అబూసలేంను దోషిగా నిర్ధారించిన సిబిఐ కోర్టు
హైదరాబాద్: నకిలీ పాస్పోర్టు కేసులో అండర్ వరల్డ్ డాన్ అబూసలేంను సిబిఐ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ నెల 28న కోర్టు శిక్ష ఖరారు చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని అజామ్‌ఘర్ జిల్లాకు చెందిన అబూసలేం కర్నూలు వాసిగా నకిలీ పత్రాలు సృష్టించి పాస్‌పోర్టు పొంది విదేశాలకు పారిపోయాడు. దాంతో అతని పేరు మోస్టు వాంటెడ్ జాబితో చేరింది. 2002 సెప్టెంబర్ 20న పోర్చ్‌గల్లో సినీనటి మోనికాబేడీతోపాటు అతనిని అరెస్టు చేశారు.
2004లో ఇతర కేసుల విచారణ నిమిత్తం పోర్చ్‌గల్ కోర్టు అతనిని భారతదేశం పంపడానికి అనుమతి ఇచ్చింది. అబూసలేంపై దాదాపు 50 కేసులు ఉన్నాయి. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో కూడా అతను నిందితుడు.