pension scheme
-
NPS-Vatsalya: వారసులపై వాత్సల్యం
ఉద్యోగంలో చేరిన వెంటనే ప్రతి ఒక్కరూ ముందుగా చేయాల్సిన పని, విశ్రాంత జీవనానికి మెరుగైన ప్రణాళిక రూపొందించుకోవడం. ప్రభుత్వరంగ ఉద్యోగులకు పింఛను భరోసా ఉంటుంది. కానీ, ప్రైవేటు రంగ ఉద్యోగులు, స్వయం ఉపాధిలో ఉన్న వారు తామే స్వయంగా ఇందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. ఉద్యోగం వచి్చన కొత్తలో రిటైర్మెంట్ గురించి తర్వాత చూద్దాంలే.. అని వాయిదా వేసే వారే ఎక్కువ. వివాహం, తర్వాత సంతానంతో విశ్రాంత జీవనం ప్రాధాన్యలేమిగా మారిపోతుంది. పిల్లలను గొప్పగా చదివించడమే అన్నింటికంటే ముఖ్య లక్ష్యంగా సాగిపోతుంటారు. దీనివల్ల అంతిమంగా విశ్రాంత జీవనంలో ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ తరహా నిర్లక్ష్యం రేపు తమ పిల్లలు చేయకూడదని భావించే తల్లిదండ్రులు.. వారి పేరుతో ఇప్పుడే ఓ పింఛను ఖాతా తెరిచేస్తే సరి. అందుకు వీలు కలి్పంచేదే ఎన్పీఎస్ వాత్సల్య. బడ్జెట్లో ప్రకటించిన ఈ కొత్త పథకాన్ని తాజాగా కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించిన నేపథ్యంలో దీనిపై అవగాహన కలి్పంచే కథనమిది... తల్లిదండ్రులు ఎవరైనా సరే తమ పిల్లల భవిష్యత్ మెరుగ్గా ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడూ వారి గురించే ఆలోచిస్తుంటారు. కానీ, భవిష్యత్‌లో వారు ఎలా స్థిరపడతారో ముందుగా ఊహించడం కష్టం. అందుకని వారి పేరుతో ఎన్పీఎస్ వాత్సల్య ఖాతా తెరవడం ఒక మంచి ఆలోచనే అవుతుంది. ఇది పొదుపు, పెట్టుబడుల ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. ఆరి్థక క్రమశిక్షణను నేర్పుతుంది. 18 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులు చేసిన పెట్టుబడితో ఏర్పడిన నిధిని చూసిన తర్వాత, రిటైర్మెంట్ లక్ష్యాన్ని పిల్లలు సులభంగా అర్థం చేసుకుంటారు. వారు ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ ఖాతాను కొనసాగించుకున్నట్టు అయితే, రిటైర్మెంట్ నాటికి భారీ సంపదను పోగు చేసుకోవచ్చు. 50–60 ఏళ్ల కాలం పాటు పెట్టుబడులకు ఉంటుంది కనుక కాంపౌండింగ్ ప్రయోజనంతో ఊహించనంత పెద్ద నిధి సమకూరుతుంది. వాత్సల్య ఎవరికి? 2024–25 బడ్జెట్లో పిల్లల కోసం పింఛను పథకం ‘ఎన్పీఎస్ వాత్సల్య’ను ఆరి్థక మంత్రి సీతారామన్ ప్రకటించారు. దీన్ని సెపె్టంబర్ 18 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. తమ పిల్లల పేరిట పింఛను ఖాతా తెరిచి, ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఎన్పీఎస్ వాత్సల్య వీలు కలి్పస్తుంది. తాము ఎంతగానో ప్రేమించే తమ పిల్లల భవిష్యత్‌కు బలమైన బాట వేసేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. పిల్లలకు తల్లిదండ్రులు సహజ సంరక్షకులు (గార్డియన్). వారు లేనప్పుడు చట్టబద్ధ సంరక్షకులు పిల్లల పేరిట ఖాతా ప్రారంభించొచ్చు. పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఎన్పీఎస్ టైర్–1 (అందరు పౌరులు)గా ఇది మారిపోతుంది. సాధారణ ఎన్పీఎస్ ఖాతాలోని అన్ని ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. మేజర్ అయిన తర్వాత మూడు నెలల్లోపు తిరిగి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. పన్ను ప్రయోజనాలు పన్ను ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ, ఎన్పీఎస్కు ప్రస్తుతం ఉన్న పలు రకాల పన్ను ప్రయోజనాలను వాటి గరిష్ట పరిమితికి మించకుండా తమ పేరు, తమ పిల్లల పేరుపై పెట్టుబడులకు ఉపయోగించుకోవచ్చు.సంరక్షకుల హక్కుఖాతాదారు (మైనర్) మరణించిన సందర్భంలో అప్పటి వరకు సమకూరిన నిధిని తిరిగి తల్లిదండ్రి లేదా సంరక్షకులకు ఇచ్చేస్తారు. తల్లిదండ్రుల్లో ఒకరు మరణించిన సందర్భంలో మరొకరు కేవైసీ పూర్తి చేసి పెట్టుబడి కొనసాగించొచ్చు. తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన సందర్భంలో మైనర్‌కు 18 ఏళ్లు నిండేంత వరకు చట్టబద్ధమైన సంరక్షకులు ఎలాంటి చందా చెల్లించకుండానే ఖాతాని కొనసాగించొచ్చు.ఉపసంహరణ వాత్సల్యకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ అమలవుతుంది. అంటే ప్రారంభించిన మూడేళ్లలోపు పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి అనుమతించరు. ఆ తర్వాత నుంచి సమకూరిన నిధిలో 25 శాతాన్ని విద్య, అనారోగ్యం తదితర నిర్ధేశిత అవసరాలకు వెనక్కి తీసుకోవచ్చు. ఎక్కడ ప్రారంభించాలి? ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాను నేరుగా ఈ–ఎన్పీఎస్ పోర్టల్ ద్వారా ప్రారంభించుకోవచ్చు. లేదా పోస్టాఫీస్, ప్రముఖ బ్యాంక్ శాఖలకు వెళ్లి తెరవొచ్చు. ప్రభుత్వరంగంలోని కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పీఎన్బీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు ప్రైవేటు రంంలోని ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు ఎన్పీఎస్ వాత్సల్యను ఆఫర్ చేస్తున్నాయి. అలాగే ఆన్లైన్లో ప్రొటీన్ ఈ–గవ్ టెక్నాలజీస్, కేఫిన్‌టెక్, క్యామ్స్ ఎన్పీఎస్ ప్లాట్‌ఫామ్‌ల సాయంతోనూ ప్రారంభించొచ్చు. వైదొలగడం పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ పథకం కొనసాగించుకోవచ్చు. లేదా వైదొలిగే అవకాశం కూడా ఉంది. ఒకవేళ తప్పుకోవాలని భావించేట్టు అయితే ఇక్కడ రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి. అప్పటి వరకు సమకూరిన నిధి రూ.2.5 లక్షలకు మించకపోతే, మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. రూ.2.5 లక్షలకు మించి ఉంటే అందులో 20 శాతమే వెనక్కి తీసుకోగలరు. మిగిలిన 80 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లు ఎన్పీఎస్ వాత్సల్య ప్రారంభానికి వీలుగా పిల్లలకు సంబంధించి పుట్టిన తేదీ ధ్రువపత్రం అది లేకపోతే స్కూల్ లీవింగ్ సరి్టఫికెట్/ఎస్ఎస్సీ/పాన్ వీటిల్లో ఏదో ఒకటి ఇవ్వాలి. ప్రారంభించే పేరెంట్ (తల్లి లేదా తండ్రి) లేదా గార్డియన్‌కు సంబంధించి ఆధార్, పాన్ కాపీ, బ్యాంక్ ఖాతా వివరాలు అవసరం అవుతాయి. ఎన్ఆర్ఐ/ఓసీఐ అయితే ఖాతా తెరిచే పిల్లల పేరిట ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్వో ఖాతా కలిగి ఉండాలి. ఎన్ఆర్ఐ పాస్‌పోర్ట్ కాపీ, ఓసీఐ విదేశీ చిరునామా కాపీలను సమర్పించాలి. అర్హతలు 18 ఏళ్లలోపు పిల్లల పేరిట భారత పౌరులు లేదా నాన్ రెసిడెంట్ ఇండియన్ (ఎన్ఆర్ఐ), ఓవర్సీస్ సిటిజన్íÙప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) ఈ ఖాతా తెరిచేందుకు అర్హులు. ఏటా కనీసం రూ.1,000 ఇన్వెస్ట్ చేయాలి. గరిష్ట పరిమితి లేదు. సంరక్షకులు ఇన్వెస్ట్ చేసినప్పటికీ ఈ ఖాతా లబ్దిదారు మైనరే అవుతారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో ఈ పథకం కొనసాగుతుంది. మైనర్ పేరిట పెన్షన్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (పీఆర్ఏఎన్/ప్రాన్)ను పీఎఫ్ఆర్డీఏ కేటాయిస్తుంది. పెట్టుబడుల ఆప్షన్లు యాక్టివ్ చాయిస్: ఈ విధానంలో 50 ఏళ్ల వయసు వరకు ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతం కేటాయింపులు చేసుకోవచ్చు. కార్పొరేట్ డెట్‌కు 100 శాతం, ప్రభుత్వ సెక్యూరిటీలకు 100 శాతం, ఆల్టర్నేట్ అసెట్ క్లాస్‌కు 5 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. 75 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకుంటే.. 50 ఏళ్ల వయసు దాటిన క్రమంగా 60 ఏళ్ల నాటికి ఈక్విటీ కేటాయింపులు 50 శాతానికి తగ్గి, డెట్ కేటాయింపులు 50 శాతంగా మారుతాయి. ఆటో చాయిస్: ఏ విభాగానికి ఎంత మేర కేటాయింపులు చేసుకోవాలన్న అవగాహన లేకపోతే ఆటో చాయిస్ ఎంపిక చేసుకోవచ్చు. ఈ విధానంలో లైఫ్ సైకిల్ ఫండ్ (ఎల్సీ)–75, ఎల్సీ–50, ఎల్సీ–25 అని మూడు ఆప్షన్లు ఉన్నాయి. ఎల్సీ–75లో 35 ఏళ్ల వయసు వరకే 75 శాతం ఈక్విటీలకు కేటాయింపులు వెళతాయి. ఆ తర్వాత నుంచి ఏటా ఈక్విటీలకు తగ్గుతూ, డెట్‌కు పెరుగుతాయి. ఎల్సీ–50 కింద ఈక్విటీలకు 35 ఏళ్ల వయసు వచ్చే వరకే 50 శాతం కేటాయింపులు చేసుకోగలరు. ఆ తర్వాత క్రమంగా ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతూ వెళతాయి. ఎల్సీ–25లో 35 ఏళ్ల వరకే ఈక్విటీలకు 25 శాతం కేటాయింపులు వెళతాయి. ఆ తర్వాత నుంచి క్రమంగా డెట్‌కు కేటాయింపులు పెరుగుతాయి. డిఫాల్ట్ చాయిస్: పైన చెప్పుకున్న ఎల్సీ–50 ప్రకారం ఈ విధానంలో పెట్టుబడుల కేటాయింపులు చేస్తారు.చిన్న మొత్తమే అయినా.. పెట్టుబడులకు ఎంత ఎక్కువ కాల వ్యవధి ఉంటే, అంత గొప్పగా కాంపౌండింగ్ అవుతుంది. వడ్డీపై, వడ్డీ (చక్రవడ్డీ) తోడవుతుంది. ఒక ఉదాహరణ ప్రకారం.. శిశువు జన్మించిన వెంటనే ఖాతా తెరిచి ఏటా రూ.10,000 చొప్పున 18 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మొత్తం పెట్టుబడి రూ.1.8 లక్షలు అవుతుంది. 10 శాతం రాబడుల రేటు ఆధారంగా 18 ఏళ్లు పూర్తయ్యే నాటికి ఈ మొత్తం రూ.5లక్షలుగా మారుతుంది. ఇదే నిధి ఏటా 10 శాతం చొప్పున కాంపౌండ్ అవుతూ వెళితే 60 ఏళ్లు ముగిసే నాటికి రూ.2.75 కోట్లు సమకూరుతుంది. ఒకవేళ రాబడుల రేటు 11.59 శాతం మేర ఉంటే రూ.5.97 కోట్లు, 12.86 శాతం రాబడులు వస్తే రూ.11.05 కోట్లు సమకూరుతుంది. కేవలం రూ.10వేల వార్షిక పొదుపు రూ.కోట్లుగా మారుతుంది. ఈ ఉదాహరణను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, చండీగఢ్ జారీ చేసింది. మరొక ఉదాహరణ చూద్దాం. ప్రతి నెలా రూ.5,000 చొప్పున శిశువు జని్మంచిన నాటి నుంచి ఇన్వెస్ట్ చేస్తూ.. వారు ఉద్యోగంలో చేరేంత వరకు.. ఆ తర్వాత పిల్లలు కూడా అంతే మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళితే 10 శాతం రాబడి అంచనా ప్రకారం 60ఏళ్లకు (రిటైర్మెంట్ నాటికి) సుమారు రూ.19 కోట్లు సమకూరుతుంది. ఇదే రూ.5,000 పెట్టుబడిని మొదటి నుంచి ఏటా 10 శాతం చొప్పున పెంచుతూ వెళితే 60 ఏళ్లకు రూ.100 కోట్ల నిధి ఏర్పడుతుంది. ఇది కాంపౌండింగ్ మహిమ. ఈ తరహా దీర్ఘకాలిక పెట్టుబడుల పథకాన్ని, పిల్లలకు ఫించను బహుమానాన్ని ఇవ్వడం మంచి నిర్ణయమే అవుతుంది. ‘‘ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ విభాగం 14 శాతం, కార్పొరేట్ డెట్ విభాగం 9.1 శాతం, జీ–సెక్ విభాగం 8.8 శాతం చొప్పున వార్షిక రాబడులు అందించింది. ఎన్పీఎస్ వాత్సల్య దీర్ఘకాల పెట్టుబడి. కనుక క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అనుసరించాలి. మీ పిల్లల భవిష్యత్ ఆరి్థక భద్రతపై దృష్టి సారించాలి’’అని స్వయానా ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. దీర్ఘకాలంలో ఈక్విటీలకు గరిష్ట కేటాయింపులతో కూడిన ఆప్షన్లో రాబడి 10 శాతం ఉంటుందని ఆశించొచ్చు. ఆన్లైన్లో ఎలా ప్రారంభించుకోవచ్చు? → ఈఎన్పీఎస్ పోర్టల్‌కు వెళ్లాలి. హోమ్‌పేజీ పైన మెనూలో కనిపించే ఆప్షన్లలో ‘ఎన్పీఎస్ వాత్సల్య (మైనర్స్) రిజిస్ట్రేషన్’ను ఎంపిక చేసుకోవాలి. → ఇక్కడ మైనర్, గార్డియన్ వివరాలు అన్నింటినీ నమోదు చేయాలి. కావాల్సిన డాక్యుమెంట్ కాపీలను అప్లోడ్ చేసి ‘కన్ఫర్మ్’ చేయాలి. → మొదట గార్డియన్ పుట్టిన తేదీ వివరాలు, పాన్ నంబర్, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ వివరాలు ఇచ్చి ‘బిగిన్ రిజి్రస్టేషన్’ను క్లిక్ చేయాలి. → మొబైల్, ఈమెయిల్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అక్నాలెడ్జ్మెంట్ నంబర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అప్పుడు ‘కంటిన్యూ’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. → ఆన్లైన్లో ఖాతా తెరిచే వారు (తల్లి/తండ్రి/సంరక్షకులు) తెల్ల పేపర్‌పై సంతకం చేసి దాన్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఇతర డాక్యుమెంట్లతోపాటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. → ఆరంభ చందా రూ.1,000 చెల్లించాలి. దీంతో ప్రాన్ జారీ అవుతుంది. మైనర్ పేరిట ఎన్పీఎస్ వాత్సల్య ఖాతా ప్రారంభం అవుతుంది. –సాక్షి, బిజినెస్‌డెస్క్ -
పిల్లలకూ పెన్షన్!
న్యూఢిల్లీ: పిల్లల పేరిట పింఛను పథకం ప్రారంభించి, ఇన్వెస్ట్ చేయడానికి వీలుగా ‘ఎన్పీఎస్ వాత్సల్య’ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ పథకాన్ని 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ఎన్పీఎస్ పథకం మెరుగైన రాబడులను అందిస్తోందని, భవిష్యత్ ఆదాయం కోసం ఇందులో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కలి్పస్తున్నట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ విభాగంలో 14 శాతం, కార్పొరేట్ డెట్‌లో 9.1 శాతం, జీ–సెక్లలో 8.8 శాతం చొప్పున రాబడులు ఉన్నట్టు వివరించారు. ‘పీఎం వాత్సల్య పథకాన్ని అమలు చేసే క్రమంలో దీన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటాం’అని ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ సరీ్వసెస్ విభాగం కార్యదర్శి నాగరాజు మద్దిరాల తెలిపారు. ఎవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు..? ఆన్లైన్లో లేదంటే ఆఫ్‌లైన్‌లో బ్యాంక్ శాఖ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి రూ.1,000తో ఎన్పీఎస్ వాత్సల్య పథకం ప్రారంభించొచ్చు. ఆ తర్వాత నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు పిల్లల పేరుమీద ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన వెంటనే వారి పేరు మీద రెగ్యులర్ ఎన్పీఎస్ ఖాతాగా అది మారుతుంది. వారికి 60 ఏళ్లు నిండే వరకు కొనసాగుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇప్పటికే ఎన్పీఎస్ వాత్సల్య ప్రారంభించేందుకు పీఎఫ్ఆర్డీఏతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ముంబైలో ఈ పథకాన్ని ప్రారంభించి, కొందరు పిల్లలను పేరిట ఖాతాలు తెరిపించింది. పిల్లల పేరిట ఈ ఖాతాను ప్రారంభించడం ద్వారా వారి భవిష్యత్తుకు తల్లిదండ్రులు భరోసా కల్పించినట్టు అవుతుంది. పెట్టుబడి దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రభావంతో మంచి సంపదగా మారుతుంది. -
అది నేనే.. ఇదీ నేనే
యూపీఎస్‌ను మేం వ్యతిరేకిస్తున్నాంకేంద్రం తెచ్చిన యూపీఎస్‌ను మేం వ్యతిరేకిస్తున్నాం. ఇది ఉద్యోగులకు నష్టదాయకం. ఉద్యోగుల సంపదంతా ప్రభుత్వానికి పుణ్యానికి ఇవ్వడమే. ఉద్యోగి నుంచి ఎలాంటి మొత్తం మినహాయించకుండా పెన్షన్ అందించాలి. ప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పాత పింఛన్ విధానాన్నే అమలు చేయాలి. – ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘంముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి ఉద్యోగుల మేలు కోసం గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)ను తెస్తే ఆయన గగ్గోలు పెట్టారు. దీనివల్ల ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతింటాయని గుండెలు బాదుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం.. వైఎస్ జగన్ ప్రభుత్వం తరహాలోనే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)ను తెస్తే బాబు కిమ్మనడం లేదు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ తరఫున ఇద్దరు మంత్రులు ఉన్నా తనపై ఉన్న కేసులకు భయపడి యూపీఎస్‌ను వ్యతి రేకించే సాహసం చంద్రబాబు చేయడం లేదు. దీంతో ఆయన వైఖరిపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఉద్యోగులను నిలువెల్లా మోసం చేయడమే బాబు ఉద్దేశమని నిప్పులు చెరుగుతున్నారు.సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగుల పింఛన్ విషయంలో సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరిపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం మెరుగైన పింఛన్ వచ్చేలా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) తెస్తే చంద్రబాబు వ్యతిరేకించారని గుర్తు చేస్తున్నారు. జీపీఎస్ విధానంతో ఉద్యోగులకు నష్టం జరుగుతుందని.. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుతోపాటు కూటమి నేతలు ప్రచారం చేశారని ఉద్యోగుల సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ సంయక్తంగా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొస్తామని హామీ ఇచ్చారని పేర్కొంటున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్‌ను వ్యతిరేకించిన చంద్రబాబు తాను భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) పేరుతో జీపీఎస్ తరహాలోనే తెచ్చినా నోరుమెదపకపోవడంపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది ఆయన రెండు కళ్ల సిద్ధాంతానికి అద్దం పడుతోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీపీఎస్ తరహాలోనే యూపీఎస్‌ను తెచ్చినా.. దాదాపు జీపీఎస్ తరహాలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం యూపీఎస్‌ను తెచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అయినప్పటికీ కేంద్ర మంత్రిమండలిలో ఇద్దరు టీడీపీ సభ్యులు ఉన్నా చంద్రబాబు వ్యతిరేకించకపోవడంపై మండిపడుతున్నారు. ఇది చంద్రబాబు, కూటమి నేతలు సీపీఎస్ ఉద్యోగులను మోసం చేయడమేనని సీపీఎస్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీపీఎస్ వల్ల ఉద్యోగులకు నష్టం జరుగుతుందని ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కేంద్రం తీసుకువచ్చిన యూపీఎస్ వల్ల కూడా అంతే నష్టం జరుగుతున్నా నోరు విప్పకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగులను దగా చేయడమే ఆయన ఉద్దేశమని దుయ్యబడుతున్నారు. బయటపడ్డ చంద్రబాబు మోసపూరిత నైజం.. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని సమీక్షించకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు జూలై 12న జీపీఎస్ అమలుకు ఆర్థిక శాఖ ద్వారా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయించారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు మెరుగైన విధానంపై ఉద్యోగ సంఘాలతో చర్చించలేదని ధ్వజమెత్తుతున్నారు. జీపీఎస్ అమలు కోసం గెజిట్ విడుదల చేయించడంతోనే చంద్రబాబు మోసపూరిత నైజం బయటపడిందని నిప్పులు చెరుగుతున్నారు. గెజిట్ విడుదల విషయం మీడియాలో రావడంతో ‘చంద్రబాబు ఆగ్రహం’ అంటూ ఎల్లో మీడియాలో కథనాలు వచ్చాయని, గెజిట్ అమలు నిలిపేయాలని ఆదేశించారంటూ కూడా కథనాలు అచ్చేశాయని గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు గెజిట్ నిలుపుదల ఉత్తర్వులే జారీ కాలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బాబు ఆగ్రహమనేది ఉత్తి మాటేననేది.. గెజిట్ నిలుపుదల చేయకపోవడంతోనే అర్థమైందని మండిపడుతున్నారు. ఇప్పుడు మరోసారి కేంద్రం తెచ్చిన యూపీఎస్‌ను చంద్రబాబు, కూటమి నేతలు వ్యతిరేకించకపోవడంతో ఆ నేతల అసలు స్వరూపం బయటపడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీపీఎస్ అమలుకు గెజిట్ జారీ చేయించడంతో పాటు ఇప్పుడు కేంద్రం తెచ్చిన యూపీఎస్‌ను చంద్రబాబు వ్యతిరేకించలేదంటే సీపీఎస్ ఉద్యోగులను నిలువునా మోసం చేయడమేనని నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల ముందో మాట.. ఎన్నికల తర్వాత మరో మాట చెప్పడంలో చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందని ధ్వజమెత్తుతున్నారు. కేంద్రం యూపీఎస్ తెస్తే కనీసం మాట్లాడకపోవడం కూటమి నేతల ద్వంద్వ వైఖరికి అర్థం పడుతోందని సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. పెన్షన్ భిక్ష కాదు.. ప్రాథమిక హక్కు..తాజాగా కేంద్రం తెచ్చిన యూపీఎస్.. ఉద్యోగులను పూర్తిగా ముంచే స్కీమ్. చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగి నుంచి ఎలాంటి మొత్తం మినహాయించకుండా పింఛన్ పథకాన్ని అందించాలి. పెన్షన్ భిక్ష కాదు.. ప్లాన్లతో వచ్చే డబ్బు కాదు. ఇది ఉద్యోగి ప్రాథమిక హక్కు. ఉద్యోగుల ఆకాంక్షలకు సోమనాథన్ కమిటీ పూర్తిగా వ్యతిరేకం. ఇప్పుడున్న ఎన్పీఎస్ పథకంలో రిటైరయ్యాక వచ్చే 60 శాతం మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కంటే 5 రెట్లు ఎక్కువ వస్తుంది. ఎలాంటి ప్లాన్లతో సంబంధం లేకుండా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. 35, 40 ఏళ్ల పాటు ఉద్యోగి సర్వీసులో బేసిక్ పే, డీఏలో పది శాతం నొక్కేసి.. మ్యాచింగ్ గ్రాంట్ అంటూ దానికి కొంత పోగేసి, చివర్లో రిటైరయ్యాక మొత్తం కార్పస్ ఫండ్‌ను మింగేసే కుట్రే యూపీఎస్. ఉద్యోగుల పెన్షన్ సొమ్మును షేర్ మార్కెట్లో పెట్టడం ఎవరి ప్రయోజనాల కోసం?. – సీఎ దాస్, ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుయూపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాంప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పాత పింఛన్ విధానాన్నే అమలు చేయాలి. తాజాగా కేంద్రం తెచ్చిన యూపీఎస్‌లో ప్రాన్ ఎమౌంట్ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకుని 50 శాతం పింఛన్‌ను డీఆర్తో కలిపి ఇస్తారా? లేక ప్రస్తుత పింఛన్ పథకంలో ఉన్నట్లు 60 శాతం ప్రాన్ అమౌంట్ ఇస్తారా? అనేది తేల్చాలి. అలాగే యూపీఎస్ పెన్షన్‌ను ఏ విధంగా, ఎవరి ద్వారా చెల్లిస్తారనేదానిపైనా స్పష్టత ఇవ్వాలి. సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగికి కుటుంబ పింఛన్ 60 శాతం చెల్లిస్తారా? స్వచ్ఛంద పదవీ విరమణ విషయంలో కనీస సర్వీస్ ఎంతగా నిర్ణయిస్తారు? రిటైర్ అయ్యాక అప్పటివరకు ఉద్యోగి చెల్లించిన మొత్తం తిరిగి ఉద్యోగికి చెల్లిస్తారా? లేకపోతే యూపీఎస్, లంప్సమ్ ఎమౌంట్తో సరిపెడతారా? వీటన్నింటిపైనా స్పష్టత ఇవ్వాలి. – కె.సతీష్, ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకుడు -
మోదీ గుడ్ న్యూస్.. ఇకపై వారందరికి ఫుల్ పెన్షన్!
-
పెన్షన్ ఫండ్స్‌కు పన్ను ప్రయోజనాలు
పెన్షన్ సదుపాయంతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ పథకాలు, డెట్ ఫండ్స్ విషయంలో పన్ను ప్రయోజనాలు కలి్పంచాలంటూ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది. బడ్జెట్‌కు ముందు తమ డిమాండ్లను ఆర్థిక మంత్రికి దృష్టికి తీసుకెళ్లింది. జాతీయ పింఛను పథకం(ఎన్పీఎస్)లో పెట్టుబడులకు సెక్షన్ 80సీసీడీ కింద కలి్పస్తున్న పన్ను మినహాయింపును పెన్షన్ ప్రయోజనంతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ (మ్యూచువల్ ఫండ్స్ లింక్డ్ రిటైర్మెంట్ స్కీమ్స్)కు సైతం అమలు చేయాలని కోరింది. అలాగే, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మూడేళ్లు, అంతకుమించిన పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పుడు.. వచి్చన లాభంపై డిబెంచర్లకు మాదిరే ఫ్లాట్ 10% పన్నును, ద్రవ్యోల్బణం మినహాయింపు ప్రయోజనం లేకుండా అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈక్విటీల్లో 35% వరకు పెట్టుబడులు పెట్టే డెట్ ఫండ్స్‌కు గతేడాది విధించిన స్వల్పకాల మూలధన లాభాల పన్నును తిరిగి పరిశీలించాలని కోరింది. బాండ్లలో పెట్టుబడులకు ప్రోత్సాహం డెట్ ఫండ్స్ ద్వారా బాండ్లలో పెట్టుబడులకు రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించాలని కూడా ఆర్థిక మంత్రిని యాంఫి కోరింది. డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలకు మాదిరే పన్ను రేట్లు అమలు చేయాలని, ఇందుకు ఫైనాన్స్ యాక్ట్, 2023లోని సెక్షన్ 50ఏఏను సవరించాలని వినతిపత్రంలో పేర్కొంది. స్టార్టప్‌లపై ఏంజెల్ ట్యాక్స్ ఎత్తేయాలి.. స్టార్టప్‌లపై ఏంజెల్ ట్యాక్స్ ఎత్తివేయాలంటూ పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కేంద్ర ఆర్థిక శాఖకు సూచించింది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో లిస్ట్ కాని స్టార్టప్‌లు జారీ చేసే షేర్ల విలువ మదింపునకు గాను డీపీఐఐటీ గతేడాది సెప్టెంబర్‌లో కొత్త నిబంధనలు తీసుకొచి్చంది. పారదర్శక మార్కెట్ విలువ కంటే అధిక ధరపై షేర్లు జారీ చేసే స్టార్టప్‌లు ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని తొలగిస్తే స్టార్టప్‌లను ప్రోత్సహించినట్టు అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
‘బురిడీ’బాబులు.. అంతా మాయ
ఆంధ్రప్రదేశ్‌లో గత శాసనసభ ఎన్నికలలో మెజార్టీ ప్రభుత్వ ఉద్యోగులు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారన్న అభిప్రాయం ఉంది. దానికి పలు కారణాలు ఉండవచ్చు. ప్రభుత్వపరంగా కొన్నిలోపాలు ఉండవచ్చు. కాని అదే టైమ్ లో ముఖ్యమంత్రి జగన్ ఏ అధికారిని లేదా ఏ ఉద్యోగిని అగౌరవపరచలేదు. ఎవరిని మోసం చేసే యత్నం చేయలేదు. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఇస్తానని ఎన్నికల ముందు చెప్పినా , అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి అర్ధం చేసుకుని ఉద్యోగులకు పాత పెన్షన్ ఇవ్వలేకపోయినా, ఏ రకంగా వారికి మేలు చేయవచ్చన్నదానిపై దృష్టి పెట్టారు. అందులో బాగంగానే వారికి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ను తీసుకు వచ్చారు. ఇందుకోసం చాలా కసరత్తు చేశారు. ఉద్యోగ సంఘాలతో కూడా పలుమార్లు చర్చించారు. అయినా కొంతమంది ఉద్యోగులకు అది నచ్చలేదు. అదే టైమ్ లో అప్పటి విపక్షనేత, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాని, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు సీపీఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. వారిని రెచ్చగొట్టడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా చేయని ప్రయత్నం లేదు. అబద్దాలను నిత్యం వండి వార్చేవి. అయినా జగన్ తాను చేయదలచుకున్నది చిత్తశుద్దితో చేసి ఉద్యోగులు రిటైరైనప్పుడు వచ్చే జీతంలో ఏభై శాతం పెన్షన్ వచ్చేలా స్కీమును తెచ్చారు. ఇప్పుడు అది దేశవ్యాప్తంగా చర్చ అయింది. ఆంధ్ర మోడల్ పేరుతో కేంద్రం కూడా దీనిని పరిగణనలోకి తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాలు కూడా ఇది బాగానే ఉందని అభిప్రాయపడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు తాము ఓపీఎస్‌కు వెళుతున్నామని చెప్పినా, ఆచరణలో చేయలేకపోయాయి.ఈ నేపధ్యంలో ఏపీలో ఎన్నికలు జరగ్గా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు మొదలైనవారు జగన్‌కు వ్యతిరేకంగా మారారు. కొన్ని ఆందోళనలు కూడా చేపట్టారు. వారంతా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లతో పాటు, ఈనాడు, జ్యోతి వంటి ఎల్లో మీడియా ట్రాప్ లో పడ్డారు. నిజంగానే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పాత పెన్షన్ స్కీమ్ వస్తుంందని అనుకున్నారు. కాని అలా జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులలోనే చంద్రబాబు ప్రభుత్వం యుటర్న్ తీసుకుని జగన్ ప్రభుత్వం ఇచ్చిన జిఓనే అమలు నిమిత్తం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి కూడా ఈనాడు మీడియా దుర్మార్గంగా జగన్ ప్రభుత్వానిదే తప్పు అన్నట్లు పచ్చి అబద్దపు వార్తను రాసి, టీడీపీ ప్రభుత్వ తప్పేమిలేదన్నట్లు కవరింగ్ ఇస్తూ కధనాన్ని ఇచ్చింది. చంద్రబాబు కాని, పవన్ కళ్యాణ్ కాని దీని గురించి మాట్లాడడం లేదు. కనీసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించలేదు. నిజంగానే వీరికి చిత్తశుద్ది ఉంటే జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీఓని, చట్టాన్ని రద్దు చేసి ఉండవచ్చు కదా! లేని లాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసినట్లు ప్రకటించిన చంద్రబాబు నాయుడు జీపీఎస్‌ను మాత్రం ఎందుకు కొనసాగిస్తున్నారు. ఇది ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేసినట్లు కాదా? అబద్దాలు చెప్పడంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పోటీపడినట్లు కాదా?అంటే ఎవరు బదులు ఇవ్వాలి. కూటమికి మద్దతు ఇచ్చిన ఉద్యోగులు అవాక్కవడం తప్ప ఇంక చేయగలిగింది లేదు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు దీనిపై నిరసన బాట పట్టినా పెద్దగా ఫలితం ఉండదన్న అభిప్రాయం ఉంది. గత ప్రభుత్వం కొద్దిగా ఆలస్యం చేసినా జీతాలు ఏ నెల ఆపలేదు. పేదల స్కీములకు ప్రాధాన్యత ఇచ్చిన కారణంగా ఈ ఇబ్బంది వచ్చింది. అలాగే వారికి సంబంధించిన జిపిఎఫ్,గ్రాట్యుటి తదితర చెల్లింపులలో కొంత ఆలస్యమైన మాట నిజమే. అదే టైమ్ లో ఉద్యోగుల మీద ఎక్కడా వేధింపులు లేవు. గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలు తెచ్చిన తర్వాత వీరిపై పని ఒత్తిడి కూడా తగ్గింది. నేరుగా లబ్దిదారులకు నగదు బదిలీని విజయవంతంగా అమలు చేయడంతో అవినీతి తగ్గింది. అయితే ఈ పద్దతుల వల్ల తమ ప్రాధాన్యత తగ్గిందని కొంతమంది భావించి ఉండవచ్చు. కాని ప్రజల విశాల ప్రయోజనాల రీత్యా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు చేయక తప్పు. ఉద్యోగులను జగన్ ఎప్పుడూ అన్నా.. అంటూ సంబోధించి చాలా మర్యాద ఇచ్చేవారు. అదే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఒకలా, అధికారం వచ్చాక మరొలా ఉంటారని మరోసారి రుజువు చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఒక శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఏదో చిన్న సమస్య వచ్చింది. కొద్ది సెకన్లపాటు అంతరాయం కలిగింది.దానికే ఆయన ఉద్యోగులపై మండిపడ్డారు. వారు ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలని, తమాషాగా ఉందా అని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ తాను 1995 నాటి పాలన తెస్తానని అన్నారు. ఆ రోజుల్లో ఆయన తన గుర్తింపు కోసం ఆకస్మిక తనిఖీలు చేపట్టేవారు. ఎక్కడబడితే అక్కడ ఉద్యోగులను, అధికారులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. వారిని బహిరంగంగా మందలించేవారు.ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఒక అధికారి గుండెపోటుకు గురై మరణించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అది పెద్ద సంచలనం అయింది. అంతేకాదు.2014 టరమ్‌లో చంద్రబాబు తెలుగుదేశం మీడియా ప్రముఖుడు ఒకరితో కూర్చుని ఉద్యోగుల జీతభత్యాల గురించి ఏమి మాట్లాడుకుంది అంతా విన్నారు. అయినా చంద్రబాబు గొప్పతనం ఏమిటంటే ఉద్యోగులను మళ్లీ తనవైపు తిప్పుకోగలగడం, వారిని నమ్మించడం.అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చినా, చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయకపోయినా ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేయడం. 19952004 మద్య ఏభైకి పైగా ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయించారు. ప్రపంచ బ్యాంకు రుణం కోసం వారు పెట్టిన కండిషన్ల ప్రకారం ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవడానికి అంగీకరించారన్న విమర్శ ఉండేది. అదే చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించేవారు. టీచర్ల పోస్టులను భర్తీ చేయడం లేదని, మెగా డీఎస్సీ అంటూ ఊదరగొడతారు. విశేషం ఏమిటంటే సుమారు లక్షన్నర ఉద్యోగాలను సృష్టించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అయితే, ఆయన ఉద్యోగాలు ఇవ్వలేదని చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ లు ప్రచారం చేస్తే, ఈనాడు, ఆంధ్రజ్యోతి డప్పు కొడితే దానిని కూడా కొంతమేర ప్రజలు నమ్మడం. ఇలా ఎన్నో జిమ్మిక్కులు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు యథాప్రకారం యుటర్న్‌లు తీసుకోవడం ఆరంభించారు. ఈసారి ఆయనకు పవన్ కళ్యాణ్ జత అయ్యారు. అంతే తేడా. గతంలో సోషల్ మీడియా ఉండేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు వారు ఎన్నికలకు ముందు ఏమి చెప్పారు? ఇప్పుడు ఏమి చేస్తున్నారు ?అన్నదానిపై విశ్లేషణలు వచ్చేస్తున్నాయి. ప్రజలను ఒకటి, రెండుసార్లు మోసం చేయవచ్చుకాని, ఎల్లకాలం మోసం చేయలేరన్న సూక్తి ఉంది. కాని అది చంద్రబాబు విషయంలో వాస్తవం కాదని రుజువు అయింది. ఈ సందర్భంలో మోసం చేసేవారి తప్పుకన్నా, మోసపోయేవారి తప్పే అధికమని అనుకోవాలన్న నానుడి కరెక్టేనేమో! – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
టీడీపీ ఈవెంట్‌గా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం?!
తాడేపల్లి, సాక్షి: వలంటీర్ వ్యవస్థను ముట్టుకోమన్నారు. పైగా అధికారంలోకి వచ్చాక వాళ్లకు పది వేల రూపాయాలకు జీతం పెంచుతామన్నారు. అధికారం చేపట్టాక.. నెల తిరగక ముందే ఆ హామీని తుంగలో తొక్కేశారు. పెన్షన్ల పంపిణీకి వలంటీర్లను పూర్తిగా దూరం చేసేశారు. పైగా ఆ ప్రభుత్వ కార్యక్రమాన్ని పసుపుమయంగా మార్చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుందనే చర్చ మొదలైంది. టీడీపీ అధికారిక కార్యక్రమంగా మారిందది. పెన్షన్ల పంపిణీలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బదులుగా టీడీపీ నేతలు, కార్యకర్తలే ఎక్కువగా కనిపిస్తున్నారు. లబ్ధిదారులకు ఫించన్లు ఇస్తూ.. ఫొటోలకు ఫోజులిస్తూ హల్ చల్ చేస్తున్నారు.‘‘వలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు రావని బెదిరించారు. కానీ, ఒక్కరోజులోనే సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తాం. ఎన్నికల సమయంలో పెన్షన్ల కోసం ఎండలో తిప్పారు. ఫలితంగా 33 మంది చనిపోయారు’’ అని పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత లబ్ధిదారుల ముఖాముఖిలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ టైంలో వలంటీర్ల ద్వారా ఫించన్లు పంపిణీ చేయనీయకుండా ఈసీకి ఫిర్యాదు చేసిందెవరో అందరికీ తెలుసు.ఇదీ చదవండి: పిల్లలపై పిడుగు! ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎసరుచంద్రబాబు ఆదేశాలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రంగంలోకి దిగారు. సచివాలయ సిబ్బందిని పక్కకు నెట్టేసి.. టీడీపీ ఆధ్వర్యంలోనే పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఈ వ్యవహారమంతా గత జన్మభూమి కమిటీల తరహాలోనే నడుస్తోందన్న చర్చ మొదలైంది. గతంతో.. రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండాలనే వలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేపట్టింది. ప్రతీకార రాజకీయాలు ఉండవని, వలంటీర్లను కొనసాగిస్తామని చెప్పిన కూటమి నేతలు.. ఇప్పుడు జగన్ తెచ్చిన ఆ వ్యవస్థనే లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఏపీలో ముందు ముందు కూడా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతల జోక్యం ఇలాగే కొనసాగుతుందా? అనేది చూడాలి. -
పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. గత ప్రభుత్వ పెన్షన్ పథకం పేరు మార్చిన కూటమి ప్రభుత్వం.. ఎన్నికల హామీ మేరకు ఇవాళ్టి నుంచి పెంచిన సొమ్ముతో లబ్ధిదారులకు అందజేయాల్సి ఉందన్నది తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఉదయమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రారంభించారు. మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్లోని పెనుమాకలో సోమవారం(జులై 1) వేకువజామునే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్థానిక ఎస్టీ కాలనీలో నివాసం ఉండే బానావత్ పాములునాయక్ అనే వృద్ధుడికి తొలుత పెన్షన్ అందజేశారు. ఆపై లబ్ధిదారులు ఇస్లావత్ సాయి, బానవత్ సీతలకు స్వయంగా పెన్షన్ అందజేసి, వాళ్లతో కాసేపు ఆయన మాట్లాడారు. చంద్రబాబు వెంట మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు.అనంతరం ప్రజలతో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించిన చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులతో నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యా. లోకేష్ మంగళగిరి ప్రజల అభిమానం చురగొన్నారు. భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించుకున్నారు. మంగళగిరిలోనే పెన్షన్ల పంపిణీ ప్రారంభించడం ఆనందంగా ఉంది అని అన్నారు. గత ప్రభుత్వంలో ఒకటవ తేదీ ఉదయమే వెళ్లి వలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వంలో దానికి బ్రేకులు పడ్డాయి. ఇక ఇవాళ ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ప్రస్తుతం ఏపీలో మొత్తం 65,18,496 మంది పెన్షన్ల లబ్ధిదారులు ఉన్నారు. ఇందుకోసం చంద్రబాబు ప్రభుత్వం రూ.4,399.89 కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేసింది. పెరిగిన పెన్షన్ రూ.4 వేలతో పాటుగా.. గత 3 నెలల బకాయిలు మూడు వేలు కలిపి జులై 1 వ తేదీన లబ్ధిదారులకు రూ.7 వేలు అందాల్సి ఉంది. -
ఏపీలో ఫించన్ పథకం పేరు మార్పు
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. అందుకు తగ్గట్లే మార్పులు చేపట్టారు. ఈ క్రమంలో గత ప్రభుత్వం తాలుకా గుర్తులనూ చెరిపేసే అడుగులు వేశారు. ఇందులో ఒకటే.. ఫించన్ల పథకం పేరు మార్పు. 2014 -2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పేరుతో ఫించన్లు అందించేది. కాకపోతే.. లబ్ధిదారులు స్వయంగా వెళ్లి క్యూ లైన్లలో నిలబడి ఆ డబ్బును అందుకోవాల్సి వచ్చేది. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ పరిస్థితి మారింది. ఫలితంగా.. గత ఐదేళ్లుగా వైఎస్సార్ పెన్షన్ కానుక పేరిట వలంటీర్ వ్యవస్థ ద్వారా..అదీ ఒకటో తేదీనే.. ఇంటికే పెన్షన్లు చేరేవి. అయితే ఎన్నికల హామీలో భాగంగా సామాజిక భద్రత పెన్షన్ల పెంపును ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ పథకం పేరు మార్చేశారు. ఏపీలో ఫించన్ పథకం పేరును ఎన్టీఆర్ భరోసాగా పునరుద్ధిరించారు. ఈ మేరకు జీవో కూడా విడుదలైంది. రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్ దారులకు నగదు పెంపుతో నెలకు రూ.2,758 కోట్లు, ఏడాదికి రూ.33,099 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసింది.రాష్ట్రంలో ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ ఐవీ బాధితులు, కళాకారులకు ప్రతీనెల రూ.3వేలు పింఛన్ అందుతుంది. సీఎంగా చంద్రబాబు ఆ పింఛన్ ను రూ.4వేలకు పెంచుతూ దస్త్రంపై గురువారం సంతకం చేశారు. దీంతో ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేయనుండటంతో జులై 1న పింఛన్ కింద వీరికి రూ. 7వేలు (జులై1న ఇచ్చే రూ.4వేలు, ఏప్రిల్ నుంచి మూడు నెలలకు రూ వెయ్యి చొప్పున) అందివ్వనున్నారు. అలాగే.. దివ్యాంగులకు ప్రస్తుతం రూ.3వేలు అందుతుంది.. జులై నెల నుంచి వారికి రూ. 6వేలు అందివ్వనున్నారు. -
ముసలి వాళ్లపై ఎల్లో శాడిజం...ఇదేం సైకోయిజం బాబూ..!
-
పెన్షనర్ల కష్టాలు...ఈ పాపం చంద్రబాబుదే
-
మండుటెండల సాక్షిగా చంద్రబాబును శపిస్తున్న వృద్ధులు
-
సింహాన్ని నేరుగా ఎదుర్కోలేక పసుపు ముసుగులో నిమ్మగడ్డ
-
వీధినపడ్డ అవ్వా, తాతలు ఈ పాపం చంద్రబాబుదే
-
బాబు, నిమ్మగడ్డకు బిగ్ షాక్ ఇంటి వద్దకే పిన్షన్..
-
వికలాంగుల పెన్షన్లు ఆపేసి...అవ్వాతాతల కూడు లాగేసి...
-
చంద్రబాబు కుట్రతో పెన్షన్ దారులకు అవస్థలు..
-
చంద్రబాబు, నిమ్మగడ్డపై ఫైర్ అయిన సజ్జల
-
పెన్షన్ రాకుండా..వృద్ధులపై కసి తీర్చుకున్న చంద్రబాబు
-
అవ్వాతాతలు, వికలాంగులకు కన్నీళ్లు మిగిల్చిన రాక్షసులు..
-
వైద్యశాఖలో ఖాళీల భర్తీకి కేబినెట్ ఆమోదం
-
పెళ్లి కాని వారికి గుడ్‌న్యూస్.. ప్రతీ నెలా 2,750 పెన్షన్
చండీఘడ్: హర్యానా ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెళ్లి కాని యువతీ యువకుల కోసం ప్రత్యేక పెన్షన్ స్కీమ్‌ను ప్లాన్ చేసింది. హర్యానాలో వివాహం చేసుకోని వారికి ప్రతీ నెలా రూ.2,750లను పెన్షన్‌గా ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. వివరాల ప్రకారం.. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గురువారం కీలక ప్రకటన చేశారు. హర్యానాలో పెళ్లి కాని ఆడవాళ్లకు, మగవాళ్లకు ప్రతి నెలా రూ.2,750 ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే, ఈ స్కీమ్ 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి మాత్రమే వర్తించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. అవివాహిత పెన్షన్ అందుకునేవారి వార్షిక ఆదాయం రూ.1.80 లక్షలకు తక్కువగా ఉండాలని ప్రభుత్వం రూల్ పెట్టింది. మరోవైపు.. హర్యానాలో వితంతవులను కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వితంతువులకు కూడా పెన్షన్‌ను అందించనున్నట్టు సీఎం ఖట్టర్ ప్రకటించారు. 40 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వితంతువులకు ప్రతినెలా రూ.2750 ఇవ్వనున్నట్టు తెలిపారు. అయితే వాళ్ల వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలనే నిబంధనను విధించారు. मैं घोषणा करता हूं कि हरियाणा के 45 से 60 वर्ष तक की आयु वाले अविवाहित पुरुष व महिलाओं को अब से ₹2,750 मासिक पेंशन दी जाएगी। ₹1.80 लाख से कम वार्षिक आय वाले व्यक्तियों को इस पेंशन का लाभ मिलेगा। इसके अलावा 40-60 वर्ष आयु तक के विधुर पुरुष, जिनकी वार्षिक आय ₹3 लाख से कम है… pic.twitter.com/Jwn5fO5sWp — Manohar Lal (@mlkhattar) July 6, 2023 ఇది కూడా చదవండి: మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు.. ఎంపీ ఎన్నిక రద్దు.. -
ఊహించినట్లే విషం కక్కారు.. ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా రామోజీ?
ప్రభుత్వ నాన్ గెజెటెడ్ ఉద్యోగులకు సంబంధించి సీపీఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ బదులు జీపీఎస్ అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్‌ను ఏపీ ప్రభుత్వం తీసుకు వస్తే, దానిలో ఉన్న పాజిటివ్, నెగిటివ్ పాయింట్లను విశ్లేషించవలసిన ఒక వర్గం మీడియా దారుణమైన రాతలకు పాల్పడింది. అసలు వార్తను కాకుండా, ఉద్యోగులకు దగా..దగా.. అంటూ పెద్ద బ్యానర్ హెడింగ్ పెట్టిన ఈనాడు మీడియాను ఏమనాలి!. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ఈ రకంగా చండాలంగా మాట్లాడడానికి సాహసించలేదు. కాని ఈనాడు మాత్రం ఏదో విధంగా ఉద్యోగులను రెచ్చగొట్టాలని విశ్వయత్నం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు నిజంగా అసంతృప్తి చెంది ఉంటే ఈపాటికి ఎంత ఆదోళన వచ్చేది. అది జరగలేదనే బాధతో ఈనాడు మీడియా తనే ప్రతిపక్షం అనుకుని జర్నలిజం విలువలకు పాతరేస్తూ రాసింది. మామూలుగా అయితే ఏమి చేయాలి?. ముందుగా అసలు క్యాబినెట్ నిర్ణయం ఏమిటి? దాని పరిణామం ఏమిటి? అన్నదాని గురించి తొలుత వార్తను ఇవ్వాలి. ఆ తర్వాత నిజంగా ఎన్.జి.ఓ.లకు అన్యాయం జరిగితే దాని గురించి ఇవ్వవచ్చు. అవేమీ చేయకుండా ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులకు దగా చేశారని నీచంగా రాశారు. గత ఎన్నికల ముందు సీపీఎస్‌ను రద్దు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ హామీ ఇచ్చిన మాట నిజమే. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై గట్టిగా పరిశీలన చేశారు. అదే సందర్భంలో సీపీఎస్ రద్దుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ టెక్నికల్ గా ఉన్న సమస్యలు ఇంతగా ఉంటాయని ఊహించలేదని, అయినప్పటికీ, దానికి ప్రత్యామ్నాయంగా మెరుగైన జీపీఎస్‌ను తీసుకు వస్తున్నామని కొంతకాలం క్రితమే ప్రకటించారు. ఇలా నిజాయితీగా ఎంతమంది చెబుతారు. గతంలో చంద్రబాబు నాయుడు రైతుల రుణమాఫీకి సంబంధించి ఎన్ని విన్యాసాలు చేశారో గుర్తు లేదా!. చివరికి రుణమాఫీ చేసేశాం అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. అలా అసత్యాలు చెప్పినవారేమో గొప్పవారట. ఇప్పుడు నిజాయితీగా సమస్యను వివరించినవారేమో దగా చేసినట్లట. ఇలా ఉంది ఈనాడు మీడియా సూత్రీకరణ. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జగన్ ఇచ్చిన హామీలు పదింటిలో ఎనిమిదిని నెరవేర్చితే దాని గురించి చెప్పరు. మిగిలిన రెంటిలో కొంతమేర తీర్చారు. అయినా సీపీఎస్ రద్దు చేయలేదని, దగా అని చెడరాశారు. మరి చంద్రబాబు టైమ్‌లో ఎందుకు దానిని రద్దు చేయలేదు?. పోనీ ఎన్.జి.ఓలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ఎన్ని అమలు చేశారు? వాటిపై ఎప్పుడైనా సమీక్షకు ఎల్లో మీడియా సిద్దం అవుతుందా? ఆ పని చేయరు. కేవలం బురదచల్లుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. చదవండి: జగన్ దూకుడు.. పచ్చ బ్యాచ్‌కి కడుపులో మంట దీని అంతటికి ఒకటే కారణం. తమకు కావల్సినవారు అధికారంలో లేరన్న దుగ్దతో పాటు , తమ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలోని ఆర్ధిక అక్రమాలన్నిటిని జగన్ ప్రభుత్వం ప్రజల ముందు ఉంచుతోందన్న కసి, కక్షతో ఇలాంటి నీచమైన రాతలకు పాల్పడుతోంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినా ఈ మీడియాది ఏడుపుగానే ఉంది. ఇంకా కొంతమంది ఉన్నారు.. వారికి అన్యాయం చేశారు అని రాస్తారు. ముందుగా ఈ నిర్ణయాన్ని స్వాగతించి ఆ తర్వాత రాస్తే ఫర్వాలేదు. ఆ పని చేయరు. సీపీఎస్ బదులు వచ్చిన జిపిఎస్ లో ఉద్యోగి రిటైర్ అయ్యాక చివరి నెల బేసిక్ లో ఏభై శాతం మొత్తాన్ని పెన్షన్ తో పాటు ఏటా రెండు రెండు కరువు భృతి(డి.ఆర్.) ఇవ్వాలని సంకల్పించారు. దీనివల్ల ఉద్యోగికి నష్టం ఏమీ ఉండదు. తొలుత చివరి జీతం బేసిక్ లో 33శాతం పెన్షన్ గా ఇవ్వాలని ప్రతిపాదించినా, ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ దానిని ఏభై శాతంగా చేశారు. ఉన్నంతలో మెరుగైన స్కీమ్ తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది. దానికి ప్రధాన ఉద్యోగ సంఘాలు కూడా దాదాపుగా ఓకే చేశాయి. మంత్రివర్గ ఉప సంఘం భేటీలో ఈ మేరకు ఒక అవగాహన కూడా కుదిరింది. అయినా ఉద్యోగ ,ఉపాధ్యాయ సంఘాలు దీనిపై భగ్గుమంటున్నట్లుగా ఈనాడు, జ్యోతి వంటి తెలుగుదేశం మీడియా శక్తి వంచన లేకుండా దుష్ప్రచారం చేశాయి. ఒక విషయాన్ని విశ్లేషించడం వేరు. విషపూరితంగా రాయడం వేరు. ఎల్లో మీడియా చేస్తున్నది విషపూరిత ప్రచారమే తప్ప ఇంకొకటి కాదు. కొంతకాలం క్రితం టీచర్లు తమ డిమాండ్ ల కోసం విజయవాడకు వచ్చారు. అప్పుడు ఈ మీడియాలు పండగ చేసుకున్నాయి. కాని ఆ తర్వాత ప్రభుత్వం ఆయా అంశాలలో తీసుకుంటున్న శ్రద్ద కారణంగా అలజడి పెద్దగా లేదు. అది ఈనాడుకు, జ్యోతికి కడుపు మంటగా ఉంటోంది. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా వారు ప్రభుత్వంపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన మనసులో మాట పుస్తకంలో అసలు ప్రభుత్వపరంగా ఉద్యోగాలు ఇవ్వడాన్ని తప్పు పట్టారు. కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను ప్రోత్సహించింది ఆయనే. తత్ఫలితంగానే ఒకే పనిచేసే రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలలో భారీ వ్యత్యాసం చోటు చేసుకుంది. ఇప్పుడు జగన్ దానిని తొలగించే యత్నంచేస్తే అది కూడా వెన్నుపోటే అని తప్పుడు వార్తలు రాశారు. చంద్రబాబు 2004 కి ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు 54 మూసివేశారు. అప్పుడు ఆయనను గొప్ప సంస్కరణవాదిగా ఈనాడు ప్రచారం చేసింది. ఇప్పుడేమో టిడిపి పూర్తిగా తిరోగమనంలో ఉన్నా ఈనాడుకు తియ్యంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉంటోంది. వారిని తన కుటుంబ సభ్యులని జగన్ పలుమార్లు ప్రకటించారు. అదే చంద్రబాబు టైమ్‌లో అయితే ఉద్యోగులను ఎన్ని రకాలుగా యాతనలకు గురి చేసేవారో అనుభవించినవారందరికి తెలుసు. కేవలం కొద్ది మంది నాయకులను మేనేజ్ చేసి చంద్రబాబు ప్రభుత్వం కధ నడిపేది. కాని జగన్ ఉద్యోగుల అవసరాలను తీర్చే క్రమంలో ముందుకు వెళుతున్నారు. ఈనాడు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఇంతగా గగ్గోలు పెడుతోంది కదా! తన సంస్థలలో ఉద్యోగుల పట్ల ఇలాగే కనికరంతో ఉంటున్నదా? వారికి కూడా మంచి పెన్షన్ స్కీమ్ ఇవ్వాలని ఎప్పుడైనా భావించిందా?ఈనాడుకు మంచి లాభాలే వస్తాయి కదా! కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల జీతాలపై అప్పుడప్పుడు ట్రిబ్యునల్లను ఏర్పాటు చేస్తుంటుంది. వారి సిఫారస్‌లను యాజమాన్యాలు అమలు చేయవలసి ఉంటుంది. కాని ఎప్పుడూ ఆ సిఫారస్ లను యాజమాన్యాలు ఒప్పుకునేవి కావు. ఈనాడు రామోజీరావు అయితే తన సంస్తలోని జర్నలిస్టులందరితో తమకు సగం జీతాలు ఇస్తే చాలని ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడాచేయించుకున్న ఘట్టాలు ఉన్నాయి. అసలు తమ సంస్థలలో యూనియన్లనే అనుమతించని రామోజీరావు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల గురించి మాత్రం చాలా బాదపడుతున్నారు. వీరి రాతలను చూసి ఉద్యోగులు మోసపోకూడదనే ఈ విషయాలు చెప్పడం జరుగుతోంది. వారికి ఇంకేమైనా కోరికలు ఉంటే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి పరిష్కరించుకోవచ్చు. ఈనాడు, జ్యోతి రాసే అబద్దాలు నమ్మి భిన్నమైన మార్గంలోకి వెళితే, అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు వేధింపులు కాని, సమయం మించి పని కాని పెద్దగా లేవు. అదే చంద్రబాబు టైమ్ లో అయితే ఆయన సోది ఉపన్యాసం వినలేక చచ్చేవారమని పలువురు అధికారులు, ఉద్యోగులు వాపోతుండేవారు. జగన్ తాను మాట ఇచ్చిన నేపధ్యంలో దానిని అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. అదే చంద్రబాబు అయితే దానిని ఎలా ఎగవేయాలా అని ఆలోచిస్తుంటారు. ఎన్నికల ప్రణాళికలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. కనుక ఉద్యోగులు వీటన్నిటిని గమనించి ప్రభుత్వంతో ఏర్పడిన సుహృద్భావ వాతావరణాన్ని కొనసాగిస్తారని ఆశిద్దాం. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ చదవండి: సీఐడీ దర్యాప్తుపైనా..వక్రీకరణేనా రామోజీ? -
Manifesto: 99 శాతం పూర్తి.. దేశ చరిత్రలోనే తొలిసారి
(సాక్షి, అమరావతి) : ఓట్లడిగేటప్పుడు వందలకొద్దీ హామీలివ్వటం... తీరా ఆ ఓట్లతో గెలిచాక హామీలను పక్కనబెట్టడం!. దశాబ్దాలుగా ఇక్కడ చూస్తున్నది అదే. అలవికాని హామీలను చూసి చూసి అలసిపోయిన జనం... ఎన్నికలప్పుడు పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకు విలువివ్వటమే మానేశారు. వాటినసలు చూడకుండానే పక్కనబెట్టేస్తున్నారు. కాకపోతే 2019 ఎన్నికల్లో... ఈ పరిస్థితి మార్చాలని సంకల్పించారు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. నాడు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్సార్ సీపీ తరఫున ఒకే ఒక పేజీ మేనిఫెస్టోను విడుదల చేశారు. దాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తానని స్పష్టంగా చెప్పారు. జనం జై కొట్టారు. ఓ కొత్త చరిత్రకు అంకురార్పణ జరిగింది. మరి సింగిల్ పేజీ మేనిఫెస్టోతో ఎన్నికల్లో పోటీ చేసి అఖండ విజయాన్ని అందుకున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి... ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేశారు? ఆ మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశారా? దీనికి నిజాయితీగా వినవచ్చే సమాధానం ఒక్కటే. అది... ‘ఆ రెండూ తప్ప’ అని!. ఎందుకంటే మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకున్న జగన్... తొలి ఏడాదే దాన్లో పేర్కొన్న 95 శాతం హామీలను అమల్లోకి తెచ్చారు. మిగిలిన సంక్లిష్టమైన హామీలను కూడా సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుంటూ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. కాకపోతే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను (సీపీఎస్) రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను (ఓపీఎస్) తిరిగి అమల్లోకి తెస్తామన్న హామీని అమలు చేయలేకపోయారు. ఓపీఎస్‌ను తిరిగి తేవటం ఆచరణ సాధ్యం కాదని తేలినా... ఉద్యోగులకిచ్చిన హామీ మేరకు మెరుగైన పెన్షన్ పథకాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం రెండేళ్లుగా రకరకాల గ్రూపులతో చర్చించి కసరత్తు చేస్తూ వచ్చింది. చివరకు వారి ప్రయోజనాలను కాపాడేలా గ్యారంటీడ్ పెన్షన్ పథకానికి (జీపీఎస్) రూపకల్పన చేసింది. ఉద్యోగ వర్గాలంతా ఈ జీపీఎస్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీన్ని అమల్లోకి తేవటానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది కూడా. ఇక అమలు కాని హామీల్లో రెండవది మద్య నియంత్రణ. దశలవారీగా మద్యం వినియోగాన్ని తగ్గిస్తూ చివరకు దాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నా... రకరకాల సాంకేతిక, ఆర్థిక కారణాలతో పూర్తి స్థాయిలో ఆ హామీ అమలు కాలేదు. కాకపోతే నియంత్రణ దిశగా బలమైన అడుగులుపడ్డాయి. 2018–19తో పోలిస్తే విక్రయాలు 50 శాతానికన్నా తగ్గాయంటే నియంత్రణ దిశగా అడుగులు పడ్డాయన్నది స్పష్టంగా తెలియకమానదు. కాకపోతే ఈ రెండంశాలూ హామీ ఇచ్చినట్లుగా నూటికి నూరు శాతం అమలు కాలేదు కనక... మేనిఫెస్టోలో 99 శాతమే అమలయ్యిందని చెప్పాలి. నూటికి 99 శాతం మార్కులే ఇవ్వాలి. ఇక్కడ గమనించాల్సిందొక్కటే. అసలు మేనిఫెస్టోను ఇంత చిత్తశుద్ధితో అమలు చేసిన ప్రభుత్వాలను మనమెన్నడైనా చూశామా? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏం జరిగిందో ఎవరికి తెలియదని? 2014లో ఆయన ఇచ్చిన ఏ హామీనైనా గెలిచాక అమలు చేశారా? అసలు మేనిఫెస్టోనే పార్టీ వెబ్సైట్లో నుంచి తొలగించిన చరిత్ర ఆయనది. ఒకటికాదు రెండు కాదు... వందలకొద్దీ హామీలనిచ్చారు. కానీ తొలి నాలుగున్నరేళ్లూ ఒక్క హామీని కూడా పట్టించుకోలేదు. మళ్లీ 2019లో ఎన్నికలు ముంచుకొస్తున్నాయనగా హడావుడిగా కొన్ని హామీలను అరకొరగానైనా అమలు చేశామని చూపించుకోవటానికి ప్రయత్నించారు. కొద్ది మంది ఖాతాల్లో రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతిని జమచేయటం... పసుపు కుంకుమ కింద మహిళల ఖాతాల్లో నగదు వేయటం... ఇవన్నీ ఎన్నికలకు కేవలం రెండుమూడు నెలల ముందు చేశారు. అంతేకాదు! ఈ రాష్ట్రానికి తీరప్రాంతమే మణిహా రమంటూ రకరకాల గ్రాఫిక్‌లు చూపించి... ఎన్నికలకు కేవలం 20 రోజుల ముందు పోర్టులకు శంకుస్థాపనలంటూ హడావుడి చేశారు. భోగాపురం విమానాశ్రయానిదీ అదే కథ. విచిత్రమేంటంటే ఇలా ఏ హామీనీ అమలు చెయ్యని చంద్రబాబు నాయుడు... 2019 ఎన్నికల్లో మాత్రం తాను చెప్పివన్నీ చేశానని, మళ్లీ గెలిపిస్తే ఇంకేదో చేస్తానంటూ స్వర్గాన్ని గ్రాఫిక్‌లలో చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు కూడా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం నిజాయితీగా తన పనితీరుకు మార్కులు వేసుకుంటున్నారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్నీ అమలు చేయటానికి ప్రయత్నించటంతో పాటు రెండంశాలు తప్ప మిగిలివన్నీ 100 శాతం అమలు చేశారు. 99 శాతం మార్కులు సాధించగలిగారు. రాజకీయ వర్గాలు ఈ రెండు మేనిఫెస్టోలనూ ‘విశ్వసనీయత– వంచన’తో పోలుస్తున్నది కూడా అందుకేనేమో!!. ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే.. రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలతో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాన్ని సాధించాక 2019 మే 30న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుక్షణమే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ.. వృద్ధాప్య పింఛన్‌ను పెంచే ఫైలుపై తొలి సంతకం చేశారు. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 56 శాతం పదవులు ఇచ్చి సామాజిక విప్లవానికి తెరతీశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే.. నవరత్నాలతో 95 శాతం హామీలను అమలు చేశారు. కోవిడ్ కష్టకాలంలోనూ మాట తప్పకుండా వాటిని కొనసాగించారు. ఉద్యోగులు అడగక ముందే 12వ పీఆర్సీ (పే రివిజన్ కమిషన్) ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం... సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ అందించేలా జీపీఎస్ (గ్యారంటీ పెన్షన్ స్కీమ్) విధానానికి ఆమోదం తెలపటం... కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపడంతో మేనిఫెస్టో అమల్లో మరింత ముందడుగు వేసినట్లయింది. 99 శాతం హామీలను నెరవేర్చినట్లయింది. ఇబ్బందుల్లోనూ చెప్పిన దాని కంటే మిన్నగా.. 2020లో ప్రపంచ వ్యాప్తంగా విజృంభించిన కరోనా మహమ్మారి ప్రభావం రాష్ట్రంపైనా పడింది. ఆర్థిక ఇబ్బందులను సృష్టించింది. కరోనా కష్టకాలంలోనూ.. ఆర్థిక ఇబ్బందులున్నా హామీల అమల్లో సీఎం వైఎస్ జగన్ వెనుకంజ వేయలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలన్నీ అమలు చేశారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు రైతులకు ఇస్తాన ని మేనిఫెస్టోలో చెప్పిన సీఎం జగన్.. దాన్ని మరో వెయ్యి పెంచి ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 ఇచ్చేలా అమలు చేస్తున్నారు. అంటే.. రైతు భరోసా ద్వారా ఒక్కో రైతుకు అదనంగా రూ. 17,500 ప్రయోజనం చేకూరుస్తున్నారు. మేనిఫె స్టోలో ఇచ్చిన హామీలతోపాటు ఇతర పథకాలనూ అమల్లోకి తెచ్చారు. 2019 ఎన్నికల తర్వాత.. జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్.. తిరుపతి లోక్‌సభ, ఆత్మకూరు, బద్వే లు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ రికార్డు విజయాలు సాధించడమే ఆయనపై జనానికున్న నమ్మకానికి నిదర్శనం. అర్హతే ప్రామాణికం కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ చూడకుండా.. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అంతే పారదర్శకంగా అమలు చేస్తున్నారు. నాలుగేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.16,786 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఇతరత్రా రూపాల్లో లబ్ధి చేకూర్చిన పథకాలు కూడా కలిపితే (డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ) లబ్ధిదారులకు రూ.3.10 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. ఇచ్చిన మాట మేరకు 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ వారి పేరిట ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంతోపాటు పక్కా గృహాన్ని మంజూరు చేసి, నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దేశ చరిత్రలో ఒకేసారి ఇలా 31 లక్షల మందికి ఇంటి స్థలాలను ఇచ్చి.. వారి పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన దాఖాలు గతమెన్నడూ లేవు. -
‘అధిక పెన్షన్’పై తొలగని సందేహాలు!
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) అధిక పెన్షన్ పథకం కోసం ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చినా.. దీనిపై చందాదారులు, పెన్షనర్లలో సందేహాలు వీడటం లేదు. ఫిబ్రవరి 20న అధిక పెన్షన్ దరఖాస్తులకు ఉత్తర్వులను వెలువరించగా.. దరఖా స్తు ప్రక్రియ, ఉమ్మడి ఆప్షన్ నమోదు గడువు మరో ఐదు రోజుల్లో ముగియనుంది. కానీ ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, లబ్ధి, ఇతర అంశాలపై అయోమయం వీడటం లేదు. అధిక పెన్షన్ లెక్కించే ఫార్ము లాను ఈపీఎఫ్ఓ ఇంకా వెల్లడించలేదని.. దీనికి ఎంపికైతే జరిగే లబ్ధిపై ఎలాంటి స్పష్ట త లేదని చందాదారులు వాపోతున్నారు. ఈపీఎఫ్ఓ ప్రస్తుత నిబంధనల ప్రకా రం రూ.15 వేల గరిష్ట వేతనాన్ని పెన్షన్ కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఈ వేతన పరిధిలోని వారికి పదవీ విరమణ పొందిన తర్వాత సాధారణ పెన్షన్ మాత్రమే అందుతుంది. ఈ నిబంధనను అమల్లోకి తీసుకురావడానికి ముందు నుంచీ ఉన్న చందాదారులకు కూడా దీన్ని వర్తింపజేశారు. దీంతో అధిక వేతనమున్న వారికి అధిక పె న్షన్ పొందే అవకాశం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో కేసు నమోదైంది. ఈ క్రమంలో.. ఈ నిబంధన అమల్లోకి రాకముందే అధిక వేతనం పొందుతున్న చందాదారులు, పెన్షనర్లకు ఎక్కువ పెన్షన్ అందే అవకాశం ఇవ్వా లని కోర్టు ఈపీఎఫ్ఓను ఆదేశించింది. దీని తో ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్‌కు ఆప్షన్ ఇచ్చింది. గరిష్ట వేతనంపై అటు చందాదారుడు, ఇటు యాజమాన్యం చెరో 12శాతం చొప్పు న చందా చెల్లిస్తే.. అధిక పెన్షన్‌కు అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అంశంలో పలు సందేహాలున్నాయి. కొన్ని కంపెనీలు ఈపీఎఫ్ఓ వేతన పరిమితికి లోబడి జీతాల చెల్లింపులు చేస్తూ వచ్చాయి. అలాంటి వారి కి అధిక వేతనంపై చెల్లింపులు చేసే అంశంపై స్పష్టత లేదు. ఇక అధిక వేతనం పొందుతున్న చందాదారులకు ప్రభుత్వం వాటా 1.12 శాతాన్ని ఈపీఎఫ్‌లో జమచేసే అంశంపైనా స్పష్టత లేదు. ప్రభుత్వం జమచేయని పక్షంలో ఆ మొత్తాన్ని ఏవిధంగా సర్దుబాటు చేస్తారనే ప్రశ్నకు ఈపీఎఫ్ఓ దగ్గర సమాధానం లేదు. ‘అధిక పెన్షన్’ఫార్ములా ఇంకెప్పుడు? సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అధిక పెన్ష న్కోసం ఈపీఎఫ్ఓ ఆన్లైన్ లింకు ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటికే దరఖా స్తు చేసుకున్నవారు.. చందాకు సంబంధించి యాజమాన్యంతో కలసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం పూర్తిస్థాయి ఆధారాలను సమర్పించాలి. దీనికి మే 3వ తేదీవరకే గడువు ఉంది. ఇలా సమయం ద గ్గరపడుతున్నా.. అధిక పెన్షన్ లెక్కింపునకు సంబంధించిన సూత్రాన్ని (ఫార్ములా) ఈపీఎఫ్ఓ ఇప్పటికీ వెల్లడించలేదు. దీంతో అధి క పెన్షన్ అర్హతలు, ఎంపికైతే వచ్చే లబ్దిపై చందాదారులకు ఇప్పటికీ స్పష్టత లేదు. కొ న్ని సంస్థల యాజమాన్యాలు ఉద్యోగులకు అధిక వేతనంపై ఈపీఎఫ్ జమ చేస్తున్నా.. అధిక పెన్షన్ ఆప్షన్ ఇవ్వలేదు. ఇలాంటి సందేహాలను ఈపీఎఫ్ఓ అధికారుల దృష్టికి తీ సుకువెళుతున్నా.. ఎలాంటి స్పందన లేదని చందాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. -
EPFO update: 6 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త!
ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. త్వరలో ఈపీఎఫ్ మంథ్లీ పెన్షన్ లబ్ధిదారులు తీసుకునే నెలవారీ పెన్షన్ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది కేంద్రం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఎంప్లాయి పెన్షన్ స్కీమ్-1995 (ఈపీఎస్) కమిటీ కేంద్ర కార్మిక శాఖకు లేఖ రాసింది. పీఎఫ్ లబ్ధిదారులకు నెలనెలా ఇచ్చే పెన్షన్ రూ.1000 నుంచి రూ.7,500కు పెంచాలని డిమాండ్ చేసింది. ఆ లేఖపై 15రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు రాసిన లేఖలో పీఎఫ్ లబ్ధి దారులకు ప్రస్తుతం చెల్లించే నెలవారీ పెన్షన్ సరిపోవడం లేదని, అనారోగ్యం వస్తే చికిత్స చేయించుకునేందుకు డబ్బులు లేక కొన్ని సార్లు ప్రాణాల్ని పణంగా పెడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి భూపేందర్ యాదవ్‌కు రాసిన లేఖలో15 రోజుల్లోగా తమ డిమాండ్లపై కేంద్రం సానుకూల ప్రకటన చేయాలని నేషనల్ ఎజిటేషన్ కమిటీ కోరింది. లేదంటే రైళ్లు, రోడ్లు నిర్భందిస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించింది. సుప్రీం కోర్ట్ తీర్పు దీంతో పాటు సుప్రీం కోర్ట్ అక్టోబర్ 4, 2016, నవంబర్ 4,2022లలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా వాస్తవ జీతంపై పెన్షన్ చెల్లించాలని కూడా కోరింది. బేసిక్ శాలరీ రూ.15వేల మించిపోయిన ఉద్యోగులు ఈ ఎంప్లాయి పెన్షన్‌స్కీమ్ (ఈపీఎస్)కు అనర్హులు. తాజాగా బేసిక్ శాలరీ రూ.15వేలు, అంతకన్నా ఎక్కువ ఉన్నా ఈపీఎస్-95 స్కీమ్‌కు కంట్రిబ్యూట్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. 6 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త? ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ 1995 లేదా ఈపీఎఫ్ -95ని రిటైర్మెంట్ ఫండ్ బాడీ నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఇందులో 6కోట్లకు పైగా ఖాతాదారులున్నారు. వారిలో 75 లక్షల మంది ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈపీఎస్ కమిటీ రాసిన లేఖపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే 6 కోట్ల ఖాతా దారులకు, పెన్షన్ దారులకు లబ్ధి చేకూరనుంది. చదవండి👉 అలెర్ట్: ఈపీఎఫ్ అకౌంట్లో మీ వడ్డీ డబ్బులు కనిపించడం లేదా? -
రూ.7 డిపాజిట్ చేస్తే నెలకు రూ.5000 పెన్షన్ పొందవచ్చు!
దేశంలో అర్హులైన పౌరులకు 60 ఏళ్ల తర్వాత స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని అందించే లక్ష్యంతో కేంద్రం 2015-16 ఆర్థిక సంవత్సరంలో అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించింది . ఈ పథకం పెన్షన్ ఫండ్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో పనిచేస్తుంది. బెన్ఫిట్స్ ఈ పథకం కింద ఒక వ్యక్తి 60 ఏళ్లు నిండిన తర్వాత డిపాజిట్ చేసిన మొత్తాన్ని బట్టి కనీసం నెలకు రూ. 1,000, రూ. 2,000, రూ. 3,000, రూ. 4,000, గరిష్టంగా రూ. 5,000 పెన్షన్ పొందవచ్చు. అటల్ పెన్షన్ పథకానికి అర్హులు ఇంతకుముందు ఈ పథకం అసంఘటిత రంగాల్లో పనిచేసే వ్యక్తుల కోసం మాత్రమే ప్రారంభించబడింది. ఇప్పుడు 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో డిపాజిటర్లు 60 ఏళ్ల తర్వాత నెల నెల పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు. అయితే, పన్ను చెల్లింపుదారులు ఇకపై అక్టోబర్ 1, 2022 నాటికి ఈ ప్రభుత్వ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అన్హరులు. ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరాలనుకునేవారికి ఈ పథకాన్ని పొందేందుకు, ఒక వ్యక్తి తప్పనిసరిగా సేవింగ్స్ బ్యాంక్ ఖాతా లేదా ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పోస్టాఫీస్ ఖాతాను కలిగి ఉండాలి. రూ. 5000 పెన్షన్ ఎలా పొందాలి లబ్ధిదారులు తప్పనిసరిగా నెలవారీ, త్రైమాసిక, సెమీ యాన్యవల్ డిపాజిట్ చేయాలి. ఇలా చేస్తే 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.1,000 నుండి రూ. 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. రూ.7లతో..రూ.5000 పెన్షన్ ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో పథకంలో చేరి నెలకు రూ. 210, లేదా రోజుకు రూ.7 డిపాజిట్ చేస్తే ప్రతి నెలా రూ. 5వేలు పెన్షగా తీసుకోవచ్చు. అదేవిధంగా త్రైమాసికానికి (3నెలల కాలానికి) రూ. 626, 6 నెలలకు రూ.1239, నెలకు రూ.42 డిపాజిట్ చేస్తే నెలకు పెన్షన్ రూ. 1000 పొందవచ్చు. లేదంటే రూ.2వేలు పెన్షన్ కావాలంటే నెలకు రూ.84, రూ.3వేలు కావాలంటే నెలకు రూ.126 డిపాజిట్ చేయాలి. నెలవారీ పెన్షన్ రూ. 4000 కావాలనుకుంటే రూ.168 డిపాజిట్ చేయాలి. పన్ను ప్రయోజనాలు పథకంలో పెట్టుబడి పెట్టే వారు ఆదాయపు పన్ను చట్టం 80 సి కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందుతారు. ఇది కాకుండా, కొన్ని సందర్భాల్లో రూ. 50,000 వరకు అదనపు పన్ను ప్రయోజనం లభిస్తుంది. మొత్తంగా ఈ పథకం ద్వారా రూ. 2 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. అటల్ పెన్షన్ స్కీమ్‌లో చేరడం ఎలా? మీ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ ఉన్న బ్యాంక్ బ్రాంచ్‌లో అటల్ పెన్షన్ యోజన రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. ఆధార్ కార్డు తో పాటు వ్యక్తిగత వివరాల్ని అందించాలి. యాక్టీవ్‌గా ఉన్న ఫోన్ నెంబర్‌ను అందిస్తే సరిపోతుంది. -
PMVVY: ఈ స్కీమ్‌లో చేరితే పదేళ్లు ప్రతి నెల రూ.10వేల పెన్షన్!
Pradhan Mantri Vaya Vandana Yojana: భారత ప్రభుత్వం ప్రజల కోసం సామాజిక భద్రతా పథకాలను తీసుకొని ముందుకు వస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), అటల్ పెన్షన్ యోజన, నేషనల్ పెన్షన్ స్కీం, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీం వంటి అనేక పథకాలు ఎప్పుడో తీసుకొని వచ్చింది. ముఖ్యంగా నరేంద్ర మోడి నేతృత్వంలోని ప్రభుత్వం వృద్దుల కష్టాలను గుర్తించి ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పేరుతో ఒక పథకాన్ని 2017 మార్చిలో తీసుకొని వచ్చింది. ఈ పథకం రిటైర్ మెంట్ & పెన్షన్ స్కీం. ఈ స్కీమ్ సీనియర్ సిటిజన్లకు ఎంతో భద్రతగా ఉంటుంది. 60 ఏళ్లకంటే ఎక్కువ ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ఇందులో డబ్బులను పొదుపు చేస్తే 10 ఏళ్ల పాటు ఫించన్ పొందవచ్చు. ఈ స్కీమ్‌ను ఎల్ఐసీ నిర్వహిస్తుంది. ఈ స్కీమ్‌లో చేరేందుకు ముందుగా 2020 మార్చి 31 వరకు గడువు ఉండేది. దానిని 2023 మార్చి వరకు పొడిగించారు. ఈ పెన్షన్ పథకంను సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకొచ్చిందని గుర్తుంచుకోవాలి. ఈ పాలసీలో చేరాలంటే కనీస వయస్సు 60 ఏళ్లు ఉండాలి. ఇందులో పెట్టుబడి పెట్టిన నగదుపై 7.40 శాతం వడ్డీ చెల్లించనున్నారు. ఈ పథకం గడువు కాలం 10 ఏళ్లు ఉంటుంది. దీనిలో చేరినవారు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం ఒకసారి పెన్షన్ పొందవచ్చు. ఈ పాలసీ కింద కనిష్ఠ పెన్షన్ నెలకు రూ.100 కాగా, గరిష్టంగా రూ.9,250 పెన్షన్ ఇవ్వనుంది. మీకు నెలకు రూ.1000 పెన్షన్ కావాలంటే రూ.1.62 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక నెలకు రూ.9250 పెన్షన్ కావాలంటే రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. (చదవండి: Multibagger Stock: రూ.10 వేల పెట్టుబడితో ఏడాదిలో రూ.లక్ష లాభం!) ఒకవేళ మీరు నెలనెల వద్దు అనుకుంటే మూడు నెలలు, ఆరు నెలలకోసారి పింఛన్ పొందే సదుపాయం ఉంటుంది. నెలనెల బ్యాంకు ఖాతాకు ఫించన్ డబ్బులు జమ అవుతాయి. ఒకవేళ పాలసీదారుడు మధ్యలోనే చనిపోతే పెట్టుబడి పెట్టిన డబ్బులు నామినీకి తిరిగి ఇవ్వనున్నారు.అలాగే గడువుకాలం ముగిసాక పాలసీదారుడిక పెట్టుబడి డబ్బులు తిరిగి ఇవ్వనున్నారు. ఇందులో లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. పాలసీలో చేరిన మూడు సంవత్సరాల తర్వాత అప్పటి వరకు కట్టిన దానిలో 75 శాతం మొత్తాన్ని లోన్ కింద తీసుకోవచ్చు. పాలసీదారుడికి ఈ పాలసీ నచ్చకపోతే కార్పొరేషన్ నుంచి 15 రోజుల్లో వెనక్కి తీసుకోవచ్చు. ఈ పథకంలో మీరు ఎంత పెట్టుబడి పెట్టారో అనేదానిపై ప్రతి నెల పెన్షన్ ఆధారపడి ఉంటుంది. 10 ఏళ్ల గడువు పూర్తికాకముందే పాలసీ వద్దనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 98 శాతం మాత్రమే వెనక్కి వస్తుంది. (చదవండి: Paytm IPO: తొలి రోజే పేటిఎమ్ మదుపర్లకు భారీ షాక్!) -
Mee Seva: ‘ఆసరా’ కోసం దర్జాగా దోచేస్తున్నారు..
సాక్షి, కరీంనగర్: ఆసరా అర్జీదారులకు వసూళ్ల బెడద తప్పడం లేదు. ఆసరా పింఛన్లకు సంబంధించి దరఖాస్తులను ఉచితంగా ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించగా ఆచరణలో వసూళ్ల పర్వం కొనసాగుతూ..నే ఉంది. జిల్లా అధికారులు కొలువుండే జిల్లా కేంద్రంతో పాటు మారుమూల పల్లెల్లోనూ దోపిడీ దర్జాగా సాగుతోంది. ప్రభుత్వ ఆదేశాలను పక్కాగా అమలు చేయాల్సిన యంత్రాంగం మొద్దునిద్రలో జోగుతుండటం అర్జీదారులకు శాపంగా మారింది. మీ సేవ కేంద్రాల నిర్వాహకులతో అధికారులకు ఉన్న అనుబంధమే తమకీ పరిస్థితని బాధితులు వాపోతున్నారు. మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో అర్జీలను నమోదు చేస్తుండగా నిర్వాహకులు ఇష్టారీతిగా దోచుకుంటున్నారు. ఒక్కో అర్జీకి రూ.50 నుంచి రూ.వంద వరకు దర్జాగా వసూలు చేస్తున్నారు. ఇదేంటంటే మాకేమన్న జీతాలిస్తున్నారా అంటూ ఛీత్కారపు మాటలు. అధికారులేం చేస్తున్నట్టు.. ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో ఎలాంటి రుసుం వసూలు చేయొద్దని ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించింది. సదరు సేవలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో ఉచితంగా ఆన్లైన్లో నమోదు చేయాల్సిన మీ సేవ కేంద్రాల నిర్వాహకులు మాత్రం ఇష్టారీతిగా వసూలు చేస్తున్నారు. వాస్తవానికి మీ సేవ కేంద్రాన్ని రెవెన్యూ, ఎన్ఐసీ అధికారులు ప్రతి నెలా నిర్దేశిత సంఖ్యలో తనిఖీ చేయాల్సి ఉంటుంది. గిర్దావర్, నాయబ్ తహసీల్దార్‌తో పాటు ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ తనిఖీలు నిర్వహించాలి. కానీ, కార్యాలయాల్లోనే కూర్చుని తనిఖీ చేసినట్లు మమ అనిపిస్తున్నారు. ఒకవేళ తనిఖీలే జరిగితే గరిష్ట కేంద్రాలు సీజ్ కావాల్సిందే. టోల్‌ఫ్రీ నంబర్ 1100కు ఫిర్యాదు చేయొచ్చు మీ సేవ, ఈ సేవ కేంద్రాలు ఏ కేంద్రాలైనా ఆసరా పింఛన్ల అర్జీలను ఉచితంగా ఆన్లైన్లో నమోదు చేయాలి. ఒకవేళ రూపాయి అడిగినా ఫిర్యాదు చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ టోల్‌ఫ్రీ నంబర్ 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. అలాగే సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో సరిౖయెన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే మీ సేవ కేంద్రాన్ని సీజ్ చేసే అవకాశముంది. ఒకవేళ సదరు అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఆర్డీవో, లేదా ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే సరి. 31 వరకు అవకాశం.. మార్గదర్శకాలివి ► 57 ఏళ్లు నిండినవారికి ఆసరా పింఛన్లు మంజూరు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఆన్లైన్ దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది. అర్హులు ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు సమయంలో ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే దరఖాస్తుదారుల తరఫున ఈ సేవ కమిషనర్‌కు చెల్లిస్తున్నట్లు స్పష్టం చేసింది. ► జనన, మరణ నమోదు అధికారులు జారీ చేసిన పత్రం, టీసీ, పాఠశాల నుంచి బోర్డు పరీక్షలకు హాజరైన ధ్రువీకరణ పత్రం లేదా ఓటరు కార్డు లేదా ఓటర్ల జాబితా ఆధారంగా దరఖాస్తుదారు పుట్టిన తేదీని నిర్ణయించనున్నారు. ► పట్టణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5లక్షలకు మించకూడదు. ఆ«ధార్ కార్డులో పేర్కొన్న విధంగా లబ్ధిదారు పేరు, పాస్‌పోర్టు ఫొటో, జిల్లా, మండలం, ఆధార్ నంబర్, చిరునామా, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్ కోడ్, బ్రాంచి, మొబైల్ నంబరు తదితర వివరాలను దరఖాస్తులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు జిరాక్స్ జత చేయడం తప్పనిసరి. ఆదాయ ధ్రువీకరణ కోసం పరుగులు ► దరఖాస్తుతో పాటు ఆదాయం, బ్యాంకు ఖాతా, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులను కోరుతున్నారు. అన్ని పత్రాలు ఉన్నా ఆదాయ ధ్రువపత్రం అందరి వద్ద లేకపోవడంతో దానికోసం పరుగులు పెడుతున్నారు. ► ఆదాయ ధ్రువపత్రం పొందేందుకు రూ.10, రూ.20 విలువ ఉన్న స్టాంపు పత్రం అవసరం. కానీ జిల్లాలో ఇవి కొరత ఉండటంతో రూ.50, రూ.100 విలువ ఉన్న స్టాంపు పత్రాలను కొనాల్సి వస్తోంది. జిల్లాకేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు 20కి పైగా స్టాంప్ వెండర్లు ఉన్నారు. ► వీరివద్ద తక్కువ ధర పత్రాలు లేకపోవడంతో అధిక ధర వెచ్చించి కొనాల్సి వస్తోంది. రూ.50 విలువ గల పత్రానికి రూ.70, రూ.100 విలువ ఉన్న పత్రానికి రూ.130 వసూలు చేస్తున్నారు. ఇలా ఒక దరఖాస్తుకు రూ.200 వరకు ఖర్చవుతోందని బా«ధితులు ఏకరవు పెడుతున్నారు. పది రోజులుగా ఆధార్ సర్వర్‌డౌన్ జిల్లాలో పదిరోజులుగా ఆధార్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కారణంగా సాంకేతిక సమస్యలతో సైట్ ఓపెన్ కావడం లేదు. కేంద్రాల నిర్వాహకులు మౌజ్లతో ఎంత కుస్తీ పట్టినా చివరికి నిరాశే ఎదురవుతోంది. దీంతో రైతులు, పింఛన్ ఆశావహులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నాలుగు ఈసేవా కేంద్రాలు, మండలాల్లో 15, బ్యాంకుల్లో 65 ఆధార్‌సేవా కేంద్రాలు, మీసేవాల్లో 54 కేంద్రాల ద్వారా ఆధార్ నమోదు జరుగుతోంది. రైతుబీమాకు మూడు రోజులే అవకాశం ఉండడంతో రైతులు రోజూ మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ గడువు ముగిసిందంటే మరో సంవత్సరం వరకు వేచిచూడాల్సిందే. వృద్ధాప్య పింఛన్ వయసును 57కు కుదించడంతో దరఖాస్తు చేసేందుకు చాలామంది మీ సేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. తీరా కేంద్రానికి వెళ్లాకా ఆధార్‌లో అర్హత వయసు లేకపోవడంతో తిరుగుముఖం పడుతున్నారు. వీరికి కూడ ఈ నెల ఆఖరు చివరి తేది. సర్వర్ డౌన్ కారణంగా రాష్ట్రమంతటా ఇదే సమస్యని అధికారులు చెబుతున్నారు. వర్షన్లు చేంజ్ కావడం, మాడిఫికేషన్ అయినకొలది బేసిక్ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. దీంతో సైట్ ఓపెన్ కావడం లేదని అధికారులు వివరించారు. రూ.వంద తీసుకున్నరు మా నానమ్మ ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేద్దామని కలెక్టరేట్ సమీపంలోని మీ సేవ కేంద్రానికి వెళ్లాను. సంబంధిత పత్రాలు తీసుకున్నారు. అయిపోయింది రూ.వంద ఇవ్వమని అడిగారు. ఇదేంటంటే మాకెమన్న ప్రభుత్వమిస్తదా.. అంటూ మాట్లాడారు. వారి ఛీత్కారపు మాటలకు తాళలేక డబ్బులిచ్చేశా. – రాజేందర్, మంకమ్మతోట దర్జాగా వసూలు చేస్తున్నారు ప్రభుత్వం ఉచితంగా దరఖాస్తులు తీసుకుసేందుకు అవకాశమిచ్చిందని మీ సేవ సెంటర్‌కు వెళ్తే దర్జాగా వసూలు చేస్తున్నారు. మా తాతది అప్లై చేద్దామని భగత్‌నగర్‌లోని మీ సేవ కేంద్రానికి వెళ్లా. సంబంధిత పత్రాలిచ్చాకా రూ.80 తీసుకున్నారు. ఇదేంటీ ఉచితం కదా అంటే.. అది పేపరోళ్లు గట్లనే రాస్తరు. వాస్తవం వేరు అన్నారు. – కరుణ, కట్టరాంపూర్ చదవండి: ఇన్స్పెక్టర్ అరెస్టు: దోపిడీ కేసులో పోలీసుల ఉదాసీనం -
ప్రతి రోజు రూ.40 పొదుపుతో.. నెలకు రూ.10 వేల పెన్షన్
అసంఘటిత రంగంలో ఉన్న పేద ప్రజలకు భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ పథకమే అటల్ పెన్షన్ యోజన(ఏపీవై). ఈ పథకం 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్డీఏ) ద్వారా అటల్ పెన్షన్ యోజన నడుస్తుంది. ఒక వ్యక్తి 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కనీసం 20 సంవత్సరాల పాటు ప్రతి నెల కొత్త మొత్తం పొదుపు చేస్తే ఆ తర్వాత నెలకు రూ. 5,000 పెన్షన్ లభిస్తుంది. అటల్ పెన్షన్ యోజన కింద చందాదారులకు నెలకు రూ.1000 నుంచి రూ. 5000 మధ్య గ్యారెంటీడ్ కనీస నెలవారీ పెన్షన్ అందుతుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 మేలో ప్రారంభించింది. దీనిలో చేరాలంటే బ్యాంక్ ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉంటే సరిపోతుంది. టెర్మినల్ వ్యాధి లేదా ఖాతాదారుడు మరణించిన పరిస్థితుల్లో మినహా పెన్షన్ ముందస్తుగా చెల్లించడం, ఏపీవై నుంచి నిష్క్రమించడం జరగదు. మీరు ముందుగా చేరితే తక్కువ మొత్తం ప్రతి నెల కట్టాల్సి వస్తుంది కాబట్టి త్వరగా మీ పేరు నమోదు చేసుకుంటే మంచిది. పీఎఫ్ఆర్డీఏ పెన్షన్ స్కీంలో ఒకటి కంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 18 సంవత్సరాలు వయస్సు గల చందాదారులు 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు నెలకు రూ.210 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 39 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వివాహిత జంటలు విడిగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 60 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ఈ జంటకు నెలకు రూ.10,000 సామూహిక పెన్షన్ లభిస్తుంది. 30 లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న భార్యాభర్తలు తమ తమ ఏపీవై ఖాతాల్లో నెలకు రూ.577 పొదుపు చేయాల్సి ఉంటుంది. అంటే నెలకు ఇద్దరికీ కలిపి రూ.1154 (రోజుకి 1154/30 = రూ. 38.46) 30 ఏళ్ల వరకు పొదుపు చేస్తే 60 ఏళ్ల తర్వాత ఇద్దరికీ కలిపి ప్రతి నెల రూ. 10 వేల రూపాయల పెన్షన్ వస్తుంది. ఒకవేళ జంటకు 35 సంవత్సరాల వయస్సు ఉన్నట్లయితే వారి సంబంధిత ఏపీవై ఖాతాల్లో నెలవారీ కంట్రిబ్యూషన్ రూ.902కు పెరుగుతుంది. -
ఆత్మలకు ఆసరా.. ఏళ్లుగా చనిపోయిన వారికి పెన్షన్లు..
సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్): రాజన్నసిరిసిల్ల జిల్లాలో చనిపోయిన వారికి పింఛన్లు వస్తున్నాయి. బతికుండి.. అన్ని అర్హతలున్న వారు ఏళ్లుగా ఆఫీస్‌లు చుట్టూ తిరిగిన అధికారులు కనికరించడం లేదు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపు లేని తనం.. బాధ్యతా రాహిత్యం మూలంగా వందలాది మంది మృతులు ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. నెలవారీగా తనిఖీలు చేసి చనిపోయిన వారి పేర్లు తొలగించాల్సి ఉంది. కానీ మున్సిపల్ అధికారుల పట్టింపులేని తనంతో సచ్చినోళ్ల బ్యాంకు ఖాతాల్లో ప్రజాధనం పడుతూనే ఉంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు నివేదిక ఆధారంగా మృతుల పేర్లను ఎంపీడీవోలు తొలగిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో మృతులకు ఆసరా పెన్షన్లు వస్తున్నా.. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లోనే ఎక్కువగా ఆత్మల పేరిట ఆసరా పొందుతున్నారు. ఇప్పటికైన జిల్లా అధికారులు సచ్చినోళ్ల పెన్షన్లు తొలగించి అర్హులకు ఆసరా కల్పిస్తే.. ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంతో పాటు ప్రజాధనానికి సార్థకత ఉంటుంది. సిరిసిల్లలోని కార్మికక్షేత్రం బీవై నగర్‌లోని ఇంటి నంబరు 11–01–40లో నివసించే కోనమ్మగారి భూలక్ష్మి(78) ఐదేళ్ల కిందటే కాలం చేసింది. కానీ ఆమెకు ఇంకా వృద్ధాప్య పెన్షన్ రూ.2,016 వస్తూనే ఉంది. ఆమె బ్యాంకు ఖాతాలో ఆసరా డబ్బులు పడుతున్నాయి. ఆమె పెన్షన్ నంబరు 12402 కేఏ0339114000 ద్వారా ఐదేళ్లుగా ప్రజాధనం బినామీల పాలవుతుంది. ఇలా సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతోపాటు జిల్లావ్యాప్తంగా వెయ్యి మందికి పైగా సచ్చినోళ్ల పేరిట ప్రతీ నెల ఆసరా పెన్షన్ సొమ్ము జమవుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా చనిపోయిన వారికి ఆసరా పెన్షన్ డబ్బులు ఇవ్వడంతో నెలకు రూ.20.16 లక్షల మేరకు ప్రజాధనం వృథా అవుతోంది. అర్హుడి వేదన.. అరణ్య రోదన ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన ఎక్కలదేవి రవి(30) మానసిక వికలాంగుడు. అతని తల్లిదండ్రులు దేవవ్వ, పుట్టయ్య దినసరి కూలీలు. రవికి పెన్షన్ ఇప్పించాలని కోనరావుపేట మండల అధికారుల చుట్టూ తిరిగారు. సిరిసిల్ల ఆస్పత్రికి సదెరం సర్టిఫికెట్ కోసం వచ్చారు. సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో మానసిక వికలాంగులకు పరీక్షలు చేసే వైద్యుడు లేక సదెరం సర్టిఫికెట్ రాలేదు. ఫలితంగా ఆ అభాగ్యుడికి సర్కారు సాయం అందడం లేదు. ఇలాంటి అన్నీ అర్హతలు ఉన్న వారికి ఆసరా కల్పించే మానవత్వం అధికారుల్లో లోపించింది. ఇలాంటి వారు జిల్లాలో ఎందరో ఉన్నారు. వీరంతా ‘ఆసరా’ అమరులు ► సిరిసిల్ల పట్టణంలోని ఇంటి నంబరు 10–8–83లో మూడేళ్ల క్రితం చనిపోయిన కట్ల మల్లవ్వకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. బీవై నగర్లో ఇంటి నంబరు 11–1–48లో నాలుగు నెలల క్రితం మరణించిన కుడిక్యాల రాజేశం అనే నేత కార్మికుడి ఇంకా పెన్షన్ అందుతుంది. ► బీవై నగర్‌లోని ఇంటి నంబరు 11–2–52లోని దూస సుశీల ఏడాది కిందట మరణించినా వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. ► నాలుగేళ్ల క్రితం మరణించిన సుంక పోచవ్వ అనే వితంతువుకు, మూడు నెలల క్రితం మరణించిన పోగుల రాధవ్వ వితంతువు పెన్షన్ వస్తుండగా.. మూడు నెలల కిందట మరణించిన వెంగళ ► బాలనారాయణకు నేత కార్మికుడి పెన్షన్, నాలుగు నెలల కిందట మరణించిన అల్లె రామస్వామికి నేత కార్మికుడి పెన్షన్ వస్తుంది. ► సిరిసిల్ల బీ.వై.నగర్లో వివిధ కారణాలతో 15 నెలల క్రితం మరణించిన వృద్ధురాలు గూడూరి శాంతవ్వ, నాలుగేళ్ల క్రితం మరణించిన బూర లింగయ్య, మూడేళ్ల కిందట మరణించిన గాజుల చంద్రవ్వ, మూడేళ్ల కిందటే మరణించిన బొద్దుల పుణ్యవతి, రెండు నెలల కిందట మరణించిన కొండ రాజేశం ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. తప్పకుండా చర్యలు తీసుకుంటాం చనిపోయిన వారికి ఆసరా పెన్షన్ ఇవ్వడం తప్పు. మున్సిపాలిటీల్లో కమిషనర్లు క్షేత్రస్థాయి నివేదికలతో చనిపోయిన వారి పెన్ష న్ తొలగించాల్సి ఉంటుంది. తప్పకుండా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. చనిపోయిన వారి డబ్బులు ఎవరు తీసుకున్నా రికవరీ చేయిస్తాం. దీనిపై మున్సిపల్ కమిషనర్లకు లేఖలు రాస్తాం. – కౌటిల్యరెడ్డి, డీఆర్డీవో -
ప్రతి నెల రూ.55 పొదుపుతో.. నెల నెల రూ.3000 పెన్షన్
భవిష్యత్‌లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఎందులో పొదుపు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. అసంఘటిత రంగంలోని 10 కోట్ల పెద ప్రజల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మీరు కనుక ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి నెల రూ.3,000 పెన్షన్ పొందవచ్చు. ఈ పెన్షన్ స్కీమ్ పేరు ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన. ఇందులో చేరాలంటే నెల ఆదాయ రూ.15 వేలు మించకూడదు. అలాగే, నేషనల్ పెన్షన్ స్కీమ్, ఈసీఐఎస్, ఈపీఎఫ్ ఓ వంటి వాటిలో మీ పేరు ఉండకూడదు. 18 నుంచి 40 ఏళ్ల లోపు వయసు ఉన్న నెలకు రూ.15,000 కంటే తక్కువ ఆధాయం సంపాదించే కార్మికుడు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. ఈ పథకం ఎంచుకున్న వాళ్లు వారి వయస్సును(18 నుంచి 40) బట్టి రూ.55 నుంచి రూ.200 మధ్య ప్రతి నెల 60 ఏళ్లు వచ్చే వరకు చెల్లించాల్సి ఉంటుంది. అంతే మొత్తం ప్రభుత్వం తరఫున జమ అవుతుంది. ఇక మీకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రతి నెల రూ.3,000లను పెన్షన్ రూపంలో పొందవచ్చు. ఒకవేల పొదుపు పథకంలో చేరిన 10 ఏళ్ల కంటే ముందే నిష్క్రమిస్తే, చందాదారుడు జమ చేసిన మొత్తానికి వడ్డీతో కలిపి బ్యాంకులో కలిపి వేస్తారు. పదేళ్ల తర్వాత, 60 ఏళ్లకు ముందే స్కీమ్ నుంచి వైదొలిగితే ఫండ్ ద్వారా సంపాదించిన వడ్డీ లేదా పొదుపు బ్యాంకు వడ్డీ రేటులో ఏది ఎక్కువైతే అది ఖాతాలో లబ్ధిదారుడి వాటాతో జమాచేస్తారు. పేరు నమోదు చేసుకోవడం ఎలా..? అర్హత ఉన్న చందాదారులు కామన్ సర్వీస్ సెంటర్స్(సీఎస్సీ)లకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ సెంటర్ల జాబితా ఎల్ఐసీ ఇండియా శాఖల్లో లభిస్తాయి. ఈ పెన్షన్ పథకంలో చేరేందుకు పొదుపు బ్యాంకు ఖాతా/ జన్ ధన్ ఖాతా, ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. దేశవ్యాప్తంగా 3.13 లక్షల సీఎస్సీ సెంటర్లలో నమోదు చేసుకునే సదుపాయం ఉంది. చదవండి: ఫోన్ బ్యాటరీ లైఫ్‌లో సమస్యలా? ఈ 5 చిట్కాలు ఫాలో అవండి -
ప్రతి రోజు రూ.7 పొదుపుతో.. నెలకు రూ.5 వేల పెన్షన్
అటల్ పెన్షన్ యోజన(ఎపీవై) అనేది భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న పెన్షన్ పథకం. దీనిని బీమా రెగ్యులేటర్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఎ) నిర్వహిస్తుంది. పదవీ విరమణ సమయంలో స్థిర పెన్షన్ కోసం పెట్టుబడి పెట్టాలని చూస్తున్న వ్యక్తుల కోసం అటల్ పెన్షన్ యోజన అనేది సరైన ఎంపిక. అసంఘటిత రంగంలోని ప్రజలకు వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించడానికి ప్రభుత్వం 1 జూన్ 2015న ఈ పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కోసం మీరు ప్రతిరోజూ 7 రూపాయలు పొదుపు చేస్తే ప్రతి నెల రూ.5 వేల పెన్షన్ తీసుకోవచ్చు. ఇది 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వారికి అందుబాటులో ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత లబ్ధిదారులకు రూ.1000 నుంచి 5,000 రూపాయల వరకు పెన్షన్ ఇవ్వబడుతుంది. పెట్టుబడిదారుడి వయస్సు, మొత్తాన్ని బట్టి పెన్షన్ నిర్ణయించబడుతుంది. మీరు పొదుపు చేసే నగదును బట్టి ప్రతి నెల రూ.1000 నుంచి రూ.5000 వరకు పొందవచ్చు. ఈ పథకంలో చేరాలంటే సేవింగ్ బ్యాంకు అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ కలిగి ఉండటం తప్పనిసరి. ఈ పథకానికి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగాలు అనర్హులు. ఈ పథకం కింద ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సిసిడి(1 బి) కింద వినియోగదారులకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. చందాదారులకు నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధ-వార్షిక ప్రాతిపదికన పొదుపు ఖాతా డబ్బులను జమ చేయవచ్చు. నెలకు రూ.1,000 నుంచి 5,000 రూపాయల స్థిర నెలవారీ పెన్షన్ పొందాలంటే, చందాదారుడు 18 సంవత్సరాల వయస్సులో చేరితే నెలకు రూ.42 నుంచి 210 రూపాయల వరకు ప్రీమియం చెల్లించాలి. అదే 40 సంవత్సరాల వయస్సులో చేరితే నెలకు రూ.291 నుంచి రూ.1,454 మధ్య ప్రీమియం చెల్లించాలి. ఎన్‌పిఎస్ ట్రస్ట్ వెబ్సైట్లో ఎపివై కాలిక్యులేటర్ ఉంది. దీని ద్వారా మీరు మీ వయస్సు, ప్రతి నెల పెన్షన్ ఎంత కావాలో నమోదు చేస్తే నెలకు ఎంత ప్రీమియం చెల్లించాలో చూపిస్తుంది. చదవండి: ఈ పోటీలో గెలిస్తే రూ.50 వేలు మీ సొంతం? -
61.45 లక్షల మందికి నేడు పింఛన్లు పంపిణీ
-
61.45 లక్షల మందికి నేడు పింఛన్లు పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 61.45 లక్షల వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు నేడు పింఛన్ల పంపిణీ జరగనుంది. ఈ నెలలో కొత్తగా పింఛన్లు మంజూరు అయిన 59,062 మందికి కలిపి పంపిణీ కొనసాగనుంది. వీరందరికీ పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 1,483.68 కోట్లను శుక్రవారం సాయంత్రానికే ఆయా గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. శనివారం తెల్లవారుజాము నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వలంటీర్లు పింఛను డబ్బులు పంపిణీ చేస్తారు. పింఛనుదారుడి బయోమెట్రిక్, ఐరిస్ గుర్తింపు.. లేదంటే రియల్‌టైం బెనిఫీషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఆర్బీఐఎస్) విధానాలలో పంపిణీ చేస్తారు. ఈ మూడు ప్రక్రియల ద్వారా ఏ లబ్ధిదారుడికైనా పంపిణీలో ఇబ్బంది కలిగితే ఆ లబ్ధిదారుని కుటుంబ సభ్యుల బయోమెట్రిక్ ద్వారా వలంటీర్లు పంపిణీ చేస్తారు. వలంటీర్ల ద్వారా జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి సచివాలయ పరిధిలో డిజిటల్ అసిస్టెంట్ స్వయంగా పర్యవేక్షిస్తారని.. జిల్లా స్థాయిలో పర్యవేక్షణకు ఆయా జిల్లాల డీఆర్డీఏ ఆఫీసులో పర్యవేక్షణ కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. (చదవండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సలకు ఫీజుల నిర్ధారణ) -
పెన్షన్లలో కేంద్రం వాటా ఎంత?
సాక్షి, సిద్దిపేట: వెనుకటికి పప్పులో చిటికెడు ఉప్పువేసి పప్పంతా నాదే అన్న చందంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి టి. హరీశ్‌రావు విమర్శించారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి దౌల్తాబాద్, రాయపోలు మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి ఏడాదికి రూ.11,720 కోట్లు కేటాయిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.210 కోట్లు మాత్రమే కేటాయించి పెన్షన్ డబ్బులు తామే ఇస్తుందని ప్రచారం చేయడం విడ్డూరమన్నారు. వేమలఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్‌తో పాటు ఇతర ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండి అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వం చూస్తే వారి తరపున కోర్టుకు వెళ్లింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. దీంతో వారికి పరిహారం, ఇతర సదుపాయాలు ఆలస్యమయ్యాయని చెప్పారు. టీఆర్ఎస్ విజయాన్ని ఆపలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం ఆపేశక్తి ఎవరికీ లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో సుజాతకు ప్రజలు బ్రహ్మరథం పట్టడాన్ని చూసిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు మైండ్ బ్లాక్ అవుతోందని చెప్పారు. దుబ్బాకలో కాంగ్రెస్ నేతలకు తొవ్వ చూపించే నాథుడే కరువయ్యారని ఎద్దేవా చేశారు. (చదవండి: దుబ్బాక: ఎన్నికల ప్రచారం రసవత్తరం) -
తెలుగు తమ్ముళ్ల వీరంగం
-
తెలుగు తమ్ముళ్ల వీరంగం, కెమెరాలో రికార్డు
సాక్షి, అనంతపురం: అమరాపురం మండలం వి.అగ్రహారంలో టీడీపీ మాజీ ఎంపీటీసీ తిప్పేస్వామి వీరంగం సృష్టించాడు. అక్రమంగా ఫించన్ల సొమ్ముని కొట్టేయడంతో పాటు విచారణ సందర్భంగా మహిళా వలంటీర్‌ను తీవ్ర దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా వలంటీర్ వరలక్ష్మిపై చెప్పుతో దాడికి యత్నించాడు. వివరాలు.. డప్పు కళాకారుల పేరుతో కొన్నేళ్లుగా టీడీపీ మాజీ ఎంపీటీసీ తిప్పేస్వామి పింఛన్ సొమ్ముని స్వాహా చేస్తున్నాడు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి 14 అనర్హుల పింఛన్లను తొలగించారు. అయితే, విచారణకు సందర్భంగా తిప్పేస్వామి తన అనుచరులతో కలిసి రెచ్చిపోయాడు. వలంటీర్ వరలక్ష్మిపై చెప్పుతో దాడి చేసేందుకు యత్నించాడు. తీవ్రంగా తిట్టాడు. తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. (చదవండి: ఒక మహిళ.. రెండు పింఛన్లు) -
ఒక మహిళ.. రెండు పింఛన్లు
కర్నూలు (టౌన్): నగరంలోని ఓ మహిళ రెండు పింఛన్లు తీసుకుంటున్నట్లు వార్డు కార్యదర్శి విచారణలో బయటపడింది. దీంతో ఉన్నతాధికారులు రికవరీకి ఆదేశించారు. వివరాలు.. స్థానిక 41వ వార్డు 110 సచివాలయం పరిధిలో నివాసం ఉంటున్న పి.లక్ష్మీదేవి భర్త పి.రామకృష్ణారెడ్డి.. ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తూ రిటైర్డ్ అయ్యారు. కొంతకాలానికి అతను మృతిచెందారు. దీంతో అతని భార్య లక్ష్మీదేవికి నెలనెలా ఫ్యామిలీ పింఛన్ వస్తోంది. ఈ విషయం దాచిపెట్టి వృద్ధాప్య పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడంతో 2011 మంజూరైంది. ఫ్యామిలీ పింఛన్‌తో పాటు ప్రతినెలా రూ.200 చొప్పున 2017 జూన్ వరకు వృద్ధాప్య పింఛన్ తీసుకుంది. స్థానికురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటీవల వార్డు సచివాలయ కార్యదర్శి అంతర్గతంగా విచారణ చేశారు. 2011 నుంచి 2017 వరకు రెండు పింఛన్లు తీసుకుంటున్నట్లు వెల్లడైంది. తప్పుడు ధ్రువ పత్రాలు ప్రభుత్వానికి సమర్పించి స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేయించి, మహిళపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు నగరపాలక కమిషనర్ డి.కె. బాలాజీకి లేఖ రాశారు. అలాగే ఇదే విషయాన్ని ఏపీఎస్పీ కమాండెంట్ దృష్టికి తీసుకెళ్లాలని లేఖలో సూచించారు. -
పెన్షన్ల పండుగ
-
‘ఆ హక్కు రాష్ట్రానికి లేదు’
సాక్షి, హైదరాబాద్ : పింఛన్లలో 25 శాతం ప్రభుత్వం కోత విధించడంపై దాఖలైన పిటీషన్‌ను బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ రంగయ్య, చిక్కడు ప్రభాకర్.. రాష్ట్ర వ్యాప్తంగా తొలగించిన 3 లక్షల పింఛన్లను వెంటనే విడుదల చేయించాలని కోర్టుకు విన్నవించారు. పింఛన్లలో కోత విధించే హక్కు రాష్ట్రాలకు లేదని పేర్కొన్నారు. పింఛన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దీనిలో కోత విధించడానికి వీల్లేదని వాదించారు.(తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు) ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై మరోసారి చర్చించి నిర్ణయం చెబుతామని కోర్టుకు వివరించారు. జూన్ నుంచి పూర్తిస్థాయిలో పింఛన్లు అందజేస్తున్నామని వెల్లడించారు. కాగా ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేసింది. ('ప్రత్యేక బోగీల ఏర్పాటు వీలుకాదు') -
సీనియర్ సిటిజన్లకు మరో చాన్స్
ఎల్ఐసీ ఆఫర్ చేస్తున్న పెన్షన్ పథకమే ప్రధానమంత్రి వయవందన యోజన (పీఎంవీవీవై). ఇందులో చేసిన పెట్టుబడులపై పదేళ్ల పాటు క్రమం తప్పకుండా పెన్షన్ లభిస్తుంది. పదవీ విరమణ తీసుకున్న వారికి.. వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి అందుబాటులో ఉన్న మెరుగైన పథకాల్లో ఇది కూడా ఒకటి. దీనిని 2017 మే నెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. తొలుత ఏడాది పాటు ఇన్వెస్ట్‌మెంట్‌కు అవకాశం ఇవ్వగా, ఈ గడువును 2020 మార్చి వరకు పొడిగించారు. తాజాగా దీనిని మరో మూడేళ్ల పాటు 2023 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కనుక ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేయని వారికి మరో మూడేళ్ల పాటు ఇది అందుబాటులో ఉన్నట్టే. 60 ఏళ్లు, అంతకుపైన వయసున్న ప్రతీ ఒక్కరూ ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అర్హులే. ఇన్వెస్ట్మెంట్ కాల వ్యవధి 10 ఏళ్లు. ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల పాటు పెన్షన్ అందుకోవచ్చు. గడువు తీరిన తర్వాత పెట్టుబడి మొత్తం(చార్జీలు పోను) తిరిగి వస్తుంది. ఒకవేళ పాలసీ కాల వ్యవధిలో మరణం చోటు చేసుకుంటే నామినికీ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లి కానీ, లేదా ఎల్ఐసీ ఆన్లైన్ పోర్టల్ నుంచి కానీ ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెన్షన్ చెల్లింపులు ఇలా.. ఇన్వెస్ట్ చేసి, ప్రతీ నెలా నిర్ణీత మొత్తం పెన్షన్‌గా అందుకోవాలని ఆశించే వారి ముందున్న స్థిరాదాయ పథకాల్లో.. పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌తోపాటు పీఎంవీవీవై కూడా ఒకటి. ఈ పథకంలో పెట్టుబడిపై 2020–21 ఆర్థిక సంవత్సరానికి 7.40 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. కనీస నెలవారీ పెన్షన్ రూ.1,000. గరిష్ట నెలవారీ పెన్షన్ రూ.10,000. త్రైమాసికం వారీగా అయితే కనీసం రూ.3,000, గరిష్టంగా రూ.30,000, ఆరు నెలలకోసారి అయితే కనీసం రూ.6,000, గరిష్టంగా రూ.60,000.. వార్షికంగా అయితే కనీసం రూ.12,000, గరిష్టంగా రూ.1,20,000 పెన్షన్ రూపంలో పొందే అవకాశం ఉంది. నెలవారీగా కనీసం రూ.1,000 పెన్షన్ తీసుకోవాలని భావిస్తే చేయాల్సిన పెట్టుబడి రూ.1,62,162. వార్షికంగా ఒకే విడత రూ.12,000 పెన్షన్ కోసం రూ.1,56,658ని ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఈ పాలసీలో గరిష్టంగా ఒక వ్యక్తి రూ.15లక్షలను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెఫ్ట్ లేదా ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ రూపంలో పెన్షన్ చెల్లింపులు అందుకోవచ్చు. రాబడులు.. వడ్డీ రేట్ల క్షీణత ప్రభావం పీఎంవీవీవైపైనా పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు 8 శాతం రాబడి రేటు ఉండగా, దీనికి 7.40 శాతానికి కేంద్రం తగ్గించింది. పైగా 2020–21 సంవత్సరానికే ఈ రేటు వర్తిస్తుంది. ఆ తర్వాత ప్రతీ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో సంబంధిత సంవత్సరానికి రేటును నిర్ణయిస్తారు. చిన్న మొత్తాల పొదుపు పథకాల మాదిరే పీఎంవీవీవై పథకం రేట్లను కూడా సవరించాలని కేంద్రం తాజాగా నిర్ణయించడం గమనార్హం. పైగా గరిష్ట రేటు 7.75 శాతానికే పరిమితం చేశారు. ఈ ఏడాది మార్చి వరకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.6 శాతం వడ్డీ రేటుతో అత్యంత ఆకర్షణీయమైన సాధనంగా ఉండేది. కానీ, ఇటీవలే కేంద్రం ఈ రేటును 7.4 శాతానికి తగ్గించేసింది. దీనికి తగినట్టుగానే పీఎంవీవీవై పథకంలో రేటును గతంలో ఉన్న 8 శాతం నుంచి 7.4 శాతానికి సవరించినట్టు అర్థం చేసుకోవాలి. దీంతో రాబడుల పరంగా రెండు పథకాల మధ్య వ్యత్యాసం లేకుండా పోయింది. పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కాల వ్యవధి ఐదేళ్లు. ఆ తర్వాత మూడేళ్లు కొనసాగించుకోవచ్చు. పీఎంవీవీవైతో పోలిస్తే తక్కువ కాల వ్యవధి ఉండడం ఇందులోని సౌలభ్యం. పన్ను బాధ్యతలు.. పీఎంవీవీవైలో పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలు లేవని గుర్తుంచుకోవాలి. ఈ పథకంలో అయినా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో అయినా అందుకునే రాబడి వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఎవరికి వారే తమ వ్యక్తిగత ఆదాయ శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే అందుకునే ఆదాయం మొత్తం రూ.50వేలు మించకపోతే సెక్షన్ 80టీటీబీ కింద సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పన్ను రాయితీ పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు పెట్టుబడుల్లో రూ.1.50 లక్షల మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ రెండింటిలో ఏ పథకంలో అయినా గరిష్ట పెట్టుబడి రూ.15 లక్షలుగానే ఉంది. కనుక ఒక పథకంలో రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయగా, ఇంకా అదనంగా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే రెండో పథకాన్ని ఎంచుకోవచ్చు. ముందుగా వైదొలగాలంటే.. పీఎంవీవీవై పదేళ్ల కాల వ్యవధి పథకం. అసాధారణ పరిస్థితుల్లో పదేళ్లకు ముందుగానే పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఉంది. ఉదాహరణకు.. ప్రాణాంతక, తీవ్ర వ్యాధుల్లో చికిత్సల కోసం పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు. పాలసీదారు, ఆమె లేదా అతని జీవిత భాగస్వామి చికిత్సల ఖర్చుల కోసం ఇం దుకు అనుమతిస్తారు. ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 98% సరెండర్ వ్యా ల్యూగా లభిస్తుంది. పీఎంవీవీవైలో ఇన్వెస్ట్ చేసిన మూడేళ్ల తర్వాత నుంచి రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పెట్టుబడి మొత్తం విలువలో 75% వరకు రుణ అర్హత ఉంటుంది. ఎల్ఐసీయే రుణ సదుపాయం కల్పిస్తుంది. ఇచ్చిన రుణానికి చెల్లించాల్సిన మొ త్తాన్ని పెన్షన్ చెల్లింపుల నుంచి మినహాయించుకుంటుంది. గడువు తీరే వరకు ఆ రుణం బకాయిలు మిగిలి ఉంటే.. చివరిగా చేసే చెల్లిం పుల మొత్తం నుంచి ఆ మేరకు మినహాయించుకోవడం జరుగుతుంది. లుకప్ పీరియడ్.. పీఎంవీవీవైలో ఇన్వెస్ట్ చేసిన వారు తమకు పథకం వివరాలు నచ్చకపోతే 15 రోజుల్లోపు (ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేసిన వారికి 30 రోజులు) వెనక్కిచ్చేయవచ్చు. దీన్నే లుకప్ పీరియడ్‌గా పేర్కొంటారు. స్టాంప్ చార్జీల మేరకు నష్టపోవాల్సి వస్తుంది. చార్జీలు ఉన్నాయ్.. పీఎంవీవీవైలో పెట్టుబడులపై తొలి ఏడాది 0.50 శాతాన్ని వ్యయాల కింద కోసుకునేందుకు వీలుంది. రెండో ఏడాది నుంచి తదుపరి తొమ్మిదేళ్లు ఈ చార్జీ 0.3 శాతంగా అమలవుతుంది. అయితే, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో ఈ విధమైన చార్జీలు ఏవీ ఉండవు. కనుక రెండింటిలో ఒకటే కోరుకునేట్టు అయితే.. మూడు నెలలకు ఓసారి పెన్షన్ వచ్చినా ఇబ్బంది లేదనుకునే వారికి.. పీఎంవీవీవైతో పోలిస్తే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ బెటర్. పూర్తి భద్రత.. ఈ పథకంలో పెట్టుబడులు, రాబడులకు పూర్తి భద్రత ఉంటుంది. ఎందుకంటే ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వ హామీ ఉంది. -
తల్లీ, తండ్రి లేనోడన్నా కనికరించలే..!
వనపర్తి: పుట్టుకతో వికలాంగుడు పెన్షన్ ఇప్పించండనీ ఎంత మందిని వేడుకున్నా కనికరించలేదని ఓ వృద్ధురాలు సాయం కోసం కలెక్టర్‌ను ఆశ్రయించారు. వికలత్వ శాతంను ధ్రువీకరించే సదరం సర్టిఫికెట్ మంజూరై రెండేళ్లు కావస్తోంది. ఇప్పటికీ ఆసరా పెన్షన్ మంజూరు చేయలేదు. నలుగురు కార్యదర్శులు మారినా మాకుమాత్రం పెన్షన్ రాలేదని ఆ వృద్ధురాలు మనవడిని చూస్తూ అధికారులను వేడుకుంది. స్పందించిన డీఆర్డీఓ పెన్షన్ కోసం దరఖాస్తు చేశారా అనే విషయంపై విచారణ చేయగా.. 2019 డిసెంబర్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసినట్లు గుర్తించారు. గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన కె.అరుణ్‌కు ప్రభుత్వం నుంచి 2018 మే 9న సదరం సర్టిఫికెట్ జారీ చేశారు. 47శాతం వికలత్వం ఉన్నట్లు ధ్రువీకరించారు. తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మనే పెంచుతోంది. (దయ.. ‘తల్లి’చేదెవరు!) -
అభయహస్తం లబ్ధిదారులకు ‘ఆసరా’
సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్ల అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అభయహస్తం పథకం పింఛన్‌దారుల వివరాలను సేకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. అభయహస్తం పథకం అమలు తీరుపై గురువారం తన చాంబర్లో అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆసరా లబ్ధిదారులకు నెలకు రూ. 2,016 చొప్పున అందుతున్నాయన్నారు. గతంలో అభయహస్తం లబ్ధిదారులుగా ఉన్న 1.90 లక్షల మందికి ఆసరా కింద ప్రయోజనం దక్కడంలేదని, వీరందరికి ఆసరా పింఛన్లు అందజేసే దిశగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణకు నిధుల కొరత ఉందని, ఈ సమస్యను అధిగమించేందుకు ఉపాధి హామీ నిధులను వినియోగించే అంశాన్ని పరిశీలించాలని ఆయన అధికారులకు సూచించారు. -
కొఠియాలో ఆంధ్ర పెన్షన్లు
ఒడిశా, కొరాపుట్: వివాదాస్పద కొఠియా గ్రామ పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధికారులు తరచూ ప్రవేశిస్తూ ప్రజలను ఆకర్షించే తీరులో పలు ప్రజా సంక్షేమ పథకాలు అందజేయడం పట్ల ఆ ప్రాంత సర్పంచ్‌లు కొరాపుట్ జిల్లా అధికారులపై మండిపడుతున్నారు. ఇటీవల అటవీ భూముల పట్టాలను ఆంధ్రప్రదేశ్ అధికారులు అందజేశారని, అలాగే బుధవారం తొలగంజాపొదర్, ఉపరగంజపొదర్, తొలసెంబి, ఉపరసెంబి, ధుయిపొదర్ గ్రామస్తులకు 40మందికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేసి, రూ. 2, 250 ప్రతి ఒక్క లబ్ధిదారునికి చెల్లించినట్లు తొలగంజపొదర్ మాజీ సర్పంచ్ బిసు గెమేల్ విలేకరులకు సమాచారం అందజేశారు. త్వరలో మరో వందమందికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ అధికారులు హామీ ఇచ్చి వెళ్లినట్లు ఆయన తెలిపారు. అంతకుముందు 19 మంది లబ్ధిదారులకు ఆంధ్రప్రభుత్వం తరఫున అటవీ భూముల పట్టాలను అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ మాదిరి తరచూ ఆంధ్రప్రదేశ్ అధికారులు వివాదాస్పద కొఠియా ప్రజలకు ప్రజా సంక్షేమ పథకాలు సమకూరుస్తున్న విషయమై పొట్టంగి తహసీల్దారు కొరాపుట్ జిల్లా అధికారులకు సమాచారం అందివ్వకపోవడం ఏమిటని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. -
‘వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వైఎస్సార్ చేయూత’
సాక్షి, అమరావతి : 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక సంవత్సరం నుంచి వైఎస్సార్ చేయూత పథకం అమలు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అర్హులైన పేద మహిళలకు నాలుగేళ్లలో రూ. 75 వేలు ఆర్థికసహాయం అందిస్తామని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేసిందని చెప్పారు. సాంకేతిక సమస్యలో లేక సమాచార లోపం వల్లనో ఎవరికైనా పెన్షన్ రాకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. సచివాయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాబు నిరూపించాలి..? 7 లక్షల పెన్షన్లు తొలగించామని ఆరోపిస్తున్న చంద్రబాబు దానిని నిరూపించగలరా..? అని బొత్స ప్రశ్నించారు. ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబు మారడం లేదని అన్నారు. బాబు హయాంలో ఇచ్చిన పింఛన్ల కంటే 2 లక్షల పింఛన్లు అదనంగా ఇస్తున్నామని తెలిపారు. కొత్తగా 6 లక్షలకు పైగా పింఛన్లు ఇస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని అర్హులందరికీ పెన్షన్లు ఇస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్ ఆశయానికి అనుగుణంగా పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. -
వచ్చే ఏడాది నుంచి వైఎస్సార్ చేయూత
-
‘ఐదు రోజుల్లోనే పింఛన్లు మంజూరు చేస్తాం’
సాక్షి, అమరావతి : అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అనర్హులను మాత్రమే తొలగించామని, సమగ్ర విచారణ అనంతరం ఇంకా అనర్హులుంటే తొలగిస్తామని స్పష్టం చేశారు. అర్హతలు ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఐదు రోజుల్లోనే పెన్షన్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. నిరంతరం ఈ ప్రక్రియ చేపడతామని తెలిపారు. చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా పెన్షన్లను తొలగించారని మంత్రి గుర్తు చేశారు. రికార్డు స్థాయిలో 50 లక్షల 50 వేల మందికి పింఛన్లు పంపిణీ చేశామని చెప్పారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి కూడా పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం వైఎస్సార్‌సీపీదేనని రామచంద్రారెడ్డి అన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో అర్హులు, అనర్హులు జాబితాలను పెట్టామని ఆయన వెల్లడించారు. రూ.15 వేల కోట్లు పెన్షన్లకు కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదని అన్నారు. చంద్రబాబు హయాంలో భర్త ఉన్న మహిళలకు కూడా వితంతు పెన్షన్ల ఇచ్చారని ఆరోపించారు. ఇప్పటికే 4 లక్షల మంది అనర్హుల పింఛన్లు తొలగించామని తెలిపారు. బాబు సొంత గ్రామమైన నారావారి పల్లెలో కూడా పారదర్శకంగా పెన్షన్ల జాబితా పెట్టామని, కానీ ఆయన తమపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ఐదు రోజుల్లోనే పెన్షన్లు మంజూరు చేస్తాం’
-
ఆమెకు 65.. ఆయనకు 48
కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలోని జీనులకుంట గ్రామానికి చెందిన ఓ టీడీపీ నేత వాస్తవానికి 1971వ సంవత్సరంలో జన్మించాడు. అయితే, పింఛను కోసం ఆధార్‌లో ఏకంగా 1956లో పుట్టినట్టు మార్పించుకున్నారు. అంటే.. 49 ఏళ్ల వయస్సును ఏకంగా 64 ఏళ్లకు మార్పు చేసుకొని అక్రమంగా పింఛను పొందుతున్నాడు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: అక్రమార్కులు ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు తెర తీస్తున్నారు. ప్రభుత్వం అడ్డుకట్ట వేశాం అనుకునేలోగా.. మరో కొత్త మోసం వెలుగులోకి వస్తోంది. సామాజిక భద్రత పింఛన్ల విషయంలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయి. తాజాగా వయస్సు మార్పుతో పింఛను పొందుతున్న వాళ్లు కొందరైతే.. కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్న వాళ్లు మరికొందరు. నడి వయస్కులు కూడా వృద్ధులుగా ఆధార్‌లో పుట్టిన తేదీని మార్పుకొని వృద్ధాప్య పింఛనుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. 60 ఏళ్లు పైబడినట్లుగా పుట్టిన తేదీలో మార్పులు చేసుకొని, పింఛను దరఖాస్తుకు కొత్త ఆధార్‌ను సమర్పిస్తున్నారు. ప్రధానంగా శింగనమల, తాడిపత్రి, కదిరి, పుట్టపర్తి, అనంతపురం, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో భారీగా ఇలాంటి మోసాలు జరిగినట్టు సమాచారం. బెంగళూరు, బళ్లారిలోని మీ సేవ కేంద్రం నిర్వాహకులు జిల్లాలోని ఏజెంట్ల ద్వారా ఈ తతంగం నడిపిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. పాన్‌కార్డు ద్వారా తతంగం ఆధార్‌లో వయస్సు మార్పుచేర్పులను గతంలో స్థానికంగా ఉన్న మీ సేవా కేంద్రాల్లో చేశారు. అయితే, ఇందులో అక్రమాలు బయటపడటంతో మీ సేవా కేంద్రాల్లో ఈ ఆప్షన్‌ను కుదించారు. కేవలం మూడేళ్ల పరిమితికి లోబడి మాత్రమే మార్పుచేర్పులు చేయాలని.. అది కూడా పాన్‌కార్డు వంటి సరైనఆధారాలు ఉంటేనే చేయాలని దాదాపు రెండేళ్ల క్రితం ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అక్రమాలకు కొద్దివరకు ఫుల్స్టాప్ పడింది. ఆ తర్వాత బ్యాంకులతో పాటు మరికొన్ని కొత్త ఏజెన్సీలకు ఆధార్‌లో మార్పుచేర్పులకు అవకాశం కల్పిస్తూ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఏజెన్సీలు పాన్‌కార్డు ద్వారా ఇష్టారీతిన వయస్సులో మార్పుచేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం పాన్‌కార్డు చూపిస్తే చాలు.. అందుకు తగినట్టుగా వయస్సులో మార్పులు చేస్తున్నట్టు సమాచారం. కొత్త పాన్‌కార్డు తీసుకుంటే సరి.. ఆధార్‌లో వయస్సు మార్పు చేర్పులు చేయడం ఇప్పుడు చాలా సులభమైన ప్రక్రియగా మారింది. అక్రమార్కులు తలుచుకుంటే నడివయస్కులు కూడా ఇట్టే ముసలివాళ్లు అయిపోతున్నారు. ఇందుకోసం కొత్తగా పాన్ కార్డు తీసుకుంటే సరిపోతుంది. పింఛనుకు అవసరమైన వయస్సుతో దరఖాస్తు చేసుకుంటే కొత్త పాన్‌కార్డు వచ్చేస్తుంది. దీని ఆధారంగా ఆధార్‌లో మార్పులు చేర్పులు చేసేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పింఛను మొత్తాన్ని పెంచిన నేపథ్యంలో వయస్సును పెంచి దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారంతా వయస్సులో మార్పుచేర్పులకు అక్రమార్కులను ఆశ్రయిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై అధికారులు లోతుగా విచారణ చేయిస్తే అక్రమాలు బట్టబయలు అయ్యే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆమెకు 65.. ఆయనకు 48 పుట్లూరు మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ వృద్ధాప్య పింఛను కోసం తన వయస్సును 65 సంవత్సరాలుగా మార్పు చేయించుకుంది. ఇందుకోసం ఓ దళారికి రూ.3వేలు ముట్టజెప్పింది. తాడిపత్రిలోని ఓ బ్యాంకులో నిర్వహిస్తున్న ఆధార్ కేంద్రంలో ఈ తతంగం సాగింది. అయితే ఈమె భర్త వయస్సు 48 సంవత్సరాలు కావడం గమనార్హం. -
ఛపాక్ ఎఫెక్ట్: యాసిడ్ బాధితులకు పెన్షన్!
విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ‘ఛపాక్’ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఛపాక్ ఇప్పుడు అసలు సిసలైన విజయాన్ని ముద్దాడబోతోంది. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథను ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ‘ఛపాక్’. ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కించిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే అద్భుత నటనను ప్రదర్శించింది. జనవరి 10న విడుదలైన ఈ సినిమా సగటు ప్రేక్షకునితోపాటు ఓ ప్రభుత్వాన్ని సైతం కదిలించింది. యాసిడ్ బాధితుల కోసం పెన్షన్ అందిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించడమే దీనికి నిదర్శనం. ఈ మేరకు ఆ రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య మాట్లాడుతూ.. యాసిడ్ బాధితులు సగౌరవంగా బతికేందుకు వారికి ప్రతినెల రూ.5000 నుంచి రూ.6000 అందిస్తామని వెల్లడించారు. ఈ మేరకు కేబినెట్లో ప్రతిపాదన తీసుకొస్తామని, అది ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక సహాయం ద్వారా ధీర వనితలు వారి ఆశయాలను సాధించడంలో దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఈ సినిమాకు వినోదపు పన్నును మినహాయించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఛపాక్ మూవీ రివ్యూ) -
చాయ్ తాగుతవా? అని అడుగుతోంది!
సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్లపై సభ్యులు బాల్క సుమన్, గొంగిడి సునీత అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓ సన్నివేశాన్ని చెప్పా రు. ‘మా జిల్లాలో రాయ్‌పర్తి గుండా వెళ్తుంటే ఎప్పుడూ ఓ ముసలావిడ నాకు అడ్డువచ్చేది. కలిసినప్పుడల్లా రూ.100, రూ.200 ఇస్తుండే వాణ్ని. ఈ మధ్య అలా ఇస్తుంటే తీసుకోలే. కేసీఆర్ నా కొడుకు లెక్క పింఛన్ ఇస్తుండు. ఇప్పటిదాకా నన్ను పలకరించని నా కోడలు అత్తా చాయ్ తాగుతవా? కాఫీ తాగుతవా? అని అడుగుతోంది’ అని చెప్పిందన్నారు. ఇలా ఆసరా పింఛన్లతో వృద్ధుల్లో కొత్త ఆశలు వచ్చాయన్నారు. రాష్ట్రం పింఛన్లపై రూ.9,192.88 కోట్లు, కేంద్రం రూ.209.60 కోట్లు ఖర్చు చేస్తున్నాయని వెల్లడించారు. హైకోర్టును తరలించం: ఇంద్రకరణ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టును తరలించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో పద్దులో జరిగిన చర్చలో ఎంఐఎం సభ్యుడు మొయినుద్దీన్ లేవనెత్తిన అంశంపై మంత్రి స్పందించారు. ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదనలేవీ లేవని ఆయన వివరించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో 23 కొత్త జిల్లాలకు కొత్తగా జిల్లా కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయన్నారు. కింది కోర్టుల్లో ఖాళీగా ఉన్న మినిస్టీరియల్ ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నామని, 1,554 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు సైతం ఇచ్చామన్నారు. -
కిడ్నీ రోగులకు త్వరలో పింఛన్: ఈటల
సాక్షి, హైదరాబాద్: కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్ ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. త్వరలోనే వీరికి పింఛన్ మంజూరుపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిపారు. డయాలసిస్ కేంద్రాల్లో కిడ్నీ రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సభ్యులు బిగాల గణేశ్, వివేకానంద్, కంచర్ల భూపాల్‌రెడ్డి, సంజయ్‌కుమార్, అబ్రహం, గొంగిడి సునీత అడిగిన ప్రశ్నలకు ఈటల బదులిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 43 డయాలసిస్ కేంద్రాల్లో 270 మెషీన్లను ఏర్పాటు చేశామని, సగటున నలుగురు పేషెంట్లకు చికిత్సందిస్తున్నట్లు తెలిపారు. ఏటా ఒక్కో రోగిపై ప్రభుత్వం రూ.1.20 లక్షలను ఖర్చుచేస్తోందని, మరిన్ని సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. -
ఇది ట్రైలర్ మాత్రమే..
బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ వంద రోజుల పాలన కేవలం ట్రైలర్ మాత్రమే.. సినిమా రావాల్సి ఉంది. అభివృద్ధితోపాటు టెర్రరిజాన్ని సమూలంగా అంతం చేయడం, అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడం మా ప్రభుత్వ లక్ష్యం. ఎన్నికలకు ముందు ఏంచెప్పామో అక్షరాలా అదే చేసి చూపిస్తున్నాం. ఈ 100 రోజుల పాలనే ఒక ఉదాహరణ. మాది అవినీతి వ్యతిరేక ప్రభుత్వం. చట్టానికి అతీతమని భావించిన వారంతా ఇప్పుడు జైలుకెళ్లారు (చిదంబరాన్ని ఉద్దేశించి).. – రాంచీ సభలో ప్రధాని మోదీ రాంచీ: బీజేపీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వ వంద రోజుల పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని, సినిమా రావాల్సి ఉందని రాంచీలో ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల ఆవిష్కరణ సందర్భంగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని మోదీ మరోమారు స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ఏం చెప్పామో అక్షరాలా అదే చేసి చూపిస్తున్నామనీ, ఈ 100 రోజుల పాలనే ఒక ఉదాహరణ అన్నారు. జార్ఖండ్ కొత్త అసెంబ్లీ భవన ప్రారంభోత్సవం సందర్భంగా రాంచీలో మాట్లాడారు. తమ ప్రభుత్వ 100 రోజుల పాలన ఒక మచ్చుతునక మాత్రమేనన్నారు. తమ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక ప్రభుత్వమనీ, తాము చట్టానికి అతీతమని భావించిన వారంతా ఇప్పుడు జైలుకెళ్ళారనీ చిదంబరాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న మూడు జాతీయ పథకాలను మోదీ జార్ఖండ్ నుంచి ప్రారంభించారు. దేశంలోని గడపగడపకీ రక్షిత మంచి నీరు తమ ప్రభుత్వ లక్ష్యమని మోదీ అన్నారు. ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ తమ ప్రభుత్వ ప్రాధాన్యత అనీ, అందుకే త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చామనీ తెలిపారు. కశ్మీర్, లడక్‌ల అభివృద్ధే లక్ష్యంగా పనిచేశామనీ, అందులో భాగంగానే కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దుచేశామనీ స్పష్టం చేశారు. ఇవన్నీ ఎన్డీఏ–2 వంద రోజుల పాలనలో ఆవిష్కృతమైనవేనని ఆయన గుర్తుచేశారు. రాంచీలో నూతన అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవంతోపాటు ప్రభుత్వ ప్రతిష్టాత్మక రైతు పెన్షన్ స్కీంని మోదీ గురువారం ప్రారంభించారు. అనంతరం ఆదివాసీ విద్యార్థులకోసం 462 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభోత్సవం చేశారు. వీటితో పాటు నూతన సెక్రటేరియట్ భవనానికి మోదీ శంకుస్థాపన చేశారు. ► ‘జాతీయ స్థాయి పథకాల ప్రారంభోత్సవానికి జార్ఖండ్ వేదికగా నిలుస్తోంది. గత సెప్టెంబర్ లో సైతం ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ కూడా జార్ఖండ్‌లోని ప్రభాత్ తారా గ్రౌండ్ నుంచే ప్రారంభించాం. ఈ రోజు మూడు జాతీయస్థాయి సంక్షేమ పథకాలను సైతం ఇక్కడి నుంచి ప్రారంభించాం’ అని అన్నారు. ► ‘ఆదివాసీలతో సహా ప్రజలందరికీ సుపరిపాలన అందించడం ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఆయుష్మాన్ భారత్, పీఎం జీవన్ జ్యోతి యోజన, జన్ ధన్ ఎకౌంట్ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం ఆరంభించింది’ అని వెల్లడించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని పూర్తిగా నిర్మూలించడంలో జార్ఖండ్ ప్రజలు క్రియాశీలక పాత్ర పోషించాలని మోదీ పిలుపునిచ్చారు. ► ‘మహాత్మాగాంధీ 150 జయంతి సందర్భంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని ఒక చోటికి సమీకరించి, దేశాన్ని ప్రమాదం నుంచి కాపాడండి’ అంటూ మోదీ ప్రజలకు సూచించారు. కిసాన్ మాన్‌ధన్ యోజన ప్రధాని ప్రారంభించిన ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన ద్వారా 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులైన రైతులకు 60 ఏళ్ళు దాటాక నెలకు 3000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఈ పథకం కింద ఇప్పటికే 1,16,183 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నట్టు జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ తెలిపారు. స్వరోజ్‌గార్ పెన్షన్ ఇక్కడ నుంచి ప్రారంభించిన మరో రెండు పథకాలు ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్ మన్ధన్ యోజన, స్వరోజ్‌గార్ పెన్షన్ స్కీంలు. వీటి ప్రకారం సైతం 60 ఏళ్ల తరువాత లబ్దిదారులకు ప్రతినెలా 3000 రూపాయల పెన్షన్ లభిస్తుంది. జార్ఖండ్ అసెంబ్లీ కొత్త భవనం -
నవశకానికి నాంది
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తొలి సంతకం నవ శకానికి నాంది పలికింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే పాలనలో తనదైన ముద్ర కనపరిచారు. ప్రజాసంకల్ప పాదయాత్ర సాక్షిగా ప్రజల కష్టాలు, కన్నీళ్లు.. అవినీతి, బాధ్యతా రాహిత్యాన్ని కళ్లారా చూసిన జననేత తన మాటల్లో అందరికీ ఊరట కల్పిస్తూ తన ప్రసంగం కొనసాగించారు. మాటలో స్పష్టత, భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్న తీరుతో విమర్శకులు సైతం ‘శభాష్’ అంటున్నారు. కాల పరిమితి విధించి ఉద్యోగాల కల్పన.. పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు చేపట్టబోయే నిర్ణయాలతో అందరి మనసు దోచుకున్నారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం రానే వచ్చిందని ప్రతి ఒక్కరిలో సంతోషం వ్యక్తమవుతోంది. తొలి సంతకంతోనే అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వులు చిందింపజేశారు. ఐదు నెలల్లో 30,030 ఉద్యోగాలు: ముఖ్యమంత్రి తాను చెప్పినట్లే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అవినీతికి ఆస్కారం లేకుండా 50 కుటుంబాలకు ఓ వలంటీర్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 12లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. ఒక్కో రేషన్‌కార్డును ఒక్కో కుటుంబంగాభావిస్తే 12లక్షల ఇళ్లకు 25వేల ఉద్యోగాలు వస్తాయి. ఈ వాలంటీర్లందరూ ఆయా గ్రామాల్లో నివాసం ఉన్నవారే. వీరికి నెలకు రూ.5వేల వేతనం ఇస్తారు. సగటున వెయ్యి ఇళ్లు ఉన్న గ్రామంలో కూడా 20మంది నిరుద్యోగులకు ఉద్యోగం అందినట్లే. ఈ ఉద్యోగాలు కూడా రెండున్నర నెలల్లోనే.. అంటే ఆగస్టు 15లోపు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ ప్రకటనతో జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగుల్లో సంబరాలు మొదలయ్యాయి. నిరుద్యోగ యువకులు ఉన్నత చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు తెచ్చుకునే వరకు వారి సొంత గ్రామాల్లోనే వాలంటీర్లుగా కొనసాగవచ్చు. వీరు చేయాల్సింది ఒక్కటే. వారికి కేటాయించిన 50 ఇళ్లలోని పేదలు ప్రభుత్వ కార్యాలయాల గడప తొక్కకుండా సంక్షేమ పథకాలు వారి గడప తొక్కేలా చేయడమే. తద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా చేయడంలో తొలి విజయం సాధించినట్లే. గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు తద్వారా 10,030 ప్రభుత్వ ఉద్యోగాలు గ్రామాల్లో రేషన్‌కార్డు, పింఛన్, ఇంటిస్థలం, భూ వివాదంతో పాటు పలు సమస్యలకు రోజులు, నెలలు, ఏళ్ల తరబడి తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు చుట్టూ తిరిగి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి బాధలకు జగన్ ప్రభుత్వం స్వస్తి చెప్పింది. పాలనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి, అందులో ఆయా గ్రామాలకు చెందిన 10మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఈ పదిమంది వారి గ్రామాల్లో పేదలకు సంబంధించిన సంక్షేమ పథకాలు, ఇతర ఇబ్బందులను కొన్ని గంటల్లోనే పరిష్కరిస్తారు. ఇది కూడా అవినీతి నిర్మూలన కోసం జగన్ వేసిన ఓ అడుగే. దీంతో ప్రజల కష్టాలు తీరినట్లే. అలాగే జిల్లాలో 1,003 పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో సచివాలయానికి పదిమంది చొప్పున ఉద్యోగులను లెక్కిస్తే జిల్లా వ్యాప్తంగా 10,030 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. వీటిని అక్టోబర్ 2 గాంధీ జయంతిలోపు భర్తీ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. జిల్లాలో ఈ స్థాయిలో ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర చరిత్రలో బహుశా వైఎస్ జగన్ ప్రభుత్వ మాత్రమే కావడం విశేషం. తన పాలన ఎలా ఉండబోతుందో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి: పాలనను పూర్తిగా ప్రక్షాళన చేస్తానని జగన్ ఇటీవల చెప్పారు. అందుకు తగ్గట్లే సీఎం హోదాలో ప్రకటన చేశారు. సంక్షేమ పథకాల అమలులో కులం, మతం, రాజకీయం, పార్టీ ఏదీ చూడం, వారు అర్హులా? కాదా? అనే విషయాలు మాత్రమే చూస్తామని చెప్పారు. తద్వారా తాను అందరి వాడినని నేరుగా చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నప్పటికీ వారికి అధికారాలు లేకుండా జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులకు అధికారం కట్టబెట్టి, కేవలం టీడీపీ అస్మదీయులకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందేలా చేశారు. ఇతరపక్షాలలో అర్హులు ఉన్నా వారిని దూరం పెట్టారు. జన్మభూమి కమిటీల పెత్తనంతో ఐదేళ్లపాటు పేదలు నలిగిపోయారు. ఇలాంటి పాలనకు జగన్ చరమగీతం పాడారు. రాష్ట్రంలోని ప్రతి పేద ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పడంతో వైఎస్సార్సీపీతో పాటు ఇతర పార్టీల శ్రేణులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకతీతకంగా పనిచేస్తున్న సీఎం.. వైఎస్ తర్వాత జగనే అని కొనియాడుతున్నారు. అవినీతిపై యుద్ధ ప్రకటించిన సీఎం అవీనీతిపై తొలిరోజే జగన్ సమరశంఖం పూరించారు. ఎక్కడైనా సంక్షేమ పథకాల అమలులో అవినీతి జరిగినా, సంక్షేమ ఫలాలు అందకపోయినా ఎవ్వరికీ ఫిర్యాదు చేయాల్సిన పనిలేదని, సీఎం కార్యాలయంలోనే కాల్‌సెంటర్ ఏర్పాటు చేస్తామని, నేరుగా ఫిర్యాదు చేయొచ్చని ప్రకటించారు. అన్నిస్థాయిల్లో అవినీతి ప్రక్షాళన చేస్తామని గట్టిగా చెప్పారు. ఈ ప్రకటన కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఏదిఏమైనా జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు ఆయన తీసుకున్న నిర్ణయాలతో ఓ మంచి పాలన, ఓ మంచి ముఖ్యమంత్రిని చూడబోతున్నామని ‘అనంత’ ప్రజల్లో విస్తృత చర్చ జరిగింది. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం మాలాంటి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపనుంది. గ్రామ సచివాలయాల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించడం శుభపరిణామం. ఉన్న ఊళ్లోనే ఉపాధి దొరకడం వలన నిరుద్యోగులకు మంచి జరుగుతుంది. నిరుద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. – దామోదర్‌రెడ్డి, కొడిమి,అనంతపురం రూరల్ -
పింఛన్లు రెట్టింపు చేసిన తెలంగాణ సర్కార్
-
పింఛన్ల సొమ్ము రెట్టింపు !
సాక్షి,సిటీబ్యూరో: నిరుపేద ఆసరా పింఛన్ల లబ్ధిదారులకు శుభవార్త. ప్రస్తుతం అందిస్తున్న పింఛన్ల సొమ్ము రెట్టింపు కానుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 4.80 లక్షల మంది పేదలకు లబ్ధిచేకూరనుంది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన పింఛన్లు జూన్ నెల నుంచి అమల్లోకి రానున్నాయి. జులై నెలలో లబ్ధిదారుల చేతికి అందనున్నాయి. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్.ఐ.వీ–ఎయిడ్స్ బాధితులు, ఒంటరి మహిళలు, బోదకాల బాధితులకు పెరిగిన పింఛన్ల ప్రకారం నెలకు రూ. 2016 అందనున్నాయి. దివ్యాంగులకు రూ. 3016 అందనున్నాయి. ఎన్నికల సమయంలో తిరిగి అధికారం లోకి వస్తే పింఛన్ సొమ్ము రెట్టింపు చేస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా హామీ మేరకు ప్రభుత్వం పింఛన్ల పెంపు హామీని అమల్లోకి తీసుకువచ్చింది. పింఛనుదారులు ఇలా... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 4,80,275 పెన్షన్‌దారులు ఉండగా అందులో వృద్ధాప్య పెన్షన్‌దారులు 1,50,401 మంది, దివ్యాంగులు పింఛన్‌దారులు 73,028 మంది, వింతంతు పెన్షన్‌దారులు 2,25,504 మంది, చేనేత కార్మిక పింఛనదారులు 909 మంది, గీత కార్మికులు 2469 మంది, హెచ్ఐవీ పింఛనుదారులు 8389 మంది, ఫైలేరియా పింఛనుదారులు 157 మంది, బీడీ కార్మిక పింఛనుదారులు 229 మంది, ఒంటరి మహిళా పెన్షన్ లబ్ధిదారులు 19,189 మంది ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తమ్మీద రెవెన్యూ జిల్లావారిగా పరిశీలిస్తే హైదరాబాద్ జిల్లాలో 1,96,806, రంగారెడ్డి జిల్లాలో1,73,674 మేడ్చల్ జిల్లాలో 1,09,795 మంది పెన్షన్లబ్ధిదారులు ఉన్నట్లు తెలుస్తోంది. నెలకు రూ.104.12 కోట్లు మహా నగరంలో అసరా పించనుదారులుకు ప్రతి నెలా రూ. 104.12 కోట్లను ప్రభుత్వం అందించనుంది. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్.ఐ.వీ–ఎయిడ్స్ బాధితులు, ఒంటరి మహిళలు, బోదకాల బాధితులైన మొత్తం 4,07,247 మంది అసరా లబ్ధిదారులకు నెలకు రూ. 2016 చొప్పున రూ.82,10,09,952లు, దివ్యాంగులైన 73,028 మంది లబ్ధిదారులకు∙ రూ.3016 చొప్పు న నెలకు 22, 02, 52,448లు అందించనుంది. మేడ్చల్ జిల్లాలో 1.10 లక్షల పింఛన్లు సాక్షి,మేడ్చల్ జిల్లా : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పింఛన్లు మొత్తం 1,10,355 ఉన్నాయి. వీరికి ప్రతి నెలా రూ.12.57 కోట్లు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అయితే..పెరిగిన పింఛన్లతో జిల్లాపై అదనంగా రూ.20.74 కోట్ల భారం పడుతోంది. జిల్లాలో 1,10,355 పింఛన్లు ఉండగా ఇందులో దివ్యాంగుల పింఛన్లు 20,189, వృద్ధాప్య పింఛన్లు 32,025, వితంతు 52,306, చేనేత కార్మికులు 152, గీత కార్మికులు 427, బీడీ కార్మికులు 164, ఒంటరి మహిళలు 5,092 మంది ఉన్నారు. వీరందరికీ ప్రతి నెలా రూ.12.57,29,500 పంపిణీ చేస్తున్నారు. పెరిగిన పింఛన్‌తో జూన్ నుంచి ప్రభుత్వం రూ.33,31,30,680 చెల్లించాలి. జిల్లాలోని 20,189 మంది దివ్యాంగులకు నెలకు రూ.3016 చొప్పున మొత్తంగా రూ. 6,11,90.024 చెల్లించాల్సి వస్తున్నది. మిగతా 90,166 మంది పింఛన్ దారులకు నెలకు రూ.2016 చొప్పున రూ.27,19,40,656 పంపిణీ చేయాల్సి ఉంది. దీంతో జిల్లా పై పింఛన్ల అదనపు భారం ప్రతి నెల రూ.20.74 కోట్లు పడుతున్నది. -
ఆసరా రెట్టింపు
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆసరా పింఛన్ల మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూన్ నుంచి పెరిగిన పింఛన్లను అమలు చేయనున్నట్లు తెలిపింది. పెరిగిన పిం ఛన్ల మొత్తాలను జూలై 1 నుంచి లబ్ధిదారులకు పంపి ణీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులతో దివ్యాంగులకు నెలకు రూ. 3,016, మిగతా లబ్ధిదారులకు నెలకు రూ. 2,016 చొప్పున ప్రభుత్వం పింఛన్లు అందించనుంది. ఆదాయం పెంచాలి... పేదలకు పంచాలనేది తమ ప్రభుత్వ విధానమన్న టీఆర్ఎస్... అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మేనిఫెస్టోలో ఆసరా ఫించన్ల రెట్టింపును ప్రధానంగా పేర్కొంది. సామాజిక భద్రత కార్యక్రమం కింద ఆసరా పథకాన్ని అమలు చేస్తోంది. ఏటా సగటున రూ. 5,300 కోట్లు ఖర్చు... రాష్ట్రంలో టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పెన్షన్ల మొత్తాన్ని పెంచింది. 2014 నవంబర్ నుంచి ఆసరా పెన్షన్ల పథకాన్ని అమలు చేస్తోంది. దివ్యాంగులకు ప్రతి నెలా రూ. 1,500, మిగిలిన పింఛనుదారులకు ప్రతి నెలా రూ. వెయ్యి చొప్పున అందిస్తోంది. తొమ్మిది రకాల ఆసరా లబ్ధిదారులు కలిపి రాష్ట్రంలో 39,42,371 మంది ఉన్నారు. ఆసరా పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా సగటున రూ. 5,300 కోట్లు ఖర్చు చేస్తోంది. ఫించన్ల మొత్తం పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ పథకం అమలు కోసం 2019–20 బడ్జెట్లో రూ. 12,067 కోట్లు కేటాయించింది. నిర్ణీత వార్షిక ఆదాయ అర్హత ఉంటేనే ఆసరా లబ్ధిదారులుగా అవకాశం కల్పిస్తారు. 65 ఏళ్లు నిండిన వారే వృద్ధాప్య పింఛనుకు అర్హులు. వితంతువులకు 18 ఏళ్లు నిండాలి. దివ్యాంగులకు వయసుతో సంబంధంలేదు. వృద్ధాప్య పింఛను అర్హత వయసును 58 ఏళ్లకు తగ్గించనున్నట్లు టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. తగ్గించిన వయోపరిమితి ప్రకారం వృద్ధాప్య పింఛను లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇది పూర్తికాగానే కొత్త వారికి సైతం పెరిగిన పింఛను మొత్తాలను చెల్లించేలా గ్రామీణాభివృద్ధిశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఆసరా పథకం లబ్ధిదారులకు అందిస్తున్న ప్రస్తుత పెన్షన్, పెరిగిన పెన్షన్ (రూ.లలో) సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అవ్వ తాతల పెన్షన్ 3 వేలకు పెంచుతం
-
చిల్లర రాజకీయాలు
సాక్షి, ఒంగోలు అర్బన్: ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ చిల్లర రాజకీయానికి తెరలేపింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అందించే పింఛన్ పంపిణీ కేంద్రాలను ఎన్నికల ప్రచార కేంద్రాలుగా మార్చుకునేందుకు టీడీపీ నాయకులు పన్నాగాలు పన్నుతున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి వారం పదిరోజుల పాటు జరిగే పింఛన్ పంపిణీని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తున్నారు. పింఛన్ పాస్ పుస్తకాలపై చంద్రబాబు ఫొటో ఉంటుంది. గతంలో వెయ్యి రూపాయల పింఛన్ ఇచ్చిన చంద్రబాబు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తాము అధికారంలోకి వస్తే పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు పెంచుతామని ప్రకటించారు. చంద్రబాబు హడావుడిగా పింఛన్‌ను రూ.2 వేలకు పెంచాడు. చంద్రబాబును ప్రజలు నమ్మలేదు. నాలుగున్నరేళ్లు పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో వృద్ధులు, వికలాంగులు, మహిళలు గుర్తుకొచ్చారా అనే ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో విశ్వసనీయత పోవడంతో ఓటమి భయం పట్టుకుంది. డిపాజిట్లయినా దక్కించుకునేందుకు సీఎం చంద్రబాబు రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. వాటిలో పింఛన్ కేంద్రాలను ప్రచార కేంద్రాలుగా మార్చుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. పింఛన్ పంపిణీ కేంద్రాలపై దృష్టి పింఛన్ పంపిణీ కేంద్రాలను తమకు అనుకూలంగా మార్చుకుని వృద్ధులు, వికలాంగులతో ఓట్లు వేయించుకునేందుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పథక రచన చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ చోటామోటా నాయకులు, కార్యకర్తలకు ఆదేశాలు వెళ్లాయి. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల నిఘా బృందాలు పింఛన్ పంపిణీ కేంద్రాల వద్ద నిఘా ఉంచాలని కోరుతున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేయాలని పలు రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసు బందోబస్తుతో పాటు నిఘా బృందాలను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని, కేంద్రాల వద్ద ఎన్నికల ప్రచారం లేకుండా చూడాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు కోరుతున్నారు. -
ఉద్యోగుల భవిష్యత్తుకు జగన్ భరోసా
సాక్షి, పర్చూరు/మార్కాపురం టౌన్: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్). కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను కలవరపెడుతున్న అంశం. ఉద్యోగ విరమణ అనంతరం వారి జీవితాన్ని ప్రశ్నార్థకం చేసే ఈ విధానంతో భద్రత లేని వృద్ధాప్యాన్ని తలచుకుని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అనేక పోరాటాలతో ప్రభుత్వ ఉద్యోగులు సాధించిన పాత పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఒకేఒక్క ఉత్తర్వుతో రద్దు చేయడంపై మండిపడుతున్నారు. 2004 జనవరి 1 నుంచి కొత్త పెన్షన్ విధానానికి (సీపీఎస్) తెరలేపడం, అదే ఏడాది సెప్టెంబర్ 1 నుంచి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సీపీఎస్‌ను అమల్లోకి తేవడం తెలిసిందే. అప్పటి నుంచే ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సీపీఎస్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వం డెత్ గ్రాడ్యుటీ మంజూరు చేస్తున్నట్లు జీఓ ఇచ్చినప్పటికీ అందులో అనేక లోపాలుండటంతో ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తంమీద 500 మందికిపైగా చనిపోయిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా అందలేదు. వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. దీంతో సీపీఎస్ వద్దని, పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకున్న జగన్... సీపీఎస్‌తో జరుగుతున్న నష్టంపై ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ పార్టీ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే అమలు చేస్తామని ప్రజా సంకల్ప యాత్రలో హామీ ఇచ్చారు. జగన్ హామీతో సీపీఎస్ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. తమ సమస్య పరిష్కారం కావాలంటే రావాలి జగన్.. కావాలి జగన్ అంటూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కోసం వారంతా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగుల పాలిట శాపంగా పీఎఫ్ఆర్డీఏ... సీపీఎస్ విధానంలో ఉద్యోగుల మూల వేతనం, డీఏ సొమ్ములో 10 శాతాన్ని పెన్షన్ కోసం చెల్లించాలి. దీనికి ప్రభుత్వం కొంత సొమ్మును ఉద్యోగి ఖాతాకు జత చేస్తుంది. దీని కోసం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) సంస్థను కేంద్రం తెరపైకి తెచ్చింది. 2013 సెప్టెంబరు 13న పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించింది. ప్రతి సీపీఎస్ ఉద్యోగికీ ప్రాన్ అకౌంటు కేటాయించి దాని నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఆ ఖాతాలోని సొమ్మును షేర్ మార్కెట్లో పెడతారు. ఉద్యోగి రిటైర్మెంట్ రోజున ప్రాన్ ఖాతాలోని సొమ్ములో 60 శాతం మాత్రమే చెల్లిస్తారు. మిగిలిన 40 శాతం సొమ్మును ఆన్‌డ్యూటీ ప్లాన్‌లో పెట్టి సుమారు 6–9 శాతం రిటరన్స్తో పెన్షన్ చెల్లిస్తారు. ఈ పెన్షన్ మొత్తం ఏడాది మాత్రమే స్థిరంగా ఉంటుంది. ఆ తర్వాత ఏడాది నుంచి షేర్ మార్కెట్ ఒడిదుడుకులను బట్టి నిర్ణయిస్తారు. పోరాటాలు చేసిన వారిపై కేసులు పెట్టించిన చంద్రబాబు... సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ వి«ధానాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, మానవ హారాలు, కలెక్టరేట్ల ముట్టడి, ఆమరణ నిరాహారదీక్షలు నిర్వహించారు. చలో అమరావతి, చలో రాజధాని, చలో విజయవాడ వంటి పేర్లతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమస్యను పరిష్కరించకపోగా, శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిని అరెస్టు చేయించారు. గృహ నిర్బంధాలతో ఇబ్బంది పెట్టారు. అక్రమ కేసులు పెట్టించి నరకం చూపించారు. జిల్లా వ్యాప్తంగా 13 వేల మంది సీపీఎస్ ఉద్యోగులు... జిల్లా వ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులు 13,000 మంది ఉన్నారు. అందులో ఉపాధ్యాయులు 6 వేల మంది, పోలీసులు 3,500 మంది, 58 విభాగాలకు చెందిన గజిటెడ్, నాన్ గజిటెడ్ ఉద్యోగులు 3,500 మంది వరకు ఉన్నారు. పాత పింఛన్ పద్ధతే మేలు సీపీఎస్ విధానం కంటే పాత పెన్షన్ విధానమే ప్రయోజనకరంగా ఉంటుందని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. పాత పింఛన్ విధానమే జీవితానికి భరోసా కల్పించగలదని మా అభిప్రాయం. రిటైర్మెంట్ తర్యాత వృద్ధాప్యంలో పెన్షన్ వస్తే ఆసరాగా ఉంటుంది. – వనమా పుష్పరాజ్, స్కూల్ అసిస్టెంట్, పర్చూరు సీపీఎస్‌తో ఉద్యోగులకు అన్యాయమే సీపీఎస్ విధానం అమలు చేస్తే ఉద్యోగ విరమణ తర్యాత చాలా నష్టపోతారు. విశ్రాంత జీవితాన్ని సక్రమంగా గడిపే పరిస్థితి ఉండదు. సీపీఎస్ రద్దు కోసం ఆందోళనలు చేసినా పట్టించుకోకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడం బాధాకరం. – చింతా సుకన్య, తెలుగు పండిట్ ఉద్యోగానికి భద్రత లేదు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం పొందినా భద్రత మాత్రం కరువే. ఐదేళ్ల పాలన చేసే రాజకీయ నాయకులకు ఉన్న పెన్షన్ సౌకర్యం 30 ఏళ్ల పాటు సేవలందించిన వారికి లేకపోవడం దురదృష్టకరం. సీపీఎస్ రద్దుకు ఐదేళ్ల నుంచి పోరాటాలు చేసినా టీడీపీ ప్రభుత్వం కమిటీ వేసి మిన్నకుండటం విచారకరం. – శివకృష్ణ, సీపీఎస్ నాయకుడు, మార్కాపురం పోరాటాలు, చేసినా ఫలితం లేదు సీపీఎస్ రద్దు కోరుతూ యూటీఎఫ్ శాఖ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు పోరాటాలు, ధర్నాలు, పాదయాత్రలు చేసినా ఫలితం లేదు. ఇప్పటికీ యూటీఎఫ్ శాఖ సీపీఎస్ రద్దు కోరుతూ పోరాడుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కమిటీల ద్వారా కాలయాపన చేస్తోంది. – మహ్మద్ జహీరుద్దీన్, యూటీఎఫ్, కుటుంబ సంక్షేమ పథకం డైరెక్టర్ -
మానవత్వానికి వికలత్వం!
అతను పుట్టుకతోనే దివ్యాంగుడు. ఆపై వారిది పేద కుటుంబం. ఇదే అతని జీవితానికి శాపంగా పరిణమించింది. ఆదుకోవాల్సిన పాలకులు, అధికారులు నిర్దయగా వ్యవహరించారు. ఆ దివ్యాంగుడి జీవితాన్ని చూస్తే ఏ మనిషిలోనైనా మానవత్వం పెల్లుబికుతుంది. కానీ అధికార పార్టీ నేతలు, అధికారుల్లో పిసరంత కూడా మానవత్వం కానరావడం లేదు. ఏళ్లకు ఏళ్లుగా ఆ దివ్యాంగుడి బతుక్కి పింఛన్ సాయం కోసం తల్లిదండ్రులు తిరగని గడప లేదు. ఎక్కని మెట్లు లేవు. అతని దయనీయ స్థితిని గుర్తించలేని ఏలికల ‘మానత్వానికి వికలత్వం’ నిదర్శనంగా నిలుస్తోంది. నెల్లూరు(పొగతోట): అధికారులు, అధికార పార్టీ నేతలు మానవత్వాన్ని మరుస్తున్నారు. అధికార పార్టీ వారైతే అనర్హులకు కూడా జన్మభూమి కమిటీలు పింఛన్లు మంజూరు చేస్తున్నారు. పేదవాడికి అండగా నిలవాల్సిన అధికారులు జన్మభూమి కమిటీల ఒత్తిడికి తలొగ్గి నైతిక బాధ్యతలకు తిలోదకాలు వదులుతున్నారు. నాయుడుపేట మండలం లోతగుంటకు చెందిన రంగనాథం, చెంగమ్మ దంపతులకు ఇద్దరు మగబిడ్డలు. ఇద్దరూ దివ్యాంగ బిడ్డలే. ఆ ఇద్దరు బిడ్డలకు తల్లి అన్నీ తానై సేవలు చేస్తూ కష్టపడుతోంది. పెద్ద కుమారుడు కొద్ది రోజుల క్రితం మరణించాడు. రెండో కుమారుడు శ్రీరాములు (22)కు పుట్టుకతోనే అంగవైకల్యం.. బుద్ధిమాంద్యమే కాదు.. శరీరంలో అన్ని సమస్యలే. కదల్లేడు.. మాట్లాడలేడు. మల, ముత్రాలు అన్ని తల్లే శుభ్రం చేయాలి. అసలే పేద కుటుంబం. రెక్కాడితే కానీ.. డొక్కాడని కుటుంబం. బిడ్డలను చూసుకునేందుకు తల్లి కూలి పనులకు వెళ్లడం మానుకుంది. తండ్రి కష్టంతో ఆ కుటుంబం జీవనం కష్టంగా నడుస్తోంది. దివ్యాంగుడు శ్రీరాములకు వికలాంగుల పింఛన్ వస్తే కొంత ఆదరువుగా ఉంటుందని భావించిన తల్లిదండ్రులు పింఛన్ మంజూరు కోసం అధికారులు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగితిరిగి అలసిపోయారు. ఇతని పరిస్థితి చూసి మానవత్వం స్పందించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించారు. ఆధార్ లేదని పింఛన్ మంజూరు చేయలేదు శ్రీరాములకు చేతి వేళ్లు, కళ్లు సరిగా లేని కారణంగా ఆధార్ రాలేదు. అతనికి అధార్ లేని అధికారులు పింఛన్ మంజూరుకు కొర్రీ పెట్టారు. తల్లిదండ్రులు అతనికి ఆధార్ కోసం అనేక ఇబ్బందులు పడ్డారు. అయినా ఆధార్ మంజూరు కాలేదు. కుటుంబానికి రేషన్‌కార్డు ఉంది. శ్రీరాములకు దివ్యాంగుల పింఛన్ కోసం తల్లిదండ్రులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టు ప్రదక్షణలు చేశారు. ఇప్పటి వరకు పింఛన్ మంజూరు కాలేదు. సోమవారం తల్లి శ్రీరాములును భుజనా వేసుకుని కలెక్టరేట్‌కు తీసుకు వచ్చింది. పింఛన్ మంజూరు చేయలంటూ అధికారులను వేడుకుంది. అతని పరిస్థితిని చూసి స్పందించిన డీఆర్ఓ చంద్రశేఖర్‌రెడ్డి డీఆర్డీఏ అధికారులను పిలిచి మాట్లాడారు. ఆధార్ లేకుండా ప్రత్యేక కేసు కింద పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులను పిలిచి సదరం సర్టిఫికెట్ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సదరం సర్టిఫికెట్ మంజూరు చేయించమని డీఆర్ఓ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచిస్తే వారు.. వీరిని పక్కకు తీసుకెళ్లి మీరు పోయి తెచ్చుకోమని పంపించేశారు. ఇప్పుడు కూడా కింది స్థాయి అధికారుల్లో మానవత్వం మచ్చుకైనా కనిపించకపోవడం శోచనీయమని వీరిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. అనేక పర్యాయాలు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి అధికారులను సంప్రదిస్తే ఇదే విధంగా సమాధానం చెబుతున్నారని శ్రీరాములు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. -
ఆత్మలకూ... పింఛన్లు!
సామాజిక పింఛన్లను కొందరు కార్యదర్శులు సొంతానికి వాడుకుంటున్నారు. మరణించిన వారి పేరున దర్జాగా కాజేస్తూ ప్రభుత్వాన్ని మోసగిస్తున్నారు. తప్పుడు ధ్రువీకరణలతో జేబులు నింపుకుని తప్పుదారి పట్టిస్తున్నారు. జరుగుతున్న అక్రమాలు సోషల్ ఆడిట్లో బట్టబయలవుతోంది. విజయనగరం ,బలిజిపేట(పార్వతీపురం): సామాజిక పింఛన్ల పంపిణీలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. వీటిపై ఎన్ని నిబంధనలు పెట్టినా... కొందరు కార్యదర్శులు తమ పని తాము చేసుకుపోతున్నారు. గ్రామాలలో మరణించిన వారిపేరున వచ్చే పింఛన్లు ఇలా కాజేస్తున్నట్టు సోషల్‌ఆడిట్‌లో తేలింది. గ్రామస్థాయి నాయకులు వారితో కుమ్మక్కయి ఈ విధంగా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన సోషల్ ఆడిట్లో 5గ్రామాలకు చెందిన 12మంది లబ్ధిదారుల పింఛను మొత్తాలు రూ. 22వేలు ప్రతినెలా కార్యదర్శులు అథంటికేషన్‌తో స్వాహాచేసిన విషయం బట్టబయలైంది. మరణించిన వారిపేరున వచ్చే మొత్తాలను స్వాహా చేస్తున్నారని రుజువయింది. అందులో మండలంలోని పెద్దింపేటకు చెందిన ఆరుగురి పింఛన్ మొత్తం రూ. 13వేలు గ్రామ కార్యదర్శి కాజేసినట్టు తేలింది. పలగరలో 1, అంపావల్లిలో 2, వంతరాంలో 2, అరసాడలో ఒకరికి మంజూరైన మొత్తాలు ఆయాగ్రామ కార్యదర్శులు స్వాహా చేసినట్టు తేలింది. ఎన్ని మెషీన్లు వచ్చినా... రెండేళ్ల క్రితం నుంచి బయోమెట్రిక్ద్వారానే పింఛన్ల పంపిణీ సాగుతోంది. లబ్ధిదారులు వచ్చి వేలిముద్రలు వేసి వారి పింఛను తీసుకునేవారు. మంచం మీద ఉండేవారు, ఇతరత్రా రాలేనివారి వద్దకు వెళ్ళి బయోమెట్రిక్ వేయించుకుని వారికి పింఛన్ పంపిణీ చేస్తారు. వేలిముద్రలు పడక, ఐరిస్ కాక పొందలేనివారికి పంపిణీ చేసేవారే అథంటికేషన్ వేసి చెల్లించే అవకాశం కల్పించారు. అయితే ఇలా గ్రామపింఛన్ లబ్ధిదారుల మొత్తంలో 2శాతానికి మించి అథంటికేషన్ ద్వారా చెల్లించకూడదు. అథంటికేషన్తోనే అవకతవకలు జరుగుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. సకాలంలో కాని మరణ ధ్రువీకరణ మరణ ధ్రువీకరణ పత్రాలు గ్రామ కార్యదర్శులే ఇస్తారు. అంటే ఎవరు ఎప్పుడు మృతిచెందారన్నది వారికి తెలుస్తుంది. ధ్రువీకరణ పత్రాన్ని పూర్తి వివరాలతో 21రోజుల్లోగా కార్యదర్శి ఆన్లైన్ చేయాలి. అలా అయితేనే వారు పింఛన్ లబ్ధిదారులైతే ఆ మొత్తాలు ఇక వచ్చే అవకాశం ఉండదు. అయితే కొందరు కార్యదర్శులు ఈ మరణ ధ్రువీకరణను ఆన్లైన్ చేయడంలో తాత్సారం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఎంపీడీఓ వెంకటరమణ వద్ద సాక్షి ప్రస్తావించగా... మరణించినవారి పేరున వచ్చే పింఛన్లు డ్రా చేయడం నేరమనీ, అలా జరిగినట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
పెన్షన్ల.. గోల్మాల్ !
పెన్షన్ కోసం కాగితాల మీద భర్తను చంపేసింది ఒకామే..! 60 ఏళ్ల వయస్సు రాకున్నా, వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న మరొకాయన. మరోచోట భర్తతో కలిసి జీవిస్తూనే.. ఒంటరి మహిళను అంటూ పెన్షన్ పొందుతున్న ఇంకో మహిళ. గీత కార్మికుని పేర పింఛను లాగిస్తున్న మరో కులస్తుడు.. ఏమిటిదంతా అంటే... ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ల మంజూరీలో చోటు చేసుకున్న విచిత్రాలు..! సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అర్హులు పెన్షన్ల కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. అనర్హులు మాత్రం దొడ్డిదారిన దర్జాగా లబ్ధి పొందుతున్నారు. కుటుంబంలో ఒక్కరికే పెన్షన్ ఇవ్వాలి, అది కూడా అర్హులకే ఇవ్వాలి. కానీ అర్హత లేని వారు అడ్డదారిన పెన్షన్లు పొందుతున్నారు. నల్లగొండ మున్సిపాలిటీలోని ఒక ప్రైవేట్ ఉద్యోగి ద్వారా కథంతా నడిపిస్తున్నారు. కొందరు దళారులు, మరికొందరు మాజీ కౌన్సిలర్లు, పైరవీకారుల అవతారం ఎత్తి అక్రమాలకు తెరతీశారు. మున్సిపల్ అధికారులు కానీ, పెన్షన్ విభాగానికి చెందిన ఇతర అధికారులు కానీ పెన్షన్ల దరఖాస్తులను ఏమాత్రం పరిశీలించకుండా పచ్చా జెండా ఊపడం వల్ల జరిగిన అనర్థాలివి. కేవలం ఒక్క నల్ల గొండ పట్టణంలోనే 2వేల పైచిలుకు మంది ఇలా తప్పుడు పద్ధతుల్లో పెన్షన్ల ద్వారా లబ్ధిపొందుతున్నారని సమాచారం. ఇలా, ప్రతి నెలా రూ.20లక్షల వరకు పక్కదారి పడుతోంది. అంటే ఏటా రూ.2.50కోట్లు. ఇది కేవలం ఒక్క మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమం. జిల్లాలో మరికొన్ని మున్సిపాలిటీలు, ఇతర ప్రాంతాల్లోనూ ఇదే రకమైన వ్యవహారాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇదీ ... వరుస నల్లగొండ మున్సిపాలిటీలో మొత్తం 15,336 మంది వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ , చేనేత, గీతకారిక్మకుల తదితర పెన్షన్లు ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక్కో పెన్షన్‌దారుకు రూ.వెయ్యి చొప్పున నగదు అందుతుండగా వికలాంగులకు మాత్రం రూ.1500 అందిస్తున్నారు. పెన్షన్ కోసం అడ్డదారులు తొక్కుతున్న కొందరు తమ భర్త ఉండగానే చనిపోయాడంటూ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పెట్టి వితంతు పెన్షన్ పొందుతున్నారు. మరికొందరు భర్తతో కలిసి జీవిస్తూనే ఒంటరిని అంటూ ఒంటరి మహిళ పెన్షన్ పొందుతున్నారు. ఒక ఇంట్లో భార్యాభర్తల్లో ఒక్కరే పెన్షన్ పొందే వీలుంది. కానీ, కొన్ని చోట్ల ఇద్దరూ పొందుతున్నారు. భర్త వృద్ధాప్య పెన్షన్ పొందుతుంటే... భార్య మాత్రం తన భర్త చనిపోయాడంటూ వితంతు పెన్షన్ పొందుతున్న ఉదంతాలు ఉన్నాయి. గ్రామాల్లో జీవిస్తూ.. నల్లగొండ పట్టణంలో పెన్షన్ పొందుతున్న వారూ ఉన్నారు. వీరికి సంబంధించి ఇంటి చిరునామాలూ సరిగా లేవు. నల్లగొండ పట్టణంలో 2వేలకు పైగానే బోగస్ పెన్షన్లు ఉన్నట్లు సమాచారం. 3, 4, 6, 9, 10, 11, 14, 15, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 32, 33, 35, 37, 39 వార్డుల్లో బోగస్ పెన్షన్లు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణ ఏదీ...? ప్రతి ఏటా పెన్షన్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయి కానీ వాటి పరిశీలిస్తున్న పాపాన పోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో అనర్హుల సంఖ్య ప్రతిఏటా పెరిగిపోతోంది. ఏ కాగితాలు సరి చూడకుండానే ప్రైవేట్ ఉద్యోగుల సహకారంతో పెన్షన్‌కు అర్హత పొంది, పెన్షన్ స్వాహా చేస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ మొత్తాన్ని రూ.వెయ్యి నుంచి రూ.2016కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ పెరుగుదల అమలులోకి వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో సహజంగానే పక్కదారి పడుతున్న మొత్తం పెరిగే ముప్పు ఉంది. మచ్చుకు కొన్ని... బోగస్ పెన్షన్లు పెన్షన్ల జాబితాలో సీరియల్ నంబర్ 14612 పై 39వ వార్డులో ఓ భర్త, భార్య, ఇద్దరూ పెన్షన్ పొందుతున్నారు. భార్య వితంతు పెన్షన్ పొందుతుండగా, భర్త మాత్రం వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నాడు. వీరు ఒక షాప్ కూడా నడుపుతున్నారు. . సీరియల్ నంబర్ 5594పై ఓ అంగన్వాడీ టీచర్ పెన్షన్ పొందుతోంది. సీరియల్ నంబర్ 5635, గొల్లగూడ కాలనీలో ఆ కాలనీకి సంబంధం లేకున్నా, వేరే గ్రామస్తులు ఇక్కడ పెన్షన్ పొందుతున్నారు. 5715 సీరియల్ నంబర్ ద్వారా ఓ గీత కార్మికుడు కాని వ్యక్తి గీత కార్మిక పెన్షన్ పొందుతున్నాడు. 14వ వార్డులోనే 5729 సీరియల్ నంబర్లో భర్త, భార్యలు పెన్షన్ పొందుతుండగా, భార్య వితంతు పెన్షన్, భర్త వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నాడు. ఇది పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో చోటు చేసుకుంది. 5733 సీరియల్ నంబర్ ద్వారా భర్త, భార్య ఇద్దరూ పెన్షన్ పొందుతున్నారు. భార్య వితంతు పెన్షన్, భర్త వృద్ధాప్య పెన్షన్. ఈ పెన్షన్‌దారు ఇటీవల ఓ గ్రామంలో సర్పంచ్‌గా కూడా పోటీచేసినట్లు సమాచారం. 5734 సీరియల్ నంబర్ ద్వారా పెన్షన్ పొందే మహిళ భర్త ఉండి కూడా వితంతు పెన్షన్ పొందుతుంది. అదే విధంగా 5739, 5742 ïసీరియల్ నంబర్లు ద్వారా చేనేత కార్మికులు కాని ఇద్దరు వ్యక్తులు చేనేత పెన్షన్ పొందుతున్నారు. 5796 íసీరియల్ నంబర్ ద్వారా ఒంటరి మహిళగా పెన్షన్ పొందుతున్న మహిళ భర్తతోనే కలిసి జీవనం సాగిస్తోంది. ఎన్నికల సందర్భంలో కొందరు గ్రామాల నుంచి ఓటు కోసం ఇక్కడ నమోదు చేయించుకొని పెన్షన్లు కూడా ఇప్పించారని ఆరోపణలు ఉండగా, కొందరు పైరవీ కారులు నిత్యం ఇదే పనిలో ఉంటున్నారని తెలుస్తోంది. -
టీడీపీ అండతో వృద్దాప్య పింఛన్ పథకంలో అక్రమాలు
-
అభయహస్తం పింఛన్‌దారులకు రిక్తహస్తం
శ్రీకాకుళం పాతబస్టాండ్: వృద్ధులు, వింతంతువులు, దివ్యాంగులకు పింఛన్ పెంచాం, డ్వాక్రా మహిళలకు రూ.పది వేల చెక్కులు ఇచ్చామంటూ టీడీపీ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. మహిళ సంఘాల ద్వారా అహయహస్తం పథకంలో ఉన్న లబ్ధిదారులకు మాత్రం పింఛన్ పెంచడంలో నిర్లక్ష్యం వహించింది. ప్రభుత్వం తీరుపై మహిళా సంఘాల సభ్యులు, ప్రతినిధులు అందోళన చెందుతున్నారు. మరికొన్ని చోట్ల పింఛన్ల పంపిణీ వద్ద సిబ్బందితో వివాదాలకు కూడా దిగుతున్నారు. జిల్లాలో సుమారు ఏడు వేల కుటాంబాలకు ప్రభుత్వం రిక్తహస్తం చూపింది. కొత్తగా చేరేవారికి అవకాశం లేదు అభయహస్తం పథకాన్ని నాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ పథకం ప్రారంభమై ప్రతిఫలాలు అందుతున్నాయన్న సమయంలోనే ఆయన మృతి చెందారు. ఈ పథకాన్ని వైఎస్సార్ అభయహస్తం పేరిట అనంతరం అమలు చేశారు. అభయహస్తంతో చాలా మంది అప్పటిలో చేరారు. తర్వాత కొత్తగా ఈ పథకంలో చేరే అవకాశం కల్పించలేదు. దీంతో కేవలం జిల్లాలో 45 వేల మందికి మాత్రమే ఈ పథకం వర్తిస్తోంది. ఈ పథంలో ఉండి, 60 ఏళ్ల వయస్సు నిండిన వారికి అక్కడ నుంచి వారు జీవించి ఉన్నంత వరకు ప్రతి నెలా రూ.500 పింఛను ఇవ్వాలని అప్పటి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పింఛన్ మొత్తాన్ని పెంచలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పేరిట సామాజిక భద్రతా పింఛన్లను రెండు వందల నుంచి రూ.వెయ్యికి పంచినా, వీరికి మాత్రం రెండు పర్యాయాలు పెంచలేదు. 45 వేలకు పైగా మహిళా స్వయం శక్తి సంఘాల జిల్లాలో 45 వేలకు పైగా మహిళా స్వయం శక్తి సంఘాలున్నాయి. వీటిలో సుమారుగా 5 లక్షల మంది వరకు సభ్యులున్నారు. తర్వాత కొత్తగా సంఘాలు ఏర్పడినా.. వారికి ఇప్పటివరకు ఈ ప్రభుత్వం అభయహస్తం పథకంలో చేర్పించిన దఖలాలు లేవు. సుమారు లక్ష మందికి ప్రయోజనం అందకుండా పోయింది. ఈ పథకంలో చేరిన తర్వాత అభయహస్తం పథకంలో ఉండి, 60 ఏళ్లు పైబడి పింఛను పోందుతున్నవారు 6,801 మంది ఉన్నారు. ఈ నెల నుంచి పింఛను పెరుగుతోందని ఆశించారు. ఈ నెల తీరా పింఛను తీసుకొనే సమయానికి వారికి కేవలం రూ.500లు మాత్రమే వచ్చింది. రూ.వెయ్యి అవుతోందని ఆశ ఎంతో కాలం నిలవలేదు. రూ.వెయ్యి పెంపు.. కిడ్ని వ్యాధి ముదిరి, డయాలసిస్ స్థితిలో ఉన్నవారికి ప్రస్తుతం నెలకు రూ.2500లు పింఛన్ అందజేస్తున్నారు. ఇటువంటి పింఛన్లు పొందేవారు ప్రస్తుతం జిల్లాలో 305 మంది ఉన్నారు. ఈ పింఛన్ ఎందరో పోరాటాలు ఫలితంగా వచ్చింది. ఈ పింఛన్ కూడా రెట్టింపు చేయాల్సింది. కానీ వీరికి మరో వెయ్యి రూపాయిలు కలిపి రూ.3500కి పరిమితం చేశారు. టీడీపీ సర్కార్ చిన్నచూపు చూస్తుందని వారి కుటుంబ సభ్యులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పింఛను పథకం ప్రచారాస్త్రమే!
సాక్షి, న్యూఢిల్లీ : అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల ప్రయోజనం కోసం కేంద్ర మంత్రి పియూష్ గోయల్ గురువారం పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్లో కొత్త పింఛను పథకాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ పథకం కింద కార్మికులకు 60 ఏళ్ల నుంచి నెలకు మూడువేల రూపాయల చొప్పున పింఛను లభిస్తుంది. అందుకోసం 29 ఏళ్లు నిండిన కార్మికుడు నెలకు వంద రూపాయల చొప్పున, 18 ఏళ్లు నిండిన కార్మికుడయితే నెలకు 55 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని, దీనివల్ల పది కోట్ల మంది కార్మికులు ప్రయోజనం పొందుతారని పియూష్ గోయల్ తెలిపారు. పింఛను కోసం కనీసంగా ఎంతకాలం పాటు కార్మికుడు తనవంతు భాగాన్ని చెల్లిస్తూ పోవాలనే కాల పరిమితి ఈ పథకంలో ఎక్కడా లేకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తోంది. ఇది కొత్త పథకంగా మోదీ ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ 2015, మార్చిలో ప్రవేశ పెట్టిన ‘అటల్ పెన్షన్ యోజన’ పథకానికి మరో రూపమని తెలుస్తోంది. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ పథకంలో నెలవారి పింఛన్‌ను కనీసంగా వెయ్యి రూపాయలు, గరిష్టంగా ఐదువేల రూపాయలుగా నిర్ణయించారు. పింఛను సొమ్ము ప్రాతిపదికన పింఛను పథకానికి లబ్దిదారుడు నెలవారిగా ఎంత చెల్లిస్తాడో అందులో యాభై శాతాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అలా కార్మికుడి పేరిట వెయ్యి రూపాయలు జమయ్యే వరకు ప్రభుత్వం తన వాటాను చెల్లించాల్సి ఉంటుంది. 2017, ఫిబ్రవరి నెల నాటికి ఈ అటల్ పెన్షన్ పథకం కింద లబ్దిదారులుగా నమోదయినది 42.8 లక్షల మంది కార్మికులు మాత్రమే. వీరిలో 48 శాతం మంది కనిష్ట పింఛను వెయ్యి రూపాయలను ఎంపిక చేసుకున్నట్లు ‘పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ’ తెలియజేసింది. ఈ పథకానికి మోదీ ప్రభుత్వం కూడా పెద్దగా ప్రచారం కల్పించలేదు. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త పథకంలో అటల్ పథకాన్ని విలీనం చేస్తారా ? లేదా రెండింటిని కొనసాగిస్తారా? అన్న విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ఈ పథకం కోసం 500 కోట్ల రూపాయలను కార్మికులు తమ వంతు వాటా చెల్లించే పింఛను పథకాలు యూరప్ దేశాల్లో విజయవంతం అయ్యాయిగానీ భారత్ లాంటి ఏ వర్ధమాన దేశాల్లో విజయవంతం కాలేదు. అందుకు కారణం దేశంలో కార్మికులకు చాలీ చాలని జీతాలు లభించడమే. ఎప్పుడో వచ్చే పింఛను కోసం, అసలు అప్పటికి బతికి ఉంటామో, లేదో అన్న సంశయంతో నెలకు వంద రూపాయలను చెల్లించలేని మనస్థత్వం కలిగిన వాళ్లు, ఆర్థిక స్థోమత లేనివాళ్లు భారత కార్మిక రంగంలో ఎక్కువ మంది. నెలకు 15 వేల రూపాయల లోపు జీతం అందుకునే కార్మికులకు మాత్రమే ఈ పింఛను పథకం వర్తించడం ఇక్కడ గమనార్హం. 60 ఏళ్ల వయస్సులో వచ్చే మూడు వేల రూపాయలు నెలవారి పన్ల పొడికి కూడా సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు ఈ పథకం వల్ల పది కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని ఎలా లెక్కలు వేశారో కేంద్రానికే తెలియాలి. అయినా ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన పథకానికి ప్రచారం కావాలిగానీ ప్రయోజనం సంగతి ప్రభుత్వానికి ఎందుకు? -
వైఎస్ అభయహస్తం బాటలో కేంద్ర పింఛన్ పథకం
సాక్షి, అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో అమలు చేసిన ఒక పథకానికి అచ్చుగుద్దినట్టు అలానే ఉండే పథకాన్ని ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశమంతటా అమలు చేస్తామని బడ్జెట్లో ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి డ్వాక్రా మహిళలందరికీ 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా ఎంతో కొంత పింఛను అందించాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం తీరునే ఇప్పుడు దేశంలోని అసంఘటిత కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి 60 ఏళ్ల తర్వాత పింఛన్లు అందించే పథకాన్ని అమలు చేయడానికి కేంద్రం ముందుకొచ్చింది. 60 ఏళ్లు దాటిన మహిళలు సభ్యులుగా ఉన్న డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అనేక అంక్షలు అమలు చేస్తున్న విషయాన్ని అప్పటి ప్రభుత్వ ఉన్నతాధికారులు వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకు రాగా వారి కోసం అభయహస్తం పేరుతో పింఛన్ల పథకాన్ని ప్రకటించారు. డ్వాక్రా మహిళలు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 చొప్పున ఈ పథకంలో జమ చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి మహిళ పేరున ఏడాదికి రూ.365 చొప్పున చెల్లిస్తుంది. మహిళ వాటా, ప్రభుత్వ వాటా రెండు కలిపి ప్రభుత్వమే ఆ డబ్బులను ఎల్ఐసీ వంటి బీమా సంస్థల్లో పింఛన్ల స్కీంలో పెట్టుబడిగా పెడుతుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత వారికి పింఛన్లు చెల్లిస్తోంది. సభ్యులు పథకంలో చేరిన సంవత్సరాల ఆధారంగా రూ.500 నుంచి రూ.2,600 మధ్య పింఛను చెల్లించాలి. మహిళలకు 60 ఏళ్లు రాకమునుపే ఆ కుటుంబంలో చదువుకునే పిల్లలకు స్కాలర్ షిప్పు ఇవ్వడం.. ఒక వేళ దుర్మరణం వంటి విషాదకర సంఘటన జరిగితే బీమాగా కొంత మొత్తాన్ని ఆ కుటుంబానికి అందజేయడం ఈ పథకం ప్రధాన ఉద్ధేశం. ప్రస్తుత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 34 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఈ పథకంలో సభ్యులుగా కొనసాగుతుండగా, వారిలో 3,21,703 మంది ఈ పథకం ద్వారా ప్రతి నెలా ప్రస్తుతం పింఛన్లు అందుకుంటున్నారు. వైఎస్ ముందు చూపుతో ఆనాడే ఆదర్శ పథకం అసంఘటిత కార్మికుల కోసం ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో సభ్యులుగా చేరిన వారు ఏడాదికి రూ.100 జమ చేస్తే.. ప్రభుత్వం కూడా వంద రూపాయలు అతని పేరిట జమ చేస్తూ.. అతనికి 60 ఏళ్ల తర్వాత రూ.3 వేల వరకు పింఛను ఇస్తుంది. ఇది అభయహస్తం పథకానికి అచ్చుగుదినట్టుగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ముందు చూపుతో ఇలాంటి విన్నూత పథకాలు ప్రవేశపెట్టారని, ఇప్పుడు అవి దేశానికి ఆదర్శంగా మారాయని అంటున్నారు. అయితే, అభయహస్తం పథకానికి చంద్రబాబు ప్రభుత్వం ‘అన్న అభయహస్తం’ అని పేరు మార్చిందే గానీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ పథకంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి మరింత మంది డ్వాక్రా మహిళలకు పింఛన్ల లబ్ధి కలిగేలా చేయడానికి మాత్రం అసక్తి చూపడం లేదనే విమర్శ ఉంది. -
పింఛన్ల పితలాటకం సైట్ క్లోజ్
ఒంగోలు టౌన్ సామాజిక భద్రత పింఛన్లను పదిరెట్లు పెంచామంటూ రాష్ట ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించుకొంది. ఆ ప్రకటనను చూసి పింఛన్లకు అర్హులైన వారు వాటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళితే వెబ్సైట్ రూపంలో ప్రభుత్వం మోకాలడ్డుతోంది. తాత్కాలికంగా పనిచేయడం లేదు (టెంపరరీ అన్ అవైలబుల్) అంటూ వెబ్సైట్లో ఉండటంతో ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. ఎన్నికల పింఛన్లలో కూడా చంద్రబాబు ప్రభుత్వం పితలాటకం ఆడుతోందంటూ పలువురు అర్హులైన లబ్ధిదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. పది రెట్లు పింఛన్ పెంచామని చెబితే వాటిని పొందేందుకు ఆశగా వెళిన తమకు నిరాశ ఎదురవుతోందని వాపోతున్నారు. ఒంగోలు నగర పా లక సంస్థ పరిధిలో ఇప్పటివరకు 15వేల మంది పింఛన్లు పొందుతున్నారని, జనవరిలో జరిగిన జన్మభూమిలో మరో వెయ్యి పింఛన్లు మంజూరు చేశామంటూ నగర పాలక సంస్థ అధికారులు ప్రకటించారు. అయితే కొత్తగా మంజూరు చేసిన ఆ వెయ్యి పింఛన్లలో అగ్రభాగం అధికారపార్టీ ముద్ర పడిన వారివి ఉన్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ విమర్శలకు బలం చేకూర్చే విధంగా పింఛన్ల కోసం నగర పాలక సంస్థ కార్యాలయం చుట్టూ దరఖాస్తుదారులు తిరుగుతూనే ఉన్నారు. పది రెట్లు ఇవే.. సామాజిక భద్రత పింఛన్లు అయిన వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, చేనేత, ఒంటరి, మత్స్యకార, గీత కార్మికులు, చర్మకారులు, డప్పుకారులు, హిజ్రాలు, డయాలసిస్‌తో బాధపడుతున్న వారికి ప్రతినెలా అందించే పింఛన్లను రెట్టింపు చేశామంటూ చంద్రబాబు ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ప్రకటించేశారు. నాలుగున్నరేళ్లు అధికారంలో ఉండగా గుర్తుకురాని పదిరెట్ల పింఛన్ ఎన్నికలు సమీపించడంతో హడావుడిగా ప్రకటన చేశారు. ఇప్పటివరకు వృద్దాప్య, వితంతు, చేనేత, ఒంటరి, మత్స్యకార, గీతకార్మిక, చర్మకారులు, 79 శాతంలోపు వికలాంగత్వం ఉన్నవారికి 1000 రూపాయల చొప్పున పింఛన్లు అందిస్తున్నారు. అయితే ఆ 1000 రూపాయలను 2000 రూపాయలుగా పెంచుతున్నట్లు చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. అదేవిధంగా 80శాతం పైగా వికలాంగత్వం ఉంటే 1500 రూపాయలు, హిజ్రాలకు 1500 రూపాయల చొప్పున ఇస్తున్న పింఛన్లను 3000 రూపాయలు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. డయాలసిస్ చేయించుకుంటున్న వారికి ఇప్పటివరకు 2500 రూపాయలు ఇస్తుండగా, తాజాగా రూ. 3500 చేస్తూ ప్రకటించారు. జన్మభూమిలో చుక్కెదురు.. జనవరి 2 నుంచి నగరంలో నిర్వహించిన జన్మభూమి సభల్లో సామాజిక భద్రత పించన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి చుక్కెదురైంది. అధికార పార్టీకి చెందిన డివిజన్ అధ్యక్షుల కనుసన్నల్లో పింఛన్ల ప్రక్రియ చేపట్టారు. ఆ సమయంలో తమ డివిజన్ పరిధిలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో తమ పార్టీకి అనుకూలంగా లేనివాటిని పక్కన పెట్టేశారనేది జగమెరిగిన సత్యం. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులుగా ఉన్నవారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే నిర్ధాక్షిణ్యంగా వాటిని పక్కన పెట్టేయడంతో అనేకమంది అర్హులైనవారు పింఛన్లను పొందలేకపోయారు. తెలుగుదేశం పార్టీ డివిజన్ల అధ్యక్షులు మొదలుకొని ఒంగోలు శాసనసభ్యుడు వరకు జన్మభూమిలో అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేశామంటూ ప్రకటించుకుంటున్నారు. అయితే వాటిలో ప్రతిపక్ష పార్టీకి చెందిన వాటిని పక్కన పెట్టేశారన్నది బహిరంగ రహస్యమే. కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు సామాజిక భద్రత పింఛన్లను పదిరెట్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతోపాటు ఫిబ్రవరి ఒకటవ తేదీ శుక్రవారం నుంచి మూడు రోజులపాటు పండుగ వాతావరణంలో వాటిని లబ్ధిదారులకు అందించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఒంగోలు నగర పరిధిలో పింఛన్లకు అర్హులుగా ఉండి, జాబితాలో పేర్లు లేనివారు వాటికోసం పేర్లు నమోదు చేసుకునేందుకు నగర పాలక సంస్థ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చినవారికి అక్కడ భంగపాటు ఎదురవుతోంది. అందుకు కారణం పింఛన్ల నమోదుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను ప్రభుత్వం క్లోజ్ చేయడమే. ఎన్నికల సమయంలో పెంచిన పించన్లు ఆసరాగా ఉంటాయన్న ఉద్దేశ్యంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతరులు నగర పాలక సంస్థ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. పింఛన్ల నమోదుకు సంబంధించిన వెబ్ సైట్ టెంపరరీ అన్ అవైలబుల్ అని వస్తుండటంతో కార్యాలయ సిబ్బంది వారికి సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. కొంతమంది నుండి నామమాత్రంగా దరఖాస్తులు తీసుకుంటున్నారు. అయితే ఆ వెబ్సైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో, ఎప్పుడు పదిరెట్లు పింఛన్లు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నవారు వాటిని అందుకుంటారో చంద్రబాబుకే తెలియాలి. -
పింఛన్@57
సాక్షి,ఆదిలాబాద్/ఆదిలాబాద్‌అర్బన్: వృద్ధాప్య పింఛన్ వయసు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి 57 ఏళ్లు నిండిన వృద్ధులు ప్రతీనెల పింఛన్ అందుకునే వెసులుబాటు సర్కార్ కల్పించింది. గతంలో వృద్ధాప్య పింఛన్ వయసు 65 ఏళ్లుగా ఉండగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం 57 ఏళ్లకు కుదించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు రెండురోజులక్రితం విడుదల అయ్యాయి. నూతన మార్గదర్శకాలు జిల్లా అధి కారులకు అందాల్సి ఉంది. 57 ఏళ్లు నిండిన వృ ద్ధులు పింఛన్ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటరుకార్డులోని వయసు ప్రమాణికంగా తీసుకొని పింఛన్‌కు ఎంపిక చేయనున్నారు. జిల్లాలో 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లలోపు ఎంత మంది ఉన్నారు..ఎంత మంది ఆసరా పథకానికి అర్హులు కానున్నారనే వివరాలు ఆయా మండలాల వారీగా లెక్క తేల్చేందుకు జిల్లా అధి కారులు చర్యలు ప్రారంభించారు. అయితే అర్హత వయసు నిండిన వారందరికీ వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటిన పింఛన్ సొమ్ము చేతికందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆసరాకు బడ్జెట్ కేటాయించి ఎన్నికల హామీ మేరకు పెంచిన పింఛన్ సొమ్ముతోపాటు కొత్త పింఛన్లను అందించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. జిల్లాలో 13 వేల మందికిపైగా అర్హులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పింఛన్ మం జూరుకు ఓటరుకార్డులోని వయసు ప్రమాణికంగా తీసుకుంటున్నందున 2018 సెప్టెంబర్ 19 నా టికి 57 ఏళ్లు నిండిన వారందరూ అర్హులే. అయితే ఆదిలాబాద్, బోథ్ రెండు నియోజకవర్గాల్లో 50 నుంచి 59 ఏళ్లు గల ఓటర్లు 47,979 మంది ఉన్నారు. ఇందులో 57 నుంచి 59 ఏళ్ల వయసు వారు సుమారు 8 వేల మందికిపైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 60 నుంచి 69 ఏళ్ల వయసు గల ఓటర్లు 27,085 మంది ఉన్నారు. అయితే ఇందులో 60,61, 62, 63,64 వయసు గల వారు సుమారు 5 వేలకుపైగా ఉంటారని అధికారులు అంచనాకు వచ్చారు. అయితే ప్రస్తుతం సంవత్సరాల వారీగా ఓటర్ల వి వరాలు అందుబాటులో లేవు. ఒక ఫార్మాట్లో పదేళ్లకు కలిపి ఒకేసంఖ్య వచ్చేలా ఓటర్ల వివరా లు ఉన్నాయి. అయితే వయసుల వారీగా ఓట ర్లను గుర్తించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను హైదరాబాద్ నుంచి తీసుకురానున్నారని సమాచారం. ఇలా అయితేనే జిల్లా ఓటర్ల జాబితాలో 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లలోపు ఎంత మంది ఉన్నారనేది స్పష్టంగా చెప్పవచ్చని అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా జిల్లాలో మరో13 వేల మందికిపైగా లబ్ధిదారులకు కొత్తగా ఆసరా పింఛన్ మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా జిల్లాలో ప్రస్తుతం 69,956 మంది ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. కొత్త వాటిని కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరగనుంది. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగనుంది. గ్రామాల్లో, పట్టణాల్లో ఎంపికకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. గ్రామాల్లో వీఆర్వోలు, పట్టణాల్లో అయితే బిల్ కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పాల్గొంటారు. ఇలా ఎంపిక చేసిన జాబితాను గ్రామ సభల ద్వారా ప్రదర్శిస్తారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరించి వచ్చిన వాటిని పరిశీలన చేసి తుది జాబితా రూపొందిస్తారు. లబ్ధిదారుల ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా, ఫొటోను పంచాయతీ కార్యదర్శులు, బిల్కలెక్టర్లు సేకరిస్తారు. గ్రామాల్లోని లబ్ధిదారుల జాబితాను ఎంపీడీవోలు, పట్టణ లబ్ధిదారుల జాబితాను కమిషనర్లు పరిపాలన అనుమతికోసం కలెక్టర్‌కు పంపిస్తారు. ఆమోదం తెలిపిన అనంతరం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రస్తుతం ఉన్న ఆసరా సాప్ట్‌వేర్‌లో లబ్ధిదారుల వివరాలు అప్లోడ్ చేస్తారు. -
సీపీఎస్ రద్దు చేయకుంటే పోరుబాటే
ఉద్యోగ విరమణ తర్వాత జీవితానికి ఆర్థిక భద్రత, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినా, ఆ కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు, ప్రత్యేక ప్రయోజనాలు, సామాజిక భద్రతగా పింఛన్లు వస్తాయనుకున్నారు. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఉద్యోగుల భవిష్యత్‌కు భరోసా లేకుండా పోయింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులను ఆందోళనలు, పోరాటాల బాట పట్టేలా చేసింది. కాకినాడ సిటీ: జిల్లా సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లాలోని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. కాకినాడ మెక్లారిన్ హైస్కూల్ నుంచి భారీ ఊరేగింపుగా ఆనందభారతి గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు జిల్లాలోని సీపీఎస్ ఉద్యోగులు వేలాదిగా తరలి వచ్చి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని దుయ్యబట్టారు. సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానం కొనసాగించాలని నినదించారు. కమిటీలు వేసి ఉద్యోగులను బుజ్జగించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. పింఛన్ రద్దు చేసే అధికారం పార్లమెంట్‌కు ఎక్కడిదంటూ ప్రశ్నించారు. శానససభలో పింఛన్ తీసేస్తున్నట్లు తీర్మానం చేసి కొత్త పింఛన్ విధానం అమలు చేస్తున్నట్లు చట్టాలు చేశారా అంటూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నిలదీశారు. రానున్న శాసనసభ సమావేశాల్లో ప్రత్యేక తీర్మానం ద్వారా సీపీఎస్ విధానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించకపోతే అసెంబ్లీ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. సీపీఎస్ ఉద్యోగులు నిర్వహించిన సమరభేరి బహిరంగ సభకు ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.రవికుమార్ అధ్యక్షత వహించగా రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు ఐ.వెంకటేశ్వరరావు, బూరిగ ఆశీర్వాదం, గొడుగు ప్రతాప్, డి.వెంకటరావు, ప్రదీప్‌కుమార్, ఎస్కేవీ భాషా, హృదయరాజు, మాజీ ఎమ్మెల్సీ నల్లమిల్లి శేషారెడ్డి, అంబాజీపేట ఎంపీడీఓ తూతిక విశ్వనాథ్ తదితరులు పాల్గొని మాట్లాడారు. సీపీఎస్ ప్రకటన ఇలా... సీపీఎస్ విధానంపై 2003, డిసెంబర్ 22న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 2004, జనవరి ఒకటి నుంచి సీపీఎస్‌ను అమలులోకి తెచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004, సెప్టెంబర్ ఒకటి నుంచి సర్వీసులో చేరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, విశ్వవిద్యాలయ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పొందుతున్న సంస్థల్లో ఉద్యోగులు, అటానమస్ కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులందరికీ 2004, నవంబర్ 22 నుంచి అమలు చేస్తోంది. దీనిని పెన్షన్ నిధి నియంత్రణ, అభివృద్ధి, ప్రాధికార సంస్థ (పీఎఫ్ఆర్డీఏ), నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థల సమన్వయంతో దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. సీపీఎస్ అంశం రాష్ట్ర పరిధిలోనిదే... సీపీఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో పెద్ద ఉద్యమమే మొదలు పెట్టామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమైనందున దీనిని రద్దు చేయలేమని కొన్ని రాష్ట్రాలు పేర్కొంటున్నాయని, ఇది సరికాదన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లును కొన్ని రాష్ట్రాలు ఆమోదించిన తర్వాతే కేంద్రం అమల్లోకి తెచ్చిందన్నారు. ప్రస్తుతం త్రిపుర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కూడా పాత పింఛన్ విధానమే అమల్లో ఉందన్నారు. సమాచార హక్కు చట్టం కింద వివరాలను కోరినప్పుడు ఇది కేవలం రాష్ట్రాల పరిధిలోని అంశం మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసినట్లు పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. సీపీఎస్ విధానం రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా శాఖల ఉద్యోగులు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామన్నారు. కేజ్రీవాల్ మాస్క్‌లతో... ఆందోళనకారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫోటోలు, ఫ్లెక్స్‌లు, మాస్క్‌లు ధరించి పాల్గొనడం విశేషం. ఉద్యోగులకు ఆమ్ ఆద్మీ పార్టీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నరాల శివ, మహిళా విభాగం కన్వీనర్ టి.రూపారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సీపీఎస్ రద్దుకు జగన్ సుముఖం : మార్గాని భరత్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారని రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజవర్గ కో ఆర్డినేటర్ మార్గాని భరత్ పేర్కొన్నారు. కాకినాడలో ఏపీ సీపీఎస్ జిల్లా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో íసీపీఎస్ రద్దుపై నిర్వహించిన ర్యాలీ, సమరభేరి బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా పర్యటన సమయంలో తాము అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేయడంతో పాటు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని, సకాలంలో కరువు భత్యం చెల్లిస్తామని జగన్ ప్రకటించారని భరత్ గుర్తు చేశారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జగన్‌ను కలసి సీపీఎస్ విధానంపై చర్చించారని, స్పష్టమైన హామీని కూడా జగన్ ఉద్యోగులకు ఇచ్చారన్నారు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని, సీపీఎస్ విధానం రద్దు అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్సార్ సీపీకి ఓటు వేసి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని మార్గాని భరత్ కోరారు. కేంద్రం జోక్యం అవసరం లేదు ఇతర రాష్ట్రాలలో పాత పింఛన్ విధానం అమలు చేస్తున్నారు. మన ప్రభుత్వం మాత్రం కేంద్ర పరిధిలోనిదంటూ దాటవేస్తోంది. సీపీఎస్‌ను రద్దు చేసేందుకు కేంద్రం జోక్యం అవసరం లేదు. – భానుశ్రీ, కాకినాడ -
సీపీఎస్ రద్దు చేయకుంటే రాష్ట్ర వ్యాప్త నిరసనలు
శ్రీకాకుళం అర్బన్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం విధానం రద్దు కోసం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించి ఆమోదించాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతాయని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషొత్తమనాయుడు, పెన్షన్ సాధన సమితి జిల్లా కన్వీనర్ హనుమంతు సాయిరాం హెచ్చరించారు. ఈ మేరకు నగరంలోని ఎన్జీవో కార్యాలయం వద్ద రెండో రోజు సోమవారం నిరాహారదీక్షా శిబిరాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. ఇక్కడ 109 మంది ఉద్యోగులు 48 గంటలపాటు నిరాహారదీక్ష చేయ డం సాధారణ విషయం కాదన్నారు. ఈ పోరాటాలను ప్రభుత్వం చూసి సీపీఎస్ రద్ద కోసం కృషిచేయాలన్నారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. లేనిపక్షంలో తలెత్తే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు యూ తారకేశ్వరరావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గురుగుబెల్లి భాస్కరరావు, సీహెచ్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ సీపీఎస్ బాధితులు చేస్తున్న దీక్ష రాష్ట్రంలోని లక్షా 86 వేల మంది ఉద్యోగుల ఆక్రందన అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చనిపోయిన 286 మంది బాధిత కుటు ంబాల దీనస్థితులు ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. ఉద్యోగుల దక్షతను, నిబద్ధతను చులకనగా చూస్తే ఉద్యమాంధ్రప్రదేశ్‌గా మారుతుందని హెచ్చరించారు. అతిచి న్నం రాష్ట్రం త్రిపురలో ఇప్పటికీ పాతపింఛన్ విధానం కొనసాగుతోందన్నారు. మన రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. లేనిపక్షంలో 2004 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు పునరావృతం కాక తప్పదన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే అసెంబ్లీ ముందే ఆమరణ నిరాహారదీక్షలకు వెనుకాడబోమని హెచ్చరించారు. రెండ్రోజుల నిరాహారదీక్షకు సంఘీభావం ప్రకటించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. దీక్ష విరమణ సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ రెండ్రోజుల నిరాహారదీక్ష చేసిన ఉద్యోగులకు ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు పురుషొత్తమనాయుడు, పెన్షన్ సాధన సమితి జిల్లా కన్వీనర్ హనుమంతు సాయిరాం నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో జాక్టో చైర్మన్ పప్పల రాజశేఖర్, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చౌదరి రవీంద్ర, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పేడాడ ప్రభాకరరావు, డీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి జీ గోపాలరావు, పీ హరిప్రసన్న, ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి, గురుగుబెల్లి బాలాజీరావు(ఏపీటీఎఫ్), కే పద్మావతి(ఆర్‌యూపీపీ), రవీంద్ర(ఐసీడీఎస్), చంద్రరావు (బీసీ వెల్ఫేర్), బొడ్డేపల్లి మోహనరావు, వివిధ సంఘాల నాయకులు బైరి అప్పారావు, వీ హరిశ్చంద్రుడు, శ్రీనివాసరావు, మల్లేశ్వరరావు, రామారావు, ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు పీ మురళి, ఎన్ రత్నకుమార్, ఎస్ గోపి, ఎం శ్రీనివాసరావు, బీ పూర్ణచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఏకమైన ఉపాధ్యాయ సంఘాల జేఏసీలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విద్యాశాఖ పరిధిలోని మూడు ఉపాధ్యాయ జేఏసీలు, వాటిల్లోని 54 సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టాలని నిర్ణయించాయి. వేర్వేరు జేఏసీల పరిధిలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై పోరాటాలు సాగించాలని నిర్ణయించాయి. శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో జాయింట్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ యూనియన్‌గా (జేసీటీయూ) ఏర్పడ్డాయి. ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు 30 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశాయి. వచ్చే నెల 2 నుంచి జరగాల్సిన 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్‌ను బహిష్కరించాలని నిర్ణయించాయి. బహిష్కరణను విజయవంతం చేసేందుకు ఈనెల 28, 29 తేదీల్లో అన్ని జిల్లాల్లో సన్నాహక సదస్సులు నిర్వహించాలని నిర్ణ్ణయించాయి. దీనిపై ఈనెల 27న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసిచ్చేందుకు సిద్ధమయ్యాయి. మూడు జేఏసీలకు నాయకత్వం వహిస్తున్న పీఆర్టీయూ అ«ధ్యక్షుడు సరోత్తంరెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు భుజంగరావు, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావా రవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా 9 ప్రధాన సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సంఘాల నేతలు విష్ణువర్ధన్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, రఘునందన్, చెన్నయ్య, అంజిరెడ్డి, రాజన్న పాల్గొన్నారు. ఇవీ ప్రధాన డిమాండ్లు.. సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమల్లోకి తేవాలి. ఏకీకృత సర్వీస్ రూల్స్ కోసం న్యాయపరమైన ఆటంకాలు తొలగించి, వేసవిలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి. కొత్త పీఆర్సీని 2018 జూలై 1 నుంచి అమలు చేసేలా చర్యలు చేపట్టాలి. రూ.398 వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. 2016 వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలి. ఎయిడెడ్, మోడల్ స్కూల్, కేజీబీవీ, గిరిజన, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను పునరుద్ధరించాలి. ఎస్సెస్సీ పరీక్షల విధులు, మూల్యాంకనం రేట్లను రెట్టింపు చేయాలి. -
ఉద్యోగుల పోరు బాట
శ్రీకాకుళం: తమకు తీవ్ర నష్టాన్ని కలిగించే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)పై సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్న ద్వంద్వ సిద్ధాంతాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానాన్ని పరిశీలిస్తామని ఎన్నికల ముందు చెప్పి.. అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత.. సీపీఎస్ తమ పరిధిలో లేదని మాట మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చి వేడుకున్నా కనీసం వాటిని పట్టించుకోని ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ధర్నాలు నిర్వహించాలని ఒక పూట సామూహిక సెలవుపెట్టాలని పిలుపునిచ్చాయి. దశల వారీగా ఆందోళనను ఉద్ధృతం చేసేందుకు నిర్ణయించాయి. అన్నీ నష్టాలే.. సీపీఎస్ విధానంలో ఉద్యోగి పదవీ విరమణ అనంతరం పెన్షన్ ఉండదు. పాత పెన్షన్ దారులకు ఉండేలా ఆరోగ్య కార్డులు, ఇతర సదుపాయాలు, డీఏ, పీఆర్సీ వంటి ప్రయోజనాలు ఉండవు. సీపీఎస్ విధానంలో ఉన్న ఒక ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబ సభ్యులకు ఇదివరకు ఒకరికి ఉద్యోగం, పెన్షన్ ఇచ్చేవారు. కానీ సీపీఎస్‌లో ఈ సౌకర్యాలు ఉండవు. పెన్షన్ నుంచి రుణాలు, అడ్వాన్స్‌లు పొందే సౌకర్యం కూడా ఉండదు. ఇలా ఎన్నో నష్టాలు ఉండడంతో పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ కంపెనీలు లాభాలు ఆర్జించడానికే.. ఉద్యోగుల జీతం నుంచి పది శాతం మినహాయించి వాటిని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ లైఫ్ వంటి వాటిల్లో పెట్టుబడి పెడతారు. ఇవి సీఆర్ఏ పరిధిలో పని చేస్తాయి. ఈ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు ఇతర దేశాల్లో నష్టాలు చవిచూసి.. ప్రస్తుతం మన దేశంలో వ్యాపారం చేసి విదేశాల్లో నష్టపోయిన వాటిని పూడ్చుకోవాలని చూస్తున్నాయని బాధిత సీపీఎస్ ఉద్యోగులు వివరిస్తున్నారు. వారి నష్టాలు పూర్తయితే గాని లాభాలు చూపించరని, అప్పటివరకు తమ జీతం నుంచి మినహాయించిన మొత్తాలు పెట్టుబడిగా పెట్టినా ఆ మొత్తమంతా నష్టపోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దశల వారీగా చెల్లింపు ఉద్యోగి పదవీ విరమణ చేసిన వెంటనే తమ జీతం నుంచి మినహాయించిన మొత్తం, ప్రభుత్వం జత చేసిన పదిశాతం మొత్తం ఒకేసారి చెల్లించరని, పదవీ విరమణ చేసిన రోజున 60 శాతం మాత్రమే ఇస్తారని.. ఉద్యోగికి 70 ఏళ్లు నిండిన తరువాత మరో 20 శాతం, 80 ఏళ్లు నిండిన తర్వాత మిగిలిన మొత్తం చెల్లిస్తారు. ఏ కారణంగానైనా 60 ఏళ్ల తరువాత 70 ఏళ్లలోపు సీపీఎస్ ఉద్యోగి మరణిస్తే 40 శాతాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ప్రైవేటు సంస్థలకు ప్రయోజనం చేకూర్చడం మాని ప్రభుత్వమే ఆ మొత్తాన్ని తమ వద్ద ఉంచుకొని భద్రత కల్పించాలని డిమాండ్ చేసినా పట్టించుకోకపోవడంతో ఆందోళన బాట పట్టామని స్పష్టం చేస్తున్నారు. తప్పు కేంద్రంపై నెట్టేసేందుకే.. సీపీఎస్ విధానం రద్దు కేంద్రం పరిధిలో ఉందని సీఎం చెప్పడం కేవలం సాకు మాత్రమేనని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. 2002లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి.. దీనిని రాష్ట్రాల్లో అమలు ఆయా ప్రభుత్వాలకు కేంద్రం వదిలేసింది. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు.. ఈ విధానం వైపు మొగ్గు చూపి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో 2004, సెప్టెంబర్ 1 నుంచి ఈ విధానం రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. ఇటీవల ఛత్తీస్గడ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఉద్యోగులు ఆందోళన చేయడంతో వీటిని పరిశీలించేందుకు కమిటీని నియమించాయి. ఈ నివేదిక ఆధారంగా శాసనసభలో తీర్మానించి కేంద్రానికి నివేదించేందుకు కూడా ఆయా ప్రభుత్వాలు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చాయి. రాష్ట్రంలో కూడా ఇటువంటి చర్యలే చేపట్టాలని కోరినా ఫలితం లేకపోయింది. రూ.120 కోట్లకు పైనే ఆదాయం ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్, జెడ్పీ ఉద్యోగులకు జెడ్పీ పీఎఫ్, ప్రైవేటు ఉద్యోగులకు ఈపీఎఫ్ వంటి సంస్థలు ఉండడం వల్ల భద్రత ఉందని, రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఎస్ ఉద్యోగుల ద్వారా సంవత్సరానికి రూ.120 కోట్లకు పైగా సమకూరుతోందని, వడ్డీతో కలుపుకొంటే ఇది రూ.150 కోట్లకు పైబడుతుందని సీపీఎస్ ఉద్యోగులు వివరిస్తున్నారు. జగన్ హామీతో భరోసా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ఆ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ప్రకటించడంపై సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏదైనా హామీ ప్రకటించే మనస్తత్వం గల ఆయన.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పడాన్ని స్వాగతిస్తున్నారు. జగన్‌కు సాధ్యమైనప్పుడు చంద్రబాబుకు ఎందుకు సాధ్యపడడం లేదని నిలదీస్తున్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని జన్మభూమిలో వినతి పత్రాలు ఇస్తే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యేలు ఆదేశించడంపై బాధిత ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
ఉద్యోగుల ఆశలకు ఊపిరి
సాక్షి, అమరావతి, బద్వేలు/కడప ఎడ్యుకేషన్: ఉద్యోగుల పాలిట నో పెన్షన్ స్కీమ్‌గా మారిన భాగస్వామ్య పింఛను పథకం (సీపీఎస్)ను ఎత్తివేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గత కొన్నేళ్లుగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో 1.86 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు భాగస్వామ్య పింఛను పథకం (సీపీఎస్) పరిధిలో ఉన్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఉన్నత విద్యామండలి, ఆరోగ్య, పోలీసు తదితర శాఖలలో మరో 60 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. 2004 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానానికి వ్యతిరేకంగా అప్పట్నుంచే దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో గత సెప్టెంబర్ ఒకటిన రాజధాని అమరావతికి తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఉద్యోగులు మిలియన్ మార్చ్ చేపట్టారు. అదే రోజూ సామూహిక సెలవుదినాన్ని పాటించారు. అంతకుముందు కూడా ఎన్ని ఆందోళనలు చేపట్టినా, ఎంతగా విన్నవించుకున్నా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఈ పరిస్థితుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామంటూ ప్రకటించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాల ఆశలకు ఊపిరి పోశారు. సీపీఎస్‌ను అమల్లోకి తెచ్చిన ఎన్డీయే పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు అని, అది ఉద్యోగికి, అతని కుటుంబ జీవనానికి అనువుగా ఉండాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఉద్యోగిగా ఉన్నప్పటి హోదాకు తగ్గకుండా జీవించడానికి అనువుగా అది ఉండాలని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎన్నో పోరాటాలు చేసి పెన్షన్ విధానాన్ని సాధించుకున్నారు. అయితే ప్రభుత్వాలు ఆర్థిక సంస్కరణల పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించే పెన్షన్‌ను మోయలేని భారంగా పేర్కొంటూ దాన్ని వదిలించుకున్నాయి. అప్పటి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నోటిఫికేషన్‌తో 2004 జనవరి 1 నుండి నూతన పెన్షన్ పథకం (సీపీఎస్)ను అమలులోకి తెచ్చింది. ప్రభుత్వాలు పెన్షన్ చెల్లించే బాధ్యత నుండి తప్పుకునేలా కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం అమలు చేసింది. దీంతో రాష్ట్రంలో 1.8 లక్షల మందికి పైగా ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత లభించే జీవన భద్రతను కోల్పోయారు. వారి కుటుంబాలకు రక్షణలేని పరిస్థితి ఏర్పడింది. స్వాగతిస్తున్నాం: ఫ్యాప్టో వైఎస్ జగన్ ప్రకటన అభినందనీయం. దీనిని మేము స్వాగతిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు సీపీఎస్ రద్దుకు వీలుగా ముందుకు రావాలి. ఈ విషయంలో టీడీపీ రెండునాల్కల ధోరణిలో ఉంది. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉన్నందున సీపీఎస్ రద్దుకు వారిని ఒప్పించాలి. – పి.బాబురెడ్డి (చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు సీపీఎస్ రద్దుపై జగన్ ప్రకటనను మేము స్వాగతిస్తున్నాం. ఇది ఉద్యోగుల భవిష్యత్‌కు భరోసా ఇవ్వడమే. ఉద్యోగులకు పింఛన్ లేకుండా చేసిన ప్రభుత్వం.. ఐదేళ్లు పదవిలో ఉండే రాజకీయ నేతలకు మాత్రం పింఛన్ ఇస్తోంది. – జీవీ నారాయణరెడ్డి, ప్రధానోపాధ్యాయు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు: ఏపీటీఎఫ్ 2004 సెప్టెంబర్ 1 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా లక్షా 86 వేల మంది ఉన్నారు. సీపీఎస్‌ను రద్దు చేస్తే వీరందరి జీవితాల్లో వెలుగులు నింపిన వారవుతారు. – శ్యాంసుందర్‌రెడ్డి (ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు) ఇతర పార్టీలు స్పందించాలి సీపీఎఎస్ రద్దుపై, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన విధానాన్ని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. ఇతర పార్టీలు కూడా తమ విధానాన్ని ప్రకటించి సీపీఎస్ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి. – కత్తి నరసింహారెడ్డి (ఉపాధ్యాయ ఎమ్మెల్సీ) వైఎస్ జగన్ ప్రకటన హర్షణీయం ప్రభుత్వ ఉద్యోగుల సొంతింటి కలను నెరవేరుస్తానని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని వైఎస్ జగ¯Œ ప్రకటించటం హర్షణీయం. – కె.జాలిరెడ్డి, కె.ఓబుళపతి (ఏపీ వైఎస్సార్‌టీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు) -
పెన్షన్.. టెన్షన్!
♦ గందరగోళంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ♦ ఆందోళనలో 1.2 లక్షల మంది ఉద్యోగులు ♦ నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సామూహిక సెలవు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2004 సెప్టెంబర్ 1 నుంచి అమల్లో ఉన్న కాంట్రిబ్యుటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) గందరగోళంగా మారింది. పాత పెన్షన్ విధానంలో ఉన్న ప్రయోజనాలేవీ వర్తించకపోగా.. ఉన్న ప్రయోజనాలూ సరిగా అందని దుస్థితి నెలకొంది. రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం నుంచి అందే లాభాలేమీ పెద్దగా లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు సీపీఎస్ కింద చెల్లించిన సొమ్ముకు సంబంధించిన ఖాతాలు, లెక్కలు సరిగా లేకపోవడం, పెన్షన్ ఫండ్‌లో ఉన్న సొమ్ముకు కనీస వడ్డీ కూడా అందని పరిస్థితి ఉండడం సమస్యగా మారింది. దీంతో అసలు సీపీఎస్‌ను రద్దు చేయాలని.. తిరిగి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం సామూహిక సెలవు పెట్టడం తోపాటు నిరసన చేపట్టనున్నారు. సీపీఎస్‌తో ప్రయోజనం అంతంతే! కేంద్ర ప్రభుత్వం 2004 సెప్టెంబర్ 1 నుంచి సీపీఎస్‌ను అమల్లోకి తెచ్చింది. దాని ప్రకారం... పెన్షన్ కోసం ఉద్యోగి తన వాటాగా వేతనంలో 10 శాతం చెల్లిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మరో 10 శాతం చెల్లిస్తుంది. ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వ అధీనంలోని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) వద్ద జమవుతూ ఉంటుంది. ఉద్యోగి రిటైరైనపుడు తన ఖాతాలో ఉన్న సొమ్ములో 60 శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. మిగతా 40 శాతం సొమ్మును పీఎఫ్ఆర్డీఏ తమ వద్దే ఉంచుకుని.. దానిని స్టాక్మార్కెట్లో పెట్టుబడులుగా పెడుతుంది. ఆ సొమ్ము నెట్ అసెట్ వ్యాల్యూ ప్రకారం లెక్కించి ఉద్యోగికి పెన్షన్‌ను ఇస్తుంది. వేల మంది ఖాతాలు గందరగోళమే..! రాష్ట్రంలో 1.2 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉంటే.. అందులో దాదాపు 40 శాతం మంది పెన్షన్ ఖాతాల్లో సొమ్ము ఎంత జమ అయిందో తెలియని పరిస్థితి నెలకొంది. 2004 నుంచే సీపీఎస్‌ను అమలు చేస్తున్నా.. 2013లో కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఆర్డీఏ చట్టం చేసింది. ఈ మధ్య కాలంలో నియమితులైన దాదాపు 50 వేల మంది ఉద్యోగుల ఖాతాల నిర్వహణ గందరగోళంగా మారింది. సీపీఎస్ పరిధిలో లేని త్రిపుర, బెంగాల్ వాస్తవానికి త్రిపుర, బెంగాల్ రాష్ట్రాలు ఇప్పటికీ సీపీఎస్ పరిధిలో లేవని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు కూడా సీపీఎస్ రద్దు కోసం కమిటీలను వేశాయని, మన రాష్ట్రంలోనూ సీపీఎస్ రద్దుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నాయి. అయితే సీపీఎస్ రద్దు, ఫ్యామిలీ పెన్షన్ వర్తింపు, పాత పెన్షన్ విధానం అమలు అంశాలు కొంతమేర కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి. గ్రాట్యుటీ అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఈ నేపథ్యంలో సీపీఎస్ ఉద్యోగులకు వెంటనే గ్రాట్యుటీ సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పాత పెన్షన్ విధానంలో ప్రయోజనాలెన్నో రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తిస్తుంది. దాని ప్రకారం.. ఆ ఉద్యోగి పదవీ విరమణ రోజు నాటికి ఉన్న మూల వేతనంలో సగం మేర సొమ్ము ఆ తర్వాత నెలనెలా పెన్షన్‌గా అందుతుంది. ఇందుకు ఉద్యోగి ఎలాంటి వాటా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక ఆ ఉద్యోగి మరణిస్తే.. వారిపై ఆధారపడిన కుటుంబానికి కుటుంబ పెన్షన్ వస్తుంది. గరిష్టంగా రూ.12 లక్షల వరకు గ్రాట్యుటీ అందజేస్తారు. జీపీఎఫ్‌లో దాచుకున్న సొమ్ము వడ్డీతో సహా వస్తుంది. కానీ 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టం (సీపీఎస్)లో ఈ ప్రయోజనాలేవీ ఉండవు. నిరసనలు చేపడతాం ‘‘సీపీఎస్ రద్దు కోసం జాక్టో తరఫున సామూహిక సెలవు పెడుతున్నాం. దానితోపాటు నిరసన కార్యక్రమాలు చేపడతాం..’’ – భుజంగరావు, ఎస్టీయూ అధ్యక్షుడు సీపీఎస్ నుంచి వైదొలగవచ్చు ‘‘త్రిపుర, బెంగాల్ రాష్ట్రాలు అసలు సీపీఎస్‌లోనే లేవు. కాబట్టి తెలంగాణ కూడా సీపీఎస్ నుంచి వైదొలిగే వీలుంది. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ తరఫున జిల్లా కేంద్రాల్లో సామూహిక ధర్నాలు నిర్వహిస్తాం..’’ – చావ రవి, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి వెంటనే గ్రాట్యుటీ ఇవ్వాలి ‘‘సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే. దీనిపై కేంద్రంతో వెంటనే మాట్లాడాలి. గ్రాట్యుటీ ఇచ్చే ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం..’’ – కారెం రవీందర్‌రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు సీపీఎస్ రద్దు చేయాల్సిందే.. ‘‘సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ తరఫున ఇందుకోసం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం..’’ – వి.మమత, టీజీవో అధ్యక్షురాలు -
8 శాతం పెన్షన్ స్కీమ్ లాంచ్, కేవలం వారికే..
ప్రధాన్ మంత్రి వయా వందన యోజన(పీఎంవీవీవై) పెన్షన్ స్కీమ్‌ను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ స్కీమ్ కేవలం 60ఏళ్లు, ఆపైబడిన సీనియర్ సిటిజన్లకు మాత్రమే. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లకు(60ఏళ్లు, ఆపైబడిన వారికి) ప్రభుత్వం 10ఏళ్ల పాటు గ్యారెంటీ వడ్డీని ఇవ్వనుంది. పదేళ్ల కాలం పాటు ఉండే ఈ పాలసీలో పాలసీదారు కోరుకున్న విధంగా ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు, పన్నెండు నెలల పద్ధతిలో పెన్షన్ అందుతుంది. 2017 మే 4 నుంచి ఈ స్కీమ్ ఆఫర్ చేయడాన్ని ఎల్ఐసీ ప్రారంభించింది. 2018 మే 3 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. ఎల్ఐసీ ద్వారా ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లోనూ ఈ స్కీమ్‌ను కొనుగోలుచేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో ఏడాది పెన్షన్ ప్లాన్‌ను ఎంపికచేసుకుంటే, కనీసం 1,44,578 రూపాయలను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.7,22,892ను ఇన్వెస్ట్ చేయాలి. నెలవారీ పెన్షన్ ప్లాన్‌ను ఎంపికచేసుకున్న పక్షంలో కనీసం రూ.1,50,000, గరిష్టంగా రూ.7,50,000 పెట్టుబడులుగా పెట్టాలి. రూ.1,50,000 పెట్టుబడులు పెట్టిన వారు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ పొందుతారు. అదేవిధంగా రూ.7,50,000 ఇన్వెస్ట్‌చేస్తే నెలవారీ పెన్షన్ రూ.5000 ఆర్జించే అవకాశముంది. ఒకవేళ 10ఏళ్ల కాల వ్యవధిలో పెన్షనర్ మరణిస్తే, కొనుగోలుచేసిన మొత్తాన్ని బెనిఫియరీకి అందిస్తారు. 10 ఏళ్ల కాలవ్యవధి అయిపోయే సమయానికి 98 శాతం కొనుగోలు ధరంతా రీఫండ్ అయిపోతుందని ప్రభుత్వం చెప్పింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ స్కీమ్ నుంచి బయటికి వైదొలిగే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ పాలసీపై జీఎస్టీ మినహాయింపు కూడా కల్పించడంతో పాటు, కొనుగోలు ధరపై 75 శాతం రుణసదుపాయం కూడా ఉంది. అయితే పాలసీ కాలం మూడేళ్లు పూర్తైన తర్వాతే ఆ అవకాశం లభిస్తుంది. -
పాత పెన్షన్ స్కీం అమలుకు కృషి
మండలి చైర్మన్ స్వామిగౌడ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: పోరాడి సాధించు కున్న తెలంగాణలో ప్రతి ఉద్యోగిని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని మండలి చైర్మన్ స్వామి గౌడ్ పేర్కొన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానంపై ఉద్యోగుల ఆందోళ నను పరిగణనలోకి తీసుకొని, వారికి ఏ విధానం లాభదాయ కమో దానినే ప్రభుత్వం అమలు చేసేలా కృషి చేస్తానని హామీ నిచ్చారు. తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ డైరీని ఆయన చాంబర్లో సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు ఆందోళనకరంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని సంఘం ప్రతినిధులు స్వామిగౌడ్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
సీనియర్ సిటిజన్లకు తీపికబురు
వయసు పైబడిన వారికి సామాజిక రక్షణగా తీసుకొచ్చిన పెన్షన్ స్కీమ్‌ను కేబినెట్ మంగళవారం ఆమోదించింది. ఈ స్కీమ్ కింద 10 ఏళ్ల పాటు, ఎల్ఐసీ 8 శాతం రిటర్న్‌లను గ్యారెంటీగా అందించనుంది. సోషల్ సెక్యురిటీ, ఫైనాన్సియల్ ఇక్లూజన్ ప్రొగ్రామ్ కింద ఎల్ఐసీ ఈ రిటర్న్‌లను సీనియర్ సిటిజన్లకు తప్పక ఇవ్వనుంది. వరిస్థ పెన్షన్ బీమా యోజన 2017 ఆవిష్కరిస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. ఈ స్కీమ్ కింద 10 ఏళ్ల పాటు 8 శాతం రిటర్న్‌లతో పెన్షన్‌ను అందించనున్నామని కేంద్రం హామినిచ్చింది. నెల/త్రైమాసికం/అర్థ సంవత్సరం, వార్షిక తరహాలో దేన్ని పెన్షనర్లు ఎంచుకుంటే, ఆ విధంగా రిటర్న్‌లను ఇస్తామని కేంద్రం చెప్పింది. ఈ ఏడాది నుంచి ఎల్ఐసీ ద్వారా ఈ స్కీమ్‌ను అమల్లోకి తేనున్నారు. మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ఆదాయాలు తగ్గుతాయి కాబట్టి 60 సంవత్సరాలు, ఆపై వయసు మీదపడిన వారికి ఈ స్కీమ్ ఎంతో సహకరించనుంది. -
పండుటాకుల పాట్లు
ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు పోస్టాఫీస్‌ల చుట్టూ ప్రదక్షిణలు నిరీక్షించి నీరసించిపోతున్న వృద్ధులు, దివ్యాంగులు సూర్యాపేట :వయస్సు మీదపడిన పండుటాకులు, దివ్యాంగులు, వితంతువుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టి ‘ఆసరా’ పింఛన్ పథకం రోజురోజుకూ నీరుగారుతోంది. మూడు నెలలుగా జిల్లాలోని లబ్ధిదారులకు పెన్షన్ అందకపోవడంతో వారు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. వృద్ధాప్యంలో ప్రభుత్వం అందించే ‘ఆసరా’తోనే బతుకీడుస్తున్న వారు ప్రస్తుతం డబ్బులు లేక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నిత్యం పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేçస్తూ నిరీక్షించి నీరసించి పడిపోతున్నారు. పలు చోట్ల వృద్ధులు అనారోగ్యానికి గురైన సంఘటనలుచోటు చేసుకుంటున్నాయి. ఒకరిద్దరికే ఇచ్చి.... ప్రభుత్వం పెన్షన్ డబ్బులు విడుదల చేసిందని అధికారులు చెబుతున్నా.. లబ్ధిదారులకు మాత్రం మూడు నెలలుగా అందడంలేదు. పోస్టాఫీస్ల్లో ఒకరిద్దరికి ఇచ్చి డబ్బులు లేవని అధికారులు ముఖం చాటేస్తున్నారని వృద్ధులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో 23 మండలాలు రెండు మున్సిపాలిటీలు, హుజూర్నగర్ నగర పంచాయతీ పరిధిలో 51,310 వృద్ధాప్య, 51,408 వితంతు, 19,813 వికలాంగులు, 6,500 గీతకార్మికులు, 823 చేనేత కార్మికుల పెన్షన్లు మొత్తం 1,29,854 లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో వృద్ధులు, వితంతులకు, గీత, చేనేత కార్మికులకు నెలకు రూ.వెయ్యి, వికలాంగులకు నెలకు రూ.1,500 అందచేస్తారు. ఇలా జిల్లాలోని పెన్షన్‌దారులకు నెలకు రూ.15.15కోట్ల బడ్జెట్‌ను (ఆక్టోబర్ నెలకు) ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు 19 మండలాల పరిధిలో కేవలం 50,716 మంది లబ్ధిదారులకుగాను రూ.5,89,60,000 మాత్రమే పంపిణీ చేశారు. అంటే మిగిలిన రూ.10 కోట్లు పంపిణీ చేయాల్సింది. అదేవిధంగా పలుప్రాంతాల్లో సెప్టెంబర్ నెల డబ్బులు కూడా అందజేయకపోవడం గమనార్హం. వీటితో పాటు, డిసెంబర్ నెల కూడా గడిచిపోయిందని, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల డబ్బులు బ్యాంకులకు వచ్చేదెప్పుడు, వచ్చిన డబ్బులు తమకు అందచేసేదెప్పుడని పింఛన్‌దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రొడెక్కిన వృద్ధులు... మూడు నెలలుగా పెన్షన్లు అందకపోవడంతో తమ కనీస అవసరాలు తీర్చుకోలేక పోతున్నామని వృద్ధులు, వికలాంగులు, వితంతులు ఆందోళన బాటపట్టి రోడెక్కారు. పెన్‌పహాడ్ మండలంలోని పలు గ్రామాలకు ఇప్పటి వరకు ఆక్టోబర్ నెల డబ్బులు కూడా రాలేదని పోస్టాఫీస్ అధికారులు చెప్పడంతో ఇటీవల కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గరిడేపల్లి మండలం కేంద్రంలోని పోస్టాఫీస్ వద్ద కూడా నిరసన తెలిపారు. ఇక ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో గురువారం పెన్షనర్లు రాస్తారోకో నిర్వహించారు. ఇలా ప్రతీ రోజు ఏదో ఒక చోట నిరసనలు తెలియడం పరిపాటిగా మారింది. పెద్దనోట్ల రద్దుతో... ఆసరా పింఛన్‌దారులకు పెద్దనోట్ల రద్దు దెబ్బ కూడా బాగానే తగిలింది. 50 రోజుల క్రితం కేంద్రం పెద్దనోట్లు రద్దు చేస్తూ ప్రకటన చేసింది. అప్పటికే నెల రోజుల పింఛన్ రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులకు నోట్ల రద్దు ప్రభావంతో మళ్లీ డబ్బులు అందలేదు. దీంతో వారు ఎంచేయాలో అర్థం కాని పరిస్థితిల్లో పడిపోయారు. కొన్ని చోట్ల నవంబర్ పింఛన్ డబ్బులు పంపిణీ చేసినా రూ.2 వేల నోటుతో చిల్లర ఇక్కట్లు తప్పలేదు.