వారణాసి జ్ఞానవాపి మసీదు కేసులో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న రాఖీ సింగ్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు బహిరంగ లేఖ రాశారు. అనాయాస మరణానికి(euthanasia) తనను అనుమతించాలని ఆమె రాష్ట్రపతికి విజ‍్క్షప్తి చేశౠరు. జ‍్క్షానవాపి విషయంలో తనతో పాటు పిటిషన్లు వేసిన వాళ్లే తనను వేధిస్తున్నారని, అందుకే తాను చావాలనుకుంటున్నానని అందులో పేర్కొన్నారామె.
మీ బదులు కోసం జూన్ 9వ తేదీ ఉదయం 9 గంటల వరకు ఎదురు చూస్తా. మీ నుంచి స్పందన లేకుంటే.. తర్వాత తీసుకోబోయే నిర్ణయానికి నాదే పూర్తి బాధ్యత అంటూ ఆమె లేఖను రాష్ట్రపతి భవన్‌కు పంపారు.
పిటిషన్‌ను ఉపసంహరించుకున్నప్పటి నుంచి హిందూ సమాజంలో తనను బద్నాం చేసే కుట్ర జరుగుతోందని అంటున్నారామె. అందుకు తనతో పాటు జ్ఞానవాపి పిటిషన్ వేసిన నలుగురే కారణమంటూ చెబుతున్నారు. పిటిషన్ వెనక్కు తీసుకోవడం విషయంలో తన మీద తప్పుడు ప్రచారం చేశారని, దాని వల్ల తన పరువు పోయిందని, హిందూ సమాజం.. ఆఖరికి తన కుటుంబం కూడా తనను ఇప్పుడు ద్వేషిస్తోందని లేఖలో వాపోయారామె. ఈ మానసిక క్షోభ నుంచి బయటపడేందుకు తనకు అనాయాస మరణానికి అనుమతించాలని ఆమె లేఖ ద్వారా రాష్ట్రపతి ముర్ముకు విజ‍్క్షప్తి చేశారు. అయితే..
రాఖీ బంధువు జితేంద్ర సింగ్ విసేన్ తమ ఆర్థిక పరిస్థితి వల్లే పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. కోర్టుల చుట్టూ తిరగడానికి మాకెవరూ స్పాన్సర్లు లేరు. మా జేబులోంచి ఖర్చు పెట్టుకునేంత స్తోమత లేదు. అందుకే మా కుటుంబం జ‍్క్షానవాపి విషయంలో దాఖలు చేసిన అన్ని పిటిషన్లను ఉపసంహరించుకుంది అని ఆయన స్పష్టత ఇచ్చారు. నేను, నా కుటుంబం(రాఖీ సింగ్‌తో సహా) అన్ని పిటిషన్లను ఉపసంహరించుకున్నాం. మా ఆర్థిక పరిస్థితితో పాటు దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. ధర్మం కోసం సోరాడడానికి మా దగ్గర వనరులు లేవు. మేం జీవితంలో చేసిన తప్పు.. ఈ పిటిషన్‌ను వేయడం అంటూ ఆయన మీడియాకు చెబుతున్నారు.
జ్ఞానవాపి మసీదులో పూజలకు అనుమతించాలంటూ ఐదుగురు మహిళలు పిటిషన్లు వేయగా.. అందులో రాఖీసింగ్ కూడా ఉన్నారు. అయితే ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉందంటూ ఆమె తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment