న్యూఢిల్లీ: ఢిల్లీలోని 40 ఏళ్ల ఒక వ్యక్తి గత కొంతకాలంగా మైయాల్జిక్ ఎన్సెఫలోమైలిటిస్ లేదా క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దీన్ని దీర్ఘకాలిక న్యూరో ఇన్ఫలమేటరీ వ్యాధీ అని కూడా అంటారు. ఇది నరాలను బలహీన పరుస్తూ నెమ్మదిగా మంచానికి పరిమితం చేసే అరుదైన వ్యాధి. అతనికి ఈ వ్యాధి లక్షణాలను 2014లో తొలిసారిగా గుర్తించారు వైద్యులు. అతను ఎయిమ్స్‌లో కొన్నేళ్ల పాటు చిక్సిత తీసుకున్నాడు. దాతల సమస్య, తర్వాత కరోనా రావడం వంటి తదితర సమస్యల నడుమ ఆ వ్యక్తికి చికిత్స కొనసాగించ లేకపోయారు అతని తల్లిదండ్రులు.
ప్రస్తుతం ఆ వ్యక్తి మంచానికే పరిమితమయ్యాడు. కేవలం కొన్ని అడుగులు మాత్రమే వేయగలడు. దీంతో ఆ వ్యక్తి అనాయసంగా లేదా కారుణ్య మరణం పొందాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అందుకోసం అతను స్విట్జర్లాండ్ వెళ్లాడు. దీంతో అతడి స్నేహితురాలు అతన్ని ఆపేందుకు ఢిల్లీ హైకోర్టు మెట్టెక్కింది.
తన స్నేహితుడికి ఎమిగ్రేషన్ క్లియరెన్స్ మంజూరు చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ఆమె పిటిషన్‌లో తన స్నేహితుడు అరుదైన న్యూరో ఇన్ఫలమేటరీ వ్యాధితో బాధపడుతున్నాడని, దాతల సమస్య కారణం చికిత్స కొనసాగించలేకపోయమని పేర్కొంది.
అతనికి భారత్‌లో లేదా విదేశాల్లో చికిత్స అందించే ఆర్థిక పరిస్థితులు లేవు. కానీ అతను కారుణ్య మరణానికి వెళ్లాలనే గట్టి నిర్ణయంతో ఉన్నాడు. దీన్ని వృధాప్యంలో ఉన్న అతని తల్లిదండ్రులు తట్టుకోలేరు. పైగా వారికి తమ కొడుకుకి ఏదో ఒక రోజు నయమవుతుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.
అంతేకాదు చికిత్స కోసం స్విట్జర్లాండ్ వెళ్తున్నట్లుగా తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి వీసా పొందిన తన స్నేహితుడి వైద్య పరిస్థితిని పరిశీలించేందుకు వైద్య బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా పిటిషన్‌లో కోరింది. అంతేకాదు ఆమె తమ అభ్యర్ధను మన్నించి అతన్ని ఆపకపోతే తన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు తీవ్ర మనో వేదనను, పుత్ర శోకాన్ని మిగిల్చిన వారవుతారని పిటిషన్‌లో పేర్కొంది.
(చదవండి: క్షమాపణలు కోరిని బ్రిటిష్ హై కమిషనర్: వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment