున్న కేసీఅర్ చేస్తున్న ఆరోపణలపై పొన్నాల స్పందించారు. నాడు టీడీపీ హయాంలో ముంత్రిగా ఉన్న కడియం శ్రీహరి దేవాదులకు 10 శాతం మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారని గుర్తు చేశారు. సదరు మంత్రిగారు ప్రస్తుతం మీ పార్టీలో ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆ విషయంపై కడియంను తప్పుపట్టమంటే ఏమంటావు అంటూ కేసీఆర్‌ను పొన్నాల ప్రశ్నించారు. -
కేసీఆర్‌పై దుబాయిలో పలు కేసులు నమోదు!
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. గురువారం హైదరాబాద్‌లో పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ... కేసీఆర్‌కు భారత రాజ్యాంగంపై నమ్మకం లేనట్లుందని... అందుకే ఉద్యోగుల విభజనపై రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. విభజన బిల్లులో ఉద్యోగుల బదిలీలపై కేసీఆర్‌కు అనుమానాలు ఉన్నంట్లుందని... అలా అయితే ఆ అనుమానాలను ఎందుకు పార్లమెంట్లో గతంలో లేవనెత్తలేదని కేసీఆర్‌ను పొన్నాల ప్రశ్నించారు. కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ఉద్యోగులకు పొన్నాల ఈ సందర్భంగా సూచించారు. ఉద్యోగుల అభిప్రాయాలతో టి.కాంగ్రెస్ ఏకీభవిస్తోందని ఆయన స్సష్టం చేశారు. కేసీఆర్ గతంలో నుంచి చేస్తున్న తప్పులను తాను ఎత్తి చూపుతున్నానని... అందుకే తనను అదేపనిగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌పై దొంగ పాస్ పోర్ట్... మనుషుల అక్రమ రవాణా చేసినట్లు దుబాయ్‌లో కేసులు నమోదు అయినట్లు తెలిపారు. ఆ కేసులపై ఏ ప్రభుత్వ సంస్థ కేసీఆర్‌కు క్లీన్ చిట్ ఇవ్వలేదన్న విషయాన్ని పొన్నాల స్పష్టం చేశారు. -
తెలంగాణను మోసం చేసింది 'ఆ ఇద్దరే'
తెలంగాణను మోసం చేసింది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్లే అని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి జి.వివేక్‌లు ఆరోపించారు. మంగళవారం వారు హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ... తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తో సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కేసీఆర్ సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ఉద్యమద్రోహులకు కేసీఆర్ టిక్కెట్లిచ్చారని వారు విమర్శించారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను పార్టీలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్‌లు కాంగ్రెస్ అధిష్టానానికి మాట ఇచ్చారని గుత్తా, వివేక్‌లు గుర్తు చేశారు. ఇచ్చిన మాటను టీఆర్ఎస్ విస్మరించిందని అన్నారు. కానీ తెలంగాణ ఇస్తామన్న మాటకు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా కట్టుబడి... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంస్థను సరిగ్గా నడపలేని కేసీఆర్.... తెలంగాణను ఎలా పునర్నిర్మిస్తాంటూ వివేక్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. గుజరాత్ లోని గోద్రా అల్లర్లకు ముఖ్య కారకుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ అని గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారని వారు గుర్తు చేశారు. అలాంటి బాబు ప్రస్తుతం మతోన్మాద శక్తులకు ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. -
కలికితురాయి కరీంనగర్
మొదటిసారి ఇక్కడే తెలంగాణ జెండా ఎగురవేసిన అనుకున్నట్లే రాష్ట్రం తెచ్చిన అంతా జిల్లా ప్రజల దీవెన ఎన్నికల శంఖారావంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : ఉద్యమాల గడ్డ కరీంనగర్ నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల సమరశంఖం పూరించారు. జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన బహిరంగసభలో పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన తర్వాత టీఆర్ఎస్ ముందున్న ర్తవ్యం గురించి ఆయన సుదీర్ఘంగా వివరించారు. పద్నాలుగేళ్ల క్రితం ఇదే గ్రౌండ్... ఇదే వేదిక నుంచి తెలంగాణ జెండా ఎగురవేశానని గుర్తు చేసుకున్నారు. ‘ఆ రోజు ఇక్కడున్నోళ్లు... టీవీల్లో చూసినోళ్లు... పొలగాడు బాగానే బయలుదేరిండు గనీ, బక్కపలుచగున్నడు... గీనేతోనేమైద్దీ అనుకున్నరు. మీ అందరి దయ... కరీంనగర్లో మీరిచ్చిన దీవెనతో రాష్ట్రం సాధించిన’ అని ప్రజల హర్షధ్వానాల మధ్య చెప్పారు. మొదటిసారి ఇదే ఎస్సారార్ కళాశాల మైదానంలో ప్రొఫెసర్ జయశంకర్, కెప్టెన్ లక్ష్మీకాంతరావుతో కలిసి బ్రహ్మండమైన సింహగర్జన సభ నిర్వహించి తెలంగాణ ఉద్యమానికి బయలుదేరామని చెప్పారు. కరీంనగర్‌పై తనకు నమ్మకముందని, ఏ పని చేపట్టినా సఫలమవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి సభ కరీంనగర్లో పెట్టుకున్నామని, విజయం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఓట్లడిగేవాళ్లను చూస్తే సిగ్గేస్తుంది : కే.కేశవరావు తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వాళ్లు... వెన్నుపోటుపొడిచిన వాళ్లు... ఎంతోమందిని జైలుకు పంపించినవాళ్లు... తనకు తెలుసని... వాళ్లంతా ఇప్పుడు తెలంగాణ అని అంటే సిగ్గేస్తోందని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు విమర్శించారు. శంఖారావంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో అమరుల సంతాప తీర్మానాన్ని కూడా చేయలేని వాళ్లు ఈ రోజు అమరుల గురించి మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజల జీవితాలను ధన్యం చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. కరీంనగర్ సింహస్వప్నం :నాయిని తెలంగాణ వ్యతిరేకులకు కరీంనగర్ జిల్లా సింహస్వప్నం వంటిదని టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా పోరాటాల పురిటిగడ్డ అని, ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభించి రాష్ట్రం సాధించామన్నారు. చంద్రబాబు ఏజెంట్ కోటి రూపాయలతో దొరికాడని, టీడీపీతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీకి ఓటు వేస్తే తెలంగాణను అడ్డుకున్న టీడీపీకి వేసినట్లేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. కరీంనగర్ లోకసభ అభ్యర్థి బోయినిపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ నవ తెలంగాణ నిర్మాణాన్ని యావత్ ప్రపంచానికి ఈ సభ తెలియచేస్తుందన్నారు. పెద్దపల్లి లోకసభ అభ్యర్థి బాల్క సుమన్ మాట్లాడుతూ రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి తనలాంటి విద్యార్థికి టికెట్ ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కరీంనగర్ భీముడు గంగుల... పులిబిడ్డ పుట్ట మధు కరీంనగర్ భీముడు గంగుల కమలాకర్ ను గెలిపించాలని కేసీఆర్ చమత్కరించారు. జిల్లాలోని అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను పేరుపేరునా ప్రజలకు పరిచయం చేసి గెలిపించాలని కోరారు. అభ్యర్థుల గురించి చేసిన వ్యాఖ్యలు సభికులను ఉత్సాహపరిచాయి. గంగులను భీముడిగా అభివర్ణించిన కేసీఆర్, పుట్ట మధును బాంబుగా, పులిబిడ్డగా పేర్కొన్నారు. తన బిడ్డ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొమురంభీం విగ్రహాన్ని పెట్టడానికి వెళితే అడ్డుకొని విగ్రహాన్ని జైలులో పెట్టించాడని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై మండిపడ్డారు. మంథని ప్రజలు చరిత్ర తిరగరాయాలన్నారు. ఈటెల రాజేందర్‌ను పరిచయం చేస్తున్న సమయంలో ప్రజలు కేకలు వేయడంతో, ‘ఈటెలకు గాలి బాగుంది అన్నారు. జగిత్యాల అభ్యర్థి డాక్టర్ సంజయ్‌ను పరిచయం చేసే సమయంలోనూ గోల పెరగడంతో వీళ్లు జగిత్యాలోల్లా...సంజయ్‌కు కూడా గాలిబాగానే ఉందన్నారు. కరీంనగర్ లోకసభ అభ్యర్థి బి.వినోద్‌కుమార్ గురించి చెబుతూ కరీంనగర్ మిషన్ ఆస్పత్రిలోనే వినోద్‌కుమార్ పుట్టాడని, ఆయనను ఆదరించాలన్నారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి బాల్క సుమన్‌పై మాజీ సీఎం కిరణ్‌కుమార్ 150 కేసులు పెట్టాడన్నారు. పరిచయం సందర్భంగా కేసీఆర్‌కు పెద్దపల్లి లోకసభ అభ్యర్థి బాల్క సుమన్, చొప్పదండి అసెంబ్లీ అభ్యర్థి బొడిగె శోభ పాదాభివందనం చేశారు. దాసరి మనోహర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, సోమారపు సత్యనారాయణ, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కొప్పుల ఈశ్వర్, వొడితెల సతీష్‌బాబు, చెన్నమనేని రమేశ్‌బాబును పరిచం చేసి గెలిపించాలన్నారు. పరిచయానికి కేటీఆర్ దూరం టీఆర్ఎస్ అభ్యర్థుల పరిచయం సమయంలో కేసీఆర్ కుమారుడు, సిరిసిల్ల అభ్యర్థి కేటీఆర్ దూరంగా ఉండడం ఆసక్తి కలిగించింది. సభావేదిక కింద ప్రజల నడుమ కూర్చున్న కేటీఆర్, అభ్యర్థులు ముందుకు రావాలని కేసీఆర్ సూచించినప్పటికీ వేదికనెక్కలేదు. దీంతో 12 మంది అసెంబ్లీ అభ్యర్థులను మాత్రమే కేసీఆర్ పరిచయం చేశారు. నిజామాబాద్ లోకసభ అభ్యర్థి కవిత కూడా కిందనే కూర్చొని వేదికపైకి రాకపోవడంతో ఆమెను పరిచ యం చేయలేకపోయారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, చెన్నాడి సుధాకర్‌రావు, మాజీ మంత్రి కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, జి.రాజేశంగౌడ్, తుల ఉమ, ఓరుగంటి ఆనంద్, తన్నీరు శరత్‌రావు, జి.వి.రామకృష్ణారావు, పన్యాల భూపతిరెడ్డి, సర్ధార్ రవీందర్‌సింగ్, కట్ల సతీశ్, ఎడ్ల అశోక్, గుగ్గిళ్లపు రమేశ్, చల్ల హరిశంకర్, వేల్ముల పుష్పలత, కటారి రేవతిరావు, అక్బర్ హుస్సేన్, దిండిగాల మహేశ్, కోల ప్రశాంత్, అంజద్, గుంజపడుగు హరిప్రసాద్, మైకేల్ శ్రీను, దూలం సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
'టీఆర్ఎస్ పునర్నిర్మాణమందంటే దొరల పాలనే'
తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మాట తప్పారని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఆదివారం నల్గొండలో మోత్కుపల్లి మాట్లాడుతూ కేసీఆర్ వైఖరిపై మండిపడ్డారు. టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ పార్టీ అని విమర్శించారు. తెలంగాణ పునర్నిర్మాణమని టీఆర్ఎస్ అంటుందని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ పునర్నిర్మాణమంటే దొరల పాలనను మళ్లీ నిర్మించడమేనని మోత్కుపల్లి పేర్కొన్నారు. -
కేసీఆర్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం : పల్లా రాజేశ్వర్‌రెడ్డి
దేవరకొండ, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమని ఆ పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకొండ టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకసారి టీడీపీలో, మరోసారి కాంగ్రెస్‌లో ఎంపీగా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను విమర్శించే స్థాయి కాదన్నారు. కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలితే టీఆర్ఎస్ ఊరుకునే స్థితిలో లేదని హెచ్చరించా రు. కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి కేతావత్ లాలునాయక్ గాజుల ఆంజనేయులు, ఏ.వి.రెడ్డి, సపావట్ నిరంజన్‌నాయక్, రాంబాబునాయక్ తదితరులు ఉన్నారు. -
కేసీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
రాష్ట్ర విభజన ఆపాలని కోరుతూ న్యాయవాది ఎమ్ఎల్ శర్మ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయంతో రాష్ట్ర విభజన చేసిందని, ఆ నిర్ణయాన్ని నిలవరించాలని శర్మ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్ ) దాఖలు చేశారు. గతంలో దాఖలైన పిటిషన్లకు ఆ పిల్ జత చేయాలని సుప్రీం కోర్టు శర్మను ఆదేశించింది. అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. విభజనపై ఇది వరకే కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సంగతిని ఈ సందర్బంగా సుప్రీం గుర్తు చేసింది. నోటీసులపై కేంద్రం నుంచి సమాధానం వచ్చిన వెంటనే విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే శర్మ దాఖలు చేసిన పిల్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను నాలుగో ప్రతివాదిగా చేర్చారు. దాంతో కేసీఆర్‌కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. -
నేడు హైదరాబాద్‌కు కేసిఆర్
-
బంద్ స్వచ్ఛందం
పాలమూరు, న్యూస్‌లైన్: రాయల తెలంగాణ ప్రతిపాదనపై తెలంగాణవాదులు భగ్గుమన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం జిల్లాలో బంద్ స్వచ్ఛందం, సంపూర్ణంగా కొనసాగింది. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్, టీజేఏసీ, ఇతర అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, ఆందోళనలు కొనసాగాయి. ముందస్తుగా బంద్ పాటించాలని నిర్ణయించిన మేరకు అన్ని విద్యాసంస్థలు, హోటళ్లు, వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు, పెట్రోలు బంక్‌లు మూతబడ్డాయి. ఆర్టీసీ కార్మికులు ఈ బంద్‌లో పాల్గొన్నారు. అందులో భాగంగానే తెల్లవారుజామున టీఆర్ఎస్ శ్రేణులు మహబూబ్‌నగర్‌లోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బస్సులు రాకుండా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. టీజేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు విధులను బహిష్కరించి నల్లబ్యాడ్జీలు ధరించి పట్టణంలో భారీర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి ముందుండి నడిపించారు. రాయల తెలంగాణ అంటూ ప్రజాస్వామ్యానికి కేంద్రం సంకెళ్లు వేసిందని ఏబీవీపీ నాయకులు చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన చేపట్టారు. తెలంగాణ చౌరస్తా వరకు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. అలాగే బంద్‌లో భాగంగా పట్టణంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ జాగృతి, టీసీపీఎం ఆధ్వర్యంలో వేర్వేరుగా బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఓవైసీకి సెగ..! ఎంఐఎం ముఖ్య నాయకుడు చంద్రాయన్‌గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి తెలంగాణ సెగ తగిలింది. కొత్తూరు మండలం జహంగీర్ పీర్ దర్గాలో ప్రత్యేకప్రార్థనలు చేసిన ఆయన దర్గా నుంచి బయటకు వస్తుండగా.. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు అడ్డుకుని ‘జై తెలంగాణ’ నినాదాలు చేయాలని పట్టుబట్టారు. ఒక్కసారిగా తెలంగాణవాదులు భారీసంఖ్యలో ఆయనను చుట్టుముట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. దూస్కల్ మీదుగా బైపాస్ రోడ్డుకు చేర్చడంతో హైదారాబాద్‌కు చేరుకున్నారు. మక్తల్ నియోజకవర్గంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కొడంగల్, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో తెలంగాణవాదులు నిరసన వ్యక్తం చేశారు. షాద్‌నగర్‌లో టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ, బీజేపీ, జేఏసీ, సీపీఐ, ఎంఎస్ఎఫ్ నాయకులు బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. ముఖ్యకూడలిలో మానవహారం నిర్వహించారు. వనపర్తి పట్టణంలో టీఆర్ఎస్, బీజేపీ, టీజేఏసీ ప్రతినిధులు ఉదయం ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు. అలాగే జడ్చర్లలో వ్యాపార సముదాయాలు, సినిమా హాళ్లు, కార్యాలయాలు, పోలేపల్లి సెజ్‌లోని ఫార్మా కంపెనీలను స్వచ్ఛందంగా మూసివేశారు. స్థానిక కొత్తబస్టాండ్ ప్రాంతంలో ఉదయం ఎనిమిది బస్సులను అడ్డుకున్నారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు పట్టణంలో మోటార్‌సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఎక్కడి బస్సులు అక్కడే మహబూబ్‌నగర్ అర్బన్ : తెలంగాణ బంద్‌లో భాగంగా టీఆర్ఎస్ ఇచ్చిన బంద్ పిలుపుతో జిల్లాలో ఆర్టీసీ బస్సులకు బ్రేకులు పడ్డాయి. గురువారం జిల్లాలోని ఎనిమిది డిపోల్లో సుమారు 800 బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో ఆర్టీసీకి ఒక్కరోజు రూ.70లక్షల నష్టం వాటిల్లింది. టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ నేతలు, సభ్యులు సంతకాలు కూడా చేయకుండా రాయల తెలంగాణ పట్ల తీవ్ర నిరసన తెలిపారు. కాగా తెలంగాణ నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు మాత్రం విధులకు హాజరైనట్లు సంతకాలు చేసినా బస్సులను బయటికి రాకుండా ఆందోళనకారులు అడ్డుకోవడంతో వారంతా డిపోలోనే గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రయాణికులు, బస్సులు రాకపోవడంతో బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు, తెలంగాణ విద్యార్థి , ప్రజాసంఘాలు తెల్లవారుఝామునే డిపో ఎదుట బైటాయింపు చేశారు.