కేసీఆర్పై దుబాయిలో పలు కేసులు నమోదు!
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. గురువారం హైదరాబాద్లో పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ... కేసీఆర్కు భారత రాజ్యాంగంపై నమ్మకం లేనట్లుందని... అందుకే ఉద్యోగుల విభజనపై రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. విభజన బిల్లులో ఉద్యోగుల బదిలీలపై కేసీఆర్కు అనుమానాలు ఉన్నంట్లుందని... అలా అయితే ఆ అనుమానాలను ఎందుకు పార్లమెంట్లో గతంలో లేవనెత్తలేదని కేసీఆర్ను పొన్నాల ప్రశ్నించారు. కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ఉద్యోగులకు పొన్నాల ఈ సందర్భంగా సూచించారు.
ఉద్యోగుల అభిప్రాయాలతో టి.కాంగ్రెస్ ఏకీభవిస్తోందని ఆయన స్సష్టం చేశారు. కేసీఆర్ గతంలో నుంచి చేస్తున్న తప్పులను తాను ఎత్తి చూపుతున్నానని... అందుకే తనను అదేపనిగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్పై దొంగ పాస్ పోర్ట్... మనుషుల అక్రమ రవాణా చేసినట్లు దుబాయ్లో కేసులు నమోదు అయినట్లు తెలిపారు. ఆ కేసులపై ఏ ప్రభుత్వ సంస్థ కేసీఆర్కు క్లీన్ చిట్ ఇవ్వలేదన్న విషయాన్ని పొన్నాల స్పష్టం చేశారు.