అనారోగ్య సమస్యల్ని, తీవ్రమైన బాధల్ని అనుభవించే సమయంలో ఈ బాధ భరించేకంటే చచ్చిపోవడం మేలు అని అనిపిస్తుంది. కానీ నిజంగానే చట్టబద్ధంగా మరణించేందుకు కొన్ని దేశాల్లో అనుమతి ఉంది. చికిత్స లేదు అనుకున్న సమయంలో, వైద్యులు, చట్టాలు పరిశీలించిన తరువాత చట్ట రీత్యా చనిపోవడానికి అనుమతి ఉంది. దాన్నే "కారుణ్య మరణం" (Euthanasia) అంటారు. అంటే సులభంగా నొప్పిలేకుండా, ఆ రోగికి శాశ్వతంగా విముక్తి కల్పించడం అన్నమాట.
సరిగ్గా ఇలాగే చికిత్స లేని మానసిక వ్యాధులతో సతమతమవుతున్న నెదర్‌ల్యాండ్స్ యువతి జొరాయా టెర్ బీక్ (28) కారుణ్య మరణాన్ని ఎంచుకుంది. ది ఫ్రీ ప్రెస్ రిపోర్ట్ ప్రకారం టెర్ బీక్ చాలా కాలంగా ఆమె డిప్రెషన్, ఆటిజమ్, బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ వంటి సమస్యలతో బాధపడుతోంది. ఎన్ని చికిత్సలు చేసినా విముక్తి లభించలేదు. అంతేకాదు ఇక ఎలాంటి ఇతర చికిత్సలూ లేవని వైద్యులు కూడా తేల్చి చెప్పారు. దీంతో, బాధల నుంచి తప్పించుకునేందుకు ఆమె కారుణ్య మరణాన్ని ఎంచుకుంది. (తైవాన్‌ను కుదిపేసిన భూకంపం : మెట్రోట్రైన్, స్విమ్మింగ్ పూల్‌లో దృశ్యాలు)
ప్రేమించే స్నేహితుడు, పెంపుడు జంతువులున్నప్పటికీ, ఆమె కూడా తన మానసిక వ్యాధి చికిత్సకు లొంగదని భావిస్తుంది. నెదర్లాండ్స్‌లో ఎక్కువ మంది ప్రజలు మానసిక ఆరోగ్య సమస్యలను భరించే బదులు వాటి బాధలను అంతం చేసుకోవాలని ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మే నెలలో ఆమె కూడా కారుణ్యమరణానికి రంగం సిద్దం కావడం విషాదం. ఈ ప్రక్రియలో భాగంగా దీనికి ప్రకారం టెర్ బీక్ ఇంటి వద్దే వైద్యులు ఆమెకు తొలుత మత్తు మందు ఇస్తారు. ఆ తరువాత గుండె కొట్టుకోవడాన్ని ఆపే మరో మందును ఇస్తారు. జోరాయా ఇంట్లో ఆమె ప్రియుడు, ఇతర కుటుంబసభ్యుల సమక్షంలో అచేతన స్థితిలో ఆమె లోకానికి శాశ్వతంగా ఈ లోకాన్ని వీడనుంది.
నెదర్లాండ్స్‌లోని థియోలాజికల్ యూనివర్శిటీ కాంపెన్‌లోని హెల్త్‌కేర్ ఎథిసిస్ట్ స్టెఫ్ గ్రోన్‌వౌడ్ మాట్లాడుతూ గతంకంటే ఈ ధోరణి బాగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2001లోనే నెదర్‌లాండ్స్ కారుణ్యమరణానికి చట్టబద్ధత కల్పించింది. 2022 నాటి లెక్కల ప్రకారం, నెదర్‌లాండ్స్ మొత్తం మరణాల్లో 5 శాతం కారుణ్య మరణాలే కావడం గమనార్హం. దీంతో ఆత్మహత్యలను ప్రోత్సహిస్తోందంటూ ప్రభుత్వంపై చాలా విమర్శలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment