
చండీఘడ్: హర్యానా ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెళ్లి కాని యువతీ యువకుల కోసం ప్రత్యేక పెన్షన్ స్కీమ్‌ను ప్లాన్ చేసింది. హర్యానాలో వివాహం చేసుకోని వారికి ప్రతీ నెలా రూ.2,750లను పెన్షన్‌గా ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది.
వివరాల ప్రకారం.. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గురువారం కీలక ప్రకటన చేశారు. హర్యానాలో పెళ్లి కాని ఆడవాళ్లకు, మగవాళ్లకు ప్రతి నెలా రూ.2,750 ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే, ఈ స్కీమ్ 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి మాత్రమే వర్తించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. అవివాహిత పెన్షన్ అందుకునేవారి వార్షిక ఆదాయం రూ.1.80 లక్షలకు తక్కువగా ఉండాలని ప్రభుత్వం రూల్ పెట్టింది.
మరోవైపు.. హర్యానాలో వితంతవులను కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వితంతువులకు కూడా పెన్షన్‌ను అందించనున్నట్టు సీఎం ఖట్టర్ ప్రకటించారు. 40 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వితంతువులకు ప్రతినెలా రూ.2750 ఇవ్వనున్నట్టు తెలిపారు. అయితే వాళ్ల వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలనే నిబంధనను విధించారు.
मैं घोषणा करता हूं कि हरियाणा के 45 से 60 वर्ष तक की आयु वाले अविवाहित पुरुष व महिलाओं को अब से ₹2,750 मासिक पेंशन दी जाएगी।
— Manohar Lal (@mlkhattar) July 6, 2023
₹1.80 लाख से कम वार्षिक आय वाले व्यक्तियों को इस पेंशन का लाभ मिलेगा।
इसके अलावा 40-60 वर्ष आयु तक के विधुर पुरुष, जिनकी वार्षिक आय ₹3 लाख से कम है… pic.twitter.com/Jwn5fO5sWp
ఇది కూడా చదవండి: మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు.. ఎంపీ ఎన్నిక రద్దు..
Comments
Please login to add a commentAdd a comment