Hindu communities
-
Bangladesh: ఆగని దాడులు.. టార్గెట్ ఇస్కాన్.. మరో అరెస్టు
ఢిల్లీ/ఢాకా: తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న బంగ్లాదేశ్‌లో.. హిందు ఆలయాలపై దాడులు ఆగడం లేదు. తాజాగా అల్లరి మూకలు ఛట్టోగ్రామ్‌లోని మూడు ఆలయాలపై రాళ్లు రువ్వి దాడికి తెగబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ధృవీకరించారు. మరోవైపు.. ఇస్కాన్ లక్ష్యంగా అణచివేత చర్యలు చేపట్టింది అక్కడి ప్రభుత్వం.తాజాగా.. బంగ్లాదేశ్‌లో మరో ఇస్కాన్ సభ్యుడి అరెస్టు అయ్యారు. ఛట్టోగ్రామ్లో ఇస్కాన్‌కు చెందిన శ్యామ్‌దాస్ ప్రభు అరెస్టు అయినట్లు ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధారమణ్ దాస్ ‘ఎక్స్’లో వెల్లడించారు. ఇటీవల చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ జెండాను అవమానించారని.. తద్వారా తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అయ్యారనే అభియోగాలు మోపి ఆయన్ని రాజద్రోహం కింద అరెస్ట్ చేశారు. అయితే.. ఆ అరెస్ట్‌ను నిరసిస్తూ బంగ్లా వ్యాప్తంగా హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించగా.. ఆ టైంలో(మంగళవారం) తలెత్తిన అల్లర్లలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరణించడం.. పరిస్థితిని మరింత తీవ్రంగా మార్చేసింది.మరోవైపు ఇస్కాన్‌పై నిషేధం దిశగా అక్కడి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. దీంతో మరో దోవలో ఇస్కాన్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఇస్కాన్‌కు చెందిన 17 బ్యాంక్ అకౌంట్లను నెలరోజులపాటు ఫ్రీజ్ చేసింది.బంగ్లాదేశ్ జనాభా 17 కోట్లకు కాస్త పైనే. ఇందులో 8 శాతం హిందూ జనాభా ఉంది. మైనారిటీలుగా కొన్ని హక్కులను హిందువులు అక్కడ అనుభవిస్తూ వస్తున్నారు. అయితే అనూహ్య పరిణామాల నడుమ షేక్ హసీనా పదవి నుంచి దిగిపోగా.. ఆ తర్వాత సైన్యం సహకారంతో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో హిందువులపై, ఆలయాలపై దాడులు పెరిగిపోయాయి. దీంతో చిన్మయ్ కృష్ణదాస్ రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. -
పాకిస్తాన్ లో హిందూ దేవాలయంపై దాడి.. పబ్జీ లవ్ స్టోరీనే కారణమా?
ఇస్లామాబాద్: శనివారం తెల్లవారు జామున సింధ్ ప్రాంతంలోని 150 ఏళ్ల నాటి "మరి మాతా" హిందూ దేవాలయాన్ని కూల్చిన 24 గంటలు గడవక ముందే మరో ఆలయంపై పాకిస్తానీ దుండగులు రాకెట్ లాంచర్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. సింధ్ ప్రావిన్సులో కొందరు దుండగులు హిందువులు నివసించే కాష్మోర్ ప్రాంతంలో అక్కడి హిందూ సమాజం నిర్మించుకున్న దేవాలయం పైనా చుట్టుపక్కల ఉన్న హిందువుల ఇళ్ల మీదా రాకెట్ లాంఛర్లతో విచక్షణారహితంగా దాడులు చేశారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి దుండగులు పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని కాష్మోర్-కందకోట్ ఎస్.ఎస్.పీ ఇర్ఫాన్ సమ్మో తెలిపారు. ఈ దాడుల నేపథ్యంలో స్థానిక హిందూ సమాజానికి రక్షణ కల్పిస్తామని ఈ సందర్బంగా సమ్మో అభయమిచ్చారు. ఈ దేవాలయంలో బాగ్రి సమాజానికి చెందిన వారంతా ఏడాదికి ఒకసారి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటామని, ఆలయంపై ఈ విధంగా దాడి చేయడం పిరికి చర్య అని అన్నారు బాగ్రి సమాజానికి చెందిన డాక్టర్ సురేష్. దుండగులు ఫైర్ చేసిన చాలా రాకెట్ లాంచర్లు జనావాసాల వద్ద పడ్డాయని కానీ అవి పేలకపోవవడంతో ప్రాణనష్టం జరగలేదని లేకుంటే మరింత విధ్వంసం జరిగి ఉండేదని ఆయన తెలిపారు. ఇటీవల పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ పబ్జీలో పరిచయమైన భారతీయ యువకుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోయినందుకు ప్రతీకారంగా కాష్మోర్-ఘోట్కీ నదీతీరాన ఉండే కొంతమంది ఆగంతకులు గతంలో హెచ్చరించారు. బహుశా ఇది వారి చర్యే అయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇది కూడా చదవండి: బంపరాఫర్.. అద్దెకు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లభ్యం.. -
20 కుటుంబాలు ఇళ్ళు హామీ పెట్టి.. బ్యాంకు రుణం తెచ్చి USలో కట్టిన గుడి !
ఈ గుడి కథంతా తెలుగు సినిమా కథలా కనిపిస్తుంది. కాని ఇది యథార్థంగా జరిగిన ఘటన. కాలిఫోర్నియాలో ఒక దేవాలయ నిర్మాణం విషయంలో. ఫేస్ బుక్ లో వల్లీశ్వర్ గుండు (Valliswar Gundu) షేర్ చేసుకున్న కథనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్ట్ యథాతధంగా.. 1974 లో ఉత్తర కాలిఫోర్నియాలో హిందువుల కోసం ఒక దేవాలయం ఉండాలని కొందరు స్థానిక భారతీయులకు ఒక కోరిక కలిగింది. ఆ ఆలోచనకి ఒక రూపం వచ్చి 1977లో ఒక రిజిస్టర్డ్ కమ్యూనిటీగా ఏర్పడింది. ప్లెసంటన్ అనే ప్రాంతంలో షాడో క్లివ్స్ అనే సరస్సు ప్రక్కన ఓ నాలుగెకరాల స్థలంలో దేవాలయం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికి తొలి విరాళంగా 50 వేల డాలర్లు (రూ. 4.50 లక్షలు అప్పట్లో) ఇచ్చిన భక్తుడు ఒక గుజరాతీ. ఆయన పేరు గులు అద్వాణి. రకరకాల 'సాంకేతిక కారణాలు ' చూపిస్తూ స్థానిక పాలనా సంస్థ ఈ నిర్మాణానికి అభ్యంతరాలు తెలిపింది. ప్లెసంటన్ పౌరులు మూడు వేల సంతకాలతో తమ నిరసన వ్యక్తం చేశారు. రెండేళ్ళపాటు పోరాడారు. ప్రయోజనం శూన్యం. ఆ భూమి క్రయాన్ని రద్దు చేసుకున్నారు. అక్కడికి తూర్పుగా తొమ్మిది మైళ్ళ దూరంలో నాలుగెకరాల భూమి కొన్నారు. సరైన రోడ్లు లేవు. విద్యుత్ నీటి సదుపాయాలు సరిగ్గా లేవు. అక్కడే 1983లో దేవాలయం కట్టాలనుకున్నచోట ఒక పాత ఇల్లు కొని, తమ కార్యాలయం చేసుకున్నారు. ఆ కార్యాలయానికి ప్రక్కనే ఆలయ క్షేత్ర భూమిలో సర్వశక్తిమంతురాలైన శ్రీ కనక దుర్గాదేవి మందిరానికి భూమి పూజ జరిగింది. గత నాలుగు దశాబ్దాలకు పైగా దేవాలయ అభివృద్ధిలో పాత్రధారిగా, అలుపెరగని సేవకురాలిగా, అన్ని పరిణామాలకి సాక్షిగా అనునిత్యం తరిస్తున్న నీలంరాజు విజయలక్ష్మి జ్ఞాపకాల్లోకి తొంగి చూస్తే..సంభ్రమం, ఆశ్చర్యం కలిగించే అద్భుతాలు ఎన్నో!. (నీలంరాజు విజయలక్ష్మి) అప్పుడే అద్భుతం జరిగింది! ఆమె మాటల్లో చెప్పాలంటే … 1982 ఆగష్టులో గణపతి స్థపతి గారు వచ్చి చూసి, అమ్మవారు ఉన్న చోట ఆగమ శాస్త్రం ప్రకారం ఏయే దేవతా విగ్రహాలు ఉండాలో చెప్పారు. 'పద్మశ్రీ' గ్రహీత ముత్తయ్య స్థపతి కూడా చూసి, కొన్ని సూచనలు చేశారు. దక్షిణభారత, ఉత్తర భారత శైలులు రెండిటినీ కమిటీ పరిగణనలోకి తీసుకుంది. ఆ సూచనల ప్రకారం విష్ణ్వాలయానికి చోళ శైలి గోపురం, శివాలయానికి కళింగ శైలి గోపురం ఎంచుకున్నారు. గణేశ, శివ, కార్తికేయ, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు, హనుమ, కాల భైరవులకు నల్లని గ్రానైట్ విగ్రహాలు, రామకృష్ణులు, దశ భుజ దుర్గలకు పాలరాతి విగ్రహాలు ఎంచుకున్నారు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది ! 1980 ప్రాంతంలో ఈ కమిటీ సారథుల్లో ఒకరైన శ్రీ ముత్తురామన్ అయ్యర్ శాన్ఫ్రాన్సిస్కోలో శివ-సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమెరికన్ స్వామీజీ తానే చొరవ తీసుకొని గణేశ, కార్తికేయ విగ్రహాలు ఇచ్చారు. కాని ఆలయం లేదు కదా! అందుకని వాటిని భక్తుల ఇళ్ళల్లో ఉంచి, వాటికి నిత్య పూజాభిషేకాలు జరిగేలా చూశారు. సరిగ్గా ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. గుడి కట్టడానికి నిధులు కావాలి. భారతీయ స్టేట్ బ్యాంకు వారు "రుణం ఇస్తాం. హామీ ఏం పెడతారు?" అని అడిగారు. అంతే.. 20 మంది భక్తులు తమ ఇళ్ళను హామీగా పెట్టేందుకు ముందుకు వచ్చారు. దాదాపు అయిదు లక్షల డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.60 లక్షలు) రుణం తీసుకున్నారు. తరువాత ఇంకో అద్భుతం జరిగింది ! 1984 ప్రథమార్థంలో అమెరికా వచ్చిన ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుని కమిటీ సభ్యులు కలిసి "టీటీడా వారి చేత మాకు శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం, స్వామి వారి అలంకారాలు ఇప్పించండి స్వామీ" అని కోరటం, వివేకానందుడి ఆహార్యంలో దర్శనమిచ్చిన ముఖ్యమంత్రి తక్షణం "అలాగే " అని హామీ ఇవ్వటం చకచక జరిగిపోయింది. సరిగ్గా నెల తిరక్కుండా టీటీడీ నుంచి ఆగమ శాస్త్రానుసారం ఏకశిల గ్రానైట్ మీద చెక్కిన శ్రీనివాసుడి విగ్రహం, అలంకార సామగ్రి, వస్త్రాలు, పాత్రలు (మొత్తం లక్ష రూపాయల విలువ) కాలిఫోర్నియా చేరిపోవటం జరిగింది. తమిళనాడు ప్రభుత్వం మంచి శిల్పుల్ని, కొన్ని విగ్రహాల్ని ఇస్తామని వాగ్దానం చేసింది. అప్పటికి చేతిలో ఉన్న విరాళాలతో కమిటీ 1984 ఏప్రిల్ దేవాలయ నిర్మాణానికి నిర్మాణానికి ఉపక్రమించింది. మళ్ళీ అమెరికా వచ్చిన ముఖ్యమంత్రి శ్రీఎన్.టి.రామారావు 1984 జూన్ 13 న ఆలయ సముదాయానికి శంకుస్థాపన చేశారు. (నాడు పూజలో పాల్గొన్న ఎన్టీఆర్) నా భక్తుడు నా కోసం వస్తాడు నన్ను పంపించు.. అప్పుడింకో అద్భుతం జరిగింది ! ఈ ఆలయ నిర్మాణానికి తపిస్తున్న భక్తుడు ముత్తురామన్ అయ్యర్ గారికి న్యూయార్క్ గణేశ దేవాలయ వ్యవస్థాపకులు అలిగప్పన్ గారు ఫోన్ చేసి, "మీకు అమ్మవారి విగ్రహం కావాలి కదా! మద్రాసు (చెన్నై)లో దేవీ భక్తుడు రిటైర్డ్ ఇంజినీర్ డాక్టర్ రాజు గారితో మాట్లాడండి" అని చెప్పారు. తరువాత ఆ ఇంజినీరే ఫోన్ చేశారు. ముత్తురామన్, తన భార్య గీతతో కలిసి మద్రాసు వెళ్తే, ఆ ఇంజినీర్, "ముత్తుస్వామి అనే భక్తుడు అమెరికాలో దేవాలయం కోసం వచ్చి నా విగ్రహం అడుగుతారు. నన్ను పంపించు" అని అమ్మవారు కొన్నేళ్ళక్రితమే తనకు చెప్పిందంటూ తన డైరీ చూపించారు. వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న ఆ విగ్రహం కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి స్పర్శతో దివ్యత్వాన్ని సంతరించుకున్నదని అంటూ ఆ విగ్రహాన్ని అమెరికా పంపించే ఏర్పాటు చేశారు. అలా వచ్చిన అమ్మవారికి ముందు తాత్కాలిక వసతి కల్పించారు. తర్వాత ప్రతిష్ట చేశారు. శివలింగాన్ని, మరి కొన్ని విగ్రహాల్ని తమిళనాడు ప్రభుత్వం ఇచ్చింది. ఇతర పాలరాతి విగ్రహాల్ని కమిటీయే సమకూర్చుకుంది. 1983 లో ప్రముఖ సితార విద్వాంసుడు పండిట్ రవి శంకర్ శంకుస్థాపన చేసినా, ఈ ఆలయ సముదాయం నిర్మాణ పనులు మాత్రం అమ్మవారి విగ్రహం వచ్చాకనే వేగంగా పుంజుకున్నాయి. అయితే నిధులు లేక మొత్తం సముదాయానికి పైకప్పు నిర్మాణం చాలాకాలం పట్టింది. అలాంటి రోజుల్లో, చెదురుమదురుగా వచ్చే భక్తులు శివలింగం ముందర పైసలు (సెంట్లు) వేసేవారు. అలా 99 సెంట్లు ఎప్పుడు సమకూరితే అప్పుడే అయిదు లీటర్ల పాలు కొని శివుడికి క్షీరాభిషేకం చేసేవాళ్ళు. అంతదాకా జలాభిషేకాలే ! మూడు నాలుగేళ్ళు అలాగే జరిగింది. రాధాకృష్ణులు, శ్రీరామ పరివారం, నవగ్రహాలు, హనుమ, కాలభైరవ ... అందరూ స్థిరపడ్డాక, 1986లో తొలి కుంభాభిషేకంలో ఈ మందిరాల మీద హెలికాప్టర్లోంచి పుష్ప వృష్టితో కూడా అర్చించారు. నిత్య పూజలతో పాటు కళ్యాణం, అభిషేకం వంటి సేవలన్నీ మొదలయ్యాయి. నలభయ్యేళ్ళు గడిచాయి. ఇప్పుడు 11 మంది అర్చకులు, ఆరుగురు ముఖ్య సిబ్బంది, ఇతరసహాయకులు, వారాంతాల్లో, ఇతర పర్వ దినాల్లో వచ్చి సేవలందించే వందమంది దాకా స్వచ్ఛంద సేవ చేసే భక్తులతో ప్రకాశిస్తున్న ఈ దేవాలయంలో ప్రతి పన్నెండేళ్ళకోసారి కుంభాభిషేకాలు జరుగుతున్నాయి. పాలతో అభిషేకం చేయలేని స్థితి నుంచి నిత్యాన్నదానం ఇచ్చే.. మళ్ళీ ఓ అద్భుతం ! క్రమంగా ఆలయ అవసరాలు పెరుగుతున్నాయి. "ఏం చేద్దాం ?" అనుకుంటున్న రోజుల్లో అమెరికా వాసులైన ఆకెళ్ళ సోదరులు ముందుకు వచ్చి, ఆలయానికి అనుకుని ఉన్న భూమిని తమ తల్లిదండ్రులు ఆకెళ్ళ మనోరమ, ఆకెళ్ళ శాస్త్రి గారి పేరు మీద విరాళంగా ఇచ్చారు. ఆ తరువాత డాక్టర్ హనుమరెడ్డి లక్కిరెడ్డి, డాక్టర్ పేరయ్య సూదనగుంట వంటి దాతలు సహా అనేక మంది విరాళాలతో ఆలయ సముదాయం భవనాలు, సదుపాయాలు విస్తరించాయి. ఇక్కడ ప్రముఖ పండితుల ప్రవచనాలు, క్రతువులు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘నిత్య కళ్యాణం పచ్చ తోరణం’గా ఈ దేవతా క్షేత్రం భాసిల్లుతోంది. ఒకప్పుడు శివలింగానికి పాలతో అభిషేకం చేసే స్తోమత లేని ఈ ఆలయంలో నేడు ప్రతి రోజూ అన్న ప్రసాదాలే. పర్వ దినాల్లో మూడువేల మందిదాకా భక్తులకు అన్న ప్రసాదాలు లభిస్తున్నాయి. ప్రతి జనవరి 1 నాడు ఎన్నో వేలమంది భక్తులు ఇక్కడి దేవతలను సేవిస్తుంటారు.. ఇప్పుడు కాలిఫోర్నియాలో అతి పెద్ద దేవాలయంగా లివర్ మోర్లో భక్తుల సేవలందుకుంటున్నది ఈ శివ-విష్ణు దేవాలయం (Hindu Cultural and Community Centre). “తొలి భూమిపూజ నాడు దీపం వెలించే భాగ్యం నాకు లభించింది. అప్పట్నుంచీ, నేను మా వారు శ్రీనివాస రావు గారు ఈ సముదాయంలోని అన్ని ఆలయాల అభివృద్ధిలో పాత్రధారుల మయిపోయాం. మేనేజ్మెంటు కమిటీలో రక రకాల బాధ్యతల్లో ఉన్నాం. కొన్ని సంవత్సరాల పాటు నేను ప్రతిరోజూ 30 మైళ్ళ (50 కి.మీ) దూరం నుంచి దేవాలయానికి సేవలకోసం వచ్చేదాన్ని. ఇప్పుడు మంగళ, శుక్రవారాలు, పర్వదినాలు ....! అనేక అద్భుతాలతో, అనేకమంది దాతల విరాళాలతో, సేవలతో నిర్మాణమయింది ఈ దేవాలయం. గత నాలుగున్నర దశాబ్దాలలో ఇందులో ప్రతి మందిరంలోనూ మా చేత ఏదో ఒక పాత్రను ధరింపజేసి, ఈ దేవాలయంతో మా అనుబంధాన్ని అమ్మవారు సుసంపన్నం చేస్తోంది. పన్నెండేళ్ళకోసారి చొప్పున ఇప్పటిదాకా జరిగిన నాలుగు కుంభాభిషేకాల్లో ఉన్నాను. ఏనాడూ అమ్మవారు నన్ను విశ్రాంతి తీసుకోనివ్వలేదు. ఎంతకాలం ఆమె ఇలా శక్తినిస్తే, అంతవరకూ సేవిస్తూనే ఉంటాను..." అంటారు భక్తురాలు విజయలక్ష్మి. (చదవండి: ధర్మచక్ర ప్రవర్తనా పూర్ణిమ) -
ఆదిపురుష్‌పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో ప్రభాస్, కృతి సనన్ జంటగా వచ్చిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ చిత్రం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని.. హిందువులకు పవిత్రమైన ఇతిహాస రామాయణాన్ని హేళన చేసేలా ఉందంటూ హిందూసేన అభ్యంతరం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం ఆదిపురుష్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హిందూ సేన జాతీయాధ్యక్షుడు విష్ణు గుప్తా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ చిత్రం కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు రామాయణాన్ని, అలాగే శ్రీరాముడిని, భారత సంప్రదాయాల్ని ఎగతాళి చేసినట్లు ఉందని పిటిషన్లో పేర్కొన్నారాయన. సినిమాలో ప్రధాన పాత్రలను చూపించిన తీరు సరికాదనేది హిందూ సేన ప్రధాన అభ్యంతరం. వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో, అలాగే తులసీదాస్ రచించిన రామచరితమానస్‌లోనూ ప్రధాన పాత్రల వర్ణనకు.. ఆదిపురుష్‌లో పాత్రలను చూపించిన తీరుకు చాలా తేడాలు ఉన్నాయని పిటిషన్లో ప్రస్తావించారు. హిందూ దేవుళ్లైన రాముడు, సీత, హనుమంతుడు, రావణుడికి సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని లేదంటే సరిదిద్దడానికి చిత్రయూనిట్‌కు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. ముఖ్యంగా రావణ బ్రహ్మ పాత్రధారి(సైఫ్ అలీఖాన్)ను గడ్డంతో ఏదో క్రూరుడిగా చూపించినట్లు ఉందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది హిందూ సేన. ప్రామాణికమైన వాల్మీకి రామాయణం గురించి తెలుసుకోవాలంటే పండితుల్ని, సాహిత్యకారుల్ని సంప్రదించాల్సిందేనంటూ ఈ చిత్ర ప్రారంభంలోనే నోట్ ఇవ్వడం గమనార్హం. ఇదీ చదవండి: ఆదిపురుష్ ఆ ఓటీటీలోనే.. వచ్చేసిన క్లారిటీ -
హిందూ సమాజం ద్వేషిస్తోంది.. చావడానికి అనుమతించండి!
వారణాసి జ్ఞానవాపి మసీదు కేసులో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న రాఖీ సింగ్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు బహిరంగ లేఖ రాశారు. అనాయాస మరణానికి(euthanasia) తనను అనుమతించాలని ఆమె రాష్ట్రపతికి విజ్క్షప్తి చేశౠరు. జ్క్షానవాపి విషయంలో తనతో పాటు పిటిషన్లు వేసిన వాళ్లే తనను వేధిస్తున్నారని, అందుకే తాను చావాలనుకుంటున్నానని అందులో పేర్కొన్నారామె. మీ బదులు కోసం జూన్ 9వ తేదీ ఉదయం 9 గంటల వరకు ఎదురు చూస్తా. మీ నుంచి స్పందన లేకుంటే.. తర్వాత తీసుకోబోయే నిర్ణయానికి నాదే పూర్తి బాధ్యత అంటూ ఆమె లేఖను రాష్ట్రపతి భవన్‌కు పంపారు. పిటిషన్‌ను ఉపసంహరించుకున్నప్పటి నుంచి హిందూ సమాజంలో తనను బద్నాం చేసే కుట్ర జరుగుతోందని అంటున్నారామె. అందుకు తనతో పాటు జ్ఞానవాపి పిటిషన్ వేసిన నలుగురే కారణమంటూ చెబుతున్నారు. పిటిషన్ వెనక్కు తీసుకోవడం విషయంలో తన మీద తప్పుడు ప్రచారం చేశారని, దాని వల్ల తన పరువు పోయిందని, హిందూ సమాజం.. ఆఖరికి తన కుటుంబం కూడా తనను ఇప్పుడు ద్వేషిస్తోందని లేఖలో వాపోయారామె. ఈ మానసిక క్షోభ నుంచి బయటపడేందుకు తనకు అనాయాస మరణానికి అనుమతించాలని ఆమె లేఖ ద్వారా రాష్ట్రపతి ముర్ముకు విజ్క్షప్తి చేశారు. అయితే.. రాఖీ బంధువు జితేంద్ర సింగ్ విసేన్ తమ ఆర్థిక పరిస్థితి వల్లే పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. కోర్టుల చుట్టూ తిరగడానికి మాకెవరూ స్పాన్సర్లు లేరు. మా జేబులోంచి ఖర్చు పెట్టుకునేంత స్తోమత లేదు. అందుకే మా కుటుంబం జ్క్షానవాపి విషయంలో దాఖలు చేసిన అన్ని పిటిషన్లను ఉపసంహరించుకుంది అని ఆయన స్పష్టత ఇచ్చారు. నేను, నా కుటుంబం(రాఖీ సింగ్‌తో సహా) అన్ని పిటిషన్లను ఉపసంహరించుకున్నాం. మా ఆర్థిక పరిస్థితితో పాటు దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. ధర్మం కోసం సోరాడడానికి మా దగ్గర వనరులు లేవు. మేం జీవితంలో చేసిన తప్పు.. ఈ పిటిషన్‌ను వేయడం అంటూ ఆయన మీడియాకు చెబుతున్నారు. జ్ఞానవాపి మసీదులో పూజలకు అనుమతించాలంటూ ఐదుగురు మహిళలు పిటిషన్లు వేయగా.. అందులో రాఖీసింగ్ కూడా ఉన్నారు. అయితే ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉందంటూ ఆమె తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. -
Texas: హిందూ ఆలయంలో హుండీ దొంగతనం
ఆస్టిన్: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన టెక్సస్‌లోని ఓ హిందూ దేవాలయంలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని ఆగంతకులు నేరుగా గుడిలోకి ప్రవేశించి హుండీ, భక్తులు తమ విలువైన వస్తువులు దాచుకునే లాకర్‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన భారత కమ్యూనిటీని షాక్‌కు గురి చేసింది. బ్రజోస్ వ్యాలీలో ఉన్న ఏకైక హిందూ దేవాలయం శ్రీ ఓంకారనాథ్ ఆలయం. ఈ ఆలయంలోనే దొంగతనం ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బోర్డ్ మెంబర్ శ్రీనివాస సుంకరి వెల్లడించిన వివరాల ప్రకారం.. కిటికీ తొలగించి లోనికి చొరబడ్డ ఆంగతకులు.. హుండీతో పాటు కొన్ని విలువైన వస్తువులున్న లాకర్‌ను చోరీ చేసినట్లు తెలిపారు. అయితే ఆలయ అర్చుకుడి కుటుంబం సమీపంలోనే నివసిస్తోందని, వాళ్లంతా సురక్షితంగానే ఉన్నట్లు సుంకరి వెల్లడించారు. ఇక.. సెక్యూరిటీ కెమెరాల్లో ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో నమోదు అయ్యింది. ఆదివారం హిందూ కమ్యూనిటీతో సమావేశమై.. ఈ ఘటన గురించి చర్చించినట్లు వెల్లడించారు. అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారాయన. ఇక ఈ దొంగతనంపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
Kaali Poster: ఫిల్మ్‌మేకర్ లీనాపై ఫిర్యాదుల వెల్లువ
నూపుర్ శర్మ వ్యవహారం ఇంకా వార్తల్లోనే ఉన్న వేళ.. ఈసారి హిందువుల మనోభావాలు దెబ్బ తీసిందంటూ ఓ ఫిల్మ్‌మేకర్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ‘కాళి’ పేరుతో రిలీజ్ అయిన ఓ డాక్యుమెంటరీ పోస్టర్.. ఇప్పుడు పెనుదుమారంగా మారే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులో పుట్టి.. టొరంటో(కెనడా)లో ఉంటున్న లీనా మణిమేకలై.. కాళి టైటిల్‌తో రెండు రోజుల కిందట ఓ పోస్టర్‌ను వదిలింది. పోస్టర్ మరీ అభ్యంతరకరంగా ఉండడంతో.. ఆమె క్షమాపణలు చెబుతూ, పోస్టర్‌ను తొలగించాలంటూ పలువురు హెచ్చరికలతో కూడిన డిమాండ్లు చేశారు. ఈ తరుణంలో.. క్షమాపణలు చెప్పకపోగా మరింత రెచ్చగొట్టేలా లీనా మణిమేకలై వ్యవహరించింది. ఈ ఉదయం ఆమె తమిళంలో చేసిన ఓ ట్వీట్.. విషయాన్ని మరింత హీటెక్కించింది. “எனக்கு இழப்பதற்கு ஒன்றுமில்லை. இருக்கும் வரை எதற்கும் அஞ்சாமல் நம்புவதைப் பேசும் குரலோடு இருந்துவிட விரும்புகிறேன். அதற்கு விலை என் உயிர் தான் என்றால் தரலாம்” https://t.co/fEU3sWY4HK — Leena Manimekalai (@LeenaManimekali) July 4, 2022 అరెస్ట్ లీనా మణిమేకలై హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో.. ముందు సినిమా చూడాలని, ఆపై అరెస్ట్ అంటూ డిమాండ్ చేసిన వాళ్లంతా లవ్యూ అంటారంటూ ట్వీట్లో ఆమె పేర్కొంది. అయితే ఆమె వివరణతో వివాదం మాత్రం చల్లారడం లేదు. నూపుర్ శర్మను తప్పుబట్టిన వాళ్లంతా ఇప్పుడు ఏమైపోయారని నిలదీస్తున్నారు పలువురు. ఢిల్లీకి చెందిన ఓ లాయర్ లీనా.. లీనాపై ఢిల్లీ సైబర్ సెల్ ఐఎఫ్ఎస్వోలో ఫిర్యాదు చేశారు. గౌ మహాసభ నిర్వాహకుడు అజయ్ గౌతమ్.. పోలీసులకు పిర్యాదు చేయడంతో పాటు హోం సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. తక్షణమే ఈ డాక్యుమెంటరీని ఆపించాలంటూ కోరుతున్నారాయన. మరికొన్ని చోట్ల సైతం లీనాపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. Super thrilled to share the launch of my recent film - today at @AgaKhanMuseum as part of its “Rhythms of Canada” Link: https://t.co/RAQimMt7Ln I made this performance doc as a cohort of https://t.co/D5ywx1Y7Wu@YorkuAMPD @TorontoMet @YorkUFGS Feeling pumped with my CREW❤️ pic.twitter.com/L8LDDnctC9 — Leena Manimekalai (@LeenaManimekali) July 2, 2022 ‘‘పోగొట్టుకోవడానికి నా దగ్గరంటూ ఏమీ లేదు. ప్రాణం ఉన్నంత వరకు.. దేనికీ భయపడకుండా మాట్లాడతాను. ఒకవేళ నా ప్రాణమే వెల కడితే.. ఇచ్చేస్తాను’ అంటూ మరో ప్రకటన చేసింది ఆమె. టొరంటో ఆగాఖాన్ మ్యూజియమ్ వద్ద రిథమ్స్ ఆఫ్ కెనడా సెగ్మెంట్లో భాగంగా ఈ డాక్యుమెంటరీని తీసినట్లు ఆమె చెప్తున్నారు. ఒకవైపు లీనా.. మరోవైపు విమర్శకులు ఎంతకూ తగ్గకపోవడంతో ఈ వివాదం ఎంత ముదురుతుందో చూడాలి!. -
కర్ణాటకలో మరొకటి.. ఆలయాల వద్ద అమ్మకాలపై బ్యాన్!
కర్ణాటకలో మరో డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఆలయాల దగ్గర, జాతరల్లో పండ్లు, పూలు,ఇతర వస్తువులు అమ్ముకునేందుకు ముస్లింలను అనుమతించొద్దంటూ డిమాండ్ ఊపందుకుంది. ఈ మేరకు పోస్టర్లు వెలుస్తుండడంతో.. పూర్తి నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం హామీ ఇచ్చింది. కర్ణాటక ఉడుపిలోని హోసా మార్గుడి Hosa Margudi ఆలయం జాతరలో ప్రతీ ఏడాది వందకు పైగా ముస్లిం వర్తకులు స్టాల్స్ నిర్వహిస్తుంటారు. అయితే.. ఈ దఫా వాళ్లకు అనుమతి నిరాకరించారు నిర్వాహకులు. కారణం.. ఆలయాల దగ్గర, ఉత్సవాల్లో వ్యాపారం నిర్వహించుకునేందుకు ముస్లింలను అనుమతించకూడదంటూ పోస్టర్లు వెలిశాయి. దీంతో వాళ్లకు ఈసారి స్టాల్స్ పెట్టుకునేందుకు అనుమతి దొరకలేదు. ఒత్తిడి వల్లే ఉడిపిలోని వీధి వ్యాపారుల సంఘం ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఆరిఫ్ ఈ వ్యవహారంపై స్పందించాడు. ‘‘మేము వెళ్లి ఆలయ కమిటీ సభ్యులను కలిశాం. అయితే వాళ్లు హిందువుల కోసం మాత్రమే స్లాట్లను వేలం వేస్తామని చెప్పారు. వాళ్లపై కచ్చితంగా ఒత్తిడి ఉండే ఉంటుంది. అందుకే మేము చేసేది లేక వెనుదిరిగాం’’ అని ఆరిఫ్ పేర్కొన్నాడు. హిందూ సంఘాల డిమాండ్ మేరకే మేం నిషేధం విధించాం అని హోసా మార్గుడి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రశాంత్ శెట్టి స్పష్టం చేశారు. ఎండోమెంట్ చట్టాల ప్రకారం.. హిందుయేతరులకు అనుమతులు లేవని, కానీ, రెండు మతాల వాళ్లు ఈ జాతరలో పాల్గొంటుడడంతో అనుమతిస్తూ వస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ఈసారి హిందూ సంఘాల నుంచి ఒత్తిళ్లు వచ్చాయని, విషయం పెద్దది కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. హిజాబ్ తీర్పు ఎఫెక్ట్! హిజాబ్ తీర్పు తర్వాత.. ముస్లిం విద్యార్థినులకు మద్దతుగా బంద్‌కు పిలుపు ఇచ్చారు ముస్లిం వర్తకులు. ఈ నేపథ్యంలోనే హిందూ సంఘాలు వాళ్లను నిషేధించాలని పట్టుబట్టినట్లు ఆరిఫ్ ఆరోపిస్తున్నారు. మరోవైపు తోటి వ్యాపారులపై నిషేధం విధించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షం ధ్వజమెత్తడంతో.. చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వీధుల్లోనూ అభ్యంతరాలు దేవాలయాల జాతరల్లోనే కాకుండా వీధుల్లో కూడా అమ్ముకునేందుకు ముస్లింలను అనుమతించడం లేదంటూ కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనేత, కాంగ్రెస్ నేత యుటి ఖాదర్ ఆరోపించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు కూడా. అయితే న్యాయశాఖ మంత్రి మధుస్వామి మాత్రం నిషేధాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వం నిషేధం లాంటి వాటిని ప్రోత్సహించడం లేదు. ఆలయ పరిసరాల్లో అలాంటి బ్యానర్లు వెలిసినా.. చర్యలు తీసుకుంటాం’’ అని మధుస్వామి స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో సమన్యాయం చేస్తామని, శాంతి భద్రతలు దెబ్బ తినకుండా పటిష్ట చర్యలు చేపడతామని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర హామీ ఇస్తున్నారు. మరోవైపు కర్ణాటకలో చాలా ఆలయాల దగ్గర ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. శివమొగ్గలో ఐదు రోజుల కోటే మారికాంబ జాతర ఉత్సవాల్లోనూ ముస్లిం నిర్వాహకులకు.. నిరసనలతో ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది. -
శివాజీ విగ్రహానికి చెప్పుల దండ
హైదరాబాద్ : ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామంతాపూర్‌లో గత అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామంతాపూర్ మెయిన్ రోడ్డులో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న హిందూ సంఘాల నాయకులు నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగారు. శివాజీ విగ్రహానికి జరిగిన అవమానం హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయని యం.ఎల్.ఎ రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజీపీ నాయకులు, కార్యకర్తలు, హిందూ వాహిని కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.