
కారుణ్య మరణం కోసం మోదీకి లేఖ రాసిన దివ్యాంగురాలు
చిత్తోర్‌ఘర్, రాజస్థాన్ : ప్రభుత్వం తనకు అందించాల్సిన సాయాన్ని చేయడం లేదని, బ్రతుకు భారమైందని తనకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలంటూ ఓ దివ్యాంగురాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాజస్థాన్‌లోని చిత్తోర్‌ఘర్‌కు చెందిన తాను ఎన్నిసార్లు దివ్యాంగుల పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్నా అధికారులు మంజూరు చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తినడానికి తిండి లేక బతుకీడ్చుతున్నానని, ఇంతకంటే గౌరవంగా చనిపోవడమే మంచిదని భావిస్తున్నానని, కారుణ్య మరణానికి అనుమతించాలని కోరారు. కాగా, కారుణ్య మరణానికి తన సోదరి లేఖ రాయడంపై స్పందించిన ఆమె సోదరుడు అర్హత ప్రకారం అందాల్సిన పెన్షన్ కోసం తాను గంటల తరబడి క్యూలలో నిల్చున్నా అధికారులు మంజూరు చేసేందుకు నిరాకరించారని చెప్పినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment