euthanasia
-
మానసిక అనారోగ్యం ఇంత భయానకమైనదా..? పాపం ఆ వ్యక్తి..
కొన్ని రకాల మానసిక రుగ్మతలు చాలా భయానకంగా ఉంటాయి. ఓ పట్టాన వాటికి ఉపశమనం దొరకదు. మనిషి సంకల్పబలానికే పరీక్ష పెట్టేలా ఉంటాయి ఆ వ్యాధులు. కొందరు జయిస్తారు. మరికొందరు ఆ వ్యాధి పెట్టే బాధకు తలవొగ్గక తప్పని పరిస్థితి ఎదురవ్వుతుంది. అలాంటి దుస్థితిలోనే ఉన్నాడు ఈ 28 ఏళ్ల వ్యక్తి. ఇన్స్టాగ్రామ్ వేదిక తన వ్యథను పంచుకున్నాడు.బ్రిటన్ సంతతి ఘనా కళాకారుడు జోసెఫ్ అవువా-డార్కో మానసిక అనారోగ్యంతో జీవించడం కంటే ముగించేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చేశాడు. అతడు మెదడుకి సంబంధించిన బైపోలార్ డిజార్డర్‌తో బాధపతున్నాడు. చట్టబద్ధంగా జీవితాన్ని ముగించేసేలా నెదర్లాండ్ దేశానికి వెళ్లాలనుకుంటున్నట్లు ఇన్‌స్టా వేదికగా తెలిపాడు. అనాయస మరణం కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. అనుమతి రావడానికి సుమారు నాలుగేళ్లు పడుతుందని అన్నాడు. ఎలాగో ఇంతటి జఠిలమైన నిర్ణయం తీసుకున్నాను కదా అని.. 'ది లాస్ట్ సప్పర్ ప్రాజెక్ట్'ను ప్రారంభించాడు. ఏంటంటే ఇది..తన చివరి క్షణాలను ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశ్యంతో అపరిచితులతో కనెక్ట్ అయ్యి వారితో విందులు ఆస్వాదించాలనేది అతడి కోరిక. ఆ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్ పేరుతో ప్రపంచవ్యాప్త పర్యటనలకు పయనమయ్యాడు కూడా. ఇప్పటి వరకు అతడు పారిస్, మిలన్, బ్రస్సెల్స్, బెర్లిన్లలో 57 విందులను ఆస్వాదించాడు. వచ్చే ఏడాదికి 120 విందులతో కూడిన టూర్స్‌కి ప్లాన్ చేశాడు. దీనివల్ల తాను ఇతరులతో కనెక్ట్ అవ్వడమేగాక తనకు ఓ రుగ్మత ఉందనే విషయం మర్చిపోయి ఆనందంగా గడపగలుగుతున్నాడట. మనల్ని ప్రేమించేవారు సంతోషంగా ఉండేలా వైద్య సహాయంతో పొందే ఈ అనాయస మరణం అహింసాయుతమైనదేనని చెబుతున్నాడు జోసఫ్. చివరగా తన బైపోలార్ సమస్య ఎంత తీవ్రతరమైనదో వివరించాడు. పొద్దుపొద్దున్నే లేవడమే ఓ నరకంలా ఉంటుందని, ప్రతి ఉదయం ఓ నరకమే అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. నాలుగేళ్లకు పైగా బాగా ఆలోచించే ఇక ఈ నిర్ణయం తీసుకున్నాని వివరించాడు.. జోసఫ్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అతడి వ్యథను విన్న నెటిజన్లు అతని నిర్ణయాన్ని కొందరు గౌరవించగా, మరికొందరు నిర్ణయం మార్చుకో బ్రదర్..తమతో విందు షేర్ చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. కాగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రకారం, బైపోలార్ డిజార్డర్ అనేది మెదడుకి సంబంధించిన మానిక్-డిప్రెసివ్ అనారోగ్యం. ఇది మానసిక స్థితి, శక్తి స్థాయిలలో తీవ్ర మార్పులకు కారణమవుతుంది. ఏటా చాలామంది ఈ రుగ్మత బారినపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. View this post on Instagram A post shared by Joseph “Nana Kwame” Awuah-Darko 🇬🇭 (@okuntakinte) (చదవండి: Round Egg Auction: కోటిలో ఒక్కటి ఇలా ఉంటుందేమో..! వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందంటే..) -
ఈ హృదయ విదాకర కేసులో తీర్పు ఇవ్వలేం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : తన కుమారుడి కారుణ్య మరణానికి (euthanasia) అనుమతించాలని దాఖలు చేసిన తల్లిదండ్రల అభ్యర్ధనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ హృదయ విదారక కేసులో పిటిషనర్లకు మద్దతుగా తీర్పు ఇవ్వలేమని తెలిపింది. అదే సమయంలో 11ఏళ్లుగా మంచానికే పరిమితమైన కుమారుణ్ని చూసుకునేందుకు తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న తల్లిదండ్రులకు ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఏదైనా సంస్థ బాధితుడి సంరక్షణ బాధ్యతల్ని చూసుకుంటుందో తెలుసుకోవాలని కేంద్రాన్ని కోరింది. కేసు పూర్వా పరాల్ని పరిశీలిస్తే.కేసు పూర్వా పరాల్ని పరిశీలిస్తే.. అశోక్ రాణా,నిర్మలా దేవి దంపతుల కుమారుడు హరీష్ రాణా. 2013లో చండీగఢ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదివేవారు. ఆ ఏడాది ఆగస్టు 3న సాయంత్రం 7 గంటలకు చండీగఢ్ నుంచి తండ్రి అశోక్ రాణాకు ఫోన్ వచ్చింది. హరీశ్ కింద పడిపోయి, గాయాలపాలయ్యారని చెప్పారు.నాలుగో అంతస్తు నుంచి కిందపడిహరీష్ తాను ఉంటున్న పేయింగ్ గెస్ట్ భవనంలోని నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో అలా అయ్యింది. తొలుత హరీష్‌కు చండీగఢ్‌లోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత ఎన్ని ఆస్పత్రులు తిప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. తలకు బలమైన గాయం కావడంతో అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు.ట్రీట్మెంట్ కోసం ఆస్తులమ్మితల్లిదండ్రులు ఇంటి నుంచి చికిత్స అందించే వారు. చికిత్స నిమిత్తం హరీష్ రాణాకు పైపుల (రైల్స్ ట్యూబ్) ద్వారా ఆహారాన్ని, మెడిసిన్‌ను పంపించే వారు. ఇందుకోసం భారీ మొత్తంలో ఖర్చయ్యేది. ఉన్న ఆస్తుల్ని అమ్మి చికిత్స అందించినా.. కుమారుడిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. దీంతో కుమారుడి కారుణ్యం మరణానికి అవకాశం కల్పించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలనితాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు బాధితుడి తల్లిదండ్రులు. మంగళవారం బాధితుల పిటిషన్‌పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా,జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా అశోక్ రాణా తరుఫు న్యాయవాది మాట్లాడుతూ.. కుమారుడి వైద్యం కోసం అశోక్ రాణా దంపతులు తమ ఇంటిని విక్రయించారని, ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని, కారుణ్య మరణం పొందేలా వీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.పిటిషన్లకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేంపిటిషన్ల అభ్యర్ధనపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రైల్స్ ట్యూబ్ తొలగింపు కారుణ్య మరణంలో భాగం కాదు. రైల్స్ ట్యూబ్ తీసివేస్తే రోగి ఆకలితో మరణిస్తారు'అని బెంచ్ పేర్కొంది. అయితే, ఈ హృదయ విదారకమైన కేసులో పిటిషన్లకు మద్దతుగా తీర్పు ఇవ్వలేం. అలాగని చూస్తూ ఉండిపోం. పిటిషనర్లైన తల్లిదండ్రులు దశాబ్దానికి కుమారుడి కోసం కష్టపడుతున్నారు. ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ సుదీర్ఘమైన, కష్టతరమైన ప్రయాణంలో ఇప్పటి వారి జీవితంలో వెలుగు చూడలేదు.అందుకే తల్లిదండ్రుల్ని ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పిస్తూ కుమారుడి బాగోగులు చూసుకునేందుకు ఏదైనా శాశ్వత పరిష్కారం చూపిస్తుందా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని బెంచ్ అభ్యర్థించింది.తల్లిదండ్రులకు ఉపశమనం కలిగేలాఇది చాలా కఠినమైన కేసు. తల్లిదండ్రులు 13 ఏళ్లుగా కష్టపడుతున్నారని, ఇకపై తమ కుమారుడి వైద్య బిల్లులు భరించలేకపోతున్నారని సీజేఐ తెలిపారు. ఏదైనా సంస్థ హరీష్ రాణాను జాగ్రత్తగా చూసుకోగలదో లేదో తెలుసుకోండి. రైల్స్ ట్యూబ్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నప్పటికీ, కారుణ్య మరణానికి అనుమతించలేమని’అని బెంచ్ తీర్పును వెలువరించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ఆరోగ్య మంత్రిత్వ శాఖను సంప్రదింస్తామని చెప్పారు. -
ఇక ఆ బాధలు నావల్ల కాదు : చిన్న వయసులోనే కఠిన నిర్ణయం
అనారోగ్య సమస్యల్ని, తీవ్రమైన బాధల్ని అనుభవించే సమయంలో ఈ బాధ భరించేకంటే చచ్చిపోవడం మేలు అని అనిపిస్తుంది. కానీ నిజంగానే చట్టబద్ధంగా మరణించేందుకు కొన్ని దేశాల్లో అనుమతి ఉంది. చికిత్స లేదు అనుకున్న సమయంలో, వైద్యులు, చట్టాలు పరిశీలించిన తరువాత చట్ట రీత్యా చనిపోవడానికి అనుమతి ఉంది. దాన్నే "కారుణ్య మరణం" (Euthanasia) అంటారు. అంటే సులభంగా నొప్పిలేకుండా, ఆ రోగికి శాశ్వతంగా విముక్తి కల్పించడం అన్నమాట. సరిగ్గా ఇలాగే చికిత్స లేని మానసిక వ్యాధులతో సతమతమవుతున్న నెదర్ల్యాండ్స్ యువతి జొరాయా టెర్ బీక్ (28) కారుణ్య మరణాన్ని ఎంచుకుంది. ది ఫ్రీ ప్రెస్ రిపోర్ట్ ప్రకారం టెర్ బీక్ చాలా కాలంగా ఆమె డిప్రెషన్, ఆటిజమ్, బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ వంటి సమస్యలతో బాధపడుతోంది. ఎన్ని చికిత్సలు చేసినా విముక్తి లభించలేదు. అంతేకాదు ఇక ఎలాంటి ఇతర చికిత్సలూ లేవని వైద్యులు కూడా తేల్చి చెప్పారు. దీంతో, బాధల నుంచి తప్పించుకునేందుకు ఆమె కారుణ్య మరణాన్ని ఎంచుకుంది. (తైవాన్ను కుదిపేసిన భూకంపం : మెట్రోట్రైన్, స్విమ్మింగ్ పూల్‌లో దృశ్యాలు) ప్రేమించే స్నేహితుడు, పెంపుడు జంతువులున్నప్పటికీ, ఆమె కూడా తన మానసిక వ్యాధి చికిత్సకు లొంగదని భావిస్తుంది. నెదర్లాండ్స్‌లో ఎక్కువ మంది ప్రజలు మానసిక ఆరోగ్య సమస్యలను భరించే బదులు వాటి బాధలను అంతం చేసుకోవాలని ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మే నెలలో ఆమె కూడా కారుణ్యమరణానికి రంగం సిద్దం కావడం విషాదం. ఈ ప్రక్రియలో భాగంగా దీనికి ప్రకారం టెర్ బీక్ ఇంటి వద్దే వైద్యులు ఆమెకు తొలుత మత్తు మందు ఇస్తారు. ఆ తరువాత గుండె కొట్టుకోవడాన్ని ఆపే మరో మందును ఇస్తారు. జోరాయా ఇంట్లో ఆమె ప్రియుడు, ఇతర కుటుంబసభ్యుల సమక్షంలో అచేతన స్థితిలో ఆమె లోకానికి శాశ్వతంగా ఈ లోకాన్ని వీడనుంది. నెదర్లాండ్స్‌లోని థియోలాజికల్ యూనివర్శిటీ కాంపెన్‌లోని హెల్త్‌కేర్ ఎథిసిస్ట్ స్టెఫ్ గ్రోన్వౌడ్ మాట్లాడుతూ గతంకంటే ఈ ధోరణి బాగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2001లోనే నెదర్లాండ్స్ కారుణ్యమరణానికి చట్టబద్ధత కల్పించింది. 2022 నాటి లెక్కల ప్రకారం, నెదర్లాండ్స్ మొత్తం మరణాల్లో 5 శాతం కారుణ్య మరణాలే కావడం గమనార్హం. దీంతో ఆత్మహత్యలను ప్రోత్సహిస్తోందంటూ ప్రభుత్వంపై చాలా విమర్శలున్నాయి. -
జంటగా చేతిలో చేయి వేసుకుని మరణించటం మాటలు కాదు..!
వృద్ధాప్యంలోకి వచ్చాక..భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ముందు చనిపోవడం సహజం. మిగిలిని వారు ఆ విరహాన్ని తట్టుకోవడం కూడా అసాధ్యమే. చాలామటుకు ఆ బెంగతో మిగిలినవారు మహా అయితే ఆరు నెలలు లేదా ఏడాదిలోపు చనిపోవడం జరుగుతుంది. అయితే కొందరూ మరణంలోకూడా జంటగా కలిసే చనిపోవాలనుకుంటారు. అలాంటి అవకాశం అందరికీ రాదు కూడా. బహుశా అందువల్లే వృధాప్యంలో ఉన్న వాళ్లను ఒంటరిగా వదిలేయరేమో!. కానీ ఇక్కడొక వ్యక్తి ఓ దేశానికి ప్రధానిగా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక వృధాప్యంలోకి చేరిన అతను మరణంలో కూడా భార్యని విడిచిపెట్టకూడదనుకున్నాడు. అందుకోసం వాళ్లేం ఏం చేశారో వింటే..కన్నీళ్లు ఆగవు.! వివరాల్లోకెళ్తే..డ్రైస్ వాన్ అగ్ట్ అనే వ్యక్తి నెదర్లాండ్ మాజీ ప్రధాని. అతను ప్రధానిగా 1977 నుంచి 1982 మధ్య కాలంలో ప్రధానిగా పనిచేశాడు. క్రిస్టియన్ డెమోక్రటిక్ అప్పీల్ అనే పార్టీని కూడా స్థాపించాడు. 2009లో 2009లో పాలస్తీనా హక్కుల కోసం వాదించేందుకు ది రైట్స్ ఫోరం అనే సంస్థను ఏర్పాటు చేశాడు. అధ్యక్షుడిగా ఉన్నంతసేపు నెదర్లాండ్ దేశంలో విలువలను కాపాడాడు. నిబద్ధమైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందాడు. అక్కడి రాజకీయాలను శాసించాడు. ఆయనకు యూజీనీ అనే భార్య ఉంది. ప్రస్తుతం అగ్ట్కి 93 ఏళ్లు కాగా, అతడి భార్యకు కూడా ఇంచుమించుగా అంతే వయసు ఉంటుంది. ఇరువురు వృధాప్యంలోకి చేరిపోయారు. అయితే డ్రైస్కి 2019 నుంచి బ్రెయిన్ హేమరేజ్‌తో బాధపడుతున్నాడు. అప్పటి నుంచి అతను మంచం మీదే ఉన్నాడు. ఇక అతని భార్య కూడా గత కొంతకాలం నుంచి అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యింది. ఇద్దరూ మంచానికే పరిమితమయ్యారు, పైగా ఇరువురిలో ఎవరూ ముందు చనిపోయినా తట్టుకునే లేదు. దీంతో ఇరువురు జంటగా మరణించాలనే ఉద్దేశ్యంతో ద్వంద్వ అనాయాస మరణాన్ని ఆశ్రయించారు. అలా ఫిబ్రవరి 5న డ్రైస్ వాన్ అగ్ట్, యూజీనీ తమ స్వస్థలమైన నిజ్ మెగన్ లో ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని కన్నుమూశారు. ఈ విషయాన్ని దీ రైట్స్ ఫోరం ధృవీకరించింది.”మా వ్యవస్థాపకుడు, గౌరవ చైర్మన్ డ్రైస్ వాన్ అగ్ట్ ఫిబ్రవరి 5, నిజ్ మెగన్ లో తన భార్యతో కలిసి మరణించారు. వారిద్దరూ 70 సంవత్సరాల పాటు వైవాహిక జీవితాన్ని గడిపారు. డ్రైస్ వాన్ అగ్ట్ తన భార్యను నా అమ్మాయి అని సంబోధించేవాడు. ఇద్దరు చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని” ది రైట్స్ వింగ్ డైరెక్టర్ గెరాడ్ జొంక్ మన్ తెలిపారు. ఇదిలా ఉండగా, నెదర్లాండ్‌లో "ద్వంద అనాయాస" లేదా ఇద్దరు వ్యక్తులు ఏకకాలంలో ప్రాణాంతక ఇంజెక్షన్‌ను తీసుకును చనిపోలానుకోనే ధోరణి ఎక్కువగా ఉంది. ఇలానే 2021లో 13 జంటలు, 2022లో ఏకంగా 29 జంటలు ప్రాణాలు పోగొట్టుకున్నట్లు తెలిపారు. నిజానికి దీన్ని ఇంగ్లీష్‌లో “duoEuthanasia” అంటారు.. తెలుగులో అయితే “అనాయాస మరణం” అని అంటారు. అయితే నెదర్లాండ్ దేశంలో ప్రతి ఏడాది దాదాపు వెయ్యి మంది వ్యక్తులు అనాయాస మరణం కోసం సంప్రదిస్తున్నట్లు ఎక్స్ పర్టి సెంట్రమ్ యుతనాసి ప్రతినిధి ఎల్కే స్వార్డ్ చెబుతున్నారు. ముఖ్యంగా నెదర్లాండ్ దేశం 2002 నుంచి ఈ అనాయాస మరణాన్ని చట్టం చేసింది. దీన్ని ఆరు షరతులతో అమలు చేశారు. అయితే ఇలా కారుణ్య మరణం కావాలనుకునేవారు అందుకు తగ్గ కారణాలు చూపించాల్సి ఉంటుంది. భరించలేని బాధలు, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందలేకపోవడం వంటివి ఇందులో ఉంటాయి. అనుమతి పొందిన వారికి వైద్యులు విషపూరిత ఇంజెక్షన్‌ను ఇస్తారు. మరోవైపు ఇలాంటి మరణాలను ప్రోత్సహించేది లేదంటూ అమెరికా, ఆసియా, యూరప్ లోని కొన్ని దేశాలు చట్టాలు రూపొందించాయి. కాగా, నెదర్లాండ్ మాజీ ప్రధాని, ఆయన భార్య అనాయస మరణం పొందడం పట్ల ప్రపంచ దేశాల అధిపతులు సంతాపం వ్యక్తం చేశారు. (చదవండి: 1700 ఏళ్ల నాటి పురాతన గుడ్డు..ఇప్పటికీ లోపల పచ్చసొన..!) -
మెర్సీ ప్లీజ్!
‘‘విధి కన్నెర్ర చేసి కోలుకోని దెబ్బకొట్టినా.. మనిషి తట్టుకుని నిలబడ గలుగుతాడు. కానీ అక్కున చేర్చుకుని ఓదార్చాల్సిన సమాజం ఈసడింపులు, చీదరింపులతో అసహ్యంగా చూస్తే బతకాలన్న కోరిక చచ్చిపోతుంది. కోరిక లేని మనిషికి చావు తప్ప మరోమార్గం కనిపించదు, ఇదే నా జీవితంలో ప్రస్తుతం జరుగుతోంది. కనీసం నన్ను ప్రశాంతంగానైనా చావనివ్వండి ప్లీజ్’’ అని అడుగుతోంది డాక్టర్ పార్వతీ కుమారి. జార్ఖండ్‌లోని చిన్న నగరం ధన్‌బాద్. ఇక్కడే పుట్టింది పార్వతీ కుమారి. తాతయ్య, నాయనమ్మలు, ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ల మధ్య ఆడుతూ పాడుతూ పెరిగింది. పదోతరగతి పాసై∙ఎంచక్కా కాలేజీకి వెళ్దామని అడ్మిషన్ తీసుకుంది. సరిగా అప్పుడే పార్వతికి విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఇంటిచిట్కాలు పాటిస్తూ నొప్పిని తగ్గించుకోవడానికి ప్రయత్నించింది. కానీ తగ్గకపోగా రోజురోజుకి ఎక్కువవుతూ పోయింది. ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా ఫలితం కనిపించలేదు.. ఓరోజున ఉన్నట్టుండి కోమాలోకి వెళ్లిపోయింది పార్వతి. కళ్లు తెరిచింది కానీ.... స్పృహæలేకుండా జీవచ్ఛవంలా పడి ఉన్న పార్వతి... మూడు నెలల తరువాత కోమా నుంచి బయటకు వచ్చింది. కళ్లు తెరిచి చూసింది కానీ ఏమీ కనిపించడం లేదు. సీనియర్ కంటి డాక్టర్‌కు చూపించగా...‘‘వివిధ రకాల మందుల దుష్ప్రభావం వల్ల కంటిచూపు పోయింది’’ అని చెప్పారు. పార్వతికీ, ఆమె తల్లిదండ్రులకు ప్రపంచం తలకిందులైనట్లు అనిపించింది. ఇంట్లో పార్వతి తండ్రి ఒక్కడిదే సంపాదన. ఆమె చికిత్సకు చాలా ఖర్చవడంతో అప్పుల పాలయ్యారు. ‘‘కళ్లులేని అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? బతికుంటే తల్లిదండ్రులకు భారమే అని’’ ఇరుగు పొరుగు ఈసడింపుగా మాట్లాడేవారు. పీహెచ్డీ దాకా... అనేక భయాందోళనల మధ్య ఉన్న పార్వతి మూడేళ్లు గడిపేసింది. ఆ తరువాత డెహ్రాడూన్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్’లో చేరింది. పదకొండో తరగతిలో అడ్మిషన్ తీసుకుని మొదటి మూడు నెలలు బ్రెయిలీ స్క్రిప్ట్‌ను నేర్చుకుంది. డెభ్బై రెండు శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పాసైంది. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ కాలేజీలో బీఏ, దౌలత్‌రామ్ కాలేజీలో ఎమ్.ఏ. చేసింది. తరువాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఎమ్‌ఫిల్, పీహెచ్డీ పూర్తి చేసింది. ఇలా చకచకా చదివేసి జేఆర్‌ఎఫ్‌గా సెలక్ట్ అయ్యింది. ఒక పక్క చదువుతూనే మరోపక్క సాహిత్య సేవ కూడా చేసింది. పుంజుకునేలోపే... కుటుంబ సభ్యులు, కాలేజీ లెక్చరర్లు, తోటి విద్యార్థులు, స్నేహితుల సాయంతో చదివిన పార్వతికి ఓ ఈవినింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. హమ్మయ్య ఇంతకాలానికి ఎవరి సాయం తీసుకోకుండా నా కాళ్లమీద నేను నిలబడ్డాను, ఇప్పుడు నేను కూడా నా కుటుంబ సభ్యులకు, ఇతరులకు సాయం చేయవచ్చు అనుకుని.. సంతోషంగా తన డ్యూటీ చేసుకునేది పార్వతి. కాలేజీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను పర్మినెంట్ చేసే సమయం వచ్చింది. తాను కూడా పర్మినెంట్ ఉద్యోగి అయిపోతుంది అనుకుంది పార్వతి. అయితే పర్మినెంట్ చేయడం మాట అటుంచి కనీసం కారణం కూడా చెప్పకుండా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించేశారు!! దీంతో మరోసారి తన జీవితం అంధకారమైనట్లనిపించింది. ‘‘వెలుగు కోసం వేచిచూస్తూ లైన్లో ఉన్న నన్ను మళ్లీ చీకటిలోకి ఈడ్చిపడేసారు. ఇక నాకు పోరాడే ఓపికలేదు. అందుకే కనీసం ప్రశాంతంగా చనిపోనివ్వండి’ అని ఈ దేశప్రజలు, సమాజాన్ని అడుగుతున్నాను.’’ అని తీవ్రమైన నిరాశతో పార్వతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రొఫెసర్‌గా తానేమిటో ఇప్పటికే నిరూపించుకుంది. తన కాళ్లమీద తాను నిలబడేలా చేసి ఆ కళ్లకు వెలుగు చూపిస్తే పోయేదేముంది? -
హిందూ సమాజం ద్వేషిస్తోంది.. చావడానికి అనుమతించండి!
వారణాసి జ్ఞానవాపి మసీదు కేసులో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న రాఖీ సింగ్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు బహిరంగ లేఖ రాశారు. అనాయాస మరణానికి(euthanasia) తనను అనుమతించాలని ఆమె రాష్ట్రపతికి విజ్క్షప్తి చేశౠరు. జ్క్షానవాపి విషయంలో తనతో పాటు పిటిషన్లు వేసిన వాళ్లే తనను వేధిస్తున్నారని, అందుకే తాను చావాలనుకుంటున్నానని అందులో పేర్కొన్నారామె. మీ బదులు కోసం జూన్ 9వ తేదీ ఉదయం 9 గంటల వరకు ఎదురు చూస్తా. మీ నుంచి స్పందన లేకుంటే.. తర్వాత తీసుకోబోయే నిర్ణయానికి నాదే పూర్తి బాధ్యత అంటూ ఆమె లేఖను రాష్ట్రపతి భవన్‌కు పంపారు. పిటిషన్‌ను ఉపసంహరించుకున్నప్పటి నుంచి హిందూ సమాజంలో తనను బద్నాం చేసే కుట్ర జరుగుతోందని అంటున్నారామె. అందుకు తనతో పాటు జ్ఞానవాపి పిటిషన్ వేసిన నలుగురే కారణమంటూ చెబుతున్నారు. పిటిషన్ వెనక్కు తీసుకోవడం విషయంలో తన మీద తప్పుడు ప్రచారం చేశారని, దాని వల్ల తన పరువు పోయిందని, హిందూ సమాజం.. ఆఖరికి తన కుటుంబం కూడా తనను ఇప్పుడు ద్వేషిస్తోందని లేఖలో వాపోయారామె. ఈ మానసిక క్షోభ నుంచి బయటపడేందుకు తనకు అనాయాస మరణానికి అనుమతించాలని ఆమె లేఖ ద్వారా రాష్ట్రపతి ముర్ముకు విజ్క్షప్తి చేశారు. అయితే.. రాఖీ బంధువు జితేంద్ర సింగ్ విసేన్ తమ ఆర్థిక పరిస్థితి వల్లే పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. కోర్టుల చుట్టూ తిరగడానికి మాకెవరూ స్పాన్సర్లు లేరు. మా జేబులోంచి ఖర్చు పెట్టుకునేంత స్తోమత లేదు. అందుకే మా కుటుంబం జ్క్షానవాపి విషయంలో దాఖలు చేసిన అన్ని పిటిషన్లను ఉపసంహరించుకుంది అని ఆయన స్పష్టత ఇచ్చారు. నేను, నా కుటుంబం(రాఖీ సింగ్‌తో సహా) అన్ని పిటిషన్లను ఉపసంహరించుకున్నాం. మా ఆర్థిక పరిస్థితితో పాటు దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. ధర్మం కోసం సోరాడడానికి మా దగ్గర వనరులు లేవు. మేం జీవితంలో చేసిన తప్పు.. ఈ పిటిషన్‌ను వేయడం అంటూ ఆయన మీడియాకు చెబుతున్నారు. జ్ఞానవాపి మసీదులో పూజలకు అనుమతించాలంటూ ఐదుగురు మహిళలు పిటిషన్లు వేయగా.. అందులో రాఖీసింగ్ కూడా ఉన్నారు. అయితే ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉందంటూ ఆమె తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. -
చనిపోవడం కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన వ్యక్తి... ఆపేందుకు కోర్టు మెట్లెక్కిన స్నేహితురాలు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని 40 ఏళ్ల ఒక వ్యక్తి గత కొంతకాలంగా మైయాల్జిక్ ఎన్సెఫలోమైలిటిస్ లేదా క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దీన్ని దీర్ఘకాలిక న్యూరో ఇన్ఫలమేటరీ వ్యాధీ అని కూడా అంటారు. ఇది నరాలను బలహీన పరుస్తూ నెమ్మదిగా మంచానికి పరిమితం చేసే అరుదైన వ్యాధి. అతనికి ఈ వ్యాధి లక్షణాలను 2014లో తొలిసారిగా గుర్తించారు వైద్యులు. అతను ఎయిమ్స్‌లో కొన్నేళ్ల పాటు చిక్సిత తీసుకున్నాడు. దాతల సమస్య, తర్వాత కరోనా రావడం వంటి తదితర సమస్యల నడుమ ఆ వ్యక్తికి చికిత్స కొనసాగించ లేకపోయారు అతని తల్లిదండ్రులు. ప్రస్తుతం ఆ వ్యక్తి మంచానికే పరిమితమయ్యాడు. కేవలం కొన్ని అడుగులు మాత్రమే వేయగలడు. దీంతో ఆ వ్యక్తి అనాయసంగా లేదా కారుణ్య మరణం పొందాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అందుకోసం అతను స్విట్జర్లాండ్ వెళ్లాడు. దీంతో అతడి స్నేహితురాలు అతన్ని ఆపేందుకు ఢిల్లీ హైకోర్టు మెట్టెక్కింది. తన స్నేహితుడికి ఎమిగ్రేషన్ క్లియరెన్స్ మంజూరు చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ఆమె పిటిషన్లో తన స్నేహితుడు అరుదైన న్యూరో ఇన్ఫలమేటరీ వ్యాధితో బాధపడుతున్నాడని, దాతల సమస్య కారణం చికిత్స కొనసాగించలేకపోయమని పేర్కొంది. అతనికి భారత్‌లో లేదా విదేశాల్లో చికిత్స అందించే ఆర్థిక పరిస్థితులు లేవు. కానీ అతను కారుణ్య మరణానికి వెళ్లాలనే గట్టి నిర్ణయంతో ఉన్నాడు. దీన్ని వృధాప్యంలో ఉన్న అతని తల్లిదండ్రులు తట్టుకోలేరు. పైగా వారికి తమ కొడుకుకి ఏదో ఒక రోజు నయమవుతుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు చికిత్స కోసం స్విట్జర్లాండ్ వెళ్తున్నట్లుగా తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి వీసా పొందిన తన స్నేహితుడి వైద్య పరిస్థితిని పరిశీలించేందుకు వైద్య బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా పిటిషన్లో కోరింది. అంతేకాదు ఆమె తమ అభ్యర్ధను మన్నించి అతన్ని ఆపకపోతే తన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు తీవ్ర మనో వేదనను, పుత్ర శోకాన్ని మిగిల్చిన వారవుతారని పిటిషన్లో పేర్కొంది. (చదవండి: క్షమాపణలు కోరిని బ్రిటిష్ హై కమిషనర్: వీడియో వైరల్) -
విద్యార్థిని కిడ్నాప్... రూ.20 లక్షలు డిమాండ్ చేసి రూ.5 లక్షలు ఇచ్చినప్పటికీ
న్యూఢిల్లీ: కొన్ని నేరాలు చూస్తే ఎవర్ని నమ్మాలి అనే సందేహం కలుగుతుంది. చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు తమ బంధువులు లేదా పరిచయమున్న వ్యక్తుల చేతిలోనే మోసపోవడం లేదా వేధింపులకు గురవడం వంటివి జరుగుతుండటం బాధకరం. అచ్చం అలాంటి ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...ఢిల్లీలో ఎంబీఏ విద్యార్థి ఫినైల్ సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..."ఆ ఎంబీఏ విద్యార్థితో ఒక నిందితుడు పథకంలో భాగంగా సన్నిహితంగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆ నిందితుడు అతన్ని అక్టోబర్ 23, 2020న కిడ్నాప్ చేసి గదికి తీసుకెళ్లారు. అంతేకాదు తుపాకీ వీడియోతో నగ్న వీడియోల తోపాటు తుపాకీ, గంజాయి, పిస్టల్ని పట్టుకుని ఉన్న వీడియోలను కూడా తీశారు. ఈ మేరకు ఆ నిందుతుడు తప్పుడు కేసులో ఇరికిస్తానంటూ ఆ విద్యార్థిని బెదిరించి రూ. 20 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో ఆ విద్యార్థి కుటుంబం రూ.5 లక్షలు చెల్లించింది. అయినప్పటికీ ఆ నిందితుడి ఆ విద్యార్థి నగ్న వీడియోలను అతని కాలనీలోని వాళ్లకు, బంధువులకు పంపిచాడు. మళ్లీ ఫిబ్రవరి 1న ఫోన్ చేసి డబ్బు ఇవ్వాలంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. ఇక ఆ విద్యార్థి వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ధర్మపాల్ అనే కానిస్టేబుల్ కూడా ఆ విద్యార్థిని బెదిరించడం మొదలు పెట్టాడు. దీంతో ఆ విద్యార్థి మనస్తాపం చెంది ఆ విద్యార్థి ఫినైల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు." అని పోలీసులు చెప్పారు. ఈ మేరకు పోలీసులు ఈ ఘటనకు ప్రధాన కారకుడైన నిందుతుడిని అరెస్టు చేయడమే కాక ఇతర నిందుతుల ఆచూకి కోసం విచారించడం ప్రారంభించారు. అంతేగాక ఆ విద్యార్థి కుటుంబాన్ని కలిసి నిందుతులు పట్టుకుని అరెస్ట్ చేయడమే కాక సదరు కానిస్టేబుల్ పై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. (చదవండి: హెల్మెట్ ధరించమని అన్నందుకే దారుణంగా కొట్టి, జీప్ ఎక్కించి....) -
ఆ బాధను భరించలేకపోతున్నా!
‘చాలా ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నా.. ఇప్పుడు ఆ పోరాటం ముగిసింది. ఇక నా వల్ల కాదు. ఈ బాధను నేను భరించలేకపోతున్నా. చాలా సంభాషణలు.. సమీక్షల అనంతరం నేను ఈ లోకం వీడాలనే నిర్ణయానికి వచ్చా.. తినడం, తాగడం మానేసాను. వాస్తవానికి నేను ఎప్పుడో చనిపోయాను. ప్రస్తుతానికి నేను గాలి పీల్చుకుంటున్నా.. అది బతకడానికి కాదు. నా కుటుంబం నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంది. రోజంతా నా కుటుంబంతో గడిపితే నా బాధ నుంచి ఉపశమనం కలిగేది. నా జీవితంలో ముఖ్యమైన వారందరికి గుడ్‌బై. ఇక సెలవు’ అంటూ ఓ 17 ఏళ్ల టీనేజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెదర్లాండ్స్‌లో ఉన్న చట్టాలపై చర్చకు తెరలేపింది. సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. ‘ఇది చాలా విచారకరమైన విషయం. ఓ యంగ్ డచ్ గర్ల్ 17 ఏళ్ల వయసులోనే కారుణ్య మరణం పొందడం ఏంటి. ఆమె తన డిప్రెషన్‌ను హ్యాండిల్ చేయలేకపోయింది. అయినా డచ్ ప్రభుత్వం ఎలా అనుమతిచ్చింది. కనీసం ఆమె మేజర్ అయ్యేంత వరకైనా వేచి చూడాల్సింది. ఆ అమ్మాయి మరణంతో మా గుండె పగిలింది.’ అంటూ ఆ దేశ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం ఏంటంటే.. పసితనంలో తన తనువుపై మృగాళ్లు చేసిన గాయం.. ఆ టీనేజర్‌ను తీవ్ర డిప్రేషన్‌లో నెట్టేసింది. కోలుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఆమె వల్ల కాలేదు. చివరకు ఈ భూమి మీద ఉండలేనంటూ కారుణ్య మరణం పొందింది. నెదర్లాండ్స్‌కు చెందిన నోవా పోథోవెన్ చిన్నతనంలో జరిగిన అత్యాచారం నుంచి కోలుకోలేకపోయింది. ఆ ఘటనతో కొన్నేళ్లుగా తీవ్రమానసిక వ్యధను అనుభవించింది. చివరకు తనవల్ల కాదని ప్రభుత్వ అనుమతితో కారుణ్యమరణం పొందింది. ఇక నెదర్లాండ్స్‌లో కారుణ్య మరణం చట్టబద్ధమన్న విషయం తెలిసిందే. అయితే నోవా మరణంతో ఈ చట్టాన్ని సవరించాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో పునరాలోచించాలని కోరుతున్నారు. ఇక నోవా తన జీవితాన్ని ‘విన్నింగ్ ఆర్ లర్నింగ్’ పుస్తకంగా మలిచింది. How incredibly sad. A young Dutch girl has legally euthanised herself at 17-years-old because she couldn't handle the depression of being raped as a child. My heart breaks for this poor baby. Her name is Noa Pothoven. 😢 — CharlieSANSOM.com (@CharlieSansom) June 4, 2019 Unpopular opinion: #NoaPothoven lacked the maturity needed for such a decision. I fear she was spurred on by the attention she was getting by followers I.E "this will be great for drama and attention if I go this way! My followers will love me and I will be worshiped". — City Girl ♥️ (@_abuse_survivor) June 4, 2019 -
పెళ్లి కావడం లేదు.. కారుణ్య మరణానికి అనుమతివ్వండి
పుణే: పెళ్లి కావడం లేదనే బాధ ఓ వ్యక్తి తీవ్ర మనోవేదనకు గురిచేసింది. దీంతో అతడు తనకు కారుణ్య మరణం ప్రసాదించమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఓ లేఖ రాశారు. కెరీర్లో స్థిరత్వం లేకపోవడం, ఎంత ప్రయత్నించిన పెళ్లి కాకపోవడం వల్లే అతడు ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఈ లేఖపై దత్తవాడి పోలీసు అధికారి దేవీదాస్ మాట్లాడుతూ.. ‘ఇరవై రోజుల క్రితం ఈ లేఖ సీఎం కార్యాలయానికి వచ్చింది. 35 ఏళ్ల ఓ వ్యక్తి తన తల్లిదండ్రులకు ఏం చేయలేకపోతున్నాననే బాధలో ఈ లేఖ రాశారు. అతడి తల్లికి 70 ఏళ్లు, తండ్రికి 83 ఏళ్లు ఉంటాయని ఆ వ్యక్తి లేఖలో పేర్కొన్నారు. అతనికి తన తల్లిదండ్రులంటే ఎంతో ఇష్టం. పెళ్లి కాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మేము అతనికి కౌనిల్సింగ్ నిర్వహించామ’ని తెలిపారు. అయితే ఈ లేఖ రాసిన వ్యక్తి మంచి విద్యావంతుడు కావడమే కాకుండా, సంపన్న కుటుంబానికి చెందినవారని దేవీదాస్ పేర్కొన్నారు. -
ముఖ్యమంత్రికి ‘ఇచ్ఛా మరణ’ వరముంది!
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ను మహాభారతంలోని భీష్మ పితామహుడితో పోలుస్తూ ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి అజయ్ చంద్రకర్ వ్యాఖ్యలు చేశారు. భీష్ముడి తరహాలోనే రమణ్‌సింగ్‌కు ‘ఇచ్ఛా మరణ’ (కోరుకున్నప్పుడే చనిపోయే) వరముందని ఆయన చెప్పుకొచ్చారు. ‘ముఖ్యమంత్రికి ఇచ్ఛామరణ వరముంది. భీష్మ పితామహుడి తరహాలో ఎప్పుడు ఓడిపోవాలి.. ఎప్పుడు గెలువాలన్నది ఆయనకు తెలుసు. ఛత్తీస్‌గఢ్ పురోగతి సాధించి.. సుసంపన్నమయ్యేవరకు తాను ఎప్పుడు ఓడిపోయేది ఆయన చెప్పబోరు’ అంటూ ఆయన శుక్రవారం ఓ సభలో పేర్కొన్నారు. ఓ పెద్ద పార్టీ నాయకుడు రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారని, ఆ పార్టీ పాలనలో రాష్ట్రం వలసలు, నిరక్షరాస్యత మాత్రమే చవిచూసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆయన విమర్శలు గుప్పించారు. రమణ్‌సింగ్‌ను భీష్మపితామహుడితో పోలుస్తూ మంత్రి అజయ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మోదీ గారు చనిపోనివ్వండి..
చిత్తోర్ఘర్, రాజస్థాన్ : ప్రభుత్వం తనకు అందించాల్సిన సాయాన్ని చేయడం లేదని, బ్రతుకు భారమైందని తనకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలంటూ ఓ దివ్యాంగురాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాజస్థాన్‌లోని చిత్తోర్ఘర్కు చెందిన తాను ఎన్నిసార్లు దివ్యాంగుల పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్నా అధికారులు మంజూరు చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తినడానికి తిండి లేక బతుకీడ్చుతున్నానని, ఇంతకంటే గౌరవంగా చనిపోవడమే మంచిదని భావిస్తున్నానని, కారుణ్య మరణానికి అనుమతించాలని కోరారు. కాగా, కారుణ్య మరణానికి తన సోదరి లేఖ రాయడంపై స్పందించిన ఆమె సోదరుడు అర్హత ప్రకారం అందాల్సిన పెన్షన్ కోసం తాను గంటల తరబడి క్యూలలో నిల్చున్నా అధికారులు మంజూరు చేసేందుకు నిరాకరించారని చెప్పినట్లు వెల్లడించారు. -
చనిపోయేందుకు ఆస్ట్రేలియా నుంచి స్విట్జర్లాండ్‌కు
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాకు చెందిన 104 సంవత్సరాల శాస్త్రవేత్త అనాయాస మరణం కోసం స్విట్జర్లాండ్ రానున్నారు. అనారోగ్య సమస్యలు లేకున్నా కారుణ్య మరణంతో తనువు చాలించాలని ఉందని డేవిడ్ గుడాల్ అనే వయసు మీరిన శాస్త్రవేత్త తన కోరికను వెల్లడించారు. గుడాల్ ఆలోచనకు కుటుంబ సభ్యులూ పూర్తిగా బాసటగా నిలిచారు. తనకు నాణ్యతతో కూడిన జీవితం క్రమంగా క్షీణిస్తోందని కారుణ్య మరణం ప్రసాదించాలని గుడాల్ బాసెల్‌లోని ఏజెన్సీకి ఫాస్ట్‌ట్రాక్ అపాయింట్మెంట్ కోసం వేడుకున్నారు. గత నెలలోనే గుడాల్ కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలో 104వ బర్త్‌డేను జరుపుకున్నారు. ‘ఈ వయసుకు చేరుకోవడం పట్ల ఇప్పుడు నేను చింతిస్తున్నా..నేను సంతోషంగా లేను..నాకు కన్నుమూయాలని ఉంద’ని ఆయన ఆవేదన చెందారు. తనలాంటి వయసుమళ్లిన వ్యక్తులకు స్వేచ్ఛగా మరణించే హక్కుతో సహా పౌర హక్కులన్నీ ఉండాలన్నది తన అభిప్రాయమని స్పష్టం చేశారు. 2016లో 102 ఏళ్ల వయసులో ఆయనను తన యూనివర్సిటీ బలవంతంగా విధుల నుంచి తప్పించడంతో ప్రొఫెసర్ గుడాల్ వార్తల్లో నిలిచారు. వయసు మళ్లిన కారణంగా తనను వర్సిటీ నుంచి పంపించివేయడంపై ఆయన చేసిన పోరాటం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. గౌరవంగా మరణించేలా సహకరించడం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చట్టవిరుద్ధం. ఆస్ట్రేలియాలోనూ దీనిపై నిషేధం విధించారు. గత ఏడాది విక్టోరియా స్టేట్ దీన్ని తొలిసారిగా చట్టబద్ధం కాగా, అది కూడా దీర్ఘకాలిక వ్యాదులతో బాధపడుతూ ఆరు నెలలకు మించి జీవించని వారికి మాత్రమే జూన్ 2019 నుంచి వర్తింపచేస్తారు. ఆస్ర్టేలియా అంతటా కారుణ్య మరణాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గుడాల్‌ను స్విట్జర్లాండ్‌కు తరలించేందుకు సాయపడుతున్న ఎగ్జిట్ ఇంటర్నేషనల్ ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో నెలకొన్న పరిస్థితిపై పలు వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన వయసుమీరిన, ప్రముఖ వ్యక్తులు గౌరవంగా మరణించేందుకు ఇతర దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి బాధాకరమని పేర్కొంది. -
కారుణ్య మరణాన్ని ప్రసాదించండి : రైతన్నలు
ప్రతి బియ్యపు గింజపైనా తినేవాడి పేరు రాసుంటుందంటారు. అదినిజమో కాదో కానీ రైతన్నలు పండించే ప్రతి బియ్యపు గింజలోనూ అతడి చెమటచుక్కలు ఇంకి ఉంటాయి. జనం ఆకలితీర్చే రైతన్న కడుపు మండితే ఏమౌతుందో ఇటీవల ముంబై పురవీధుల్లో కవాతుతొక్కిన మట్టికాళ్ళ మహాపాదయాత్ర చాటిచెప్పింది. అదే రైతు కడుపు మాడినప్పుడు, నిర్లక్ష్యానికి గురైనప్పుడు, బతికే మార్గమే లేనప్పుడు చావును వెతుక్కుంటాడు. ఈ రోజు(సోమవారం) మహారాష్ట్రలోని 91 మంది రైతన్నలు దాదాపు అదే మార్గాన్ని వెతుక్కున్నారు. అయితే వాళ్ళు కోరుకున్నది బలవన్మరణం కాదు. కారుణ్యమరణం. ఇటీవల సుప్రీంకోర్టు జీవించే హక్కు మాదిరిగానే తప్పనిసరి పరిస్థితి (మెడికల్ కండిషన్)లో చనిపోయే హక్కు పౌరుడికి ఉంటుందని తీర్పిచ్చిన నేపథ్యంలో మహారాష్ట్రలోని బల్ధానా జిల్లా కి చెందిన 91 మంది రైతన్నలు కారుణ్యమరణాన్ని ప్రసాదించాల్సిందిగా గవర్నర్‌కి విజ్ఞప్తి చేశారు. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామనీ, తమ కుటుంబ సభ్యుల ఆకలితీర్చే స్థితిలో కూడా లేమనీ, చివరకు హైవే నిర్మాణంలో కోల్పోయిన భూములకు సరైన నష్టపరిహారాన్ని కూడా ఇవ్వకపోవడంతో తమకు మరణమే శరణ్యమనీ భావిస్తూ మరణించే అవకాశాన్ని కల్పించాలంటూ సోమవారం గవర్నర్‌కి లేఖరాసారు. బతుకు భారమైన పరిస్థితుల్లో తమకి చట్టబద్దంగా మరణించేందుకు కారుణ్యమరణం రూపంలో అనుమతివ్వాలంటూ అన్నదాతలు గవర్నర్‌కీ, సబ్‌డివిజనల్ ఆఫీసర్‌కి లేఖ ఇచ్చారు. మహారాష్ట్రలో గత ఏడాది జనవరి 1 నుంచి అక్టోబర్ 31 లోపు 2,414 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. మహారాష్ట్రలోని విదర్భలోని అమరావతీ డివిజన్లో అత్యధిక సంఖ్యలో 907 మంది, మరట్వాడా జిల్లాలోని ఔరంగాబాద్ డివిజన్లో 789 మంది రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. విదర్భ, మరట్వాడా రెండూ కలిపి మొత్తం 19 జిల్లాల్లో వ్యవసాయ సంక్షోభం, బతుకుఛిద్రమైన రైతన్నలకు రుణమాఫీ అందకపోవడమే కారణమని ముంబై మహాపాదయాత్రని నడిపించిన సీపీఎం అనుబంధ సంస్థ ఆల్ ఇండియా కిసాన్ సభ పేర్కొంటోంది. జస్టిస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులనూ, అలాగే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ను అమలు చేయాలన్న మహాపాదయాత్ర ప్రధాన డిమాండ్లను సైతం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిన తరువాతనే మహాపాదయాత్రకు తరలివచ్చిన రైతన్నలు వెనుదిరిగారు. ఇప్పుడు మరోమారు కారుణ్యమరణానికి అర్జీ పెట్టుకోవడం అన్నదాతల కృతనిశ్చయాన్ని స్పష్టం చేస్తోంది.–సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
హాయిగా జీవించాం.. ప్రశాంతంగా చనిపోనివ్వండి!
సాక్షి, ముంబయి: తాము ఇంతకాలం ఎంతో ఆనందంగా జీవించామని ఈ చివరిదశలో అనారోగ్యంతో మంచాన పడి, ఆస్పత్రుల చుట్టూ తిరగలేమని చావును ప్రసాదించాలని కోరుతున్నారు ముంబయికి చెందిన వృద్ధ దంపతులు. కారుణ్య మరణానికి అనుమతినివ్వాలని తాము దాఖలు చేసిన పిల్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సాధ్యమైనంత త్వరగా స్పందించాలని దంపతులు విజ్ఞప్తి చేస్తున్నారు. నారాయణ్ లావాటే (88), ఐరావతి లావాటే (78) దంపతులు దక్షిణ ముంబయి, గ్రాంట్ రోడ్డులోని ఓ చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన నారాయణ్ 1989లో రిటైర్ కాగా, ఓ ప్రైవేట్ కాలేజ్ ప్రిన్సిపల్‌గా చేసిన ఐరావతి 1997లో పదవీ విరమణ చేశారు. అప్పటినుంచీ స్థానిక గ్రాంట్ రోడ్డులోని తమ ఇంట్లో హాయిగా జీవనం సాగిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ తమకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, కానీ భవిష్యత్తులో ఎలాంటి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆందోళన మొదలైందన్నారు నారాయణ్. ఒకరు లేకుండా మరొకరం బతకలేమని, అదే విధంగా మాలో ఏ ఒక్కరు అనారోగ్యంతో మంచాన పడి కష్టాలు పడుతున్నా చూడటం తమ వల్ల కాదని నారాయణ్ అన్నారు. యాక్టివ్ ఎథనేషియా ద్వారా తమ దంపతులకు కారుణ్య మరణం (మెర్సీ కిల్లింగ్) అవకాశం ఇవ్వాలంటున్నారు. ప్రశాంతంగా బతికేందుకు ఎంత హక్కు ఉందో.. ఎలాంటి ఆంక్షలు లేకుండా చనిపోయేందుకు పౌరులకు అంతే హక్కు ఉండాలన్నారు. ఇప్పటికీ చాలా వృద్ధాప్యంలో ఉన్నామని, ప్రస్తుతం ఇక్కడ మెట్రో రైలు పనులు జరుగుతున్నందున బయటకు వెళ్లడానికి చాలా కష్టంగా ఉందన్నారు ఐరావతి. నా భర్తకు వచ్చే పెన్షన్ మాకు సరిపోతుంది కానీ, కష్టాలు, బాధలతో ప్రాణం వదలడం కంటే సుఖమయంగా లోకాన్ని విడిచిపోవాలని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఎన్సీపీ నేతలు శరద్ పవార్, సుప్రియ సూలేలతో పాటుగా రామ్ జెఠ్మలానీ, రాజ్యసభ సభ్యుడు కరణ్ సింగ్, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింగ్వీలకు కారుణ్య మరణానికి సంబంధించిన డ్రాఫ్ట్ ఆఫ్ బిల్‌ను పంపించినట్లు నారాయణ్ దంపతులు వివరించారు. ‘మా బంధువులకు చెబితే అలా చేయవద్దని చెప్పారు... ఎందుకంటే వారికి సంతానం ఉన్నారు, బాధ్యతలున్నాయి. మాకు అలాంటి ఏ సమస్యలు, బాధ్యతలు లేవని’ నారాయణ్ దంపతులు అంటున్నారు. కారణ్య మరణాలు అంటే?.. ఎలా చేస్తారు.. కారుణ్య మరణాలను అమలు చేసేందుకు యాక్టివ్ ఎథనేషియా, పాసివ్ ఎథనేషియా అనే రెండు పద్ధతులు ఉంటాయి. ప్రాణాంతక జబ్బుతో బాధపడుతూ ఇక ఎంతమాత్రం బతకరని తెలిసిన రోగుల విషయంలో కొన్ని దేశాలు యాక్టివ్ ఎథనేషియాను, మరికొన్ని దేశాలు పాసివ్ ఎథనేషియాను అమలు చేస్తున్నాయి. యాక్టివ్ ఎథనేషియా అంటే ప్రాణాలు తీసే ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మృత్యువును ప్రసాదించడం. పాసివ్ ఎథనేషియా అంటే చికిత్సను ఆపేసి లైఫై సపోర్ట్ వ్యవస్థను తొలగించి రోగి తనంతట తానే చనిపోయేలా చేయడం. యాక్టివ్ ఎథనేషియాను దుర్వినియోగం చేసే అవకాశం ఉండడంతో పాసివ్ ఎథనేషియాకే కేంద్రం మొగ్గు చూపుతున్న విషయం విదితమే. -
చనిపోనివ్వాలంటూ మోదీకి లేఖ
భోపాల్: దివ్యాంగులకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓ వైపు మాట్లాడుతుండగా.. సాధారణ వ్యక్తి కంటే ఎక్కువ చదివినా తనకు ఉద్యోగం దొరకలేదని భోపాల్ కు చెందిన లక్ష్మీ యాదవ్ అనే దివ్యాంగురాలు ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంవో)కు ఉత్తరం రాసింది. గత పదేళ్లుగా ప్రైవేటు ఉద్యోగం కోసం తిరిగినా దివ్యాంగురాలిననే కారణంతో తనను ఉద్యోగానికి ఎంపిక చేయడం లేదని, దయచేసి చనిపోయేందుకు అనుమతించాలని లేఖలో కోరింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లకు కూడా లక్ష్మీ లేఖలు రాసింది. లేఖలోని విషయాలు: గత 12 ఏళ్లుగా ఎంఫిల్, ఎల్ఎల్ఎమ్ డిగ్రీలు చేత పట్టుకుని కంపెనీల ఇంటర్వూలకు ఉద్యోగం కోసం తిరిగినట్లు లక్ష్మీ లేఖలో పేర్కొంది. దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్లు ఉన్నా ఉద్యోగం ఇవ్వడానికి కంపెనీలు సంశయించాయని ఆవేదన వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాలకు చాలా పథకాలు ప్రారంభించిందని పేర్కొంది. ప్రైవేటు కంపెనీల్లో ఇంటర్వూలకు వెళ్లిన ప్రతిసారీ చేదు అనుభవం ఎదురైనట్లు చెప్పింది. మెట్లు ఎక్కలేనని, సరిగా పనిచేయగలిగే సామర్ధ్యం ఉందా? లాంటి కారణాలతో తనను ఉద్యోగానికి ఎంపిక చేయలేదని తెలిపింది. అవకాశం ఇస్తేనే కదా తన సామర్ధ్యం తెలిసేదని లక్ష్మీ లేఖలో వాపోయింది. ఉద్యోగం రాని జీవితం తనకు వద్దని చనిపోవడానికి అవకాశం కల్పించాలని లేఖలో కోరింది. -
మావాడిని చిరంజీవిని చేయండి
ఓ నిస్సహాయుడి తల్లిదండ్రుల మొర కారుణ్యమరణానికి అనుమతించాలని వేడుకోలు తీవ్ర అనారోగ్యంతో అచేతనంగా కొడుకు ఏమీ చేయలేమన్న వైద్యులు అవయవదానానికి ముందుకొచ్చిన తల్లిదండ్రులు పూతలపట్టు: చలనంలేని బిడ్డను కళ్లముందు చూడలేక ఆ తల్లిదండ్రులు తమలాంటి కష్టం మరెవరికీ రాకూడదంటూ దు:ఖాన్ని దిగమింగుకుంటున్నారు. లక్షలు వెచ్చించినా బతకడని వైద్యులు తేల్చేయడంతో తమ బిడ్డను మరొకరిలో చూసుకోవాలని ఆ పేద తల్లితండ్రులు ఆరాటపడుతున్నారు. ఇందుకోసం తమ బిడ్డ కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం గోపాలక్రిష్ణాపురానికి చెందిన ఉమాపతి, కవితల మొదటి సంతానం నిరంజన్. తొమ్మిదేళ్ల్ల వయసులోనే ఈ బిడ్డకు తల భాగం పెద్దది కావడంతో స్విమ్స్‌కు తీసుకువచ్చారు. హైడ్రోసిఫాలెస్ వ్యాధిగా వైద్యులు నిర్ధారించారు. ఆపరేషన్‌కు పది లక్షలు ఖర్చుఅవుతుందన్నారు. ఆ పేద దంపతులు ఉన్న కొద్దిపాటి పొలం అమ్మేసి బెంగళూరులోని నిమ్హాన్స్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించారు. కొన్నాళ్లు బాగున్నా సమస్య పునరావృతమైంది. దీంతో మళ్లీ ఆపరేషన్ చేశారు. అయినా వ్యాధి ముదిరిపోయింది. వారం రోజుల క్రితం మరోసారి బెంగళూరులోని రామయ్య హాస్పిటల్లో చేసిన ఆపరేషన్ కూడా ఫలించలేదు. ఆక్సిజన్ ఉన్నంత సేపు నిరంజన్ బతికుంటాడని.. తీస్తే చనిపోతాడని వైద్యులు తేల్చి చెప్పారు. చేసేదిలేక ఉమాపతి దంపతులు తమ బిడ్డను ఇంటికి తీసుకొచ్చేశారు. బిడ్డ అచేతనంగా పడి ఉండటాన్ని చూసి తల్లితండ్రులు క్షణక్షణం తల్లడిల్లిపోతున్నారు. నిరంజన్ అవయవాలు దానం చేసి మరికొందరిలోనైనా బిడ్డను చూసుకుంటామనే భావనకు వచ్చేశారు. సత్వరమే. కారుణ్య మరణానికి అనుమతించాలని అభ్యర్థిస్తున్నారు. బిడ్డ ప్రాణం పోయేలోగా అవయవదానంతో మరొకరి ప్రాణాన్ని నిలపాలనే తమ కాంక్ష నెరవేర్చాలని నిరంజన్ తల్లితండ్రులు (9490250874) కోరుతున్నారు. కారుణ్య మరణానికి అనుమతించాలి సాధారణంగా అనారోగ్య కేసుల్లో అవయవదానానికి చట్టం సమ్మతించదు. బ్రెయిన్ డెడ్.. క్లినికల్లీ డెత్ లాంటి సందర్భాల్లోనే ఇది వీలుపడుతుంది. తొలుత బాధితుని తల్లితండ్రులు కారుణ్య మరణానికి దరఖాస్తు చేసుకోవాలి. అనుమతి వస్తేనే అవయవదానం సాథ్యమమవుతుంది. దేశంలో అనారోగ్యం బారిన పడి మృత్యువు అంచున ఉన్నవారెందరో అవయవదానానికి సిద్ధంగా ఉన్నా చట్టపరంగా అనుమతి లేదు. - గూడూరి సీతామహాలక్ష్మి, అఖిల భారత అవయవ దాతల సంఘం -
సర్జరీ చేయించే స్తోమత లేక...
మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతివ్వండి తంబళ్లపల్లె కోర్టును ఆశ్రయించిన దంపతులు హైకోర్టును ఆశ్రయించాలన్న జడ్జి తంబళ్లపల్లె: ఎనిమిది నెలల ఆ చిన్నారికి పుట్టుకతోనే కాలేయ సంబంధిత వ్యాధి వెంటవచ్చింది. కానీ పుట్టింది నిరుపేద కుటుంబంలో కావడంతో సర్జరీ చేయించే స్తోమత తల్లిదండ్రులకు లేకపోయింది. అయినప్పటికీ నానా కష్టాలుపడి ఒకసారి సర్జరీ చేయిస్తే అది విఫలమైంది. లివర్ పూర్తిగా మార్పుచేస్తే ప్రాణాలు నిలుస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందుకు రూ.16 లక్షలదాకా ఖర్చవుతాయంటున్నారు. అయితే అంతసొమ్ము వెచ్చిస్తే స్తోమత లేని ఆ తల్లిదండ్రులు గుండె రాయి చేసుకున్నారు. తమ బిడ్డకిక మరణమే శరణ్యమనుకున్నారు. కారుణ్య మరణానికి అనుమతించాలంటూ కోర్టును ఆశ్రయించారు. హృదయాన్ని పిండేసే ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలివీ.. చిత్తూరుజిల్లా ములకలచెరువు మండలం బత్తలాపురానికి చెందిన రమణప్ప, సరస్వతిలది నిరుపేద కుటుంబం. రమణప్ప బెంగళూరులోని సూపర్మార్కెట్లో సేల్స్‌మన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి గత అక్టోబర్ 10నజ్ఞానసాయి అనే చిన్నారి జన్మించింది. పుట్టుకతోనే ఆ చిన్నారికి బిలియరీ అట్రాసియా(కాలేయం జబ్బు) ఉన్నట్లు నిర్ధారించిన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు రెండు వారాల్లోపు లివర్ ప్రైమరీ సర్జరీ చేయాలన్నారు. రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు ఖర్చవుతుందన్నారు. నెల తరువాత బెంగళూరు ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి డాక్టర్లు గతేడాది డిసెంబర్ 31న సర్జరీ చేశారు. 4 నెలల తరువాత ఫలితం చెబుతామన్నారు. ఆ ప్రకారం బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షలు చేసిన వైద్యులు సర్జరీ విఫలమైందన్నారు. దీంతో బెంగళూరులోనే నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చేర్చగా.. లివర్ పూర్తిగా మార్పుచేస్తే ఫలితముంటుందని వైద్యులు చెప్పారు. ఇందుకు 16 లక్షలదాకా ఖర్చవుతుందన్నారు. కాలేయం మార్పిడి తర్వాత కోలుకునేవరకు నెలకు రూ.50 వేల విలువైన మందులు వాడాలన్నారు. నాలుగు నెలల్లోపు సర్జరీ చేయాలని, లేకుంటే ప్రమాదమేనని తేల్చిచెప్పారు. అంత ఆర్థికస్తోమత లేని తల్లిదండ్రులు తమ బిడ్డకికే చావే శరణ్యమని భావించారు. తమ బిడ్డ కారుణ్య మరణానికి అనుమతించాలంటూ గురువారం తంబళ్లపల్లె కోర్టును, తర్వాత మదనపల్లె కోర్టును ఆశ్రయించారు. తంబళ్లపల్లె జడ్జి వాసుదేవ్ స్పందిస్తూ.. ఇలాంటి విషయాల్లో ఉన్నత న్యాయస్థానాలు మాత్రమే నిర్ణయాలు తీసుకునే వీలుంటుందని, అందువల్ల హైకోర్టును ఆశ్రయించాలని సూచించారు. మదనపల్లె జడ్జి సైతం ఇదే విషయం చెప్పారు. సీఎం దృష్టికి తీసుకెళ్లినా.. తమ బిడ్డ జబ్బు విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని, తిరుపతిలో జరిగిన మహానాడులో వినతిపత్రం సమర్పించానని.. అయినా ఫలితం లేకపోయిందని రమణప్ప ఆవేదన వ్యక్తంచేశారు. దాతలెవరైనా స్పందించి సాయమందించేందుకు 8142272114 నంబరులో సంప్రదించాలని వేడుకున్నారు. -
ఇక కారుణ్య మరణాలకు ఓకే
దేశంలో కారుణ్య మరణాలను అనుమతించాలా, వద్దా అన్న అంశంపై కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న చర్చకు త్వరలోనే తెరపడనుంది. కారుణ్య మరణాలను (ఎథనేషియా) అనుమతిస్తూ ముసాయిదా బిల్లును కేంద్ర ఆరోగ్య శాఖ రూపొందించింది. దీనిపై ముందుగా ప్రజాభిప్రాయం కోరతామని, వారినుంచి వచ్చే సూచనలు పరిగణలోకి తీసుకొని సమగ్ర చట్టాన్ని తీసుకొస్తామని 'జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్' డైరెక్టర్ డాక్టర్ జగదీష్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. కారుణ్య మరణాలను అనుమతించేందుకు 'ప్రొటెక్షన్ ఆఫ్ పేషంట్స్ అండ్ మెడికల్ ప్రాక్టీషనర్స్' చట్టంలో సవరణలు తీసుకురావాలి. చట్టం తీసుకొస్తే భారత వైద్యమండలి (ఎంసీఐ) కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. మెడికల్ ప్రాక్టీషనర్లకు సరైన మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంటుంది. కారుణ్య మరణాలను అమలు చేసేందుకు యాక్టివ్ ఎథనేషియా, పాసివ్ ఎథనేషియా అనే రెండు పద్ధతులు ఉంటాయి. ప్రాణాంతక జబ్బుతో బాధపడుతూ ఇక ఎంతమాత్రం బతకరని తెలిసిన రోగుల విషయంలో కొన్ని దేశాలు యాక్టివ్ ఎథనేషియాను, మరికొన్ని దేశాలు పాసివ్ ఎథనేషియాను అమలు చేస్తున్నాయి. యాక్టివ్ ఎథనేషియా అంటే ప్రాణాలు తీసే ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మృత్యువును ప్రసాదించడం. పాసివ్ ఎథనేషియా అంటే చికిత్సను ఆపేసి లైఫై సపోర్ట్ వ్యవస్థను తొలగించి రోగి తనంతట తానే చనిపోయేలా చేయడం. యాక్టివ్ ఎథనేషియాను దుర్వినియోగం చేసే అవకాశం ఉండడంతో పాసివ్ ఎథనేషియాకే కేంద్రం మొగ్గు చూపిందని డాక్టర్ జగదీష్ తెలిపారు. అరుణ షాన్‌బాగ్ అనే నర్సు విషయంలో దేశంలో కారుణ్య మరణాలను అనుమతించాలంటూ తీవ్రస్థాయిలో డిమాండ్ వచ్చింది. ఆమె రేప్ కారణంగా 42 ఏళ్లపాటు ఆస్పత్రి పడకపై జీవచ్ఛవంలా గడిపింది. ఆమె పనిచేసిన అస్పత్రి నర్సులే ఆమెను అన్నేళ్ల పాటు చూసుకున్నారు. కామన్ కాజ్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ 2005లో దాఖలు చేసిన పిటిషన్‌ను రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు విచారించినప్పుడు మరోసారి కారుణ్య మరణాలపై చర్చ జరిగింది. ఈ పిటిషన్ విషయంలో అభిప్రాయాలు తెలియజేయాలంటూ కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు కోరింది. అప్పుడు కేంద్రం కారుణ్య మరణాలను అనుమతించేందుకు నిరాకరించింది. కారుణ్య మరణాలను అనుమతించాలంటూ లా కమిషన్ చేసిన సిఫార్సులను కూడా కేంద్రం తిరస్కరించింది. ఇప్పుడు అదే లా కమిషన్ మళ్లీ చేసిన సిఫార్సును ఇప్పటి బీజేపీ ప్రభుత్వం ఆమోదించింది. -
ఛోటూకు కారుణ్య మరణం