కేసీఆర్‌ను ఎవ్వరూ నమ్మరు: జైరాం రమేశ్
సాక్షి, హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు మాట్లాడే మాటలకు.. చేతలకు.. భూమికి, ఆకాశానికి మధ్య ఉన్నంత తేడా ఉందని కేంద్రమంత్రి జైరాం రమేశ్ అన్నారు. మంగళవారం ఆయన వరంగల్ డీసీసీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చింది ధోకా, ఢక్కా ఇచ్చే పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు కాదని చెప్పారు.
కేసీఆర్‌ను ఎవరూ నమ్మరని, తెలంగాణ ఉద్యమాన్ని ఆయున ప్రారంభించడానికి వుుందే తమ పార్టీ నేతలు పోరాడారని గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణలో హంగ్ ఏర్పడే అవకాశమే లేదని, కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ పొత్తు వల్ల తెలంగాణలో కాంగ్రెస్‌కు వచ్చిన నష్టం ఏమీ లేదని, చంద్రబాబు అద్దం ముందు నిలబడితే మోడీ ప్రతిబింబం కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.