భారతదేశ సంస్కృతిలానే ఇక్కడ ఆహారం కూడా సంప్రదాయనుగుణంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా పుణ్యమా అని భారతీయ వంటకాల గురించి ఖండాంతరాలకు వ్యాప్తి అవుతోంది. విలక్షణమైన స్వీట్స్, మసాలాతో కూడిన వంటకాలు చూసి విదేశీయలు సైతం టేస్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. పైగా వాళ్లు కూడా ఈ వంటకాలను చేసేందుకు రెడీ అవుతున్నారు కూడా. ఇప్పడు ఇదంత ఎందుకంటే..మన భారతీయ వంటకాలను ఓ డచ్ కంపెనీ తన ఉద్యోగులకు సర్వ్ చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
నెదర్లాండ్‌లో అనువింద్ కన్వాల్ అనే భారతీయుడు తన ఆఫీస్‌లో ఉద్యోగులుకు భారతీయ ఆహరం పేరుతో మన సంప్రదాయ వంటకాలు సర్వ్ చేసిన వీడియోని పంచుకున్నారు. ఇది ]ప్రశ్నించగదిగినది' అనే క్యాప్షన్ జోడించి మరీ ఈ వీడియోని పోస్ట్ చేశారు. అంతేగాదు కన్వాల్ పోస్ట్‌లో తన కార్యాలయంలో భారతీయ ఆహారం అనేది కొంచెం సందేహాస్పదంగా ఉన్నప్పటికీ.. ఎలా ఈ వంటకాలను వండారు అనేదాని గురించి తాను తెలుసుకోవాలనుకోవడం లేదని అన్నారు.
అలాగే తన కార్యాలయంలో బెల్ పెప్పర్ పడిమా చట్నీ, నాన్స్ తదితర భారతీయ వంటకాలను సర్వ్ చేసినట్లు కూడా తెలిపారు. ఈ వీడియోకి ఒక మిలియన్‌కి పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి. నెటిజన్లు మాత్రం ఇలా వైవిధ్యంగా ఉండేందుకు ప్రయత్రిస్తున్న సదరు కంపెనీని ప్రశంసించగా, మరికొందరూ భారతీయ వంటకాలు ఖండాంతారాలకు చేరుకోవడం విశేషమే కాకుండా టేస్టే చేయాలనే వారి ధైర్యాన్ని కూడా మెచ్చుకోవాల్సిందేనని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: టేస్ట్ అట్లాస్ మెచ్చిన డెజర్ట్‌తో గుండె ఆరోగ్యం పదిలం..!)
Comments
Please login to add a commentAdd a comment