Unmarried
-
ఇవాళే సౌభాగ్యదాయిని ‘అట్లతద్ది’!
అట్లతద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ‘తదియ’ నే ‘తద్దె’ అంటారు. ఉండ్రాళ్ల తద్దె , అట్ల తద్దె అనేవి అలా వచ్చినవే. ఆశ్వయుజ బహుళ తదియనాడు దీనిని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు? దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏమిటీ? తదితరాల గురించే ఈ కథనం!. ఈ పండుగకు గోరింటాకు పెట్టుకోవడం చాలా ముఖ్యం అట్లతద్దె ఈ తద్ది ప్రసిద్దమైనది. ఆంధ్ర ఆడపడుచులకు చాల ముఖ్యమైన పండుగ. అట్లతద్ది ముందురోజు భోగి అని పిలుస్తారు. ఆడపిల్లలందరూ చేతులకు, కాళ్ళకు గోరింటాకు పెట్టుకుని తెల్లవారుఝామునే లేచి ఉట్టి కింద కూర్చుని చద్దన్నం తింటారు(ఇప్పుడు ఉట్లు లేవు లెండి) ఆటపాటలతో కాలక్షేపం చేసి ఉయ్యాలలూగుతారు! పగలంతా ఉపవాసముండి సాయంకాలం చంద్రోదయం అయిన తరువాత చంద్రదర్శనం చేసుకుని 'చంద్రోదయోమా వ్రతం' చేసి అట్లు దానమిచ్చి , ఉమాదేవిని పూజించి భోజనం చేస్తారు. ఈ అట్లతద్దికి గోరింటాకును పెట్టుకోవడం చాల ముఖ్యం! చర్మ వ్యాధులు రాకూడదని.. గోరింట అంటే గోరు+అంటు= గోరింట అని బ్రౌణ్యం చెపుతోంది. సంస్కృతంలో కూడ దీన్ని నఖరంజని అంటారు. దీన్ని బట్టి చూస్తే గోరింటాకు గోర్లకు మంచిది అని తెలుస్తుంది. ఈ గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి మొగుడొస్తాడని సరసాలడతారు. గ్రీష్మఋతువులోని ఆషాఢమాసంలోనూ వర్షఋతువులోని భాద్రపద మాసంలోనూ శరదృతువులోని ఆశ్వయుజ మాసంలోనూ మూడు సందర్భాలలో గోరింటాకును పెట్టుకుంటారు. ఇవి మూడు వానకారు పబ్బాలుగా ప్రసిద్ది! తెల్లవారుఝాము నుంచీ ఆడపిల్లలు పాడుతూ ఆడుకునే పాటలలో ఎన్నో ఆరోగ్యరహస్యాలను పొందుపరిచారు. ఇళ్ళల్లో నీళ్ళతావుల్లో తిరిగే ఆడవాళ్ళకు చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాటికి వాడవలసిన మందులను తెలిపే పాట.... 'కాళ్ళగజ్జ కంకాళమ్మ వేగుచుక్క వెలగామొగ్గ మొగ్గా కాదు మోదుగనీరు నీరుకాదు నిమ్మలబావి బావికాదు వావిటికూర కూరకాదు గుమ్మిడిపండు పండుకాదు పాపిడిమీసం' కాళ్ళకు గజ్జి లాంటి చర్మవ్యాధులొస్తే కంకాళమ్మ ఆకును నూరి పసరుతీసి రాస్తే గజ్జి పోతుంది. దానికి లొంగకపోతే వెలగ మొగ్గను నుజ్జుచేసి శరీరంపై పూసుకోవాలి. అప్పటికీ తగ్గకపోతే వావిటికూరను ముద్దగాజేసి పట్టీలు వేసుకోవాలి అప్పుడు ఆ వ్యాధి నిమ్మళించి గుమ్మడి పండులాగ నిగనిగలాడతారని ఈ పాటలో చెప్పారు! అలాగే గోరింటాకు పెట్టుకున్నగోళ్ళు వాటి రంగులు చూసుకుంటూ 'చిప్పచిప్ప గోళ్ళు సింగరాజు గోళ్ళు' అని పాడుకుంటారు. 'ఒప్పులకుప్ప ఒయ్యారిభామా సన్నబియ్యం ఛాయాపప్పు మునగాపప్పూ నీమొగుడెవరు గూట్లోరూపాయి నీమొగుడు సిపాయి' అని ఈరోజు ఉదయంనుంచి తయారు చేసిన పదార్ధాల మూలాలను తలచుకుంటూ వీర్యవృద్ధి కలిగిన ఈ పిండివంటలన్నీ రాబోయే మొగుడికోసమేనని మేలమాడుతూ రోటిపాటలు పాడతారు.ఆ రోళ్ళకు ఉయ్యాలలు కట్టి ఊయలలూపుతూ పెళ్ళయిన పడుచులను మొగుడిపేరు గట్టిగా చెప్పేదాకా వదలకుండా ఊపుతారు. పెట్టుకున్న గోరింటాకు ఎలా పండిందో చూసుకుని మురిసిపోతూ ... 'గోపాలకృష్ణమ్మ పెళ్ళయ్యేనాడు గోరింట పూచింది కొమ్మలేకుండా మాఇంట అబ్బాయి పెళ్ళయ్యేనాడు మల్లెలు పూచాయి మొగ్గలేకుండా' ఈ సంప్రదాయ స్త్రీ పాటనే కృష్ణశాస్త్రిగారు తమపాట పల్లవిగా మలచుకున్నారు. తరువాత వారి చరణమే 'మందారంలా పూస్తే మంచిమొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు సిందూరంలా పూస్తే చిట్టిచేయంతా అందాల చందమామ అతనే దిగివస్తాడు' అనుకుంటూ చంద్రోదయోమావ్రతం చేసుకుంటారు! ఇవన్నీ నిన్నామొన్నటి వరకు పల్లెపడుచుల అట్లతద్ది ఆటపాటలు. బహుశః ఏ పైలోకాలలోనో తెలుగు ఆడపడుచులకు వాళ్ళ చిన్నతనంలోని పాటలన్నీ వినాలనిపించిందేమో ... ఈ పాటల ఊయలలను తీసుకుపోయి అందనంత ఎత్తులో వాళ్ళదగ్గరే ఉంచేసుకున్నారు. కానీ ఊయలెప్పుడూ ఒకేచోట ఉండదు! అది కిందకు రాక తప్పదు!! మళ్ళీ ఈ అట్లతద్ది ఆటపాటలు మాకందివ్వకా తప్పదు!!! ఈ తరం పడుచులందరికీ ఒకటే వినతి! రండి లేవండి తెల్లవారు ఝామునే చద్దన్నం తిని మన ఆటపాటల ఊయలను మనమే పట్టుకుందాం రండి!! 'అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్ సీమ పచ్చిమిరపకాయ్ చిఱ్ఱో చిఱ్ఱో నీ మొగుడు కొడితే మొఱ్ఱో మొఱ్ఱో' అట్లతద్ది అంతరార్థం త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొంద గోరి మొదటి సారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి వ్రతం చేసిన వారికి వస్తుందని , ఆయన అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని , కుటుంబంలో సుఖశాంతులు వర్థిల్లుతా యని శాస్త్ర వచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం దాగి ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం. రుతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ ఉండవు. మినపపిండి , బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు , బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. బియ్యం , మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుందని నమ్మకం. అమ్మవారి నైవేద్యం ఆరోగ్యాన్ని , శక్తిని కలిగిస్తుంది. ఈ పండుగను అవివాహిత స్త్రీలు చేస్తే మంచి మొగుడు వస్తాడని, పెళ్లైన వారు చేస్తే సౌభాగ్యం కలకలం ఉంటుందని శాస్త్ర వచనం. (చదవండి: కోరికలు కలలోని పూదోటలు! వాటి కోసం పరుగులు తీస్తే చివరికి..) -
పెళ్లి కాని వారికి గుడ్‌న్యూస్.. ప్రతీ నెలా 2,750 పెన్షన్
చండీఘడ్: హర్యానా ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెళ్లి కాని యువతీ యువకుల కోసం ప్రత్యేక పెన్షన్ స్కీమ్‌ను ప్లాన్ చేసింది. హర్యానాలో వివాహం చేసుకోని వారికి ప్రతీ నెలా రూ.2,750లను పెన్షన్‌గా ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. వివరాల ప్రకారం.. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గురువారం కీలక ప్రకటన చేశారు. హర్యానాలో పెళ్లి కాని ఆడవాళ్లకు, మగవాళ్లకు ప్రతి నెలా రూ.2,750 ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే, ఈ స్కీమ్ 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి మాత్రమే వర్తించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. అవివాహిత పెన్షన్ అందుకునేవారి వార్షిక ఆదాయం రూ.1.80 లక్షలకు తక్కువగా ఉండాలని ప్రభుత్వం రూల్ పెట్టింది. మరోవైపు.. హర్యానాలో వితంతవులను కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వితంతువులకు కూడా పెన్షన్‌ను అందించనున్నట్టు సీఎం ఖట్టర్ ప్రకటించారు. 40 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వితంతువులకు ప్రతినెలా రూ.2750 ఇవ్వనున్నట్టు తెలిపారు. అయితే వాళ్ల వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలనే నిబంధనను విధించారు. मैं घोषणा करता हूं कि हरियाणा के 45 से 60 वर्ष तक की आयु वाले अविवाहित पुरुष व महिलाओं को अब से ₹2,750 मासिक पेंशन दी जाएगी। ₹1.80 लाख से कम वार्षिक आय वाले व्यक्तियों को इस पेंशन का लाभ मिलेगा। इसके अलावा 40-60 वर्ष आयु तक के विधुर पुरुष, जिनकी वार्षिक आय ₹3 लाख से कम है… pic.twitter.com/Jwn5fO5sWp — Manohar Lal (@mlkhattar) July 6, 2023 ఇది కూడా చదవండి: మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు.. ఎంపీ ఎన్నిక రద్దు.. -
'38 ఏళ్లొచ్చినా గర్ల్‌ఫ్రెండ్ లేదు.. నా కుమారుడి చిప్ దొబ్బింది..!'
బీజింగ్: పిల్లలకు పెళ్లీడు వచ్చిందంటే చాలు తల్లిదండ్రులు హడావిడి చేస్తుంటారు. సంబంధాలు చూసి త్వరగా పెళ్లి చేసేయాలని అనుకుంటారు. ఈ కాలంలో యువత అయితే తల్లిదండ్రులకు పని లేకుండా వారే తమ జీవిత భాగస్వాములను చూసుకుంటున్నారు. అలాంటిది 38 ఏళ్లొచ్చినా తన కొడుకు ఇంకా సింగిల్ గానే ఉంటున్నాడని, ఇప్పటివరకు ఒక్క గర్ల్‌ఫ్రెండ్‌ను కూడా ఇంటికి తీసుకురాలేదని ఓ తల్లి ఆందోళన చెందుతోంది. అంతేకాదు ఇన్నేళ్లు వచ్చినా పెళ్లి మాట ఎత్తకపోవడంతో అతని తలలో ఏదో లోపం ఉన్నట్టుందని ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో కుమారుడ్ని ప్రతి ఏటా మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తోంది. ఈ ఘటన చైనా హెనాన్ రాష్ట్రంలో జరిగింది. 38 ఏళ్లొచ్చినా సింగిల్‌గా ఉంటున్న ఇతని పేరు వాంగ్. ఇతనికి పెళ్లి కావడంలేదని తల్లి దిగులు చెందుతోంది. కుమారుడ్ని మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తే సమస్య తీరుతుందని భావించింది. దీంతో 2020 నుంచి ప్రతి ఏటా చైనా లూనార్ న్యూ ఇయర్ తర్వాత వాంగ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తోంది. ఈసారి షాక్.. అయితే ఈసారి ఫిబ్రవరి 4న ఆస్పత్రికి వెళ్లిన వాంగ్ తల్లికి వైద్యులు షాక్ ఇచ్చారు. అతను బాగానే ఉన్నాడని ఏలాంటి సమస్యా లేదని స్పష్టం చేశారు. అసలు సమస్య ఆమెలోనే ఉందని, కుమారుడికి పెళ్లి కావడం లేదనే దిగులుతో 'మెంటల్ డిజార్డర్' వచ్చిందని చెప్పారు. దీంతో ఆమె అవాక్కయ్యింది. తల్లి కోసమే.. కేవలం తల్లిని బాధపెట్టొద్దనే ఉద్దేశంతోనే తాను ఆస్పత్రికి వెళ్తున్నట్లు వాంగ్ చెప్పాడు. 10 ఏళ్లుగా తాను ఉద్యోగం చేస్తూ తీరక లేకుండా ఉన్నానని, గర్ల్‌ఫ్రెండ్ గురించి ఆలోచనే తనకు రాలేదన్నాడు. సమయం వచ్చినప్పుడు సరైన వ్యక్తి తన జీవితంలోకి వస్తుందేమేనని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అయినా ఇళ్లు కొనేందుకు డౌన్‌పేమెంట్‌కు డబ్బులు కూడా లేని తనను ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందని ప్రశ్నించాడు. తాను సిటీలో 'సూపర్ ఓల్డ్ సింగిల్ మ్యాన్' అంటూ ముసిముసి నవ్వులు నవ్వాడు. చైనా మీడియాలో వాంగ్ కథనం ప్రసారం కాగా.. యువకులు పెద్ద చర్చకు తెరలేపారు. పెళ్లి చేసుకోకపోతే ఈ సమాజం తాము ఏదో పాపం చేసినట్లుగా చూస్తోందని, ఇది సబబేనా అని ఓ నెటిజన్ స్పందించాడు. మరో యువకుడు స్పందిస్తూ అసలు పెళ్లి చేసుకున్న వాళ్లే మానసిక సమస్యలతో బాధపడుతున్నారని అసహనం వ్యక్తం చేశాడు. చదవండి: అందంగా కన్పించాలని ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ.. ఆ తర్వాత గంటల్లోనే.. -
వివాహం కాకపోయినా పర్లేదు!.. పిల్లలను కనండి అంటున్న చైనా!
పెళ్లి కానీ వారు ఎవరైనా తమ కుటుంబాన్ని పెంచుకోవాలనుకుంటే ఓకే అని డ్రాగన్ కంట్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకు మునుపు కేవలం వివాహిత జంటలు మాత్రమే చట్టబద్ధంగా పిల్లలను కనేలా అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పుడు పెళ్లి కాకపోయినా పర్వాలేదు చట్టబద్ధంగా పిల్లలను కనండి అని ప్రోత్సహిస్తోంది చైనా. ఎందుకంటే అక్కడ ఘోరంగా జననాల రేటు పడిపోవటంతో దాన్ని పెంచే క్రమంలో ఇలా ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు. అలాగే చైనాలోని నైరుతీ ప్రావిన్స్‌లో సిచువాన్ ఐదవ అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం. ఐతే ఈ ప్రాంతం 60 ఏళ్ల కంటే పైబడినవారి పరంగా ఏడో స్థానంలో ఉంది. ఇటీవల కాలంలో వివాహాలు, జననాల రేటు పడిపోవడంతో ఈ నిబంధనలను తీసుకువచ్చింది. ఈ మేరకు చైనా ఫిబ్రవరి 15 నుంచి కొత్త నిబంధనలను అమలు చేయనుంది. వివాహిత జంటలే గాక పిల్లలను కావాలనుకునే వారంతా అధికారుల వద్ద తమ పేర్లను నమోదు చేసుకుని కోరుకున్నంత మంది పిల్లలని కనొచ్చని చెప్పింది. చైనా జనాభా ఆరు దశాబ్దాలలో మొదటిసారిగా తగ్గిపోయింది. దీన్ని చారిత్రాత్మక మలుపుగా పేర్కొనవచ్చు. ఈ మేరకు సిచువాన్ ఆరోగ్య కమిషన్ దీర్ఘకాలిక సమతుల్య జనాభాను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. జనాభాను పెంచేలా ప్రజలకు మరిన్ని ప్రోత్సహాకాలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే వైద్య బిల్లులు కవర్ అయ్యేలా ప్రసూతి బీమా, ప్రసూతి సెలవుల సమయంలో జీతాన్ని అందించేలా వెసులబాటు వంటి తదితర ప్రోత్సహాకాలను అందించారు. ఇది ఒంటరిగా జీవించే మహిళలకు, పురుషులకు కూడా వర్తిస్తుందని చెప్పారు. (చదవండి: అక్కడ ఉల్లి మహా ఘాటు..ధర వింటే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి) -
పెళ్లి కాకుండానే యువతికి గర్భం.. అబార్షన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
సాక్షి,న్యూఢిల్లీ: అబార్షన్‌కు సంబంధించిన ఓ కేసులో సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. పెళ్లి కాని యువతి 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అబార్షన్ చేసినా ఆమెకు ఎలాంటి ప్రాణహాని లేదని ఢిల్లీ ఎయిమ్స్ ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు చెప్పడంతో ఇందుకు ఓకే చెప్పింది. పెళ్లికానందు వల్ల ఈ యువతి అబార్షన్ చేయించుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం అలాంటి పరిమితులు ఏమీ లేవని చెప్పింది. 2021లో సవరించిన మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్‌ను ప్రస్తావించింది. పెళ్లికాని మహిళలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. అబార్షన్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈ యువతి వయసు 25 ఏళ్లు. కొంత కాలంగా ఒకరితో రిలేషన్లో ఉంది. ఈ క్రమంలోనే అవాంఛిత గర్భందాల్చింది. దీంతో అబార్షన్‌కు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దిల్లీ హైకోర్టు ఇందుకు నిరాకరించినా.. సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. చదవండి: బీజేపీ నేతలకు మమత వార్నింగ్.. ‘ఇక్కడకు రావొద్దు రాయల్ బెంగాల్ టైగర్ ఉంది’ -
ఆ దేశ జనాభాలో 3కోట్ల మంది బ్యాచిలర్సే
బీజింగ్: ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా. ఆ దేశ జన గణన ఈ సంవత్సరం చేశారు. తాజాగా చేసిన జనగణనలో విస్తుగొల్పే విషయాలు వెల్లడయ్యాయి. దేశ జనాభాలో ముఖ్యంగా పెళ్లి కాని వారు అధికంగా ఉన్నారని తేలింది. ఈ విషయం తాజాగా చేసిన జనాభా లెక్కల్లో వెల్లడైంది. దీంతో ఆ దేశంలో పెద్ద ఎత్తున పెళ్లి కాని ప్రసాద్‌లే ఉన్నారు. చైనా జనాభా లెక్కల వివరాలను మే 11వ తేదీన విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం జనాభా వృద్ధి రేటు తగ్గడం ఆందోళన కలిగించే అంశం. అయితే చైనా పాటించిన విధానం ప్రభావంతో ప్రస్తుతం పెళ్లి కాని పురుషులు అధికంగా ఉన్నారు. లింగ సమతుల్యత పాటించకపోవడం వలన ఈ సమస్య ఏర్పడిందని మేధావులు చెబుతున్నారు. 30 మిలియన్ల(3 కోట్లు) పెళ్లి కాని పురుషులు ఉన్నారని చైనా ఏడవ జనాభా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం చైనాలో 111.3 పురుషులకు వంద మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అంతకుముందు 2010లో 118.1 పురుషులకు వంద మంది అమ్మాయిలు ఉన్నారు. గత లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం లింగ నిష్పత్తి కొంత మెరుగైందనే చెప్పవచ్చు. కానీ ఆశించిన స్థాయిలో లింగ నిష్పత్తి లేదు. ఒకరు మాత్రమే అనే విధానంతో లింగ అంతరం సమస్య పెరిగింది. -
ఒంటరిగా రండి.. జంటగా వెళ్లండి
బీజింగ్: ఒక్కరే ముద్దు లేదా అసలే వద్దు సిద్దాంతం చైనా జనాభాలో భారీ మార్పులు తీసుకు వచ్చింది. ఈ విధానం వల్ల జననాల సంఖ్య తగ్గడమే కాక స్త్రీ, పురుష జనాభాలో విపరీతమైన తారతమ్యం చోటు చేసుకుంది. ఫలితంగా ప్రస్తుతం చైనాలో పెళ్లి కానీ ప్రసాదుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందట. గతేడాది చైనాలో 1000 మందిలో కేవలం 7.2శాతం మందికి మాత్రమే వివాహం అయ్యిందని అధికారులు తెలిపారు. రాగల ముప్పై ఏళ్లలో దాదాపు 30 లక్షల మంది యువతీ యువకులు పెళ్లి కానీ ప్రసాదులుగా మిగిలిపోనున్నారట. ఈ నేపథ్యంలో పెళ్లి కానీ యువతీ యువకుల కోసం ఓ వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది చైనా. ఒంటరి పక్షుల కోసం ‘లవ్ పర్స్యూట్’ పేరుతో మూడేళ్ల క్రితం ప్రత్యేక రైలును ప్రారంభించింది. ఈ రైలులో ఒక్కో ట్రిప్‌లో దాదాపు 1000 మంది పెళ్లి కానీ యువతీ యువకులను ప్రయాణం చేయడానికి అనుమతిస్తారు. చాంగ్కింగ్ నార్త్ స్టేషన్ నుంచి కియాంజియాంగ్ స్టేషన్ వరకు రెండు పగళ్లు, ఒక రాత్రి సాగే ఈ ప్రయాణంలో యువత తమకు జీవితభాగస్వామిగా సరిపోయే వ్యక్తులను అన్వేషించుకోవచ్చు. రైలులో ఉన్న వారిలో ఎవరైనా నచ్చితే వారితో స్నేహం చేసి ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకుని.. ఆ తర్వాత అన్ని బాగున్నాయనుకుంటే.. పెళ్లి చేసుకోవచ్చు. వీరందరికి రైలులోనే భోజన, వసతి సదుపాయాలు కల్పించడమే కాక వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. లవ్ పర్స్యూట్ రైలులో ప్రయాణిస్తున్నప్పుడే తాను తన జీవితభాగస్వామిని గుర్తించానని యాంగ్ హువాన్ తెలిపింది. తిరుగు ప్రయాణంలో తాము ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నామన్నది. ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు ఒక్కటే అని తేలడంతో వివాహం చేసుకున్నామన్నది. ఈ ప్రయాణంలో తోడు దొరకకపోయినా.. మంచి మిత్రులు పరిచయం అవుతారంటుంది యాంగ్. -
పెళ్లి కావడం లేదు.. కారుణ్య మరణానికి అనుమతివ్వండి
పుణే: పెళ్లి కావడం లేదనే బాధ ఓ వ్యక్తి తీవ్ర మనోవేదనకు గురిచేసింది. దీంతో అతడు తనకు కారుణ్య మరణం ప్రసాదించమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఓ లేఖ రాశారు. కెరీర్లో స్థిరత్వం లేకపోవడం, ఎంత ప్రయత్నించిన పెళ్లి కాకపోవడం వల్లే అతడు ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఈ లేఖపై దత్తవాడి పోలీసు అధికారి దేవీదాస్ మాట్లాడుతూ.. ‘ఇరవై రోజుల క్రితం ఈ లేఖ సీఎం కార్యాలయానికి వచ్చింది. 35 ఏళ్ల ఓ వ్యక్తి తన తల్లిదండ్రులకు ఏం చేయలేకపోతున్నాననే బాధలో ఈ లేఖ రాశారు. అతడి తల్లికి 70 ఏళ్లు, తండ్రికి 83 ఏళ్లు ఉంటాయని ఆ వ్యక్తి లేఖలో పేర్కొన్నారు. అతనికి తన తల్లిదండ్రులంటే ఎంతో ఇష్టం. పెళ్లి కాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మేము అతనికి కౌనిల్సింగ్ నిర్వహించామ’ని తెలిపారు. అయితే ఈ లేఖ రాసిన వ్యక్తి మంచి విద్యావంతుడు కావడమే కాకుండా, సంపన్న కుటుంబానికి చెందినవారని దేవీదాస్ పేర్కొన్నారు. -
కలలరాణి ఎక్కడుందో..పెళ్లెప్పుడవుతుందో..!
‘మల్లీశ్వరి’ సినిమాలో నటుడు వెంకటేశ్ పాత్ర పేరు ప్రసాద్.. ఆయనకు వయసు వచ్చినా వివాహం కాలేదు.. సంబంధాలు చూసినా కుదరలేదు.. దీంతో ఆయనను అందరూ ‘పెళ్లి కాని ప్రసాద్’ అని పిలుస్తారు. ‘పెళ్లెప్పుడవుతుందో బాబో.. పిల్లయాడుందో బాబో’ అనే పాట ఓ సినిమాలో ఉంది.. ఇలా ఉంది ప్రస్తుతం యువకుల పరిస్థితి. యువకులు తమ స్థాయికి తగ్గ వధువు కావాలని కోరుకుంటున్నారు.. అమ్మాయిలు తన స్థాయికి మించిన వరుడు కావాలని ఆశిస్తున్నారు... దీంతో యవకులకు పెళ్లి కావడం చాలా కష్టంగా మారింది... దీనివల్ల యువత వయసు పెరిగిపోతోంది.. చూసీ చూసీ విసిగి వేసారి చివరకు సర్దుకుపోతేనే వివాహం జరుగుతోంది. జిల్లాకు చెందిన ఓ యువకుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడు నెలకు రూ.50 వేల వేతనం తీసుకుంటున్నాడు. రెండేళ్ల నుంచి పెళ్లి చేసుకుందామని తిరుగుతున్నాడు. 20 దాకా సంబం«ధాలు చూశాడు. అమ్మాయి తల్లిదండ్రులు రూ.50 వేలు సిటీలో ఏమి సరిపోతుంది, ఎలా జీవనం సాగిస్తారని అంటున్నారని అతను చెబుతున్నాడు. ఇది ఆయన పరిస్థితి మాత్రమే కాదు. ఇలా చాలా మంది యువకులు పెళ్లి కోసం తంటాలు పడుతూ మ్యారేజ్బ్యూరోలను ఆశ్రయిస్తున్నారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి. రిటైర్డ్‌మెంట్‌కు మూడు నెలలు సమయం ఉంది. ఇద్దరు కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి వివాహం చేసేందుకు రెండేళ్ల నుంచి సంబం«ధాలు చూస్తున్నాడు. పిల్లలకు వివాహాలు చేసి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుకుందామనుకుంటే కల్యాణ గడియలు రావడం లేదు. ఈ పరిస్థితి అతని ఒక్కడిదే కాదు. పెళ్ళీడుకొచ్చిన కొడుకులు ఉన్న తల్లిదండ్రులందరిదీ. ఒకప్పుడు ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే తల్లిదండ్రులకు గుండెల మీద భారంగా ఉండేది. పెళ్లి చేసి ఒకరి చేతిలో పెట్టాలంటే ఎన్నో సమస్యలు. కాలం మారింది. ఇప్పుడు కొడుకుల వివాహాలు చేసేందుకు తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. యువకులకు కల్యాణ గడియలు సమీపించడం లేదు. అనేక కారణాలతో సంబంధాలు కుదరక, లక్షల మంది యువకులు పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. కాశినాయన : కొడుకే పుట్టాలని తమ ఇష్టదైవాలను కోరుకున్న తల్లిదండ్రులు.. ఇప్పుడు వారిని ఓ ఇంటి వారిని చేయడానికి కనిపించిన దేవునికల్లా మొక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీవిత కాలం కష్టపడి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేసిన తర్వాత.. పెళ్లి చేస్తే ఓ పనైపోతుందనుకుంటే ఎక్కడా సంబంధాలు కుదరడం లేదు. యువకుల సంఖ్యకు తగ్గట్టుగా యువతులు లేకపోవడం, ఉద్యోగం వచ్చి స్థిరపడే వరకు పెళ్లి ప్రస్తావన రాకపోవడం, అబ్బాయిల విషయంలో అమ్మాయిలు రాజీ పడకపోవడం తదితర కారణాలతో పెళ్లికాని ప్రసాద్‌ల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో ఇలా.. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 28,82,469 మంది జనాభా ఉన్నారు. ఇందులో 14,51,777 మంది పురుషులు, 14,30,692 మంది స్త్రీలు ఉన్నారు. 9,94,699 మంది అక్షరాస్యత కలిగిన పురుషులు, 7,22,067 మంది అక్షరాస్యత కలిగిన స్త్రీలు ఉన్నారు. దాదాపు 15000 మంది పెళ్లి కాని అబ్బాయిలు ఉన్నట్లు మ్యారేజ్‌బ్యూరోలు చెబుతున్నారు. జిల్లాలో 1000 మంది మగపిల్లలకు 900 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. దీంతో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది. జిల్లాలో 35కు పైగా మ్యారేజ్‌బ్యూరోలు ఉన్నాయి. పాతిక మంది పెళ్లిళ్ల పేరయ్యలు ఉన్నారు. గతంలో ఇలా ఉండేది గతంలో అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోకుండా పెళ్లి ఖరారు చేసే వారు. ఇప్పుడు అమ్మాయిలు ‘ఊ’ అంటేనే పెళ్లి చూపులు, అమ్మాయికి అబ్బాయి నచ్చితేనే వివాహం. ప్రస్తుతం అంతటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అబ్బాయిలు ఆస్తి పరుడేనా, ప్రొఫెషనల్ కోర్సు చేసి ఉండాలని కోరుకుంటున్నారు. మరోవైపు అబ్బాయిలు చదువుకు తగ్గ ఉద్యోగం లేకపోవడం, ప్రైవేటు రంగాల్లో ఉపాధి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో యువకులకు పెళ్లి సంబంధాలు కష్టమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే యువకులకు పెళ్లి మరీ కష్టమవుతోంది. ఎంత ఆస్తి ఉన్నా పల్లెటూరులో తమ అమ్మాయి ఉండటం కష్టమని అమ్మాయి తల్లిదండ్రులు తెగేసి చెబుతున్నారు. ఎవరైనా అబ్బాయికి సంబంధం వస్తే అబ్బాయి ఒక్కడే ఉన్నాడా, అతనికి అక్కాచెల్లెళ్లు ఉన్నారా అంటూ విచారణ చేస్తున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో కొంత మంది సంబంధాలు చూసే పెద్దమనుషులు ఉండేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. ఎలా పోషించాలబ్బా.. అభ్యర్థులు ఎక్కువ. గవర్నమెంటు ఉద్యోగాల భర్తీ తక్కువ. సాఫ్ట్వేర్ రంగం పడిపోయింది. ప్రైవేటు సంస్థల్లో అరకొర జీతాలు. వ్యాపారం చేయాలంటే పెట్టుబడి లేకపోయే. పర్యవసానంగా జీవితంలో స్థిరపడటం గగనమైపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుని ఎలా పోషించాలని మథన పడుతున్నారు. దీంతో సమయాన్ని పొడిగించుకుంటూ పోతున్నారు. వివక్షపోతేనే పెళ్లిళ్ల కష్టాలు దూరం ఆడపిల్లలను చదివించడం, పెద్ద చేయడం, సంరక్షించడం, పెళ్లి చేయడం భారమైందని కొంత మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో చట్టవిరుద్ధమైన గర్భస్థశిశు లింగనిర్ధారణ చేయించి.. ఆడపిల్ల అయితే భ్రూణహత్యలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. యువతి, యువకుల నిష్పత్తిలో తేడాలకు ఇది ప్రథమ కారణం. 1000 మంది పురుషులకు 900 మంది స్త్రీలు ఉన్నారు. సమాజంలో మార్పులు వచ్చి స్త్రీ, పురుషుల మధ్య నిష్పత్తి సమానంగా ఉంటేనే అబ్బాయిలకు సకాలంలో పెళ్లిళ్లు అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పెరిగిన వివాహ వయసు చదువులు, ఉద్యోగాలు, జీవితం పదిలంగా ఉండాలంటూ.. యువతీ యువకులు సరైన సమయంలో పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. యువతులకు 23–25 ఏళ్ల వయసు, యువకులకు 28–30 ఏళ్ల తర్వాతనే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు ఉద్యోగం ఉన్న అబ్బాయిలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఉద్యోగాలు లేక పెళ్లిళ్లు కాక పెళ్లి కాని ప్రసాద్‌ల సంఖ్య పెరిగింది. పెళ్లికాని ప్రసాద్‌లకు పెళ్లి కావాలంటే మార్గం ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా అమ్మాయి, అబ్బాయిలు ఇష్టపడి పెళ్లి చేసుకుంటేనే వివాహాలు అవుతాయి. ప్రతి అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి ఉద్యోగం ఉండాలనే కోరికను కొంత వరకు మార్చుకుని.. ప్రస్తుత పరిస్థితికి తగ్గుట్టుగా ఆలోచిస్తే మార్పు రావచ్చు. ఇప్పటికైనా తల్లిదండ్రులు అబ్బాయి, అమ్మాయిల పెళ్లి విషయంలో సడలింపులకు తావిస్తేనే పెళ్లికాని ప్రసాద్‌లకు పెళ్లిళ్లు అవుతాయి. కుమార్తె, కుమారులు కలిగిన తల్లిదండ్రుల వైఖరి కూడా కొంత విచిత్రంగా ఉంటోంది. తమ అమ్మాయికి ఉద్యోగం ఉన్న వరుడు కావాలని కోరుకుంటారు. తమ కుమారుడికి ఉద్యోగం లేకపోయినా.. కోడలు రావాలని ఆశపడుతుంటారు. ఇలా వీరు రెండు విధాలుగా కోరుకోవడం కూడా సమస్యకు కారణమవుతోంది. -
పెరిగిపోతున్నారు.. పెళ్లికాని ప్రసాద్‌లు
నిడదవోలు : పిల్లలను ఉన్నత చదువులు చదివించి వారిని ప్రయోజకులను చేయడం వరకు బాగానే ఉన్నా.. వారికి వివాహం చేసే విషయంలో మాత్రం తల్లిదండ్రులు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా కుమారుల వివాహ విషయంలోనే ఎక్కువగా ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొడుకు పుట్టాలని తమ ఇష్ట దైవాలను పూజించడం, మొక్కులు చెల్లించడం వంటివి కొందరు తల్లిదండ్రులు చేస్తారు. కొడుకు పెరిగి పెద్దవాడైన తరువాత అతని పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేయడానికి ప్రస్తుతం తల్లిదండ్రులు వేయి దేవుళ్లకు మొక్కుతున్నారు. జీవితాంతం పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేసిన తరువాత పెళ్లి చేస్తే ఓ పనైపోతుందనుకుంటే సంబంధాలు అంత తేలిగ్గా కుదరడం లేదు. యువకుల సంఖ్యకు తగ్గట్టు యువ తులు లేకపోవడం, ఉద్యోగం వచ్చి స్థిరపడే వరకు పెళ్లి ప్రస్తావన చేయకపోవడం, అబ్బాయిల విషయంలో అమ్మాయిలు రాజీ పడకపోవడం, అమ్మాయిలు కోరుకున్నట్లు యువకులు లేకపోవడం తదితర కారణాలతో జిల్లాలో పెళ్లి కాని ప్రసాద్‌ల సంఖ్య పెరుగుతోంది. అమ్మాయిల అభిప్రాయానికే ప్రాధాన్యత గతంలో కుటుంబానికి పెద్ద దిక్కయిన తండ్రి ఎంత చెబితే అంతలా ఉండేది. అమ్మాయిలకు పెళ్లి సంబంధాలలో కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులు ఏ సంబంధం చూసినా పిల్లలు అభ్యంతరం చెప్పేవారు కాదు. అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోకుండానే పెళ్లి ముహూర్తం ఖరారు చేసేవారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అమ్మాయి ఓకే అంటేనే పెళ్లి చూపులు. అమ్మాయికి అబ్బాయి నచ్చితేనే పెళ్లి. అంటే ప్రాధాన్యత అమ్మాయికే ఎక్కువగా ఉంటోంది. అబ్బాయి ఆస్తిపరుడైనా ప్రొఫెషనల్ కోర్సు చేసి ఉండాలని.. ఉద్యోగం కూడా చేస్తూ ఉండాలని అమ్మాయిలు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే మంచి ఉద్యోగంలో స్థిరపడిన తరువాత వివాహం చేసుకోవాలనే సంకల్పం కారణంగా అబ్బాయిల వివాహాలు ఆలస్యమవుతున్నాయి. ఉన్నత చదువులు.. పెరుగుతున్న పెళ్లి వయస్సు మానవుని జీవిత చక్రంలో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత చదువుల ఆవశ్యకత ఎంతో ఉంది. చదువులు, ఉద్యోగాలు, జీవిత భద్రత అంటూ.. యువతీ, యువకులు సరైన సమయంలో పెళ్లి చేసుకోవడం లేదు. యువతులకు 23 నుంచి 25 ఏళ్లు, యువకులకు 28 నుంచి 30 ఏళ్ల తర్వాతనే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. డిగ్రీ చదివితే కనీసం ప్రైవేట్ ఉద్యోగం అయినా వస్తుందనుకుంటే నేటి రోజుల్లో ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఉన్నత చదువులు ఉంటేనే వస్తున్నాయి. ఆ చదువులు పూర్తయ్యే సరికి పెళ్లి వయస్సు మించిపోతుంది. గతంలో ఉన్నత చదువులైన మెడిసిన్, ఫార్మసీ, డెంటల్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, ఎంబీఏ, బీఎస్సీ అగ్రికల్చర్, ఎంసీఏ, సీఏ వంటి కోర్సులు కేవలం కొన్ని వర్గాలకు చెందిన వారు మాత్రమే చదివేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారు. వీరిలో అమ్మాయిలే అధికంగా కనిపిస్తున్నారు. దీంతో అమ్మాయిల చదువు పూర్తయిన తర్వాతనే మంచి ఉద్యోగం ఉన్న యువకుడితో పెళ్లికి ఒప్పుకుంటున్నారు. చాలా మంది మధ్యతరగతి అమ్మాయిలు కూడా టీచర్ ఉద్యోగానికి ఆసక్తి చూపుతున్నారు. చేసుకోబోయే యువకుడు కూడా బీఈడీ చేసినట్లయితే వాళ్లిద్దరూ ప్రైవేట్ స్కూల్స్‌లో చిన్న ఉద్యోగం చేస్తూ జీవించవచ్చుననే భావనతో అమ్మాయిలు బీఈడీ వరుడు కోసం ఎదురు చూస్తున్నారు. అబ్బాయిలు కూడా టీచర్ ఉద్యోగం చేస్తున్నా కనీసం చేసుకోబోయే అమ్మాయికి బీఈడీ ఉండాలని కోరుకుంటున్నారు. వివక్షను విడనాడాలి పూర్వ కాలంలో తల్లిదండ్రులు సంతానం విషయంలో ఆడైనా మగైనా దేవుడు వరంగా ఇచ్చిన బిడ్డలుగా భావించేవారు. తరువాత కుటుంబ నియంత్రణ అమలులోకి రావడంతో ఆర్థిక స్థోమతును కూడా దృష్టిలో పెట్టుకుని ఇద్దరు లేక ముగ్గురితో ఎక్కువ సంతానానికి ముగింపు పలికారు. ఆ తరువాత కాలంలో (రెండు దశాబ్దాల క్రితం) ఆడపిల్లలు పుడితే వారిని చదివించడం, సంరక్షించడం, పెళ్లి చేయడం వంటివి భారంగా భావించేవారు. అదే అబ్బాయిలు అయితే ఎంత ఖర్చయినా ఉన్నత చదువులు చదివిస్తే ఉద్యోగం చేసి కుటుంబానికి ఆర్థికంగా సహకరిస్తాడని, అదే విధంగా వివాహం చేస్తే వచ్చే కోడలు తెచ్చే కట్న కానుకలతో కుటుంబం ఆర్థికంగా బలపడుతుందనే ఉద్దేశంతో మగ బిడ్డే కావాలని కోరుకున్నారు. మొదటి కాన్పులో అమ్మాయి పుడితే రెండవ కాన్పులో అబ్బాయి కోసం ఎదురు చూసేవారు. అదేవిధంగా మొదటి కాన్పులో అబ్బాయి పుడితే రెండవ కాన్పులో అమ్మాయి పుడుతుందనే భావంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించునేవారు. దీంతో ఎక్కడి పడితే అక్కడ చట్ట విరుద్ధమైన గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించేవారు. ఆడ బిడ్డయితే భ్రూణ హత్యలకు పాల్ప డేవారు. నేడు యువతీ యువకుల నిష్పత్తిలో తేడాలు పెరగడానికి ఇదో కారణం. ప్రతి వెయ్యి మంది పురుషులకు 980 మంది మహిళలు మాత్రమే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. సమాజంలో మార్పులు వచ్చి స్త్రీ, పురుషుల మధ్య నిష్పత్తి సమానంగా ఉంటేనే అబ్బాయిలకు సకాలంలో వివాహాలు జరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రేక్షక పాత్రలో ప్రభుత్వం లింగ నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం పూర్తిగా నిషేధించాలి. స్కానింగ్ సెంటర్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అబ్బాయిల నిష్పత్తి ఎక్కువగా ఉండి అమ్మాయిల నిష్పత్తి తక్కువగా ఉండటంతో భవిష్యత్‌లో ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుంది. సమాజంలో మార్పులు వచ్చి స్త్రీ, పురుషుల మధ్య జనాభా నిష్పత్తి సమానంగా ఉంటేనే వివాహాలు ఆలస్యం కాకుండా జరుగుతాయి. – టీఎన్వీ సూర్యప్రకాష్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు, నిడదవోలు ఆడపిల్లలను తక్కువ చేసి చూడొద్దు తల్లిదండ్రులు ఆడపిల్లల విషయంలో తక్కువ చేసి చూడొద్దు. ఆడ పిల్లల విషయంలో వివక్ష కొనసాగితే భవిష్యత్‌లో పూర్వ రోజులు కన్యాశుల్కం వ్యవస్థ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత సమాజంలో ఆడ, మగ అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి కుటుంబంలో భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేసే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. కనుక ఆడ పిల్లలను తక్కువగా చూడకుండా మగ బిడ్డలతో పాటు సమానంగా చూడాలి. – కొండా నిర్మల, సీనియర్ సిటిజన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నిడదవోలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి ప్రస్తుత సమాజంలో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్లపై ప్రభుత్వం నిషేధం విధించినా రహస్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. కొన్ని కుటుంబాల్లో మగ బిడ్డ పుడితే వంశోధ్ధారకుడని, ఆడ బిడ్డ పుడితే మరో ఇంటికి వెళ్ళాల్సి వస్తుందని పెద్దలు, భర్త ఒత్తిడితో ఆలోచన లేకుండా ఆడ పిల్లలను వద్దనుకోవడంతో అమ్మాయిల సంఖ్య తగ్గుతోంది. ఇప్పటికే మహిళా చట్టాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. సమాజంలో ఆడ పిల్లల ప్రాధాన్యత, వారికి న్యాయస్థానాలు కల్పిస్తున్న హక్కులు, చట్టాలపై భవిష్యత్‌లో అవగాహన సదస్సులు చేపడతాం. – కారింకి సాయిబాబు, రోటరీక్లబ్ అధ్యక్షులు, నిడదవోలు -
అవివాహితకు వికటించిన అబార్షన్
సేలం: గర్భం దాల్చిన అవివాహిత విషయం ఇంట్లో తెలియకుండా నకిలీ వైద్యురాలితో అబార్షన్ చేయించుకోవడం ఆమె ప్రాణాలమీదకు తెచ్చింది. ఈ సంఘటన సేలంలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. సేలం జిల్లా ఓమలూరు సమీపం బొమ్మియంపట్టి గ్రామానికి చెందిన పెరుమాల్ కుమార్తె జీవా (19). కళాశాల విద్యార్థిని అయిన ఈమె అవివాహిత. ఇలాఉండగా జీవా ప్రియుడితో చనువుగా మెలగడంతో గర్భం దాల్చింది. ఈ విషయం కుటుంబీకులకు తెలియకుండా పది రోజుల కిందట నడుపట్టిలో నకిలీ డాక్టర్ సుల్తానా వద్దకు వెళ్లి అబార్షన్ చేయించుకుంది. అయితే, గత నెల 28న జీవాకు తీవ్రమైన కడుపునొప్పి ఏర్పడింది. దీంతో ఆమెను సేలం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ఆపరేషన్ చేసినట్టు తెలుస్తోంది. అనంతరం పరిస్థితి విషమించడంతో జీవాను 29వ తేదీ సేలం జీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 31వ తేదీ జీవా మృతి చెందింది. జీవాకు నకిలీ వైద్యురాలు అందించిన చికిత్స వికటించి మృతి చెందినట్టు సేలం హెల్త్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ వలర్మతికి సమాచారం అందింది. దీంతో ఆదివారం వలర్మతి నడుపట్టిలో ఉన్న డాక్టర్ సుల్తానా ఇంటికి వెళ్లి అకస్మిక తనిఖీలు నిర్వహించింది. తనిఖీలో సుల్తానా నకిలీ వైద్యురాలుగా తేలడంతో ఆమెను అరెస్టు చేయాలని తీవట్టిపట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సోమవారం సుల్తానాను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వ వైద్యులను ఆశ్రయించండి: సేలం హెల్త్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ వలర్మతి మీడియాతో మాట్లాడుతూ నకిలీ డాక్టర్ల వద్దకు వెళ్లి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు. -
అమ్మ ప్రేమకు ప్రతిరూపం
కొవ్వూరు రూరల్ : అమ్మ.. అంటేనే త్యాగం. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనం శాంతకుమారి. తనకు ఎంతో ఇష్టమయిన పిన్నికూతురు (వరుసకు అక్క) ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఆమెకున్న ఇద్దరు పిల్లలూ అనాథలుగా మిగిలారు. అంతే క్షణం ఆలోచించకుండా ఆమె వారిని అక్కున చేర్చుకుంది. సమాజం ఏమనుకున్నా ఫర్వాలేదనుకుని.. పెళ్లి కాకుండానే తల్లిగా మారింది. ‘అమ్మ’.. అన్న ఆ పిల్లల పిలుపులోనే సంతోషాన్ని వెతుక్కుంటూ 16 ఏళ్లు గడిపేసింది. పిల్లలే సర్వస్వంగా జీవిస్తోన్న ఆ మహిళ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నా పేరు నేతుల శాంతకుమారి. మాది కొవ్వూరు మండలం మద్దూరు. నేను ప్రస్తుతం గ్రామంలోనే అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నాను. మా తల్లిదండ్రులు నేతుల రూతమ్మ, గమరిఏలు. నాన్న దైవసేవ చేసేవారు. ఈ క్రమంలో మా పిన్ని కూతురు రాణికి మద్దూరులోనే సంబంధం చూసి అమ్మా నాన్న పెళ్లి చేశారు. వారి సంసారం సుమారు ఐదేళ్లు సాఫీగానే సాగింది. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. కొన్ని కారణాలతో మా అక్క రాణి 16 ఏళ్ల క్రితం కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పటికి వారి పిల్లలు దివ్యతేజకు మూడేళ్లు, రాజబాబుకు 6 నెలలు. తండ్రి పిల్లలను పట్టించుకోలేదు. అప్పటికి సమారు నాకు 22 ఏళ్లు. అక్క రాణి నాతో చాలా బాగా ఉండేది. ఇద్దరం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లం. ఆ ప్రేమతోనే నేను అక్క పిల్లలను చేరదీశాను. అప్పుడే అంగన్వాడీలో టీచర్ ఉద్యోగం వచ్చింది. దాంతో ఆ పిల్లలే జీవితం అనుకున్నాను. ఈ క్రమంలో పెళ్లి ప్రసక్తి పక్కన బెట్టాను. ఇంట్లో ఎవరూ వత్తిడి చేయకపోయినా, బంధువులు, స్నేహితులు పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. అయినా నేను పిల్లలే లోకం అనుకున్నాను. ఇప్పుడు రాజబాబుకు 17 ఏళ్లు. మద్దూరు హైస్కూలులో 10వ తరగతి చదువుతున్నాడు. కూతురు దివ్యతేజ 10వ తరగతి వరకూ చదివి ఆపేసింది. వాళ్లే నా సర్వస్వం.. నాకు వాళ్లను చూస్తుంటే నా పిల్లలుగానే అనిపిస్తారు. వాళ్లూ అలానే ఉంటారు. అందుకే ఎప్పుడూ పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని త్యాగం చేశానని అనిపించదు. కంటేనే తల్లి అనుకుంటే ఎలా.. మనసు ఉంటే ఎవరైనా మన పిల్లలే.. నా శక్తి మేరకు వాళ్ల కోసం ఇంకా కష్టపడతాను.’ -
అక్కడ పెళ్లికాని ప్రసాదులు లక్షల్లో..
గుజరాత్లో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆ రాష్ట్రంలో ముఖ్యంగా సౌరాష్ట్ర ప్రాంతంలో గ్రామీణులను, వ్యవసాయదారులను పెళ్లి చేసుకోవడానికి మహిళలు నిరాకరిస్తున్నారు. గుజరాత్లో 25-34 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారిలో ప్రతి ఇద్దరు అవివాహితులకు, ఏడుగురు పెళ్లికాని యువకులు ఉన్నారు. 25 ఏళ్లకు పైబడిన వారిలో మొత్తం 17.75 లక్షల మంది పెళ్లికాని యువతీయువకులు ఉన్నారు. మగపిల్లలతో పోలిస్తే బాలికల సంఖ్య తగ్గిపోతుండటమే ఈ సమస్యకు కారణం. 1981లో ప్రతి 1000 మంది బాలురుకు 947 మంది బాలికలు ఉండేవారు. అదే 2011 నాటికి బాలికల నిష్పత్తి 886కి తగ్గింది. ఇక గుజరాత్లో పోర్బందర్ ప్రాంతంలోనే పెళ్లికాని యువకుల సంఖ్య ఎక్కువగా ఉంది. చాలా కులాల్లో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఉన్నత విద్యావంతులుకావడంతో, చదువులేని యువకులను పెళ్లిచేసుకునేందుకు నిరాకరిస్తున్నారు. గత దశాబ్దకాలంలో లేట్ మ్యారేజీలు ఎక్కువగా జరుగుతున్నాయి. పోరబందర్ ప్రాంతానికి చెందిన రమేష్ పటేల్‌కు 34 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లికాలేదు. ఓ పెళ్లి సంబంధం చూస్తే పోర్బందర్కు మారాలని పెళ్లికూతురు తరఫువారు షరతు పెట్టారని, తాను తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకుని కావడంతో వ్యవసాయంతో పాటు తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత తనపై ఉందని, ఊరు విడిచి వెళ్లేందుకు నిరాకరించడంతో తనను వివాహం చేసుకునేందుకు ఆ అమ్మాయి నిరాకరించిందని రమేష్ చెప్పాడు. గుజరాత్లో రమేష్ లాంటి పెళ్లికాని యువకులు లక్షలాదిమంది ఉన్నారు. -
వివాహిత ఆత్మహత్య
æ హాలియా: మండలంలోని రంగుండ్ల గ్రామంలో పెళ్లైన ఆరునెలలకే యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఆంగోతు అనిత(18) శనివారం మధ్యాహ్నం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు చూసి కుటుంబ సభ్యులకు తెలపడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పెద్దవూర మండలం కుంకుడుచెట్టు గ్రామానికి చెందిన అనితకు రంగుండ్లకు చెందిన ఆంగోతు శంకర్‌తో ఆరు నెలల క్రితమే వివాహమైంది. నెల క్రితమే ఇరువురి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో పెద్దమనుషుల మధ్య పంచాయితీ కూడా చేసినట్లు తెలిసింది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. -
పెరుగుతున్న పెళ్లి కాని ప్రసాద్‌ల సంఖ్య