వృద్ధాప్యంలోకి వచ్చాక..భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ముందు చనిపోవడం సహజం. మిగిలిని వారు ఆ విరహాన్ని తట్టుకోవడం కూడా అసాధ్యమే. చాలామటుకు ఆ బెంగతో మిగిలినవారు మహా అయితే ఆరు నెలలు లేదా ఏడాదిలోపు చనిపోవడం జరుగుతుంది. అయితే కొందరూ మరణంలోకూడా జంటగా కలిసే చనిపోవాలనుకుంటారు. అలాంటి అవకాశం అందరికీ రాదు కూడా. బహుశా అందువల్లే వృధాప్యంలో ఉన్న వాళ్లను ఒంటరిగా వదిలేయరేమో!. కానీ ఇక్కడొక వ్యక్తి ఓ దేశానికి ప్రధానిగా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక వృధాప్యంలోకి చేరిన అతను మరణంలో కూడా భార్యని విడిచిపెట్టకూడదనుకున్నాడు. అందుకోసం వాళ్లేం ఏం చేశారో వింటే..కన్నీళ్లు ఆగవు.!
వివరాల్లోకెళ్తే..డ్రైస్ వాన్ అగ్ట్ అనే వ్యక్తి నెదర్లాండ్ మాజీ ప్రధాని. అతను ప్రధానిగా 1977 నుంచి 1982 మధ్య కాలంలో ప్రధానిగా పనిచేశాడు. క్రిస్టియన్ డెమోక్రటిక్ అప్పీల్ అనే పార్టీని కూడా స్థాపించాడు. 2009లో 2009లో పాలస్తీనా హక్కుల కోసం వాదించేందుకు ది రైట్స్ ఫోరం అనే సంస్థను ఏర్పాటు చేశాడు. అధ్యక్షుడిగా ఉన్నంతసేపు నెదర్లాండ్ దేశంలో విలువలను కాపాడాడు. నిబద్ధమైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందాడు. అక్కడి రాజకీయాలను శాసించాడు. ఆయనకు యూజీనీ అనే భార్య ఉంది. ప్రస్తుతం అగ్ట్‌కి 93 ఏళ్లు కాగా, అతడి భార్యకు కూడా ఇంచుమించుగా అంతే వయసు ఉంటుంది.
ఇరువురు వృధాప్యంలోకి చేరిపోయారు. అయితే డ్రైస్‌కి 2019 నుంచి బ్రెయిన్ హేమరేజ్‌తో బాధపడుతున్నాడు. అప్పటి నుంచి అతను మంచం మీదే ఉన్నాడు. ఇక అతని భార్య కూడా గత కొంతకాలం నుంచి అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యింది. ఇద్దరూ మంచానికే పరిమితమయ్యారు, పైగా ఇరువురిలో ఎవరూ ముందు చనిపోయినా తట్టుకునే లేదు. దీంతో ఇరువురు జంటగా మరణించాలనే ఉద్దేశ్యంతో ద్వంద్వ అనాయాస మరణాన్ని ఆశ్రయించారు. అలా ఫిబ్రవరి 5న డ్రైస్ వాన్ అగ్ట్, యూజీనీ తమ స్వస్థలమైన నిజ్ మెగన్ లో ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని కన్నుమూశారు. ఈ విషయాన్ని దీ రైట్స్ ఫోరం ధృవీకరించింది.”మా వ్యవస్థాపకుడు, గౌరవ చైర్మన్ డ్రైస్ వాన్ అగ్ట్ ఫిబ్రవరి 5, నిజ్ మెగన్ లో తన భార్యతో కలిసి మరణించారు.
వారిద్దరూ 70 సంవత్సరాల పాటు వైవాహిక జీవితాన్ని గడిపారు. డ్రైస్ వాన్ అగ్ట్ తన భార్యను నా అమ్మాయి అని సంబోధించేవాడు. ఇద్దరు చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని” ది రైట్స్ వింగ్ డైరెక్టర్ గెరాడ్ జొంక్ మన్ తెలిపారు. ఇదిలా ఉండగా, నెదర్లాండ్‌లో "ద్వంద అనాయాస" లేదా ఇద్దరు వ్యక్తులు ఏకకాలంలో ప్రాణాంతక ఇంజెక్షన్‌ను తీసుకును చనిపోలానుకోనే ధోరణి ఎక్కువగా ఉంది. ఇలానే 2021లో 13 జంటలు, 2022లో ఏకంగా 29 జంటలు ప్రాణాలు పోగొట్టుకున్నట్లు తెలిపారు. నిజానికి దీన్ని ఇంగ్లీష్‌లో “duoEuthanasia” అంటారు.. తెలుగులో అయితే “అనాయాస మరణం” అని అంటారు.
అయితే నెదర్లాండ్ దేశంలో ప్రతి ఏడాది దాదాపు వెయ్యి మంది వ్యక్తులు అనాయాస మరణం కోసం సంప్రదిస్తున్నట్లు ఎక్స్ పర్టి సెంట్రమ్ యుతనాసి ప్రతినిధి ఎల్కే స్వార్డ్ చెబుతున్నారు. ముఖ్యంగా నెదర్లాండ్ దేశం 2002 నుంచి ఈ అనాయాస మరణాన్ని చట్టం చేసింది. దీన్ని ఆరు షరతులతో అమలు చేశారు. అయితే ఇలా కారుణ్య మరణం కావాలనుకునేవారు అందుకు తగ్గ కారణాలు చూపించాల్సి ఉంటుంది. భరించలేని బాధలు, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందలేకపోవడం వంటివి ఇందులో ఉంటాయి. అనుమతి పొందిన వారికి వైద్యులు విషపూరిత ఇంజెక్షన్‌ను ఇస్తారు. మరోవైపు ఇలాంటి మరణాలను ప్రోత్సహించేది లేదంటూ అమెరికా, ఆసియా, యూరప్ లోని కొన్ని దేశాలు చట్టాలు రూపొందించాయి. కాగా, నెదర్లాండ్ మాజీ ప్రధాని, ఆయన భార్య అనాయస మరణం పొందడం పట్ల ప్రపంచ దేశాల అధిపతులు సంతాపం వ్యక్తం చేశారు.
(చదవండి: 1700 ఏళ్ల నాటి పురాతన గుడ్డు..ఇప్పటికీ లోపల పచ్చసొన..!)
Comments
Please login to add a commentAdd a comment