‘శవాలదిబ్బ’ : ఆ మారణహోమానికి 79 ఏళ్లు | Hiroshima Day 2024: World War II Hiroshima and Nagasaki Here are 10 facts | Sakshi
Sakshi News home page

‘శవాలదిబ్బ’ : ఆ మారణహోమానికి 79 ఏళ్లు

Published Tue, Aug 6 2024 1:03 PM | Last Updated on Tue, Aug 6 2024 3:25 PM

Hiroshima Day 2024: World War II Hiroshima and Nagasaki Here are 10 facts

హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు జరిగి నేటికి (ఆగష్టు 6, 2024) 79 ఏళ్లు. ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసిన తీరని విషాదం. జపాన్‌లో 1945 ఆగస్ట్‌లో జరిగిన అణు బాంబు పేలుళ్లతో హిరోషిమాలో  లక్షా 40వేల మంది, నాగసాకిలో 74వేల మందిని బలి తీసుకున్న ఉదంతం.  ప్రపంచంలోనే తొలి అణు బాంబు దాడిగా పేరొందిన  ఈ దాడుల ధాటికి విలవిల్లాడిన జపాన్ శత్రు దేశాలకు లొంగిపోవడంతో 1945 ఆగస్ట్ 14న  రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. హిరోషిమా డే సందర్భంగాఈ  ఘటనకు సంబంధించిన కొన్ని ప్రత్యేక  సంగతులు..!

1945 ఆగష్టు 6న జపాన్‌లోని హిరోషిమా నగరంపై అమెరికా అణు బాంబు జారవిడిచింది. ఎనోలా గే అనే అమెరికన్ B-29 బాంబర్, జపాన్ నగరం హిరోషిమాపై "లిటిల్ బాయ్"  అనే అణు బాంబును జారవిడిచింది. ఈ బాంబు పేలిన కాసేపట్లోనే 5 చ.కి.మీ. పరిధిలోని ప్రాంతం నాశనమైంది. 80 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 35 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాలు, రేడియన్ ప్రభావంతో వేలాదిమంది చనిపోయారు. మరో మూడు రోజులకు  అంటే ఆగస్టు 9న నాగసాకి నగరంపై అమెరికా మరో  భారీ అణుబాంబుతో దాడి చేసింది. 

హిరోషిమా అంటే జపనీస్ బాషలో విశాలమైన దీవి. దీవుల సమాహారమైన జపాన్‌లోని అతిపెద్ద దీవిలో ఉన్న పెద్ద నగరం హిరోషిమాపై యురేనియం-235తో తయారు చేసిన “లిటిల్ బాయ్”, నాగసాకిపై ప్లూటోనియంతో తయారుచేసిప “ఫ్యాట్ మ్యాన్”  అనే అత్యంత పవర్‌పుల్‌ బాంబును ప్రయోగించింది.

‘ఎనోలా గే’ అనే విమానం  బరువు 9 వేల పౌండ్లు, పొడవు 10 అడుగులు. ఈ బాంబు నేలను తాకడానికి ముందే, 1750 అడుగుల ఎత్తులోనే పేలింది. ఈ  దాడికి ముందు హిరోషిమా జనాభా దాదాపు 3.4 లక్షలు కాగా, తర్వాత అది 1.37 లక్షలకు పడిపోయిందంటే  ఈ విధ్వంసాన్ని అర్థం చేసుకోవచ్చు. 

ప్రధానంగా జపాన్‌లో  ఐదు నగరాలను ఎంచుకుంది. కోకురా, హిరోషిమా, యోకోహామా, నీగాటా ,క్యోటో. ఈ దాడులకు యునైటెడ్ కింగ్‌డమ్ సమ్మతించింది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పురాతన రాజధాని పట్ల  అప్పటి  సెక్రటరీ ఆఫ్ వార్ హెన్రీ స్టిమ్సన్‌కు ఉన్న అభిమానం కారణంగా క్యోటో తప్పించుకుంది. దానికి బదులుగా, నాగసాకి నగరం బలైంది. ఈ బాంబు పేలుళ్లలో బతికి బయటపడిన వారిని హిబాకుషా అంటారు. పేలుళ్ల ప్రభావంతో ఏర్పడిన రేడియేషన్, విషవాయువులు ప్రభావంతో బాధితుల మానసిక వేదన, బాధలు వర్ణనాతీం. అణ్వాయుధాల  వినాశకరమైన ప్రభావాన్ని  కళ్లకు కట్టిన మారణహోమం.

ఇపుడు అణుయుద్ధం జరిగితే 
రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం, ఉత్తర,  దక్షిణ అమెరికా ఘర్షణలు మధ్య ఇపుడు అణు యుద్ధం జరిగితే ఎంతమంది చనిపోవచ్చు? అనేది ప్రధానంగా వినిపించే ప్రశ్న. అణు సంఘర్షణ ప్రభావాలను అధ్యయనం చేస్తూ సంవత్సరాలు గడిపిన జర్నలిస్ట్ అన్నీ జాకబ్‌సెన్ అంచనాల ప్రకారం అణు యుద్ధం ప్రారంభమైన 72 నిమిషాల్లోనే దాదాపు ఐదు బిలియన్ల మంది ప్రజలు చనిపోతారు.

రేడియేషన్ ప్రభావం అత్యంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఓజోన్ పొర చాలా దెబ్బతింది కనుక అణువిస్ఫోటనాలు జరిగితే ఊహకందని విధ్వంసమే. అణుయుద్ధం నుండి బతికిన వారికి ఆహారం లభించదు. ఆకలితో అలమటించి. పోషకాహార లోపంతో  కృంగి కృశించి ప్రాణాలొదులుతారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement