కేసీఆర్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం : పల్లా రాజేశ్వర్‌రెడ్డి | Telangana reconstruction with kcr: Palla rajeshwarreddy | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం : పల్లా రాజేశ్వర్‌రెడ్డి

Published Sat, Apr 12 2014 1:49 AM | Last Updated on Fri, Mar 22 2019 1:49 PM

పల్లా రాజేశ్వర్‌రెడ్డి - Sakshi

పల్లా రాజేశ్వర్‌రెడ్డి

దేవరకొండ, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమని ఆ పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకొండ టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకసారి టీడీపీలో, మరోసారి కాంగ్రెస్‌లో ఎంపీగా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను విమర్శించే స్థాయి కాదన్నారు.

 

కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలితే టీఆర్‌ఎస్ ఊరుకునే స్థితిలో లేదని హెచ్చరించా రు. కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలన్నారు.  సమావేశంలో టీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థి కేతావత్ లాలునాయక్  గాజుల ఆంజనేయులు, ఏ.వి.రెడ్డి, సపావట్ నిరంజన్‌నాయక్, రాంబాబునాయక్ తదితరులు ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement