పెళ్లి కావడం లేదు.. కారుణ్య మరణానికి అనుమతివ్వండి | Pune Man Single And Unhappy With Career Seeks Permission For Euthanasia | Sakshi
Sakshi News home page

పెళ్లి కావడం లేదు.. కారుణ్య మరణానికి అనుమతివ్వండి

Published Sun, May 12 2019 5:46 PM | Last Updated on Sun, May 12 2019 5:47 PM

Pune Man Single And Unhappy With Career Seeks Permission For Euthanasia - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పుణే: పెళ్లి కావడం లేదనే బాధ ఓ వ్యక్తి తీవ్ర మనోవేదనకు గురిచేసింది. దీంతో అతడు తనకు కారుణ్య మరణం ప్రసాదించమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఓ లేఖ రాశారు. కెరీర్‌లో స్థిరత్వం లేకపోవడం, ఎంత ప్రయత్నించిన పెళ్లి కాకపోవడం వల్లే అతడు ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. 

ఈ లేఖపై దత్తవాడి పోలీసు అధికారి దేవీదాస్‌ మాట్లాడుతూ.. ‘ఇరవై రోజుల క్రితం ఈ లేఖ సీఎం కార్యాలయానికి వచ్చింది. 35 ఏళ్ల ఓ వ్యక్తి తన తల్లిదండ్రులకు ఏం చేయలేకపోతున్నాననే బాధలో ఈ లేఖ రాశారు. అతడి తల్లికి 70 ఏళ్లు, తండ్రికి 83 ఏళ్లు ఉంటాయని ఆ వ్యక్తి లేఖలో పేర్కొన్నారు. అతనికి తన తల్లిదండ్రులంటే ఎంతో ఇష్టం. పెళ్లి కాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మేము అతనికి కౌనిల్సింగ్‌ నిర్వహించామ’ని తెలిపారు. అయితే ఈ లేఖ రాసిన వ్యక్తి మంచి విద్యావంతుడు కావడమే కాకుండా, సంపన్న కుటుంబానికి చెందినవారని దేవీదాస్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement