‘చపాతి రోలర్’పై పిటిషన్‌లో ఈసీ వాదనలు
వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్న పిటిషనర్
సాక్షి, హైదరాబాద్: ప్రజా ప్రాతినిధ్య చట్టం – 1951లో నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల్లో తమకు ఫలానా గుర్తే కావాలని ఎవరూ కోరలేరని హైకోర్టులో ఎన్నికల కమిషన్ వాదనలు వినిపించింది. దీంతో ‘చపాతీ రోలర్’గుర్తును ఎంపిక జాబితాలో చేర్చాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను పిటిషనర్ ఉపసంహరించుకున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల ఉండటంతో ఎన్నికల గుర్తు జాబితాలో ‘చపాతీ రోలర్’ను చేర్చాలని కోరుతూ హైకోర్టులో అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫారమ్స్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదన లు వినిపిస్తూ...గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్ని కల్లో పిటిషనర్ పార్టీ అభ్యర్థులు ‘చపాతీ రోలర్’ గుర్తుపై పోటీ చేశారన్నారు. మండల పరిషత్ ప్రాదే శిక నియోజకవర్గం, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియో జకవర్గం, పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో అదే గుర్తు కేటాయించేలా ఈసీకి ఆదేశాలి వ్వాలని కోరారు.
ఈసీ తరఫు న్యాయవాది జి. విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం అలాంటి వెసులుబాటు లేనందున ఉన్న జాబితా నుంచే ఏదో ఒక గుర్తు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో పిటిషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది కోరడంతో ధర్మాసనం అంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment