పిటిషనర్‌కు అరుదైన శిక్ష వేసిన హైకోర్టు
పలు షరతులు విధిస్తూ ట్రాక్టర్ విడుదలకు అనుమతి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ హైదరాబాద్: రెండు ఎకరాల్లో చెట్ల నష్టానికి బాధ్యుడైన పిటిషనర్‌కు హైకోర్టు అరుదైన(బాధ్యతాయుత) శిక్ష విధించింది. ఎకరానికి 100 చొప్పున రెండు ఎకరాల్లో 200 మొక్కలు నాటాలని ఆదేశించింది. ఈ మొక్కలను సరఫరా చేయాల్సిందిగా సూర్యా పేట డీఎఫ్‌ఓకు స్పష్టం చేసింది. ఆర్డర్ కాపీ అందిన నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పిటిషనర్‌కు తెలి్చచెప్పింది. మొక్కలు నాటేందుకు న్యాయస్థానం విధించిన ఆదేశాలను పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
అయితే, చెట్ల నష్టం కలిగిందని చెబుతున్న కంపార్ట్‌మెంట్ నం.441ని గుర్తించేందుకు పిటిషనర్‌కు సాయం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాలని కోరగా.. అందుకు కోర్టు సమ్మతించింది. దీనిపై తదుపరి విచారణలోగా నివేదిక అందజేయాలని అటవీ అధికారులను ఆదేశిస్తూ, విచారణ సెపె్టంబర్ 6కు వాయిదా వేసింది. మంచిర్యాలజిల్లా నెన్నెల మండలం నాగారానికి చెందిన మాదె మల్లేశ్ వ్యవసాయదారుడు.
కుశెనపల్లి రేంజ్ కంపార్ట్‌మెంట్ నంబర్ 441లోని అటవీప్రాంతంలో అక్రమంగా ట్రాక్టర్‌తో భూమిని దున్ని చెట్లు తొలగించారన్న లింగాల సెక్షన్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు 2024, జూలై 1న మల్లేశ్, మరో ఇద్దరిపై కేసు నమోదైంది. మధ్యవర్తి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించిన అధికారులు అదే రోజు ట్రాక్టర్‌ను సీజ్ చేసి బెల్లంపల్లిలోని కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టారు.
అటవీ భూమి ఆక్రమణకు యత్నించారు
సీజ్ చేసిన తన ట్రాక్టర్‌ను తిరిగి అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాదె మల్లేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పిటిషనర్ ఎలాంటి తప్పు చేయలేదని, భూమి దున్న డానికి ఎలాంటి సంబంధం లేదని, వ్యవసాయ పనుల నిమి త్తం ట్రాక్టర్‌ను మరో ఇద్దరి(ఏ–1, ఏ–2)కి అద్దెకు మాత్రమే ఇచ్చారని మల్లేశ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
మరోవైపు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ అలవాటైన నేరస్తుడని, అతనిపై మరికొన్ని కేసులు కూడా ఉన్నాయని, వాటిపై ట్రయల్ కోర్టులో విచారణ సాగుతోందని చెప్పారు. పిటిషనర్‌తోపాటు మరికొందరు బృందంగా ఏర్పడి తరచూ అటవీ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ట్రాక్టర్ విడుదలకు గతంలో ఇదే కోర్టు ఇచి్చన ఉత్తర్వులను పాటించాలన్నారు. రూ.50 వేల బాండ్‌తోపాటు ఇద్దరు పూచీకత్తు సమరి్పంచాలని..
ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ ట్రాక్టర్‌ను అమ్మడంగాని, వేరొకరి పేరు మీదకు మార్చడంగాని చేయనని అఫిడవిట్ ఇవ్వాలని.. అధికారులు ఆదేశించినప్పుడు ట్రాక్టర్ వారి వద్దకు తీసుకురావాలని.. ఈ ఉత్తర్వుల కాపీ అందిన నాలుగు వారాల్లోగా అఫిడవిట్లు అందజేయాలని పిటిషనర్‌ను ఆదేశించారు. అనంతరం ట్రాక్టర్‌ను విడుదల చేయాలని అధికారులకు చెప్పారు. చెట్లకు నష్టం కలిగించినందుకు.. అదే అటవీ ప్రాంతంలో 200 మొక్క లు నాటాలని పిటిషనర్‌కు తేలి్చచెప్పారు.
కాగా, స్పష్టమైన ఆదేశాలు ఉంటే తప్ప అటవీశాఖ మొక్కలు సరఫరా చేయదని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో మొక్కలు సరఫరా చేయాలని సూర్యాపేట డీఎఫ్‌ఓను ఆదేశించారు. నెలరోజుల్లో మొక్కలు నాటి నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. పిటిషనర్ మాదె మల్లేశ్ కోర్టు తీర్పుపై ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎకరం భూమి దున్నితే రూ.2వేలు వస్తాయని కిరాయి(అద్దె)కి ట్రాక్టర్‌ను ఇస్తే, తనకు ఊహించని వి«ధంగా తీర్పు వచి్చందన్నారు. మరోవైపు జిల్లా అటవీ అధికారులు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment