మాఫియా డాన్ అబూ సలేంకు ఏడేళ్ల జైలుశిక్ష
నకిలీ పాస్ పోర్టుల కేసులో మాఫియా డాన్ అబూ సలేంకు నాంపల్లి క్రిమినల్ కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. పన్నెండేళ్ల తర్వాత అబూ సలేం కేసులో కోర్టు తుది తీర్పును వెల్లడించింది. అబూసలేంపై 120 (బి), 490, 471 సెక్షన్లతో కేసు నమోదు చేశారు.
ఈ సెక్షన్ల ప్రకారమే నకిలీ పాస్ పోర్ట్ కేసులో అబూ సలేంను దోషిగా నిర్ఱారించారు. ఇప్పటికే అబూ సలేం 6 సంవత్సరాల 10 రోజులు జైలుశిక్ష అనుభవించారు. ఇదే కేసులో సినీ నటి మోనికా బేడి మూడేళ్ల జైలుశిక్ష అనుభవించింది.