petitioner
-
ఇక్కడెందుకు పిటిషన్ వేశారు?
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షకు సంబంధించి సింగిల్ జడ్జి వద్ద పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా, నేరుగా ఇక్కడ పిటిషన్ ఎందుకు వేశారని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. రాజ్యాంగ పరమైన ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయని అడిగింది. విచారణను రేపటికి వాయిదా వేస్తూ, ఇక్కడే విచారణ జరపాలా.. లేక సింగిల్ జడ్జి వద్ద ఉన్న పిటిషన్లకు అటాచ్ చేయాలా అనేది తేలుస్తామని స్పష్టం చేసింది. 2024, ఫిబ్రవరి 19న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం టీఎస్పీఎస్సీ రూల్ ఆఫ్ లాను పాటించాలని, ప్రిలిమ్స్, మెయిన్స్.. అన్నింటా రిజర్వేషన్లు అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నల్లగొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన పోగుల రాంబాబు సహా మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మహిళలు, దివ్యాంగుల కేటగిరీలోనూ సమాంతర రిజర్వేషన్లు పాటించాలని, అధికారులు వరి్టకల్‌గా రోస్టర్ పాయింట్లు నిర్ధారిస్తున్నారని, మెయిన్స్‌కు 1ః50 గా ఎంపిక చేశారని, దీనిలో కూడా సమాంతర రిజర్వేషన్ల ప్రకారం ఎంపిక చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ లోకస్ లేకుండానే రూల్‌ను చాలెంజ్ చేస్తూ పిటిషన్ వేశారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘చట్టబద్ధమైన రూల్స్ లేనప్పుడు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేయాలి కదా, ఇక్కడ ఎందుకు’అని ప్రశ్నించింది. పిటిషనర్ న్యాయవాది సమయం కోరడంతో విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది. -
అటవీ భూమిని దున్నేస్తారా.. రెండొందల మొక్కలు నాటండి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ హైదరాబాద్: రెండు ఎకరాల్లో చెట్ల నష్టానికి బాధ్యుడైన పిటిషనర్‌కు హైకోర్టు అరుదైన(బాధ్యతాయుత) శిక్ష విధించింది. ఎకరానికి 100 చొప్పున రెండు ఎకరాల్లో 200 మొక్కలు నాటాలని ఆదేశించింది. ఈ మొక్కలను సరఫరా చేయాల్సిందిగా సూర్యా పేట డీఎఫ్‌ఓకు స్పష్టం చేసింది. ఆర్డర్ కాపీ అందిన నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పిటిషనర్‌కు తెలి్చచెప్పింది. మొక్కలు నాటేందుకు న్యాయస్థానం విధించిన ఆదేశాలను పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.అయితే, చెట్ల నష్టం కలిగిందని చెబుతున్న కంపార్ట్మెంట్ నం.441ని గుర్తించేందుకు పిటిషనర్‌కు సాయం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాలని కోరగా.. అందుకు కోర్టు సమ్మతించింది. దీనిపై తదుపరి విచారణలోగా నివేదిక అందజేయాలని అటవీ అధికారులను ఆదేశిస్తూ, విచారణ సెపె్టంబర్ 6కు వాయిదా వేసింది. మంచిర్యాలజిల్లా నెన్నెల మండలం నాగారానికి చెందిన మాదె మల్లేశ్ వ్యవసాయదారుడు.కుశెనపల్లి రేంజ్ కంపార్ట్మెంట్ నంబర్ 441లోని అటవీప్రాంతంలో అక్రమంగా ట్రాక్టర్‌తో భూమిని దున్ని చెట్లు తొలగించారన్న లింగాల సెక్షన్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు 2024, జూలై 1న మల్లేశ్, మరో ఇద్దరిపై కేసు నమోదైంది. మధ్యవర్తి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించిన అధికారులు అదే రోజు ట్రాక్టర్‌ను సీజ్ చేసి బెల్లంపల్లిలోని కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టారు.అటవీ భూమి ఆక్రమణకు యత్నించారుసీజ్ చేసిన తన ట్రాక్టర్‌ను తిరిగి అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాదె మల్లేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పిటిషనర్ ఎలాంటి తప్పు చేయలేదని, భూమి దున్న డానికి ఎలాంటి సంబంధం లేదని, వ్యవసాయ పనుల నిమి త్తం ట్రాక్టర్‌ను మరో ఇద్దరి(ఏ–1, ఏ–2)కి అద్దెకు మాత్రమే ఇచ్చారని మల్లేశ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.మరోవైపు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ అలవాటైన నేరస్తుడని, అతనిపై మరికొన్ని కేసులు కూడా ఉన్నాయని, వాటిపై ట్రయల్ కోర్టులో విచారణ సాగుతోందని చెప్పారు. పిటిషనర్‌తోపాటు మరికొందరు బృందంగా ఏర్పడి తరచూ అటవీ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ట్రాక్టర్ విడుదలకు గతంలో ఇదే కోర్టు ఇచి్చన ఉత్తర్వులను పాటించాలన్నారు. రూ.50 వేల బాండ్‌తోపాటు ఇద్దరు పూచీకత్తు సమరి్పంచాలని.. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ ట్రాక్టర్‌ను అమ్మడంగాని, వేరొకరి పేరు మీదకు మార్చడంగాని చేయనని అఫిడవిట్ ఇవ్వాలని.. అధికారులు ఆదేశించినప్పుడు ట్రాక్టర్ వారి వద్దకు తీసుకురావాలని.. ఈ ఉత్తర్వుల కాపీ అందిన నాలుగు వారాల్లోగా అఫిడవిట్లు అందజేయాలని పిటిషనర్‌ను ఆదేశించారు. అనంతరం ట్రాక్టర్‌ను విడుదల చేయాలని అధికారులకు చెప్పారు. చెట్లకు నష్టం కలిగించినందుకు.. అదే అటవీ ప్రాంతంలో 200 మొక్క లు నాటాలని పిటిషనర్‌కు తేలి్చచెప్పారు.కాగా, స్పష్టమైన ఆదేశాలు ఉంటే తప్ప అటవీశాఖ మొక్కలు సరఫరా చేయదని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో మొక్కలు సరఫరా చేయాలని సూర్యాపేట డీఎఫ్ఓను ఆదేశించారు. నెలరోజుల్లో మొక్కలు నాటి నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. పిటిషనర్ మాదె మల్లేశ్ కోర్టు తీర్పుపై ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎకరం భూమి దున్నితే రూ.2వేలు వస్తాయని కిరాయి(అద్దె)కి ట్రాక్టర్‌ను ఇస్తే, తనకు ఊహించని వి«ధంగా తీర్పు వచి్చందన్నారు. మరోవైపు జిల్లా అటవీ అధికారులు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు. -
‘వ్యభిచార గృహం నడిపేందుకు రక్షణ కావాలి’.. మద్రాస్ హైకోర్టు షాక్
చెన్నై: ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను చూసి మద్రాస్ హైకర్టు షాక్ గురైంది. సదరు పిటిషనర్‌పై దర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌ను రద్దు చేయడమే కాకుండా అతడికి జరిమానా కూడా విధించింది. ఇంతకీ ఆ పిటిషన్ ఏంటంటే..తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో వ్యభిచార గృహాన్ని నడిపేందుకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రాక్టీస్ చేస్తున్న రాజా మురుగన్ అనే న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ చేశారు. ఈ పిటిషన్ గురువారం హైకోర్టులో గురువారం విచారణకు వచ్చింది.ఈ సందర్భంగా మేజర్లు ఏకాభిప్రాయంతో సెక్స్ చేయడం చట్ట విరుద్ధం కాదంటూ పిటిషనర్ వాదించాడు. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరారు. తన వ్యాపార కార్యకలాపాల్లో పోలీసుల జోక్యాన్ని అడ్డుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు తెలిపారు. అయితే వ్యభిచార గృహాన్ని నడుపుతూ తప్పు చేయడమే కాకుండా తన చర్యలను నిసిగ్గుగా సమర్థించినందుకు జస్టిస్ బి పుగలేంధీ ధర్మాసనం పిటిషనర్‌పై మండిపడడింది. తన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. న్యాయవాదిపై 10 వేల జరిమానా కూడా విధించింది.అదే విధంగా ప్రఖ్యాత లా కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్ అయిన వారిని మాత్రమే న్యాయవాదులుగా నమోదు చేసుకునేలా చూడాలని బార్ కౌన్సిల్‌ను కోర్టు కోరింది. ఇతర రాష్ట్రాల్లోని సందేహాస్పద సంస్థల నుంచి గ్రాడ్యుయేట్ల నమోదును బార్ కౌన్సిల్ తప్పనిసరిగా పరిమితం చేయాలని సూచించింది.‘సమాజంలో న్యాయవాదుల ప్రతిష్ట తగ్గుతోందని బార్ కౌన్సిల్ గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. కనీసం ఇక నుంచైనా బార్ కౌన్సిల్ సభ్యులు పేరున్న కళాశాలల నుంచి మాత్రమే నమోదు చేసేలా చూసుకోవాలి. ఇతర రాష్ట్రాల నుంచి పేరు లేని అనామక సంస్థల నుంచి నమోదును పరిమితం చేయాలి’ అని తెలిపింది. -
కావాల్సిన సింబల్‌ను కోరలేరు
సాక్షి, హైదరాబాద్: ప్రజా ప్రాతినిధ్య చట్టం – 1951లో నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల్లో తమకు ఫలానా గుర్తే కావాలని ఎవరూ కోరలేరని హైకోర్టులో ఎన్నికల కమిషన్ వాదనలు వినిపించింది. దీంతో ‘చపాతీ రోలర్’గుర్తును ఎంపిక జాబితాలో చేర్చాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను పిటిషనర్ ఉపసంహరించుకున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల ఉండటంతో ఎన్నికల గుర్తు జాబితాలో ‘చపాతీ రోలర్’ను చేర్చాలని కోరుతూ హైకోర్టులో అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫారమ్స్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదన లు వినిపిస్తూ...గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్ని కల్లో పిటిషనర్ పార్టీ అభ్యర్థులు ‘చపాతీ రోలర్’ గుర్తుపై పోటీ చేశారన్నారు. మండల పరిషత్ ప్రాదే శిక నియోజకవర్గం, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియో జకవర్గం, పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో అదే గుర్తు కేటాయించేలా ఈసీకి ఆదేశాలి వ్వాలని కోరారు.ఈసీ తరఫు న్యాయవాది జి. విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం అలాంటి వెసులుబాటు లేనందున ఉన్న జాబితా నుంచే ఏదో ఒక గుర్తు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో పిటిషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది కోరడంతో ధర్మాసనం అంగీకరించింది. -
స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేయవచ్చా?
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యేని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఒక ఓటర్ పిటిషన్ వేయవచ్చా? దీనిపై స్పీకర్ విధుల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చా? ఆయన ముందు వినతిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాల ని చెప్పవచ్చా? అలా గతంలో ఏవైనా తీర్పులుంటే తమ ముందు ఉంచాలని ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేసు దాఖలు చేసిన పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ‘2023, నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో నేను ఆయనకు ఓటు వేశాను. ఆ ఎన్నికల్లో గెలిచిన దానం.. ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాదు సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి.. మరో పార్టీలో చేరిన దానంను అనర్హుడిగా ప్రకటించాలని మార్చి 23న స్పీకర్‌కు ఈ–మెయిల్ ద్వారా వినతిపత్రం సమర్పించాం. ఇంకా దానిపై ఆయన నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకుని దానంను అనుర్హుడిగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వండి’అని కోరుతూ ఖైరతాబాద్‌కు చెందిన బొల్లబోయిన రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఈ రిట్ పిటిషన్‌ను దాఖలు చేయడంలో పిటిషనర్‌కు ఎలాంటి అర్హత ఉందని అతని తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి మూడు నెలలు తిరగకుండానే కాంగ్రెస్‌కు విధేయుడిగా మారిన ఎమ్మెల్యేకు పిటిషనర్ ఓటేశారని న్యాయవాది చెప్పారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయడం ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తుందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. గత తీర్పుల కాపీలుంటే తమ ముందు ఉంచాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేశారు. -
ఐదు పేజీల తీర్పుపై... 60 పేజీల సారాంశమా!
న్యూఢిల్లీ: ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఐదు పేజీల తీర్పును సవాలు చేసేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు రూపంలో సుప్రీంకోర్టులో ఏకంగా 60 పేజీల సినాప్సిస్ (సారాంశం) సమర్పించాడో వ్యక్తి! దీనిపై విస్మయం వ్యక్తం చేయడం న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం వంతయింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక పిటిషన్‌దారుకు రూ.25 వేల జరిమానా కూడా విధించింది! ఆ మొత్తాన్ని ఏదన్నా స్వచ్ఛంద సేవా సంస్థకు విరాళంగా ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఆరోగ్య కారణాలతో అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇలాంటి సుదీర్ఘ దరఖాస్తులపై సుప్రీంకోర్టు గతేడాది అసహనం వ్యక్తం చేసింది. వాటిలో పేజీల సంఖ్యపై తక్షణం పరిమితి విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. -
5 రోజులు కస్టడీకి అప్పగించండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ సోమవారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ స్కామ్ గురించి, మిగిలిన నిందితుల పాత్ర గురించి చంద్రబాబుకు చాలా విషయాలు తెలుసని, అందువల్ల ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందంటూ సీఐడీ డీఎస్పీ ఎం.ధనుంజయుడు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. కస్టడీకి ఇచ్చే సమయంలో ఎలాంటి షరతులు విధించినా తమకు అభ్యంతరం లేదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ నిధుల మళ్లింపు, లబ్ధిదారులు ఎవరన్న విషయాలు చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. నిధుల దుర్వినియోగంలో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీనే అంతిమ లబ్ధిదారులని తెలిపారు. స్కామ్ జరిగిన తీరును ఈ పిటిషన్లో వివరించారు. ‘ఈ స్కామ్ వెనుక కొందరి ఆర్థిక పరమైన దుష్ప్రవర్తన, లోతైన కుట్ర దాగి ఉంది. వీటి వెనకు అసలు కారణాలన్నింటినీ చంద్రబాబు నుంచి తెలుసుకోవాల్సిన అవసరం దర్యాప్తు సంస్థకుంది. అధికార బాధ్యతలను పక్కన పెట్టి వ్యక్తుల లబ్ధి కోసం భారీ, లోతైన కుట్రకు పాల్పడారు. మాకు కావాల్సిన సమాచారాన్ని చంద్రబాబు నుంచి రాబట్టినప్పుడే ఈ ఆర్థిక మోసం పూర్తిగా బయటపడుతుంది. ఈ స్కామ్‌కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను మాయం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన లబ్ధిదారులు చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, గంటా సుబ్బారావు, డాక్టర్ లక్ష్మీనారాయణ. మాయం చేసిన ఫైళ్లు ఎక్కడ ఉన్నాయన్న విషయాలను చంద్రబాబును విచారించి రాబట్టాల్సి ఉంది. షెల్ కంపెనీల ద్వారా, పలువురు వ్యక్తుల సాయంతో మొత్తం డబ్బు తిరిగి చంద్రబాబుకే చేరింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను చంద్రబాబు నుంచి రాబట్టాల్సి ఉంది. చంద్రబాబును అరెస్ట్ తరువాత విచారించాం. అయితే ఆయన విచారణకు సహకరించలేదు. అందువల్ల 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదిని ఆదేశించింది. కౌంటర్ దాఖలు తరువాత ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతామని తెలిపింది. -
హిందూ సమాజం ద్వేషిస్తోంది.. చావడానికి అనుమతించండి!
వారణాసి జ్ఞానవాపి మసీదు కేసులో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న రాఖీ సింగ్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు బహిరంగ లేఖ రాశారు. అనాయాస మరణానికి(euthanasia) తనను అనుమతించాలని ఆమె రాష్ట్రపతికి విజ్క్షప్తి చేశౠరు. జ్క్షానవాపి విషయంలో తనతో పాటు పిటిషన్లు వేసిన వాళ్లే తనను వేధిస్తున్నారని, అందుకే తాను చావాలనుకుంటున్నానని అందులో పేర్కొన్నారామె. మీ బదులు కోసం జూన్ 9వ తేదీ ఉదయం 9 గంటల వరకు ఎదురు చూస్తా. మీ నుంచి స్పందన లేకుంటే.. తర్వాత తీసుకోబోయే నిర్ణయానికి నాదే పూర్తి బాధ్యత అంటూ ఆమె లేఖను రాష్ట్రపతి భవన్‌కు పంపారు. పిటిషన్‌ను ఉపసంహరించుకున్నప్పటి నుంచి హిందూ సమాజంలో తనను బద్నాం చేసే కుట్ర జరుగుతోందని అంటున్నారామె. అందుకు తనతో పాటు జ్ఞానవాపి పిటిషన్ వేసిన నలుగురే కారణమంటూ చెబుతున్నారు. పిటిషన్ వెనక్కు తీసుకోవడం విషయంలో తన మీద తప్పుడు ప్రచారం చేశారని, దాని వల్ల తన పరువు పోయిందని, హిందూ సమాజం.. ఆఖరికి తన కుటుంబం కూడా తనను ఇప్పుడు ద్వేషిస్తోందని లేఖలో వాపోయారామె. ఈ మానసిక క్షోభ నుంచి బయటపడేందుకు తనకు అనాయాస మరణానికి అనుమతించాలని ఆమె లేఖ ద్వారా రాష్ట్రపతి ముర్ముకు విజ్క్షప్తి చేశారు. అయితే.. రాఖీ బంధువు జితేంద్ర సింగ్ విసేన్ తమ ఆర్థిక పరిస్థితి వల్లే పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. కోర్టుల చుట్టూ తిరగడానికి మాకెవరూ స్పాన్సర్లు లేరు. మా జేబులోంచి ఖర్చు పెట్టుకునేంత స్తోమత లేదు. అందుకే మా కుటుంబం జ్క్షానవాపి విషయంలో దాఖలు చేసిన అన్ని పిటిషన్లను ఉపసంహరించుకుంది అని ఆయన స్పష్టత ఇచ్చారు. నేను, నా కుటుంబం(రాఖీ సింగ్‌తో సహా) అన్ని పిటిషన్లను ఉపసంహరించుకున్నాం. మా ఆర్థిక పరిస్థితితో పాటు దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. ధర్మం కోసం సోరాడడానికి మా దగ్గర వనరులు లేవు. మేం జీవితంలో చేసిన తప్పు.. ఈ పిటిషన్‌ను వేయడం అంటూ ఆయన మీడియాకు చెబుతున్నారు. జ్ఞానవాపి మసీదులో పూజలకు అనుమతించాలంటూ ఐదుగురు మహిళలు పిటిషన్లు వేయగా.. అందులో రాఖీసింగ్ కూడా ఉన్నారు. అయితే ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉందంటూ ఆమె తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. -
ప్రభుత్వం ఏ బహిరంగ సభను అడ్డుకోలేదు: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 పూర్తిగా ప్రజా ప్రయోజనమైందని ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ సందర్భంగా.. వాద ప్రతివాదనల తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలను ఓసారి పరిశీలిస్తే.. ‘‘ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.1 ప్రజల ప్రాథమిక హక్కులకు సంబంధించినది.పూర్తిగా ప్రజా ప్రయోజనమైందని న్యాయస్థానం భావిస్తోంది. అలాగే.. నడి రోడ్డుపై మీటింగ్ పెట్టడానికి ఎవరికీ హక్కు లేదు. నిజానికి ప్రభుత్వం ఏ బహిరంగ సభను అడ్డుకోలేదు. నడి రోడ్డు మీద కాదు, సౌకర్యమున్న చోట సభ పెట్టుకోమని చెప్పింది అని చీఫ్ జస్టిస్ గుర్తు చేశారు. రోడ్‌షోల మీద, ర్యాలీల మీద సర్కార్ ఎలాంటి నిషేధం విధించలేదని, నడి రోడ్డు మీద భారీగా జనాన్ని సమీకరించవద్దని మాత్రమే చెప్పిందని, ప్రజా రక్షణకు సంబంధించి ప్రభుత్వానికే పూర్తి అధికారమని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా హైకోర్టు సీజే గుర్తు చేశారు. అలాగే.. చంద్రబాబు సభల్లో 8 మంది చనిపోయిన దృష్ట్యా సర్కారు జీవో తెచ్చిందని పేర్కొన్నారు. ఈ పిటిషన్ వేసిన వ్యక్తిలో దురుద్ధేశమేదో కనిపిస్తోందన్న హైకోర్టు సీజే.. ఎనిమిది మంది చనిపోయిన దుర్ఘటనపై విచారణ కమిటీ నివేదిక కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. జీవో నెంబర్ 1ని నిలిపివేయాలంటూ వేసిన పిటిషన్‌కు సహేతుక కారణాలు లేవని, అలా చేయడమంటే ప్రజల హక్కులు కాలరాసినట్టేనని హైకోర్టు పిటిషనర్‌కు స్పష్టం చేసింది. అది సుప్రీం రూల్స్‌కు విరుద్ధం జీవో నెంబర్ 1పై ఏపీ హైకోర్టులో వాద, ప్రతివాదనలు వాడీవేడిగానే సాగాయి. ప్రభుత్వం తెచ్చిన జీవోను పిటిషన్ సవాల్ చేయగా.. ఆ వాదనలను అంతే సమర్థవంతంగా తోసిపుచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలను పరిశీలిస్తే.. ‘‘పిటిషన్‌ను అత్యవసరంగా వెకేషన్ బెంచ్ ముందుకు తేవడాన్ని వ్యతిరేకించాం. చీఫ్ జస్టిస్ వేసిన రోస్టర్‌ను వెకేషన్ బెంచ్ మార్చింది. రోస్టర్‌ను జనవరి 5వ తేదీన రూపొందించి, 6వ తేదీన హడావిడిగా మార్చారు. రోస్టర్‌ను సరైన కారణం లేకుండా మార్చడం సుప్రీంకోర్టు నియామవళికి విరుద్ధం. రోస్టర్ మార్చిన విషయం ప్రతివాదులకు కనీసం చెప్పలేదు. ఈ పిటిషన్లో అత్యవసరం కూడా ఏమీ లేదు. సెలవులు పూర్తయ్యేవరకు వేచి ఉండకుండా ముందే విచారించారు. జనవరి 12న వెకేషన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను మార్చాలి అని వాదనలు వినిపించారు. -
హైకోర్టుకు వెళ్లిన ఇప్పటం పిటిషనర్లకు షాక్
-
ఇది పైసా వసూల్ పిటిషన్లా ఉంది
సాక్షి, హైదరాబాద్: బల్క్ డ్రగ్, ఫార్మా ఉత్పత్తుల తయారీ కారణంగా వచ్చే కాలుష్యం గురించి సంబంధిత అధికారులకు ఎలాంటి ఫిర్యాదు చేయకుండా.. నేరుగా హైకోర్టును ఆశ్రయించడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్ దాఖలులో దురుద్దేశాలు ఉన్నందున పిటిషనర్‌కు రూ.20 వేలు జరిమానా విధించింది. రాష్ట్రంలోని బల్క్ డ్రగ్, ఫార్మా కంపెనీలు వ్యర్థాలను పూర్తిస్థాయిలో శుద్ధి చేయడం లేదని.. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) పట్టించుకోవడం లేదని పేర్కొంటూ.. మా తెలంగాణ పార్టీ తరఫున అధ్యక్షుడు కె.వీరారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ కాలుష్య నియంత్రణ మండలి అప్పిలేట్ బోర్డులో 19 దాకా అప్పీళ్లు దాఖలు చేశారని పీసీబీ తరఫు న్యాయవాది నివేదించారు. వాటి విచారణకు ఆయన హాజరుకాకపోవడంతో బోర్డు విచారణను ముగించిందని చెప్పారు. అసలు అధికారులకు ఎలాంటి వినతి పత్రాలు ఇవ్వకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించారన్నారు. వాదనలను విన్న ధర్మాసనం.. పిటిషనర్ తీరును తప్పుబట్టింది. ఇది పైసా వసూల్ పిటిషన్లా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌ను అనుమతించలేమని తేల్చిచెప్పింది. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థకు రూ.20 వేలు చెల్లించాలని ఆదేశించింది. పిటిషన్‌ను కొట్టివేసింది. -
న్యాయం కోసం 23 ఏళ్లుగా అతను.. !
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డుపై వినియోగదారుల ఫోరంలో 23 ఏళ్ల క్రితం కె.వి.రామారావు (63) ఫిర్యాదు దాఖలు చేశాడు. ఏప్రిల్ 27, 1998 నుంచి 2003 మే 19 వరకు కేసు కొనసాగింది. వాదనలు పూర్తయ్యాక మే 19, 2003న తీర్పు కోసం రిజర్వ్ చేయబడింది. కేసులో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. 17 ఏళ్ల పాటు ఫైలు ఆచూకీ లభించలేదు. ఫిర్యాదు తరపు న్యాయవాది ప్రమాదానికి గురికావడంతో కేసు గతి తప్పింది. అడపా, దడపా ఫిర్యాదురాదు వాకబు చేసినా లాభం లేకపోయింది. గత ఏడాది మార్చి 17న రామారావు వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు వక్కంటి నరసింహారావుతో విషయం మొరపెట్టుకోగా, ఆయన సూచన మేరకు మరోసారి దరఖాస్తు పెట్టుకున్నాడు. 17 ఏళ్ల పాటు చీకటిలో మగ్గిన ఫైలు వెలుగులోకి వచ్చింది. అప్పటికే రాష్ట్రం విడిపోయి హౌసింగ్ బోర్డులు విడిపోవడంతో తెలంగాణ హౌసింగ్ బోర్డును కూడా పార్టీని చేయమని ఫోరం ఆదేశించింది. ఆనంతరం కేసు విచారణ కొనసాగి మంగళవారం తీర్పు వెలువడింది. కేసు విచారణలో అధ్యక్షుడు వక్కంటి నరసింహారావు, సభ్యులు పారుపల్లి జవహర్‌బాబు, ఆర్ఎస్.రాజేశ్రీ పాలుపంచుకోగా బెంచ్ తరపున పారుపల్లి జవహర్‌బాబు తీర్పును వెలువరించారు. ఫిర్యాదు దారు రిజిస్ట్రేషన్ చేయని భూమికి సంబంధించి గజానికి రూ.3,500 చొప్పున, రిజిస్ట్రేషన్ తేదీ 8/8/1987 నుంచి 12 శాతం వడ్డీతో చెల్లించాలని అప్పటి ఏపీ హౌసింగ్‌బోర్డు, ఇప్పటి తెలంగాణ హౌసింగ్ బోర్డులను ఆదేశిస్తూ కమిషన్ తీర్పు చెప్పింది. ఫిర్యాదుదారుకి కలిగిన మానసిక ఆవేదన, అసౌకర్యానికి రూ.50 వేల నష్టపరిహారం, పది వేలు ఖర్చుల నిమిత్తం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఇవీ కేసు వివరాలు.. ► ఫిర్యాదురాదు కె.వి.రామారావు ఏపీ హౌసింగ్ బోర్డు నిర్వహించిన వెంకళరావు నగర్ ప్లాట్ల వేలం పాటలో పాల్గొన్నాడు. అత్యధిక ధరకు పాటపాడి 231.80 చదరపు గజాల ప్లాటును చదరపు గజానికి రూ. 1,505 రేటు చొప్పున దక్కించుకున్నాడు. 1994 కల్లా మొత్తం చెల్లించవలసిన సొమ్ము చెల్లించాడు. 1997 ఆగస్టు 8న ప్లాటు అతని పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. 231.80 చదరపు గజాలకు బదులు 216.95 చదరపు గజాలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించారు. దీంతో మిగిలిన 14.85 చదరపు గజాలకు చెల్లించిన సొమ్ము తనకు తిరిగి చెల్లించాలని ప్రతివాదిని ఆశ్రయించాడు. ప్రతివాది స్పందన లేనందున 1998లో ఫోరాన్ని ఆశ్రయించాడు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న సమయంలో మార్కెటు విలువ రూ.3,500 ఉంటే రూ. 1505 ధర చెల్లిస్తామని ప్రతివాది వాదనను తోసి పుచ్చి ఫోరాన్ని ఆశ్రయించాడు. ఫోరం సూచనల మేరకు మాయమైన ఫైలు లభ్యమైన తర్వాత 2021 మార్చి 17న తెలంగాణ హౌసింగ్ బోర్డును 2వ ప్రతివాదిగా చేర్చారు. కేసు విచారణ, పూర్వాపదాలు పరిశీలించిన మీదట వినియోగదారుల కమిషన్ ఫిర్యాదుదారుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మాయమైన ఫైలు వెతికి తీసి న్యాయం ఎప్పటికైనా జరుగుతుందన్న విషయాన్ని ఈ కేసు రుజువు చేసింది. అనివార్య కార్యణాల వల్ల ఆలస్యం అయితే అవ్వొచ్చు గానీ అన్యాయంగా ఆలస్యంగా న్యాయం గెలిచిందన్న సంతోషం వినియోగ దారునికి మిగిలింది. -
సర్పంచ్‌పై హైకోర్టు ఆగ్రహం.. 50 వేలు ఫైన్
సాక్షి, హైదరాబాద్: తామిచ్చిన వినతిపత్రాలపై చర్యలు తీసుకోవడంతో పాటు తమపై పెట్టిన క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట సర్పంచ్ గట్టు కుమారస్వామి ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్ నమోదైనా... పిల్ దాఖలు చేసే ముందు ఈ అంశానికి సంబంధించి తమపై ఎలాంటి కేసులూ లేవని తప్పుడు అఫిడవిట్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఇందులో వ్యక్తిగత ప్రయోజనం తప్ప ప్రజాప్రయోజనం ఏముందని ప్రశ్నించింది. తప్పుడు సమాచారం ఇవ్వడంతోపాటు కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు రూ.50 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లో న్యాయసేవా సాధికార సంస్థ ముందు డిపాజిట్ చేసి రసీదు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది. తమ గ్రామంలోని ప్రభుత్వ భూమిని ఎస్.మురళీధర్‌రావు అక్రమంగా ఆక్రమించుకున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, మురళీధర్‌రావు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తమపై పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతూ కుమారస్వామి దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం విచారించింది. కాగా, తీర్పును పునర్విచారించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని పిటిషనర్ తరఫు న్యాయవాది సుజాత తెలిపారు. -
యజమాని ప్రయోజనాల కోసం పిల్ వేస్తారా?
సాక్షి, హైదరాబాద్: యజమాని వ్యాపార ప్రయోజనాల కోసం ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారంటూ ఓ పిటిషనర్‌పై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం న్యాయస్థానాలను వేదిక చేసుకోవడాన్ని సహించమని స్పష్టం చేసింది. పిటిషనర్ దురుద్దేశంతో ఈ పిల్ దాఖలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ.50 వేలు జరిమానా విధించింది. 2 వారాల్లో ఈ డబ్బును న్యాయవాదుల సంక్షేమ నిధిలో జమ చేయాలని, లేకపోతే కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు సీజే జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయపురిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పెట్రోల్‌బంక్‌తో ప్రాజెక్టుకు ప్రమాదమని, అందువల్ల బంక్ ఏర్పాటు చేయకుండా ఆదేశించాలంటూ అదే ప్రాంతానికి చెందిన బి.వెంకటేశ్వర్లు పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం పిటిషనర్ ఏం చేస్తారని ధర్మాసనం ప్రశ్నించగా... సమీపంలోని మరో పెట్రోల్ బంక్‌లో ఉద్యోగని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. దీంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పెట్రోల్ బంక్ యజమానే వెనకుండి ఈ పిల్ దాఖలు చేయించినట్లుగా ఉందని, ఇందులో ప్రజాప్రయోజనం లేదని, వ్యక్తిగత వ్యాపార ప్రయోజనం ఉందని మండిపడింది. డ్యాం నిర్మాణానికి ఎంత దూరంలో నూతన పెట్రోల్ బంక్ నిర్మిస్తున్నారో పిటిషన్లో పేర్కొనలేదని, ప్రమాదం ఏ రకంగా పొంచి ఉందో కూడా పేర్కొనలేదని అసహనం వ్యక్తం చేసింది. కనీసం జరిమానా మొత్తాన్ని తగ్గించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వేడుకున్నా అంగీకరించని ధర్మాసనం.. రూ. 50 వేలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తూ పిల్ కొట్టివేసింది. -
ఇష్రత్ జహాన్ కేసు.. పిటిషనర్ మృతి
తిరువనంతపురం : ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసు పిటిషనర్ గోపినాథ్ పిళ్లై మృతి చెందారు. కేరళలో అలపుజ్జా వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఘటనలో 76 ఏళ్ల పిళ్లై తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. కాగా, గోపినాథ్ పిళ్లై... 2004 గుజరాత్ ఎన్కౌంటర్ మృతుల్లో ఒకరైన జావెద్ షేక్ అలియాస్ ప్రణేశ్ పిళ్లై తండ్రి. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన హత్యకు కుట్రపన్నారంటూ ముంబైకి చెందిన19 ఏళ్ల విద్యార్థిని ఇష్రాత్ జహాన్, మరో ముగ్గురిని 2004, జూన్ 15న ఎన్కౌంటర్ చేశారు. మృతులను జావెద్ గులాం షేక్(ప్రణేశ్ పిళ్లై), అంజాద్ అలీ రానా, జీషన్ జోహార్ గా గుర్తించారు. అయితే తన కొడుకు అమాయకుడని.. ఇది పక్కా ఫేక్ ఎన్కౌంటర్ అంటూ వాదిస్తూ గోపినాథ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత మిగతా బాధిత కుటుంబాలు కూడా ఆయను తోడయ్యాయి. మోదీ ప్రభుత్వం సానుభూతి పొందటం కోసమే అమాయకులైన వారిని చంపేశారని పిటిషనర్లు అప్పుడు వాదనలు వినిపించారు. (ఇష్రత్‌పై లాలూ కొడుకు ఆసక్తికర వ్యాఖ్యలు) ఇదిలా ఉంటే ఈ కేసును దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఇదో ఫేక్ ఎన్కౌంటర్ అని తేల్చి ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గుజరాత్ పోలీసులు, సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) సంయుక్తంగా ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్నాయని చార్జిషీటులో సీబీఐ పేర్కొంది. పలువురు ఉన్నతాధికారుల పేర్లను ఇందులో చేర్చి దర్యాప్తు కొనసాగించింది. -
పీఎన్బీ స్కాం: ఇన్వెస్టర్ ఆవేదన..!
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో భారీ కుంభకోణం ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. 1.77 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 11,346 కోట్లు) మేర ప్రభావం చూపే మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు తేలగా... ముంబైలోని ఓ శాఖలో ఇవి జరిగాయని గుర్తించినట్లు పీఎన్బీ వెల్లడించింది. అయితే స్కామ్ డ్రామా ఇప్పుడు మొదలైంది కాదని, 2011-12లో ఇందుకు బీజం పడిందని గీతాంజలి గ్రూపులో పెట్టుబడులు పెట్టి మోసపోయిన ఇన్వెస్టర్, బాధితుడు వైభవ్ ఖురానియా తెలిపారు. 2013కి వచ్చేసరికి స్కామ్ ముదిరి పాకాన పడిందని, కానీ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఏ వర్గాలు తన ఫిర్యాదును పట్టించుకోలేదని పీఎన్బీ స్కామ్ కేసుపై పిటిషన్ దాఖలుచేసిన వైభవ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐకి, సెబీకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఈఓడబ్ల్యూ.. ఇలా అన్ని సంస్థల అధికారులకు మోసాల గురించి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఒకవేళ అదే సమయంలో అప్రమత్తమై ఉంటే వ్యాపారి నీరవ్‌మోదీ దేశాన్ని వదిలి పారిపోయేవాడే కాదన్నారు. తొలుత దీనిపై ఫిర్యాదు చేసినా కేసులు నమోదు కాలేదని, ప్రస్తుతం కోర్టు వరకు విషయం వెళ్లగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నారని వివరించారు. 'గీతాంజలి సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు మేం మెహల్‌చోక్సీని కలిశాం. ఓ స్టోర్‌ను ప్రారంభించిన రెండు నెలల్లోనే పతనావస్థకు చేరుకున్నాం. కేవలం 3-4 నెలల్లోనే స్టోర్‌ను మూసివేశాం. గీతాంజలి యాజమాన్యం మమ్మల్ని దారుణంగా మోసగించింది. రూ.80 లక్షల విలువైన మా స్టాక్ (ఆభరణాలు, ఉత్పత్తులు)ను చోరీ చేసిందని' పిటిషనర్ వైభవ్ ఖురానియా వివరించారు. మరోవైపు నీరవ్‌మోదీ, గీతాంజలి గ్రూపుల సంస్థలపై ఈడీ దాడులు ఐదోరోజు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే బ్యాంకు నియంత్రణ వ్యవస్థలను తమ అధీనంలోకి తీసుకున్నామని, వాటన్నింటినీ పరిశీలిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. పీఎన్బీ కుంభకోణం కేసులో మాజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి, సింగిల్ విండో క్లర్క్ మనోజ్ కరత్‌లను శనివారం సీబీఐ అరెస్ట్ చేయగా స్పెషల్ కోర్టు వీరిని 14 రోజుల పోలీస్ కస్టడీకి తరలించిన సంగతి తెలిసిందే. -
రోజాకు సుప్రీంకోర్టులో ఊరట
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రోజా ఇచ్చిన వివరణ లేఖను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. స్పీకర్ కు ఈ లేఖ అందజేయాలని ప్రభుత్వ తరుపు న్యాయవాదికి ఆదేశించింది. రెగ్యులర్ సెషన్స్ లో లేదా ప్రత్యేక సెషన్స్ లో ఆర్కే రోజా వివరణ లేఖపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. శాసన సభ వ్యవహారాలకు కూడా రోజాను అనుమతించాలని ఆదేశించింది. ఎనిమిది వారాల్లోగా రోజా వివరణ లేఖపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. రోజా లేఖపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే మాత్రం తాము మరోసారి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. శాసనసభా పక్ష కార్యాలయంలోకి రోజాను అనుమతించాలని ఆదేశించింది. ఎల్పీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా అనుమతిచ్చింది. అంతేకాకుండా.. చిన్న సమస్యను పెద్దదిగా చేయవద్దని.. సామరస్యంగా పరిష్కరించుకోవాలని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లు సమచారం. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసిన సుప్రీంకోర్టు కేసు తదుపరి విచారణను ఆగస్టు తొలివారానికి వాయిదా వేసింది. -
వివరణ ఇచ్చేందుకు సిద్ధం
ఎమ్మెల్యే ఆర్.కె.రోజా సాక్షి, న్యూఢిల్లీ: తనపై మోపిన అభియోగాలకు వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని నగరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఆర్.కె.రోజా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆమె సుప్రీం కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘‘కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి పోరాడినందుకు నన్ను టార్గెట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. నాకు వివరణ ఇచ్చుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. ఏవిధంగా నన్ను అవమానించారో మీరందరూ చూశారు. ఈరోజు కోర్టులో ప్రభుత్వ న్యాయవాది పీపీ రావు.. ఇదివరకే పిటిషనర్‌కు అవకాశం ఇచ్చామని చెప్పారు. కానీ మాకైతే అవకాశం ఇవ్వలేదు. నేను చంద్రబాబును కామ సీఎం అన్న విషయాన్ని వాళ్లు తప్పుగా భావిస్తున్నారు. ఆ భాషగా గానీ, ఆ ఉద్దేశంతో గానీ నేను అనలేదని ముందు నుంచీ చెబుతూ వస్తున్నా. అప్పట్లో పత్రికలు కాల్‌మనీని కామ అని చెప్పి షార్ట్‌కట్‌లో వేశాయి. కాల్‌మనీపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు తప్ప చంద్రబాబును అగౌరవపరచాలని మేమెప్పుడూ ఆలోచించలేదు. ఇలాంటి చిన్న విషయాలపై వివాదాల కంటే రాష్ట్రం అభివృద్ధిపై దృష్టిపెట్టాలని న్యాయమూర్తులు అన్నారు. నా వివరణ గురించి అడిగారు. నేను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను. మా న్యాయవాదికి కూడా చెప్పాను. నేను తప్పు చేయలేదు. అనిత విషయంలో కూడా నేను ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యాను. నేను అనని మాటలను సబ్ టైటిల్స్‌గా వేశారని చెప్పాను. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించాలని కోరాను. నేను చేయని తప్పుకు నన్ను శిక్షించకండి’’ అని పేర్కొన్నారు. రోజా తరపున మరో న్యాయవాది నర్మదా సంపత్ మాట్లాడుతూ.. ‘‘వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? అని ధర్మాసనం అడిగింది. మేం సిద్ధంగా ఉన్నాం. కేవలం సభా నాయకుడి విషయంలోనే కాకుండా మరో రెండు అభియోగాలకూ ఇది వర్తించాలని కోరాం’’ అని వివరించారు. విచారం వ్యక్తంచేయాల్సిందిగా కోర్టు కోరిందా? వివరణ ఇవ్వాల్సిందిగా కోరిందా? అని మీడియా ప్రశ్నించగా ‘‘ఆమె ఉద్దేశం ఏంటో వివరించాలని చెప్పింది’’ అని వివరించారు. -
నిందితునిగా ఉన్న వ్యక్తి వీసీగా ఉండకూడదని ఎక్కడుంది..?
పిటిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఓ కేసులో మొదట నిందితునిగా ఉన్న వ్యక్తి వీసీగా బాధ్యతలు చేపట్టకూడదని ఏ చట్టంలో ఉందో చూపాలని వేముల రోహిత్ ఆత్మహత్యోదంతం నేపథ్యంలో హెచ్‌సీయూ వీసీగా అప్పారావు కొనసాగింపు వ్యవహారంలో దాఖలైన కేసులో పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో తగిన అధ్యయనం చేసి రావాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా అప్పారావు తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ అనుమతినివ్వడాన్ని సవాలు చేస్తూ, అప్పారావును హెచ్‌సీయూ నుంచి మరోచోటుకు బదిలీ చేయడంతో పాటు, బోధనా, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీ చేయకుండా హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ను ఆదేశించాలంటూ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.దీన్ని బుధవారం తాత్కాలిక సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదలను వినిపిస్తూ, హెచ్‌సీయూ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి నమోదైన కేసులో వీసీ అప్పారావు మొదటి నిందితునిగా ఉన్నారని తెలిపారు. సంబంధిత ఎఫ్ఐఆర్ను ఆయన ధర్మాసనం ముందుంచారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం, ఓ కేసులో మొదట నిందితునిగా ఉన్న వ్యక్తి వీసీగా కొనసాగరాదని ఏ చట్టంలో ఉందో చూపాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. భావోద్వేగాల ఆధారంగా అధికరణ 226 కింద కేసులను విచారించడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ‘మీరు అప్పారావును తొలగించాలని కోరుతున్నారు.. మేం చట్టం గురించి అడుగుతున్నాం’...అంటూ పిటిషనర్‌ను ఉద్దేశించి పేర్కొంది. ఈ కేసును పూర్తిగా అధ్యయనం చేసి రావాలని సూచించిన ధర్మాసనం, ఈ కేసులో తామెవ్వరికీ నోటీసులు జారీ చేయడం లేదంది. -
జీహెచ్ఎంసీ తీరుపై హైకోర్టు ఆక్షేపణ...
* అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలేదు * జరిమానా విధించి చేతులు దులుపుకుంటున్నారు * జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం * రూ.5 వేల జరిమానా.. పిటిషనర్‌కు చెల్లించాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: ప్రణాళికాబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్న అధికారులు, వాస్తవంగా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది. అక్రమ నిర్మాణాల గురించి తెలిసి కూడా... వాటిపై 25 శాతం జరిమానా విధిస్తూ, అక్రమ నిర్మాణాలు యథాతథంగా ఉండేలా చేస్తున్నారంటూ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులపై మండిపడింది. ఓ అక్రమ నిర్మాణం గురించి తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మంజూరు చేసిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన కట్టడాన్ని చట్ట ప్రకారం కూల్చి వేయాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డిప్యూటీ కమిషనర్‌కు, అక్రమ నిర్మాణం చేసిన వ్యక్తికి చెరో రూ.5 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని పిటిషనర్‌కు చెల్లించాలని ఇరువురినీ ఆదేశించింది. అలాగే డిప్యూటీ కమిషనర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని కూడా పరిశీలించాలని కమిషనర్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు సోమవారం తీర్పు వెలువరించారు. హైదరాబాద్‌కు చెందిన పి.దేవేందర్ హస్తినాపురం సౌత్ వద్ద పర్వతమ్మ ఎన్‌క్లేవ్‌లో 222 గజాల స్థలాన్ని కొన్నారు. ఈయన స్థలం పక్కనే నర్సింహరావు అనే వ్యక్తికి కూడా 222 గజాల స్థలం ఉంది. ఈ స్థలంలో గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణానికి నర్సింహారావు అనుమతులు పొందారు. అయితే మంజూరు చేసిన ప్లాన్‌కు విరుద్ధంగా గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో రెండు అంతస్తులు, దానిపై పెంట్ హౌస్ నిర్మిస్తున్నారని, నిబంధనల ప్రకారం సెట్ బ్యాక్ కూడా వదలడం లేదంటూ దేవేందర్ జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పెంట్ హౌస్‌పై సెల్‌టవర్ కూడా ఏర్పాటు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అధికారులు స్పందించకపోవడంతో దేవేందర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాక అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయాలని, సెల్ టవర్‌ను తొలగించాలని అధికారులు నర్సింహారావుకు నోటీసులు పంపారు. పూర్తిస్థాయిలో వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఈ మొత్తం వ్యవహారంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వ్యవహారశైలిని తప్పుపట్టారు. అక్రమ నిర్మాణాలని తెలిసి కూడా 25 శాతం జరిమానా విధించి చట్టప్రకారం నిర్వర్తించాల్సిన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అలాగే, ప్లాన్‌కు విరుద్ధంగా నర్సింహారావు అదనపు అంతస్తులు నిర్మించి, సెల్‌టవర్ ఏర్పాటు చేసినా కూడా పట్టించుకోలేదన్నారు. ‘నగరాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని అధికారులు ఓ వైపు చెబుతూనే, మరోవైపు అక్రమ నిర్మాణాలను జరిమానా విధించి యథాతథంగా ఉంచుతున్నారు. ఈ కేసులో కూడా నర్సింహారావుతో జీహెచ్ఎంసీ అధికారులు కుమ్మక్కు కావడం వల్లే అక్రమ నిర్మాణం వెలిసింది. అందువల్ల నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అదనపు అంతస్తులను కూల్చివేయాలి. అంతేకాక కేసులో డిప్యూటీ కమిషనర్ వ్యవహరించిన తీరును పరిగణనలోకి తీసుకుంటూ అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని కమిషనర్ పరిశీలించాలి.’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. డిప్యూటీ కమిషనర్‌కు, నర్సింహారావుకు చెరో రూ.5 వేల జరిమానా విధిస్తూ, ఆ మొత్తాన్ని పిటిషనర్‌కు చెల్లించాలని ఆదేశించారు. -
ప్రమాద బాధితుడికి రూ. 10 లక్షల పరిహారం
ఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితుడికి రూ. 10 లక్షల పరి హారం చెల్లించాలని మోటారు వాహనాల క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (ఎంఏసీటీ) గురువారం న్యూఇండియా బీమా సంస్థను ఆదేశించింది. దక్షిణ ఢిల్లీలో నివసించే 19 ఏళ్ల సోను అనే యువకుడు 2008లో ఓ బస్సు ఎక్కాడు. అయితే డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా, అతి వేగంగా నడుపుతూ అకస్మాత్తుగా బ్రేకు వేయడంతో అందులోనుంచి కింద పడ్డాడు. దీనిపై అప్పట్లో ఎంఏసీటీలో ఫిర్యాదు దాఖలైంది. దీనిని పరిశీలించిన ఎంఏసీటీ...సోను వాదన బలంగా ఉందని, పోలీసుల విచారణ దీనిని బలపరుస్తోందని ట్రిబ్యునల్ పేర్కొంది. పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఏ ఒక్క ఆధారమూ లేదంది. డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా నడిపిన కారణంగానే అతడు తీవ్రంగా గాయపడ్డాడనే విషయం తేలిందని ఎంఏసీటీ ప్రిసైడింగ్ అధికారి అజయ్కుమార్జైన్ పేర్కొన్నారు. వైద్యనివేదిక ఆధారంగా పరిహారం ఇవ్వాలని ఆదేశించిన ఎంఏసీటీ.... సోను ఈ ప్రమాదంలో 51 శాతంమేర గాయపడ్డాడని పేర్కొంది. తాత్కాలిక అంగవైకల్యానికి లోనయ్యాడంది. అయితే దానర్థం అతను శాశ్వత అంగవైకల్యానికి గురికాలేదని కాదంది. సోను దాదాపు ఆరు సంవత్సరాలపాటు వైద్యచికిత్స పొందుతూనే ఉన్నాడంది. ఈ నేపథ్యంలో అతడు శాశ్వత వైకల్యానికి గురయ్యే ప్రమాదమూ లేకపోలేదంది. ఈ కారణంగా అతడు తన దైనందిన కార్యకలాపాలను చేసుకోలేకపోతున్నాడంది. కాగా 2008, డిసెంబర్ 15వ తేదీన సోను బస్సులో ఇంటికి బయల్దేరాడు. బస్సు దిగుతున్న సమయంలో అకస్మాత్తుగా వేగం పెంచడంతో అందులోనుంచి కిందపడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని సమీపంలోని ఎయిమ్స్‌కు తరలించారు. మరోవైపు సోను నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే బస్సు నుంచి కిందపడిపోయాడంటూ డ్రైవర్ చేసిన వాదనను ఎంఏసీటీ కొట్టిపారేసింది. -
కేసీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
రాష్ట్ర విభజన ఆపాలని కోరుతూ న్యాయవాది ఎమ్ఎల్ శర్మ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయంతో రాష్ట్ర విభజన చేసిందని, ఆ నిర్ణయాన్ని నిలవరించాలని శర్మ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్ ) దాఖలు చేశారు. గతంలో దాఖలైన పిటిషన్లకు ఆ పిల్ జత చేయాలని సుప్రీం కోర్టు శర్మను ఆదేశించింది. అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. విభజనపై ఇది వరకే కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సంగతిని ఈ సందర్బంగా సుప్రీం గుర్తు చేసింది. నోటీసులపై కేంద్రం నుంచి సమాధానం వచ్చిన వెంటనే విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే శర్మ దాఖలు చేసిన పిల్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను నాలుగో ప్రతివాదిగా చేర్చారు. దాంతో కేసీఆర్‌కు సుప్రీం నోటీసులు జారీ చేసింది.