ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే ఎదురైది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. సరైన కారణం లేకుండానే కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని చెప్పలేమని విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు తెలిపింది. బెయిల్ కోసం ముందుగా ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని తెలిపింది.
అయితే ఢిల్లీ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. సీబీఐ అరెస్టును సవాల్ చేయడంతోపాటు బెయిల్ కోసం సర్వోన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.
Aam Aadmi Party (AAP) says, "Arvind Kejriwal will approach Supreme Court, challenging the order of the Delhi Court. At Supreme Court, he will challenge his arrest by the CBI as well as appeal for bail." https://t.co/Ry9m0zxCft
— ANI (@ANI) August 5, 2024
కాగా లిక్కర్ ఈడీ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో కేజ్రీవాల్ ఇంకా తీహార్ జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో లిక్కర్ కేసులో సీబీఐ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సీఎం కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. గతవారం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై వాదానులు ముగియడంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. నేడు ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment