అబూసలేం పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం
న్యూఢిల్లీ: మాఫీయా డాన్ అబూసలేం పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నకిలీ పాస్‌పోర్టు కేసులో ఏడేళ్ల జైలుశిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ అతడు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. 2001లో ఈ నేరానికి పాల్పడినందుకు అబూ సలేంతోపాటు బాలీవుడ్ నటి మోనికా బేడీని సెప్టెంబర్ 2002లో పోర్చుగల్‌లోని లిస్బన్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత ఇద్దరు నిందితులను నవంబర్ 11, 2005లో భారత్కు తీసుకు వచ్చారు. 2007లో మౌనికా బేడీని భోపాల్ కోర్టు నిర్ధోషిగా ప్రకటించడంతో మోనికా బేడి జైలు నుంచి విడుదల అయ్యింది. హైదరాబాద్ సీబీఐ నాంపల్లి కోర్టు అబూ సలేంకు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే అబూసలెం రైలులో వివాహం చేసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.