
పొన్నాల లక్ష్మయ్య (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను బయటకు తీయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్న వార్తలపై పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఘాటుగా స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, తనకు ఏ కుంభకోణంతోనైనా సంబంధం ఉందని నిరూపిస్తే అసెంబ్లీ ముందే ఉరేసుకుంటానని చెప్పారు. కేసీఆర్‌కు కాంగ్రెస్ అంటే భయం పట్టుకుందన్నారు. టీఆర్‌ఎస్ హయాంలో వెలుగులోకి వచ్చిన నయీం కేసు, మియాపూర్ భూముల కుంభకోణంపై విచారణ ఎంతవరకు వచ్చిందో సమా«ధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment