కేసీఆర్కు సుప్రీంకోర్టు నోటీసులు
రాష్ట్ర విభజన ఆపాలని కోరుతూ న్యాయవాది ఎమ్ఎల్ శర్మ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయంతో రాష్ట్ర విభజన చేసిందని, ఆ నిర్ణయాన్ని నిలవరించాలని శర్మ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్ ) దాఖలు చేశారు. గతంలో దాఖలైన పిటిషన్లకు ఆ పిల్ జత చేయాలని సుప్రీం కోర్టు శర్మను ఆదేశించింది.
అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. విభజనపై ఇది వరకే కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సంగతిని ఈ సందర్బంగా సుప్రీం గుర్తు చేసింది. నోటీసులపై కేంద్రం నుంచి సమాధానం వచ్చిన వెంటనే విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే శర్మ దాఖలు చేసిన పిల్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను నాలుగో ప్రతివాదిగా చేర్చారు. దాంతో కేసీఆర్కు సుప్రీం నోటీసులు జారీ చేసింది.