Fake passport case
-
ఛోటా రాజన్‌కు జైలు శిక్ష
న్యూఢిల్లీ: నకిలీ పాస్ట్ పోర్ట్ కేసులో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌తో పాటు మరో ముగ్గురికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. సోమవారం వీరిని దోషులుగా నిర్ధారించిన ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ రోజు (మంగళవారం) శిక్షలను ఖరారు చేసింది. వీరికి జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వీరేందర్ కుమార్ గోయల్ తీర్పు చెప్పారు. ఫోర్జరీ పత్రాలతో మారుపేరుతో ఛోటా రాజన్ పాస్ పోర్టు పొందినట్టు గతేడాది జూన్ 8న సీబీఐ కోర్టులో అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. రాజన్‌తో పాటు పాస్ పోర్టు అధికారులు జయశ్రీ దత్తాత్రేయ్ రహతె, దీపక్ నట్వర్లాల్ షా, లలిత లక్ష్మణన్‌లపై కేసు నమోదైంది. 1998-99లో బెంగళూరులో ఛోటా రాజన్.. మోహన్ కుమార్ అనే పేరుతో నకిలీ పాస్ పోర్టు పొందాడని, ఇందుకు పాస్ట్ పోర్టు అధికారులు సహకరించారని సీబీఐ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. నేరం రుజువు కావడంతో రాజన్‌తో పాటు అతనికి సహకరించిన వారికి శిక్ష పడింది. 2015 అక్టోబర్‌లో ఇండోనేసియా పోలీసులకు పట్టుబడ్డ రాజన్‌ను ఆ ఏడాది నవంబర్‌లో భారత్‌కు అప్పగించారు. -
ఛోటా రాజన్‌కు మరో ఎదురు దెబ్బ
-
ఛోటా రాజన్‌కు మరో ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు మరో ఎదురుదెబ్బ తగలింది. నకిలీ పాస్ పోర్టు కేసులో సోమవారం ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఛోటా రాజన్‌ను దోషీగా ప్రకటించింది. రేపు (మంగళవారం) రాజన్‌కు శిక్షను ఖరారు చేయనున్నట్టు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వీరేందర్ కుమార్ గోయల్ ప్రకటించారు. ఫోర్జరీ పత్రాలతో మారుపేరుతో ఛోటా రాజన్ పాస్ పోర్టు పొందినట్టు గతేడాది జూన్ 8న సీబీఐ కోర్టులో అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. రాజన్‌తో పాటు పాస్ పోర్టు అధికారులు జయశ్రీ దత్తాత్రేయ్ రహతె, దీపక్ నట్వర్లాల్ షా, లలిత లక్ష్మణన్‌లపై కేసు నమోదైంది. 1998-99లో బెంగళూరులో ఛోటా రాజన్.. మోహన్ కుమార్ అనే పేరుతో నకిలీ పాస్ పోర్టు పొందాడని, ఇందుకు పాస్ట్ పోర్టు అధికారులు సహకరించారని సీబీఐ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. నేరం రుజువు కావడంతో రాజన్‌తో పాటు అతనికి సహకరించిన వారిని కోర్టులో దోషులుగా ప్రకటించింది. హత్యలు, స్మగ్లింగ్, కిడ్నాప్ సహా రాజన్‌పై 85కు పైగా కేసులున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లతో అతనిపై దాఖలైన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2015 అక్టోబర్‌లో ఇండోనేసియా పోలీసులకు పట్టుబడ్డ రాజన్‌ను ఆ ఏడాది నవంబర్‌లో భారత్‌కు అప్పగించారు. -
బాత్రూమ్ కిటికీ నుంచి జంప్
నకిలీ పాస్‌పోర్టు కేసులో తప్పించుకున్న బ్రిటిషర్ ఢిల్లీ కోర్టు నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తుండగా ఘటన సాక్షి, హైదరాబాద్: నకిలీ పాస్‌పోర్టు, చీటింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న బ్రిటన్ దేశస్తుడు మహ్మద్ అలీ రాష్ట్ర పోలీసుల కళ్లుగప్పి ఢిల్లీలోని రైల్వే స్టేషన్ బాత్రూమ్ కిటీకి నుంచి పరారయ్యాడు. స్కాట్లాండ్ పోలీసులకు పలు చీటింగ్ కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న అలీ నాలుగేళ్ల క్రితం నకిలీ పాస్పోర్టుతో హైదరాబాద్ వచ్చి బస చేశాడు. అప్పుడు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అలీని అరెస్ట్ చేసి సీఐడీకి అప్పగించారు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో విచారణ ఖైదీగా ఉన్న అతడిని ఢిల్లీలోని పాటియాల కోర్టులో పీటీ వారెంట్‌పై బుధవారం రాష్ట్ర సీఐడీ పోలీసులు హాజరు పరిచారు. తిరుగు ప్రయాణంలో భాగంగా ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. బాత్రూమ్కు వెళ్లాలని చెప్పడంతో మహ్మద్ అలీని ఎస్కార్ట్ పోలీసులు తీసుకెళ్లారు. లోపలికి వెళ్లిన అతడు... బాత్రూమ్ కిటికీ నుంచి బయటకు దూకి తప్పిం చుకున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఢిల్లీలో అతడిని పట్టుకొనేందుకు సీఐడీ రెండు బృందాలను రంగంలోకి దింపింది. ఎస్కార్ట్‌గా వెళ్లిన నగర పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించామని సిటీ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. వేషాలు మార్చడంలో దిట్టయిన మహ్మద్ అలీని పట్టుకొనేందుకు ఢిల్లీ పోలీసులతో కలిసి రాష్ట్ర పోలీసులు వేట సాగిస్తున్నట్టు తెలిసింది. -
నాకు నకిలీ పాస్‌పోర్టు ఇచ్చింది అధికారులే: రాజన్
ఉగ్రవాదులపై పోరాడేందుకు వీలుగా భారత నిఘా వర్గాలే తనకు నకిలీ పాస్‌పోర్టు ఇప్పించాయని మాఫియా డాన్ ఛోటా రాజన్ కోర్టులో చెప్పాడు. బ్యాంకాక్‌లో 16 ఏళ్ల క్రితం నుంచి దావూద్ ఇబ్రహీం మనుషులు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని.. అందుకే తనకు మోహన్ కుమార్ అనే పేరుతో పాస్‌పోర్టు ఇచ్చారని ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగిన విచారణలో రాజన్ వెల్లడించాడు. ఉగ్రవాదులతోను, భారత వ్యతిరేక శక్తులతోను తాను పోరాడుతున్నానని, తనకు సాయం చేసిన వాళ్ల పేర్లు ఏంటో ఇప్పుడు బయట పెట్టలేనని అన్నాడు. దేశ ప్రయోజనాల కోసమే తాను ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడానని చెప్పాడు. దాదాపు పాతికేళ్ల నుంచి ఎవరికీ చిక్కకుండా తప్పించుకుంటున్న ఛోటా రాజన్‌ను గత సంవత్సరం ఇండోనేసియాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముందుగా అతడిపై నకిలీ పాస్‌పోర్టు కలిగి ఉన్నందుకు కేసు పెట్టారు. అతడితో పాటు మరో ముగ్గురు మాజీ పాస్‌పోర్టు అధికారుల మీద కూడా ఈ కేసు నమోదైంది. భారతీయ నిఘా సంస్థలకు 1993 ముంబై పేలుళ్ల నిందితుల గురించి తాను సమాచారం ఇస్తున్నట్లు తెలియడంతో దావూద్ మనుషులు తనను చంపేందుకు ప్రయత్నించారని విచారణలో రాజన్ తెలిపాడు. తన అసలు పాస్‌పోర్టును దుబాయ్‌లో వాళ్లు లాగేసుకున్నారని అన్నాడు. రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జే. ఉగ్రవాదులపై పోరాటం సాగించేందుకే తాను తన గుర్తింపును రహస్యంగా ఉంచాల్సి వచ్చిందని తెలిపాడు. -
చోటా రాజన్‌పై సీబీఐ తొలి చార్జిషీటు
న్యూఢిల్లీ: నకిలీ పాస్‌పోర్టు కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌పై తొలి చార్జిషీట్‌ను సీబీఐ మంగళవారం దాఖలు చేసింది. రాజన్ సహా ముగ్గురు మాజీ పాస్‌పోర్టు ఉద్యోగులనూ నిందితులుగా పేర్కొంది. బెంగళూరు పాస్‌పోర్టు ఆఫీసుఉద్యోగులు రాజన్‌కు తప్పుడు అడ్రస్‌తో పాస్‌పోర్టు మంజూరవడానికి సాయపడ్డారని సీబీఐ పటియాలా హౌస్ కోర్టులో వె ల్లడించారు. -
భారత్‌కు ఉగ్రవాది గిడ్డా అజీజ్
-
భారత్‌కు ఉగ్రవాది గిడ్డా అజీజ్
⇒ ఎట్టకేలకు డిపోర్టేషన్‌పై... నగరంలో నమోదైన కేసుల్లో మోస్ట్ వాంటెడ్ ⇒ బోస్నియా అంతర్యుద్ధంలో కీలకపాత్ర ⇒ నకిలీ పాస్‌పోర్ట్ కేసులో తొమ్మిదేళ్ల క్రితం సౌదీలో అరెస్టు ⇒ శిక్షాకాలం పూర్తికావడంతో తిప్పి పంపిన అధికారులు సిటీబ్యూరో: నగరానికి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్ భారత్‌కు వస్తున్నాడు. సౌదీ అరేబియాలో తలదాచుకుని, అక్కడ నుంచే ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తూ వచ్చాడు. పుష్కరకాలంగా పోలీసు, నిఘా వర్గాలు వేటాడుతున్న ఇతగాడిని తొమ్మిదేళ్ల క్రితం నకిలీ పాస్‌పోర్ట్ కేసులో సౌదీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసులో శిక్ష పూర్తి చేసుకున్న అజీజ్‌ను డిపోర్టేషన్‌పై బలవంతంగా తిప్పి పంపిస్తున్నట్లు హైదరాబాద్ అధికారులకు ఆదివారం సౌదీ నుంచి సమాచారం అందింది. సోమవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో విమానాశ్రయం లో అజీజ్ విమానం దిగుతున్నట్లు తెలిసి నగరం నుంచి నిఘా విభాగం అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఇతడిని మంగళ-బుధవారాల్లో సిటీకి తరలించి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఫసీ మాడ్యుల్ ద్వారా ఉగ్రబాట... భవానీనగర్‌కు చెందిన అబ్దుల్ అజీజ్ 1985 నుంచి 87 వర కు పాతబస్తీలోని మదీనా ప్రాంతంలో ఉన్న ఓ పెట్రోల్ పంప్లో మేనేజర్‌గా పని చేశాడు. నల్గొండ జిల్లా బోనాల్‌పల్లికి చెందిన నిషిద్ధ స్టూడెం ట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాది మహ్మద్ ఫసీయుద్దీన్ అలి యాస్ ఫసీ ద్వారా ఉగ్రవాద బాటపట్టాడు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు (ఎల్ఈటీ) అనుబంధంగా ఆజం ఘోరీ ఏర్పాటు చేసిన ఇండియన్ ముస్లిం మహమ్మదీ ముజాహిదీన్ (ఐఎంఎంఎం)తో సంబంధాలు ఏర్పాటు చేసుకుని సన్నిహితంగా మెలిగాడు. హత్యలు, దోపిడీలతో పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ఫసీ అతని అనుచరుడు మీర్ 1993 జూన్ 21న కార్ఖానా పరిధిలో జరి గిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. 2000లో కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన ఎన్కౌంటర్లో ఆజం ఘోరీ చని పోయాడు. దీంతో సౌదీ అరేబియాకు వెళ్లిపోయిన గిడ్డా అజీజ్ అక్కడే ఇంటర్నేషనల్ ఇస్లామిక్ రిలీఫ్ ఆర్గనైజేషన్ (ఐఐఆర్వో) అనే సంస్థలో చేరాడు. పూర్తి స్థాయి జిహాదీ వాలంటీర్లతో కూడిన ఈ సంస్థలో అజీజ్ కీలకపాత్ర పోషించాడు. ఆ సంస్థకు చెందిన షేక్ అహ్మద్ అనే వ్యక్తి ద్వారా రూ.9.5 లక్షలు అందుకున్న అజీజ్ ఆ డబ్బు వెచ్చించి నగరానికి చెందిన యువతనూ ఉగ్రవాదం వైపు ఆకర్షించడంతో పాటు పేలుడు పదార్థాల సమీకరణకు పురిగొల్పాడు. ‘బాబ్రీ’ ఉదంతం తరవాత రెచ్చిపోయిన అజీజ్ అయోధ్యతో పాటు హైదరాబాద్‌లోనూ భారీ స్థాయిలో విధ్వంసానికి కుట్రపన్నాడు. రెండు దేశాలు... మూడు పాస్‌పోర్టులు... బోస్నియా-చెచెన్యాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాలకు ఆకర్షితుడైన అజీజ్ 1995లోనే ఆ దేశానికి వెళ్లొచ్చాడు. ఆ యుద్ధా ల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు అనేక మంది యువతకు ఉగ్రవాద శిక్షణ కూడా ఇచ్చాడు. 1995 జూలై 17 బోస్‌ని యా నుంచి అసలు పేరుతోనే పాస్‌పోర్ట్ పొందాడు. ఆపై భారత్‌కు వచ్చిన గిడ్డా అజీజ్ 1993 జనవరి 7న సికింద్రాబాద్ ఆర్పీఓ కార్యాలయం నుంచి తన పేరుతోనే మరో పాస్‌పోర్ట్ తీసుకున్నాడు. 2000 అక్టోబర్ 3న అబ్దుల్ కరీం పేరు తో ఇంకో నకిలీ పాస్‌పోర్ట్ పొందాడు. అజీజ్ సహా అతడి అనుచరుల్ని నగర పోలీసులు 2001 ఆగస్టు 28న అరెస్టు చేశారు. విధ్వంసాలకు కుట్ర పన్నిన ఆరోపణలపై అభియోగాలు మోపారు. అరెస్టు సమయంలో పోలీసులు నకిలీ పాస్‌పోర్ట్‌తో పాటు బెల్జియం తయారీ తుపాకీ, పేలుడు పదార్థాలు, రెచ్చగొట్టే సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిల్ పొందిన అజీజ్ సౌదీ అరేబియాకు పారిపోయాడు. గణేశ్ ఆలయం పేల్చివేతకు కుట్ర... మూడేళ్ల పాటు సౌదీలోనే ఉన్న అజీజ్ 2004లో హైదరాబాద్ వచ్చాడు. నగరానికి చెందిన మరికొం దరితో కలిసి సికింద్రాబాద్‌లో ఉన్న గణేశ్ ఆలయం పేల్చివేతకు కుట్రపన్నాడు. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పేలుళ్లకు పన్నిన ఈ కుట్రను ఛేదించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు మిగిలిన నింది తుల్ని అరెస్టు చేయగా... గిడ్డా అజీజ్ త్రుటిలో తప్పించుకున్నాడు. బోస్నియా పాస్‌పోర్ట్ వినియోగించి అడ్డదారిలో సౌదీ పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. అజీజ్‌ది నకిలీ పాస్‌పోర్ట్ అని గుర్తిం చిన సౌదీ అధికారులు 2007లో అరెస్టు చేశా రు. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసులు రెండు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న అజీజ్‌పై 2008లో ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించారు. సౌదీలో నకిలీ పాస్‌పోర్ట్ కేసు విచారణ, శిక్ష పూర్తికావడంతో అక్కడి అధికారులు భారత్‌కు డిపోర్ట్ చేశారు. కానిస్టేబుల్ కుమారుడు... అజీజ్ తండ్రి మెహతబ్ అలీ పోలీసు కానిస్టేబుల్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు. నగర సాయుధ విభాగంగా పిలిచే సీఏఆర్ హెడ్-క్వార్టర్స్‌లో హెడ్-కానిస్టేబుల్‌గా పని చేసిన అలీ ప్రస్తుతం నగర శివార్లలోని షహీన్‌నగర్‌లో స్థిరపడ్డారు. గిడ్డా సోదరుడు అబ్దుల్ రషీద్ అదే ప్రాంతంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. -
అబూసలేం పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం
న్యూఢిల్లీ: మాఫీయా డాన్ అబూసలేం పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నకిలీ పాస్‌పోర్టు కేసులో ఏడేళ్ల జైలుశిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. 2001లో ఈ నేరానికి పాల్పడినందుకు అబూ సలేంతోపాటు బాలీవుడ్ నటి మోనికా బేడీని సెప్టెంబర్ 2002లో పోర్చుగల్‌లోని లిస్బన్లోని ఓ షాపింగ్ మాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు నిందితులను నవంబర్ 11, 2005లో భారత్‌కు తీసుకు వచ్చారు. 2007లో మౌనికా బేడీని భోపాల్ కోర్టు నిర్ధోషిగా ప్రకటించడంతో మోనికా బేడి జైలు నుంచి విడుదల అయ్యింది. హైదరాబాద్ సీబీఐ నాంపల్లి కోర్టు అబూ సలేంకు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే అబూసలెం రైలులో వివాహం చేసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. -
కేసీఆర్‌పై దుబాయిలో పలు కేసులు నమోదు!
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. గురువారం హైదరాబాద్‌లో పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ... కేసీఆర్‌కు భారత రాజ్యాంగంపై నమ్మకం లేనట్లుందని... అందుకే ఉద్యోగుల విభజనపై రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. విభజన బిల్లులో ఉద్యోగుల బదిలీలపై కేసీఆర్‌కు అనుమానాలు ఉన్నంట్లుందని... అలా అయితే ఆ అనుమానాలను ఎందుకు పార్లమెంట్లో గతంలో లేవనెత్తలేదని కేసీఆర్‌ను పొన్నాల ప్రశ్నించారు. కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ఉద్యోగులకు పొన్నాల ఈ సందర్భంగా సూచించారు. ఉద్యోగుల అభిప్రాయాలతో టి.కాంగ్రెస్ ఏకీభవిస్తోందని ఆయన స్సష్టం చేశారు. కేసీఆర్ గతంలో నుంచి చేస్తున్న తప్పులను తాను ఎత్తి చూపుతున్నానని... అందుకే తనను అదేపనిగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌పై దొంగ పాస్ పోర్ట్... మనుషుల అక్రమ రవాణా చేసినట్లు దుబాయ్‌లో కేసులు నమోదు అయినట్లు తెలిపారు. ఆ కేసులపై ఏ ప్రభుత్వ సంస్థ కేసీఆర్‌కు క్లీన్ చిట్ ఇవ్వలేదన్న విషయాన్ని పొన్నాల స్పష్టం చేశారు. -
అబుసలేంను థానే జైలుకు తరలింపు
హైదరాబాద్ : నకిలీ పాస్‌పోర్టుల కేసులో ఏడేళ్లు శిక్ష పడిన మాఫియా డాన్ అబూసలేంను పోలీసులు మహరాష్ట్ర థానే జైలుకు తరలించారు. ఇప్పటికే అబూ సలేం 6 సంవత్సరాల 10 రోజులు జైలుశిక్ష అనుభవించాడు. పన్నెండేళ్ల తర్వాత అబూసలేం కేసులో నాంపల్లి కోర్టు గురువారం తుది తీర్పును వెల్లడించింది. అబూసలేంపై 120 (బి), 490, 471 సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారమే ఈ కేసులో అబూసలేంను దోషిగా నిర్థారించారు. ఇదే కేసులో సినీ నటి మోనికా బేడి మూడేళ్ల జైలుశిక్ష అనుభవించింది. -
మాఫియాడాన్‌కు ఏడేళ్ల శిక్ష
-
మాఫియా డాన్ అబూ సలేంకు ఏడేళ్ల జైలుశిక్ష
నకిలీ పాస్ పోర్టుల కేసులో మాఫియా డాన్ అబూ సలేంకు నాంపల్లి క్రిమినల్ కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. పన్నెండేళ్ల తర్వాత అబూ సలేం కేసులో కోర్టు తుది తీర్పును వెల్లడించింది. అబూసలేంపై 120 (బి), 490, 471 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారమే నకిలీ పాస్ పోర్ట్ కేసులో అబూ సలేంను దోషిగా నిర్ఱారించారు. ఇప్పటికే అబూ సలేం 6 సంవత్సరాల 10 రోజులు జైలుశిక్ష అనుభవించారు. ఇదే కేసులో సినీ నటి మోనికా బేడి మూడేళ్ల జైలుశిక్ష అనుభవించింది. -
అబూసలేం దోషి
సాక్షి, హైదరాబాద్: నకిలీ పాస్‌పోర్టు కేసులో మాఫియా డాన్ అబూసలేంను దోషిగా సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. అబూసలేంకు విధించే శిక్ష ఈనెల 28న ఖరారవుతుందని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రమణ నాయుడు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో 39 మంది సాక్షుల వాంగ్మూలాలను, 60 డాక్యుమెంట్లను పరిశీలించి అనంతరం, భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని 420, 419, 471, 468 రెడ్‌విత్ 120(బి) సెక్షన్ల కింద అబూసలేంను దోషిగా నిర్ధారించినట్టు కోర్టు సోమవారం పేర్కొంది. కర్నూలు చిరునామాతో రమిల్‌కమిల్ మాలిక్ అన్న పేరుతో అబూసలేం, అతని భార్య సమీరాజుమానీ, ప్రియురాలు సినీ నటి మోనికాబేడీ 2001లో నకిలీ పాస్‌పోర్టులను పొందారు. అనంతరం వారు పోర్చుగల్‌కు పరారయ్యారు. వారిపై రెడ్‌కార్నర్ నోటీసులు జారీ కావడంతో పోర్చుగల్ రాజధాని లిస్బన్లో 2002 సెప్టెంబర్‌లో అక్కడి పోలీసులు వారిని అరెస్టు చేశారు. అనంతరం 2005 నవంబర్ 11న వారిని పోర్చుగల్ నుంచి సీబీఐ అధికారులు మనదేశానికి తీసుకొచ్చారు. ఇదే కేసులో మోనికాబేడీకి కోర్టు గతంలో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. నిందితులుగా ఉన్న కర్నూలు ఎస్పీ కార్యాలయ ఉద్యోగి శ్రీనివాస్, హెడ్‌కానిస్టేబుల్ సత్తార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహ్మద్ యూనస్, పోస్టుమన్ గోకారీ సాహెబ్‌లకు ఇప్పటికే సీబీఐ కోర్టు శిక్ష విధించింది. కేసులో రెండో నిందితురాలైన అబూసలేం భార్య సమీరా జుమానీ ఆచూకీని వరకు సీబీఐ కనిపెట్టదు. దీనితో ఆమెపై విచారణ పెండింగ్‌లో ఉంది. ఇక, ముంబై జైల్లోని అబూసలేంను సోమవారం ప్రత్యేక కోర్టులో హాజరుపర్చాల్సి ఉన్నా...భద్రతా కారణాల రీత్యా హాజరుపర్చలేదు. ఈనెల 28న శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో అబూసలేంను కోర్టులో హాజరుపర్చనున్నారు. -
అబూసలేంను దోషిగా నిర్ధారించిన సిబిఐ కోర్టు
హైదరాబాద్: నకిలీ పాస్‌పోర్టు కేసులో అండర్ వరల్డ్ డాన్ అబూసలేంను సిబిఐ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ నెల 28న కోర్టు శిక్ష ఖరారు చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని అజామ్‌ఘర్ జిల్లాకు చెందిన అబూసలేం కర్నూలు వాసిగా నకిలీ పత్రాలు సృష్టించి పాస్‌పోర్టు పొంది విదేశాలకు పారిపోయాడు. దాంతో అతని పేరు మోస్టు వాంటెడ్ జాబితో చేరింది. 2002 సెప్టెంబర్ 20న పోర్చ్గల్లో సినీనటి మోనికాబేడీతోపాటు అతనిని అరెస్టు చేశారు. 2004లో ఇతర కేసుల విచారణ నిమిత్తం పోర్చ్‌గల్ కోర్టు అతనిని భారతదేశం పంపడానికి అనుమతి ఇచ్చింది. అబూసలేంపై దాదాపు 50 కేసులు ఉన్నాయి. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో కూడా అతను నిందితుడు.