
'నన్ను తిట్టడమే కేసీఆర్ ప్రచారమనుకుంటున్నారు'
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మరోసారి విరుచుకుపడ్డారు. శుక్రవారం హైదరాబాద్లో మాట్లాడుతూ... మమ్మల్ని సన్యాసులని తిట్టడం కేసీఆర్ దురహంకారానికి నిదర్శనమన్నారు. సన్యాసులకు అధికారం అప్పగించవద్దని కేసీఆర్ ప్రజలను కోరుతున్నారు... అలా అంటే ఆయన తెలంగాణలో ఓటమిని అంగీకరించినట్లే అంటూ విమర్శించారు. తనన్ను తిట్టడమే కేసీఆర్ ప్రచారమనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
జలయజ్ఞంలో అవకతవకలు జరిగాయంటున్న కేసీఅర్ చేస్తున్న ఆరోపణలపై పొన్నాల స్పందించారు. నాడు టీడీపీ హయాంలో ముంత్రిగా ఉన్న కడియం శ్రీహరి దేవాదులకు 10 శాతం మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారని గుర్తు చేశారు. సదరు మంత్రిగారు ప్రస్తుతం మీ పార్టీలో ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆ విషయంపై కడియంను తప్పుపట్టమంటే ఏమంటావు అంటూ కేసీఆర్ను పొన్నాల ప్రశ్నించారు.