సీనియర్ సిటిజన్లకు తీపికబురు
సీనియర్ సిటిజన్లకు తీపికబురు
Published Tue, Jan 24 2017 6:42 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM
వయసు పైబడిన వారికి సామాజిక రక్షణగా తీసుకొచ్చిన పెన్షన్ స్కీమ్ను కేబినెట్ మంగళవారం ఆమోదించింది. ఈ స్కీమ్ కింద 10 ఏళ్ల పాటు, ఎల్ఐసీ 8 శాతం రిటర్న్లను గ్యారెంటీగా అందించనుంది. సోషల్ సెక్యురిటీ, ఫైనాన్సియల్ ఇక్లూజన్ ప్రొగ్రామ్ కింద ఎల్ఐసీ ఈ రిటర్న్లను సీనియర్ సిటిజన్లకు తప్పక ఇవ్వనుంది. వరిస్థ పెన్షన్ బీమా యోజన 2017 ఆవిష్కరిస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది.
ఈ స్కీమ్ కింద 10 ఏళ్ల పాటు 8 శాతం రిటర్న్లతో పెన్షన్ను అందించనున్నామని కేంద్రం హామినిచ్చింది. నెల/త్రైమాసికం/అర్థ సంవత్సరం, వార్షిక తరహాలో దేన్ని పెన్షనర్లు ఎంచుకుంటే, ఆ విధంగా రిటర్న్లను ఇస్తామని కేంద్రం చెప్పింది. ఈ ఏడాది నుంచి ఎల్ఐసీ ద్వారా ఈ స్కీమ్ను అమల్లోకి తేనున్నారు. మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ఆదాయాలు తగ్గుతాయి కాబట్టి 60 సంవత్సరాలు, ఆపై వయసు మీదపడిన వారికి ఈ స్కీమ్ ఎంతో సహకరించనుంది.
Advertisement