బాత్‌రూమ్‌ కిటికీ నుంచి జంప్‌ | British Mohammed Ali escaped in Fake passport case | Sakshi
Sakshi News home page

బాత్‌రూమ్‌ కిటికీ నుంచి జంప్‌

Published Fri, Apr 14 2017 6:17 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

బాత్‌రూమ్‌ కిటికీ నుంచి జంప్‌

బాత్‌రూమ్‌ కిటికీ నుంచి జంప్‌

నకిలీ పాస్‌పోర్టు కేసులో తప్పించుకున్న బ్రిటిషర్‌
ఢిల్లీ కోర్టు నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తుండగా ఘటన


సాక్షి, హైదరాబాద్‌: నకిలీ పాస్‌పోర్టు, చీటింగ్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్న బ్రిటన్‌ దేశస్తుడు మహ్మద్‌ అలీ రాష్ట్ర పోలీసుల కళ్లుగప్పి ఢిల్లీలోని రైల్వే స్టేషన్‌ బాత్‌రూమ్‌ కిటీకి నుంచి పరారయ్యాడు. స్కాట్‌లాండ్‌ పోలీసులకు పలు చీటింగ్‌ కేసుల్లో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న అలీ నాలుగేళ్ల క్రితం నకిలీ పాస్‌పోర్టుతో హైదరాబాద్‌ వచ్చి బస చేశాడు. అప్పుడు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అలీని అరెస్ట్‌ చేసి సీఐడీకి అప్పగించారు.

 ప్రస్తుతం చర్లపల్లి జైల్లో విచారణ ఖైదీగా ఉన్న అతడిని ఢిల్లీలోని పాటియాల కోర్టులో పీటీ వారెంట్‌పై బుధవారం రాష్ట్ర సీఐడీ పోలీసులు హాజరు పరిచారు. తిరుగు ప్రయాణంలో భాగంగా ఢిల్లీలోని హజరత్‌ నిజాముద్దీన్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. బాత్‌రూమ్‌కు వెళ్లాలని చెప్పడంతో మహ్మద్‌ అలీని ఎస్కార్ట్‌ పోలీసులు తీసుకెళ్లారు. లోపలికి వెళ్లిన అతడు... బాత్‌రూమ్‌ కిటికీ నుంచి బయటకు దూకి తప్పిం చుకున్నట్టు పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు.

 ఢిల్లీలో అతడిని పట్టుకొనేందుకు సీఐడీ రెండు బృందాలను రంగంలోకి దింపింది. ఎస్కార్ట్‌గా వెళ్లిన నగర పోలీస్‌ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించామని సిటీ పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. వేషాలు మార్చడంలో దిట్టయిన మహ్మద్‌ అలీని పట్టుకొనేందుకు ఢిల్లీ పోలీసులతో కలిసి రాష్ట్ర పోలీసులు వేట సాగిస్తున్నట్టు తెలిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement