45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వచ్చే ఏడాది నుంచి వైఎస్సార్ చేయూత పథకం అమలు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అర్హులైన పేద మహిళలకు నాలుగేళ్లలో రూ. 75 వేలు ఆర్థికసహాయం అందిస్తామని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేసిందని చెప్పారు. సాంకేతిక సమస్యలో లేక సమాచార లోపం వల్లనో ఎవరికైనా పెన్షన్ రాకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.