seniors
-
‘సీనియర్లు కొనసాగుతారు’
బ్రిడ్జ్‌టౌన్: అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించినా... ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అందుబాటులో ఉంటారని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. టి20 ఫార్మాట్‌కు సంబంధించి భారత జట్టులో మార్పు మొదలైందన్న ఆయన... పాండ్యాను కెపె్టన్‌గా నియమించే విషయం సెలక్టర్లు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. 2025లో చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్నాయి. ‘ముగ్గురు కీలక ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత టి20 జట్టులో ఇప్పటికే మార్పులు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం సీనియర్లతో కూడిన మన జట్టు ప్రదర్శన చూస్తే మా తర్వాతి లక్ష్యం చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా గెలవడమే. దాదాపు ఇదే జట్టు అక్కడా ఆడుతుంది. సీనియర్లంతా అందుబాటులో ఉంటారు. భారత జట్టు అన్ని ఐసీసీ టైటిల్స్ గెలవాలనే నేనూ కోరుకుంటా. మన దగ్గర ప్రతిభావంతులైన రిజర్వ్ ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అవసరమైతే ఒకేసారి మనం 3 జట్లను బరిలోకి దించగలం’ అని జై షా అభిప్రాయపడ్డారు. తాజా వరల్డ్ కప్‌లో కీలక ప్రదర్శన చేసిన పాండ్యాపై షా ప్రశంసలు కురిపించారు. ‘పాండ్యా ఫామ్ గురించి గతంలో ఎన్నో రకాల సందేహాలు వ్యక్తం చేశారు. కానీ సెలక్టర్లు అతనిపై నమ్మకం ఉంచి ఎంపిక చేస్తే దానిని పాండ్యా నిలబెట్టుకున్నాడు. అయితే టి20 టీమ్‌కు పూర్తి స్థాయి కెపె్టన్‌గా నియమించే అధికా రం సెలక్టర్ల చేతుల్లోనే ఉంది’ అని షా చెప్పారు. టీమిండియా మరింత ఆలస్యంగా...బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత టి20 జట్టు స్వదేశానికి రావడం మరింత ఆలస్యం కానుంది. బార్బడోస్ దేశాన్ని తాకిన పెను తుఫాన్‌తో ఆటగాళ్లు ఎక్కడికీ వెళ్లే పరిస్థితి లేదు. తీవ్రత ఎక్కువగా ఉండే కేటగిరీ 4 హరికేన్ వల్ల రెండు రోజులుగా దేశం మొత్తం లాక్డౌన్లో ఉంది. ముఖ్యంగా స్థానిక ఎయిర్‌పోర్ట్‌ను పూర్తిగా మూసేశారు. దాంతో భారత జట్టు ప్రత్యేక విమానం ద్వారా అక్కడి నుంచి బయల్దేరే అవకాశాలు కూడా లేకుండా పోయాయి. విద్యుత్, నీటి సరఫరా కూడా అస్తవ్యస్తంగా మారింది. ఎలాగైనా ఇక్కడి నుంచి ఆటగాళ్లను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ చార్టర్డ్ ఫ్లయిట్ కంపెనీలతో మాట్లాడే ప్రయత్నం చేశామని... అయితే ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు సాధ్యం కావడం లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడే వరకు వేచి ఉండటం మినహా మరో మార్గం లేదన్ని జై షా... భారత్‌కు చేరుకున్న తర్వాతే ఆటగాళ్ల సన్మానం తదితర విషయాల గురించి ఆలోచిస్తామని అన్నారు. -
చంద్రబాబు కేబినెట్.. వాళ్లకు మాత్రం హ్యాండ్!
అమరావతి, సాక్షి: చంద్రబాబు మరోసారి తన మార్క్ ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో 24 మంత్రి స్థానాలకుగానూ.. ఏకంగా 17 మంది కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చారు. అయితే జనసేనకు 3, బీజేపీ 1 మంత్రి పదవి ఇచ్చి మిగిలినవన్నీ తన పార్టీకే కేటాయించుకున్నారు. అయితే.. మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ఆశలో ఉన్న మాజీలకు, ఆశావహులకు చంద్రబాబు మాత్రం మొండిచేయి చూపించారు. గత అర్ధరాత్రి కేబినెట్ జాబితా వెలువడ్డాక వాళ్లు పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు. ఈ జాబితాను పరిశీలిస్తే చాలా పెద్దదిగానే ఉంది. మూడు పార్టీలకు చెందిన సీనియర్ల జాబితా పరిశీలిస్తే.. కళా వెంకట్రావ్, గంటా శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు,ధూళిపాళి నరేంద్ర, గద్దె రామ్మోహన్, చింతమనేని ప్రభాకర్లకు కేబినెట్లో చోటు దక్కలేదు. అలాగే.. కన్నా లక్ష్మీనారాయణ, విష్ణుకుమార్ రాజు, రఘురామ కృష్ణంరాజు, మండలి బుద్ధప్రసాద్, కూన రవికుమార్, నక్కా కోటంరెడ్డి, బోండా ఉమా, కొలికిపూడి, జీవీ, వేమిరెడ్డి, అఖిలప్రియ, మాధవిరెడ్డి, పరిటాల సునీతకు చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. అయితే.. ఈ జాబితా నుంచే స్పీకర్‌గా ఒకరికి అవకాశం దక్కేలా కనిపిస్తోంది. మరోవైపు వైఎస్సార్సీపీ నుంచి చేరి పోటీ చేసి నెగ్గిన ఆనం నారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథిలకు మాత్రం అవకాశం ఇచ్చారు. అదే పార్టీ నుంచి వచ్చిన కోటంరెడ్డి, గుమ్మనూరు జయరాం మాత్రం ఛాన్స్ దక్కలేదు. మంత్రి పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్న వీళ్లలో కొందరు నిరాశలో ఉన్నట్లు వాళ్ల వాళ్ల అనుచర గణాలు చెబుతున్నాయి. మరి వీళ్ల అసంతృప్తిని చంద్రబాబు ఎలా చెరిపేస్తారో చూడాలి.ఇదీ చదవండి: ఆ ఒక్క మంత్రి పదవి కూడా టీడీపీకేనా? -
బీజేపీలో సీనియర్లకు సీటులేదు!
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : పొత్తులో భాగంగా రాష్ట్రంలో పది అసెంబ్లీ స్థానాలకు పోటీచేయనున్న బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ మేరకు ఏపీ లోక్‌సభ ఎన్నికల ఇంచార్జ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక మాజీ ఎంపీ, ఇద్దరు మాజీమంత్రులు, ఒక జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యేలకు ఈ జాబితాలో చోటుదక్కింది. కానీ, రెండు మూడు దశాబ్దాలకు పైగా పార్టీనే నమ్ముకున్న కొందరు ముఖ్యమైన సీనియర్లకు మాత్రం అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలోనూ తీవ్ర నిరాశే మిగిలింది. మొన్న పార్లమెంట్ అభ్యర్థుల జాబితాలోనూ టికెట్ దక్కని పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజుతో పాటు ప్రస్తుత రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్థన్‌రెడ్డి, పరిపూర్ణానంద స్వామికి కూడా ఈ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో రిక్తహస్తమే మిగిలింది. బీజేపీలో చంద్రబాబుకు అనుకూలమన్న వ్యక్తులుగా పేరున్న నాయకులకు మాత్రం సీట్లు దక్కాయని అసలైన బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నచ్చిన వారికి అనుకూలంగా పురందేశ్వరి నివేదికలు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తనకు నచ్చిన వలస నేతలకు.. నిన్న మొన్నటి వరకు పార్టీతో సంబంధంలేని వారికి టికెట్లు ఇప్పించుకున్నారని ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న అసలైన బీజేపీ సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు. తాను అనుకున్న వారికి అనుకూలంగానే ఆమె జాతీయ నాయకత్వానికి నివేదికలు పంపి వారికి టికెట్లు దక్కేలా చేసుకున్నారని వారు మండిపడుతున్నారు. నిజానికి.. బీజేపీ జాబితాలో బద్వేలు అభ్యర్థిగా ప్రకటించిన రోశన్న అభ్యర్థుల ప్రకటనకు ఒకరోజు ముందే పార్టీలో చేరారని వారు చెప్పారు. అలాగే, రెండు మూడ్రోజుల క్రితం వరకు ఆయన టీడీపీ నియోజకవర్గ ప్రధాన నాయకుడిగా కొనసాగారని.. అసలు పొత్తులో బద్వేలు స్థానాన్ని బీజేపీ ఎందుకు కోరుకోవాల్సి వచ్చిందో.. టీడీపీ నేతను హడావుడిగా పార్టీలో చేర్చుకుని అతనికెందుకు సీటు ఇవ్వాల్సి వచ్చిందో రాష్ట్ర పార్టీలో చాలామందికి అంతుబట్టడంలేదు. ఇప్పుడు బీజేపీలో ఇది హాట్‌టాపిక్‌గా మారింది. నిజానికి.. చాలా నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు బీజేపీ నాయకులు రెండు మూడేళ్లుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ కష్టపడిన వారి స్థానాలను పట్టించుకోకుండా.. చంద్రబాబు ఇస్తామన్న స్థానాల్లో తనకు అనుకూలమైన వారి పేర్లను పురందేశ్వరి జాతీయ నాయకత్వానికి నివేదికలు పంపారని వారు ఆరోపిస్తున్నారు. పదిలో ఆరుగురు వలస నేతలే.. ఇక 2019 ఎన్నికలు వరకు తెలుగుదేశంలో ఉండి, ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే తాత్కాలిక పునరావాసం కోసం బీజేపీలో చేరిన చంద్రబాబు సొంత మనుషులు సుజనా చౌదరి, ఆదినారాయణరెడ్డి వంటి నాయకులు పొత్తులో బీజేపీకి దక్కిన స్థానాల్లో సీట్లు ఎగరేసుకెళ్లారని ఆ నాయకులు ఆవేదన చెందుతున్నారు. కైకలూరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు మరో నమ్మినబంటు కామినేని శ్రీనివాస్ సైతం 2014 ఎన్నికల సమయంలో బీజేపీ–టీడీపీ పొత్తు ఖాయమని తెలిశాక కమల దళంలో చేరి ఆ ఎన్నికల్లో గెలుపొందాక ఉమ్మడి ప్రభుత్వంలో మంత్రి పదవి అనుభవించారన్నారు. అలాగే.. 2019లో టీడీపీ–బీజేపీ మధ్య పొత్తులేకపోవడంతో ఆయన తిరిగి బీజేపీ తరఫున పోటీచేసేందుకు విముఖత వ్యక్తంచేసి ఎన్నికలకు దూరంగా ఉన్నారని తాజాగా సీట్లు దక్కని బీజేపీ నాయకులు గుర్తుచేస్తున్నారు. ఇక పార్టీ ప్రకటించిన పది స్థానాల్లో అరకు, అనపర్తి, విశాఖ పశ్చిమ స్థానాల అభ్యర్థులు మినహా మిగిలిన ఏడు స్థానాల అభ్యర్థులు కేంద్రంలో బీజేపీ అధికారం ఖాయమని స్పష్టంగా తెలిసిన తర్వాత పదేళ్ల క్రితం పార్టీలో చేరిన నాయకులని చెబుతున్నారు. ధర్మవరం అభ్యర్థిగా ప్రకటించిన సత్యకుమార్ మొదట నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా కొనసాగిన వ్యక్తి. అప్పట్లో ఆయన అసలు పార్టీ నాయకుడిగా పనిచేయలేదని, ఒకవేళ అతణ్ణి మొదటి నుంచి పార్టీలో కొనసాగిన వ్యక్తిగా పరిగణించినా మిగిలిన ఆరుగురు వలస నేతలేనని బీజేపీలో చర్చ సాగుతోంది. -
పొత్తులే కత్తులై..
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్ : పొత్తుల కోసం వెంపర్లాడిన తెలుగుదేశం పార్టీ పుట్టి మునుగుతోంది. పొత్తుల పోటు గట్టిగా తగలడంతో సీనియర్ల సీట్లకు అధిష్టానం ఎసరుపెట్టింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీనియర్లు బజారుకెక్కి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టికెట్ వసంత కృష్ణప్రసాద్కేనని అధిష్టానం చెప్పడంతో ఉమా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలిసింది. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కూ టికెట్ లేదని పార్టీ సంకేతాలిచ్చింది. దీంతో ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. రాజీనామాకు సిద్ధమవుతున్నారు. తనను కాదని పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తానని సవాల్ విసిరారు. అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానంటూ హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని తొలుత జనసేనకు కేటాయించినట్టు పార్టీ సమాచారం ఇవ్వడంతో బుద్దా వెంకన్న, జలీల్‌ఖాన్, ఎంకే బేగ్ ఖంగుతిన్నారు. బుద్దా వెంకన్న అనుచరులతో సమావేశం నిర్వహించి మరీ పార్టీకి పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. జలీల్‌ఖాన్ పార్టీ వీడతానని బెదిరించారు. ఇప్పుడు ఈ సీటును బీజేపీ కోరుతున్నట్టు తెలియడంతో సీటుపై ఆశలు పెట్టుకున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్కూ షాక్ తగిలింది. అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించడంతో మండలి బుద్ధప్రసాద్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బండారుకు చుక్కెదురు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి గట్టి షాక్ తగిలింది. విశాఖ జిల్లా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన రగిలిపోతున్నారు. ఈ సీటును పంచకర్ల రమేష్‌బాబుకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రకటించడంతో బండారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటికే పరిమితమయ్యారు. దీంతో పంచకర్లను ఓడిస్తామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కళావెంకట్రావుకు ఎచ్చెర్ల సీటు ఖరారు చేయకుండా ఇంకా గాల్లోనే పెట్టారు. వయసు రీత్యా ఆయనను పక్కనపెట్టాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన మరో కీలక నేత గంటా శ్రీనివాసరావు సీటును ఇంకా ఖరారు చేయలేదు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు సీటు నిరాకరించి ఆ స్థానాన్ని జనసేనకు ఇవ్వడంపై ఆయన రంకెలు వేస్తున్నారు. మెలవరం సీటు గందరగోళంగా మారింది. పల్నాడు జిల్లాలో ఆశావహుల డీలా పల్నాడు జిల్లాలో సైకిల్ పార్టీ డీలా పడింది. నరసరావుపేట అసెంబ్లీ సీటుపై ఇంకా సందిగ్ధం వీడలేదు. టీడీపీ నేత చదలవాడ అరవిందబాబు ఆందోళన చెందుతున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తనకు సీటు దక్కకుండా చేస్తున్నారని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సీటులో బీజేపీ పోటీ చేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. గురజాల అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు పేరు ఖరారు కావడంతో వైఎస్సార్సీపీకి దూరం జరిగి టీడీపీతో సన్నిహితంగా ఉంటున్న జంగా కృష్ణమూర్తి డైలమాలో పడ్డారు. జవహర్‌కు అవమానం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సీటు కోసం ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి కేఎస్ జవహర్‌ను ఆ పార్టీ అధిష్టానం ఘోరంగా అవమానించింది. ఈ సీటును గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించింది. దీంతో జవహర్ వర్గీయులు అధిష్టానం తీరుపై మండిపడుతున్నారు. నిడదవోలు సీటు ఆశిస్తున్న శేషారావుకు శరాఘాతం తగిలింది. ఈ సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గోపాలపురం సీటును మద్దిపాటు వెంకట్రాజుకు కేటాయించడంతో అక్కడ పార్టీ శ్రేణుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గం వెంట్రాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తోంది. పరిటాలకు బాబు ఝలక్ అనంతపురం జిల్లా ధర్మవరం సీటు ఆశించిన పరిటాల శ్రీరామ్ చతికిలపడ్డారు. సీటును బీజేపీకి కేటాయించడంతో వరదాపురం సూరి ఎగరేసుకుపోయారు. దీంతో ఏం చేయాలో పాలుపోక శ్రీరామ్ తల్లడిల్లుతున్నారు. పుట్టపర్తి సీటును పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూరరెడ్డికి కేటాయించడంతో బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఇక్కడ వడ్డెర సామాజికవర్గ నేతలు టికెట్ ఆశించారు. కదిరిలో 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కందికుంట వెంకట ప్రసాద్‌కు డీడీల కేసులో శిక్ష పడింది. ఆయన భార్యకు ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అనంతపురం, గుంతకల్లు సీట్లపై టీడీపీ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తోంది. జనసేనకు అన్ని టికెట్లా.. తీవ్ర అసంతృప్తి ♦ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు ఆరు టికెట్లు కేటాయించడంపై టీడీపీ కేడర్ రగిలిపోతోంది. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పోలవరాన్ని కూడా జనసేనకు కేటాయిస్తున్నట్టు సమాచారం. ♦ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కోవూరు, కావలి, ఉదయగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలలో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో సీనియర్‌నేతలు కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కన్నబాబు అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ వలస నేత ఆనం రామనారాయణరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, కావలిల్లోనూ ఆ పార్టీ ఆశావహులు టికెట్ల కేటాయింపుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోవూరు సీటును ఇటీవలే టీడీపీలో చేరిన ప్రభాకర్‌రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డికి ఇవ్వడంతో ఇన్నాళ్లూ అక్కడ పార్టీ కోసం పనిచేసిన పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి కుటుంబం రగిలిపోతోంది. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని పార్టీ అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసింది. ♦ ఉమ్మడి చిత్తూరులో చిచ్చు రేగింది. సత్యవేడు సీటును టీడీపీలో కూడా చేరని ఆదిమూలంకు ఇవ్వడంపై తెలుగుదేశం ఆశావహుల్లో ఆగ్రహ జ్వాలలు రేగాయి. గతంలో బాబు నుంచి హామీ పొందిన మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె డాక్టర్ హెలెన్, జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు స్థానాన్ని వరదరాజులరెడ్డికి కేటాయించడం పట్ల లింగారెడ్డి, సురేష్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ♦ తిరుపతి సీటును ఆరణి శ్రీనివాసులుకు జనసేన కేటాయించడంపై ఆ పార్టీలో అసంతృప్తి రగులుతోంది. దీంతో ‘ఆరణి’ గో బ్యాక్’ అనే నినాదాలతో నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. చంద్రగిరి సీటును పులవర్తి నానికి కేటాయించడంతో రియల్టర్ డాలర్ దివాకర్‌రెడ్డి నీరుగారారు. ♦ వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నుంచి ప్రతిసారీ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటావని నారాయణరెడ్డి తనయుడు, పార్టీ ఇన్చార్జి భూపేష్‌రెడ్డిని ఊరించి, చివరికి జమ్మలమడుగు సీటు బీజేపీ(ఆదినారాయణరెడ్డి)కి కేటాయించినట్లు వెల్లడించడంతో నారాయణరెడ్డి కుటుంబం సంకట స్థితిలో పడింది. -
సీనియర్లకు చంద్రబాబు షాక్
సాక్షి, అమరావతి: అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు పలువురు ముఖ్యులు, సీనియర్ నాయకులకు ఝలక్ ఇచ్చారు. తొలి జాబితాలో వారి పేర్లు గల్లంతయ్యాయి. అందులో కొందరు మాజీ మంత్రులు కూడా ఉండడం గమనార్హం. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారికి సైతం సీట్లు దక్కలేదు. శ్రీకాకుళం జిల్లాలో కళా వెంకట్రావు పేరు తొలి జాబితాలో లేకపోవడంతో పార్టీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఎన్నికలకు సీటు మార్చే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రస్తుతం సీటు లేకుండా చేశారు. ఆయన కోరుకున్న సీటు ఇచ్చేందుకు నిరాకరించిన చంద్రబాబు.. విజయనగరం జిల్లా చీపురుపల్లి వెళ్లాలని సూచించారు. గంటా అందుకు ఒప్పుకోకపోవడంతో తొలి జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కూడా చంద్రబాబు షాకిచ్చారు. పవన్ కళ్యాణ్ అభ్యంతరంతో ఆయనకు సీటు ఇచ్చేందుకు వెనుకాడుతూ తొలి జాబితాలో ఆయనకు సీటు ఖరారు చేయలేదు. దీంతో చింతమనేనికి సీటు ఇవ్వడం అనుమానంగా మారింది. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాలో మాజీ మంత్రి పీతల సుజాతకు సైతం మొండిచేయి చూపారు. యరపతినేనికి ఎసరు ఎన్టీఆర్జిల్లా మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీటు దక్కలేదు. తనదే సీటని చెప్పుకుంటూ ఆయన హడావుడి చేస్తున్నా తొలి జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. ఆయనకు సీటు ఇవ్వడం సాధ్యం కాదని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు సీటు ఖరారు చేయలేదు. దీన్నిబట్టి ఆ నియోజకవర్గంలో మరొకరికి అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. పల్నాడు జిల్లాలో సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావుకు గురజాల సీటు ఇవ్వకపోడం చర్చనీయాంశంగా మారింది. తొలి జాబితాలో ఆయన పేరు లేదంటే ప్రత్యామ్నాయంగా వేరే ఎవరికైనా ఇస్తారా అనే చర్చ నడుస్తోంది. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌కు తొలి జాబితాలో సీటు దక్కలేదు. నెల్లూరులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేరు ఈ జాబితాలో గల్లంతైంది. ఇప్పటికే ఐదుసార్లు ఆయన ఓడిపోవడంతో ఈసారి సీటు ఇవ్వడం కష్టమేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావును పక్కనపెట్టి ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్‌కు సీటివ్వడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో కొట్టుకుపోతున్న నేతలు జనసేన పొత్తులో కొన్ని సీట్లు పోవడంతో పలువురు సీనియర్లకు సీట్లు గల్లంతయ్యాయి. తెనాలి సీటు నాదెండ్ల మనోహర్‌కు ఇవ్వడంతో మాజీ మంత్రి ఆలపాటి రాజా పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రాజమండ్రి రూరల్ సీటు పొత్తులో పోయే అవకాశం ఉండడంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మొండిచేయే మిగలనుంది. తనకు సీటు గ్యారంటీ అని ఆయన చెప్పుకుంటున్నా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టమైంది. అవనిగడ్డలో సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్‌కు జాబితాలో చోటు లేకుండా పోవడానికి ఆ సీటు జనసేన పొత్తు ప్రభావమేనని చెబుతున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి సీటును బండారు సత్యనారాయణమూర్తికి ఖరారు చేయలేదు. దీంతో ఆసీటు జనసేనకు ఇవ్వడం ఖాయమైనట్లు తెలుస్తోంది. -
టీడీపీ తొలి జాబితా: సీనియర్లు ఇంటికేనా..?
సాక్షి,గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో చాలా వరకు పార్టీ సీనియర్లకు చోటు దక్కలేదు. పార్టీకోసం రక్త తర్పణం చేసిన బుద్దావెంకన్న, ఏపీ టీడీపీ మాజీ చీఫ్‌గా పనిచేసిన కిమిడి కళా వెంకట్రావు, గుంటూరు జిల్లాలో యరపతినేని, ఆలపాటి రాజా, పెద్దకూరపాడు నుంచి కొమ్మాలపాటి శ్రీధర్, ఉండి నుంచి వేటుకూరి శివరామరాజు పేర్లు తొలి జాబితాలో లేవు. ఈ ఎన్నికల్లో వీరందరికీ బాబు హ్యాండిచ్చినట్లేనన్న ప్రచారం జరుగుతోంది. విజయనగరం గజపతినగరం టీడీపీలో ఇప్పటికే అసంతృప్తి రగిలింది. కొండపల్లి శ్రీనివాసరావుకి టికెట్ కేటాయించి డా.కె.ఎ.నాయుడుకి టికెట్ ఇవ్వకపోవడంపై కేడర్ లో అసంతృప్తి భగ్గుమంది. భవిష్యత్ కార్యాచరణపై డా.కె.ఎ.నాయుడు కేడర్‌తో చర్చిస్తున్నారు. బుచ్చయ్య.. ఆక్ పాక్.. కరివేపాక్.! రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న పార్టీ సూపర్ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరికి ఈసారి నో ఛాన్స్ అన్నట్లే కనిపిస్తోంది. రాజమండ్రి రూరల్ సీటు విషయంలో న్యాయం చేస్తామని చంద్రబాబు చెప్పినప్పటికీ నేతల్లో నమ్మకం కుదరని పరిస్థితి కనిపిస్తోంది. రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ, జనసేన ఆశావహులు ఇద్దరూ పోటీ చేస్తారని బాబు అన్నారు. వీరిలో ఒకరు రాజమండ్రి రూరల్, మరొకరు వేరే చోట పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇదీ చదవండి.. టీడీపీ తొలి జాబితా: బండారు, గంటాకు హ్యాండ్ -
ములాఖత్‌కొచ్చిన సీనియర్లపై బాబుకు కాలిందట.. కారణం ఇదేనట..
రూ. 371 కోట్ల లూటీ జరిగిన స్కిల్ స్కాంలో ఆధారాలతో సహా దొరికిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో 40 రోజులు పూర్తి చేసుకున్నారు. మండలం రోజుల జైలు జీవితంలో ఆయన ఒక కిలో బరువు పెరిగారు. జైలు నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు ములాఖత్‌లో చంద్రబాబును కలుస్తున్నారు. తాను జైల్లో ఉంటే పార్టీలోని సీనియర్ నేతలు ఏమీ పట్టనట్లు ఉండిపోవడం చంద్రబాబుకు మంట తెప్పిస్తోందని సమాచారం. తన ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించిన వారు కూడా తాను జైలుకెళ్తే తమకేమీ పట్టనట్లు ఉండిపోవడం ఏంటని చంద్రబాబు కుత కుత లాడిపోతున్నట్లు తెలుస్తోంది. స్కిల్ స్కాంలో సెప్టెంబరు 9న చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ చేసిన వెంటనే ఆయన్ను విజయవాడ తరలించేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే తాను తన కాన్వాయ్‌లోనే రోడ్డు మార్గంలో వస్తానని చంద్రబాబు అనడంతో సరేలెమ్మని రోడ్డు మార్గంలో తీసుకువచ్చారు. రోడ్డు మార్గంలో తాను వస్తోంటే దారి పొడవునా పార్టీ కార్యకర్తలు.. పెద్ద సంఖ్యలో ప్రజలు రహదారి కిరువైపులా నిలబడి నిరసనలు తెలుపుతారని అది తన అనుకూల మీడియాలో అదే పనిగా చూపిస్తారని చంద్రబాబు అనుకున్నారు. అయితే ఆయన అనుకున్నదేదీ జరగలేదు. జనమే కాదు పార్టీ శ్రేణులూ చంద్రబాబు అరెస్ట్‌ను పట్టించుకోలేదు. విజయవాడ చేరుకున్న తర్వాత చంద్రబాబును కొన్ని గంటల పాటు విచారించాక ఏసీబీ కోర్టు ముందు హాజరు పరిచారు. బాబుపై ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించిన ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబును జైల్లో పెడితే రెండు తెలుగు రాష్ట్రాలూ అతలాకుతలం అయిపోతాయని చంద్రబాబు అనుకున్నారు. తమ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిస్తారని జన జీవనాన్ని స్తంభింపజేస్తారని అపుడు తనకు కావల్సినంత మైలేజీ వస్తుందని చంద్రబాబు అనుకున్నారు. అయితే చంద్రబాబు జైలుకెళ్తే బాబుతో నేను అని ఓ చిన్న కార్యక్రమానికి పిలుపు నిచ్చారు అచ్చెన్నాయుడు. దానికి పార్టీ నేతలే సరిగ్గా స్పందించలేదు. దీనిపై అచ్చెన్నాయుడు నొచ్చుకుంటూ పార్టీ శ్రేణులకు లేఖ రాశారు కూడా. జైల్లో రోజూ వివిధ పత్రికలు చదువుతోన్న చంద్రబాబు ఆశ్చర్యపోయారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన తనని అరెస్ట్ చేసినా పార్టీలో సీనియర్లు ఎవరూ వీధుల్లోకి రాకపోవడం.. నిరసన ప్రదర్శనలకు ప్లాన్ చేయకపోవడం.. ఎవరి ఇళ్లల్లో వారు కూల్‌గా కాలక్షేపం చేయడం గమనించిన చంద్రబాబుకు ఒళ్లు మండుకొచ్చిందని చెబుతున్నారు. ములాఖత్ లో తనను కలవడానికి వచ్చిన యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్‌లపై చంద్రబాబు జైల్లోనే నిప్పులు చెరిగినట్లు భోగట్టా. మీరంతా ఉండి ఏం చేస్తున్నారు? అని చంద్రబాబు మండి పడ్డంతో సీనియర్ నేతల్లోనూ అసహనం పెల్లుబికిందని అంటున్నారు. మేం పిలుపు నిచ్చినా జనం నుండి స్పందన లేకపోతే ఏం చేయమంటారు? అని యనమల రామకృష్ణుడు వివరించబోతే నాకేం చెప్పద్దు అక్కడ ఏం జరుగుతోందో నేను ఊహించగలను అని బాబు మండి పడ్డారట. ఈ ములాఖత్ తర్వాత యనమల పూర్తిగా పార్టీ పిలుపు నిచ్చిన ఆందోళనలకు దూరంగా ఉండిపోయారని పార్టీ వర్గాలే అంటున్నాయి. తన కుమారుడు న్యాయవాదులను మానిటర్ చేయడం కోసం ఢిల్లీలో ఉంటే పార్టీలో సీనియర్లు పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారని.. తనను విడుదల చేయించడానికి కానీ.. అరెస్ట్‌కు నిరసనగా ఆందోళనలను ఉధృతం చేయడానికి కానీ సీనియర్ నేతలెవరూ పూనుకోకపోవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారని అంటున్నారు. నేతలంతా చేతులెత్తేయడం వల్లనే భువనేశ్వరిని పరామర్శ యాత్ర చేయాల్సిందిగా చంద్రబాబే సూచించారని పార్టీ వర్గాల కథనం. చదవండి: పవన్ కల్యాణ్ కొత్త ప్లాన్.. బీజేపీ లొంగుతుందా? ఏ రోజుకారోజు బెయిల్ వచ్చేస్తుంది అన్న ఆశతోనే చంద్రబాబు గడుపుతున్నారని అంటున్నారు. అయితే అది ఎండమావిలా దూరం జరుగుతూ ఉండడంతో ఆయనలో నైరాశ్యం అలుముకుందని చెబుతున్నారు. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలూ లేకపోయినా మూడు దశాబ్ధాలుగా ఉన్న స్కిన్ ఎలర్జీ మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతోందని అంటున్నారు. నిజానికి స్కిన్ ఎలర్జీ కన్నా కూడా పార్టీ నేతలు తనను పూర్తిగా వదిలేయడమే చంద్రబాబుకు ఎక్కువ నొప్పి రాజేస్తున్నట్లు సమాచారం. ఇదే ఆయన్ని ఎక్కువగా బాధిస్తోందట. దీన్ని భరించలేకపోతున్నానని ఆయన ములాఖత్‌కు వచ్చిన ఓ పార్టీ నేత వద్ద వాపోయినట్లు సమాచారం. -కుర్చీ కింద కృష్ణయ్య -
ఎన్సీసీ జూనియర్లపై సీనియర్ దురాగతం..
-
పోటీకి వెనకడుగు.. ప్లాన్ ఇదేనా?.. టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
వాళ్ళంతా పార్టీలో సీనియర్లు.. సూపర్ సీనియర్లు.. హస్తం పార్టీ తమవల్లే చాలాసార్లు గెలిచిందంటారు. తమను గౌరవించాలని.. మాట వినాలని డిమాండ్ చేస్తారు. కాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ సీనియర్లలో చాలా మంది వెనకాడుతున్నారు. పోటీ చేయకుండా కొత్తవారికి అవకాశం ఇస్తారా అంటే.. కుదరదంటారు. అసలు టీ.కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? పోటీకి వెనకాడుతున్న నాయకులెవరు? తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లు ఎన్నికలు అంటేనే భయపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము నెట్టుకురాగలమా అని ఆందోళన చెందుతున్నారట. పాలిటిక్స్ గతంలో మాదిరిగా లేవు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పెరిగింది. దీంతో నేతలు ఎన్నికలంటేనే భయపడుతున్నారు. కొందరు నేతలు అక్కడా.. ఇక్కడా తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంలేదని స్టేట్మెంట్స్ ఇస్తున్నారట. దీంతో కొందరు సీనియర్ల వ్యవహారం పై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో తామే ముందుండాలని, తమకు ప్రత్యేక ఆసనాలు వేయాలని కోరుకునే సీనియర్లు ఎన్నికలంటే భయపడుతున్నారని టాక్ నడుస్తోంది. రేణుక చౌదరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి లాంటి నేతలు సైతం ఎన్నికలు అనే సరికి వెనకడుగు వేస్తున్నారని సమాచారం. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా మిగతా నేతలంతా వరుసగా రెండు సార్లు ఓడిపోవడంతో ఎన్నికలు అనే సరికి భయపడే పరిస్థితి వచ్చిందంటున్నారు కొందరు. వారసుల కోసం.. సిటింగ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో.. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ అంటేనే భయమేస్తోందని కామెంట్ చేశారు. ఉమ్మడి ఏపీలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర రాజనర్సింహ సైతం ఎన్నికలు అంటేనే భయపడుతున్నారట. దామోదర తన కూతురుని పోటీలో ఉంచితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట. మాజీ మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డిలు సైతం వచ్చే ఎన్నికలను ఎదుర్కోగలమా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారట. జానారెడ్డి లాంటి నేతలు రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చి కొడుకులను రంగంలోకి దింపే ప్లాన్ చేస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య సైతం కోడలు వైశాలిని మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకురావాలనే యోచన చేస్తున్నారట. మాజీ ఎంపీ రేణుక చౌదరి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ కోసం పనిచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇలా సీనియర్ లు అని చెప్పుకునే నేతలు సైతం ఎన్నికలు అంటే జంకుతున్నారు. కాని పోటీకి దూరం అని చెప్తున్నప్పటికీ ఈ నేతలెవరు తమ నియోజకవర్గంలో మరో నేతకు అవకాశం ఇవ్వడం లేదు. తమ వారసులనే బరిలో దించాలని ఉబలాటపడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల ఖర్చు భారీగా పెరిగింది. దీంతో పాటు చాలా మంది కొత్త నేతలు వెలుగులోకి వచ్చారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఓ యువనేతపై ఓడిపోవడం సీనియర్లను కలవర పెడుతోంది. కొత్త ఓటర్లతో.. సీనియర్ నేతలకు వచ్చిన గ్యాప్ పూడ్చుకోవడం సాధ్యం కావడం లేదు. ఈ పరిస్థితుల్లోనే వారు ఎన్నికలంటే భయపడే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోటీకి దూరం అనేది నిజమా? లేక ఏదైనా ఎత్తుగడతో ఇలా అంటున్నారా? అనేది నిదానంగా కాని తేలదు. చదవండి: గులాబీ ఎమ్మెల్యే ఎందుకు టెన్షన్లో ఉన్నారు?.. అక్కడ ఇదే హాట్ టాపిక్ -
కర్ణాటక ఎన్నికల్లో సీనియర్లకు హ్యాండిచ్చిన బీజేపీ
కర్ణాటక ఎన్నికల్లో సీనియర్లకు హ్యాండిచ్చిన బీజేపీ -
పట్టాభి ఎందుకు రెచ్చిపోయారు?.. టీడీపీలో ఏం జరిగింది.. ఏం జరుగుతోంది?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘బీసీలు అంటే వెన్నెముక. వెనుకబడిన వర్గాల వారు కాదు’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పదే పదే చెబుతున్నారు. ఆ వర్గాలను అదే స్థాయిలో చూస్తున్నారు. పదవుల అంశంలో అంతే ప్రాధాన్యమిస్తున్నారు. బీసీలకు మంచి చేయడంలో వైఎస్సార్ సీపీ అధినేతకు యావత్ భారతదేశంలో మంచి గుర్తింపు వచ్చింది. ఆదరణ లభిస్తోంది. ‘మరి మన పార్టీలో ఏం జరిగింది. ఇప్పుడేం జరుగుతోంది. బీసీలు అన్నింటినీ బేరీజు వేసుకుంటున్నారు. మాటలతో మనం ఇంకెంత కాలం మభ్యపెట్టగలం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ఆ పార్టీకి చెందిన సీనియర్లు వాపోయారు. గన్నవరంలో చోటుచేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో బీసీ వర్గాల ముఖ్యనేతల అంతర్గత చర్చల్లో వచ్చిన అంశాలు అధినేత చెవికి చేరాయి. దీనిపై తీవ్రంగా కలత చెందిన చంద్రబాబు తక్షణ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. ‘గన్నవరం నియోజకవర్గ ఇంచార్జి బచ్చుల అర్జునుడు తీవ్ర అస్వస్థతలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా తగుదునమ్మా అంటూ నేను వస్తున్నా. నేనే పోటీచేస్తా అంటూ పట్టాభిరాం అక్కడకు ఎలా వెళతారు. అర్జునుడు బీసీ వర్గానికి చెందినందునే అంత ధీమాగా, బహిరంగంగా ఆయన చాలెంజ్ చేయగలిగారు. అదే పార్టీలో బలమైన సామాజికవర్గానికి చెందిన వారు అక్కడ ఇంచార్జిగా ఉన్నట్లయితే ఆ మాట అనగలిగే వారా? సామాజికవర్గం అండ చూసుకునే రెచ్చిపోయారు. మీ దన్ను అంతలా ఉండబట్టే పట్టాభి ఆ స్థాయిలో రెచ్చిపోతున్నారనేది పార్టీలో మెజార్టీ అభిప్రాయం’ అని టీడీపీ సీనియర్లు అనడంతో చంద్రబాబు కంగుతిన్నారనేది సమాచారం. ‘క్యాడర్, క్యారక్టర్ ఏవీ పట్టించుకోకుండా ఇష్టానుసారం బూతులు మాట్లాడిన వారికి పదవులు ఇచ్చేస్తారనేది ముఖ్య శ్రేణులు భావిస్తున్నాయి. మంగళగిరి, గన్నవరం పార్టీ ఆఫీసులపై దాడులు ఎవరివల్ల జరిగాయి? ఎందువల్ల జరిగాయో మీరే విశ్లేషించుకోండి’ అని పార్టీ నాయకులు అనడంతో బాబు ఆలోచనల్లో పడ్డారని తెలిసింది. అయినా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తదితర బీసీ వర్గానికి చెందిన నాయకులు ఉన్నారు. గన్నవరంలో పార్టీకి ఏదైనా సమస్య ఉందని భావిస్తే అర్జునుడు తీవ్ర అస్వస్థతో ఉన్నందున కొనకళ్ల, కొల్లు, లేదా బచ్చుల కుమారుడు, మరెవరినైనా సీనియర్లను అక్కడకు పంపి ఉండవచ్చు. కానీ పట్టాభిని పంపి రెచ్చగొట్టించడాన్ని బట్టి బీసీలంటే మీకు చిన్నచూపు ఉందనే భావన ప్రజల్లోకి, పార్టీ క్యాడర్‌లోకి బాగా వెళ్లిపోయిందని వివరించడంతో బాబు కంగుతిన్నారని సీనియర్ నాయకుడు ‘సాక్షి’కి తెలిపారు. బీసీల గురించి చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఎంతమేరకు ఉందనేది బేరీజు వేసుకుంటున్నారని కూడా అన్నారనేది సమాచారం. మాటలు చెపితే సరిపోదు... ‘ఎమ్మెల్సీల్లో బీసీలకు జగన్ ఇచ్చిన ప్రాధాన్యతపై మా వెనుకబడిన వర్గాల్లో బాగా చర్చ జరుగుతోంది. అంతకుముందు కూడా వివిధ పదవుల్లో దక్కిన ప్రాధాన్యతను ఇప్పటికే గుర్తించారు. ఇక నుంచి మీకు మేమంత చేశాం.. ఇంత చేసేశాం.. అని టీడీపీ చెపితే వినే దశలో బీసీ వర్గాలు లేవు. అన్నీ విశ్లేషించుకుంటున్నాయి. గణాంకాలతో సహా ముఖ్యులకే పాఠాలు అప్పజెపుతాయి’ అని విజయవాడకు చెందిన బీసీ ముఖ్య నాయకుడు ఒకరు కుండబద్దలు కొట్టారు. గన్నవర్గానికి కో– ఆర్డినేటర్ కమిటీ చంద్రబాబు ఆదేశాల మేరకు గన్నవరం నియోజకవర్గానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం కమిటీని నియమించారు. కమిటీ కో–ఆర్డినేటర్‌గా కొనకళ్ల నారాయణ, సభ్యులుగా బచ్చుల అర్జునుడు కుమారుడు బచ్చుల సుబ్రహ్మణ్యంతోపాటు మరో నలుగురికి చోటు కల్పించారు. సీఐ కనకారావుపై చేసిన దాడిని పోలీసువర్గాలు తీవ్రంగా భావిస్తున్నాయని. టీడీపీ అల్లరిమూకలు ఇంతలా బరితెగిస్తాయని అనుకోలేదని వారంటున్నారని చంద్రబాబు దృష్టికి పలువురు తీసుకెళ్లారు. సంఘటన జరిగినప్పుడు గాయం తీవ్రత బాగా తెలిసిందని, ఏడు కుట్లు పడ్డాయని వివరించారు. చదవండి: రామోజీ తప్పు చేస్తే ఉద్యోగులు బలిపశువులా? -
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్.. ఇదండీ చరిత్ర
వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే టక్కున చెప్పే పేరు నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయన నాయకత్వంలోని ఇతర నేతలు కూడా అదే బాట పడుతున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం సొంత కుటుంబ సభ్యలకే రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తున్నారు. తమ ఎదుగుదలకు కృషి చేసిన రక్త సంబంధీకులనే పాతాళానికి తొక్కిపెడుతున్నారు. టీడీపీలోని కొందరు సీనియర్ల వెన్నుపోటు రాజకీయాలు పచ్చ పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఎవరికి ఎర్త్ పెడితే ఇంకెవరికి లాభం? తెలుగుదేశం పార్టీ నాయకులు తమ కుటుంబ సభ్యులకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయడంలో చంద్రబాబు నాయుడునే ఆదర్శంగా తీసుకుంటున్నారు. చంద్రబాబు ఎలా అయితే సొంత మామనే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠం లాక్కున్నారో..ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తనకోసం ఎంత కష్టపడినా చివరికి వారిలో ఎవరికీ రాజకీయ భవిష్యత్ లేకుండా ఎలా చేశారో..ఇప్పుడు టీడీపీలోని కొందరు నేతలు కూడా అదే తీరును ప్రవర్తిస్తున్నారు. తమ నేత పేటెంట్ హక్కుగా ఉన్న వెన్నుపోటు రాజకీయాలను తాము ఒంటబట్టించుకుంటున్నారు. తమ రాజకీయ ఎదుగుదలలో అనునిత్యం అండగా ఉన్న సొంత కుటుంబసభ్యులనే రాజకీయంగా అణగదొక్కుతున్నారు. తాను ముఖ్యమంత్రి కావడానికి ఎంతగానో సహకరించిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయ భవిష్యత్‌ను చంద్రబాబు ధ్వంసం చేశారు. బావమరిది హరికృష్ణను..ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీలో ఎదగనీయకుండా అణగదొక్కారు. ప్రస్తుతం బాలకృష్ణ ఒక్కడే ఎన్టీఆర్ వారసుడిగా టీడీపీలో ఎమ్మెల్యే గిరీ వెలగబెడుతున్నారు. అది కూడా వియ్యంకుడు కావడం వల్లనే బాలకృష్ణకు ఆమాత్రమైనా గుర్తింపు దక్కింది. కుమారుడు లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీకి దూరం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రతీ జిల్లాలో వెన్నుపోట్ల పర్వం ఇటీవల కాలంలో తుని అసెంబ్లీ సీటు విషయమై యనమల రామకృష్ణుడు ఆయన సోదరుడు కృష్ణుడు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం సొంత తమ్ముడుకే యనమల వెన్నుపోటు పొడుస్తున్నారు. మరో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తన కుటుంబ ఆధిపత్యానికి సోదరుడు సన్యాసి పాత్రుడు అడ్డు తగులుతాడని భావించి ఆయన్ను అనేక ఇబ్బందులకు గురి చేశారు. సోదరుడు టిడిపిలో ఉంటే తన కుమారుల రాజకీయ ఎదుగుదలకు అడ్డు తగులుతారని భావించి చంద్రబాబు తరహాలోనే సొంత సోదరుడిని తొక్కి పెట్టారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చం నాయుడు కూడా తన సోదరుడు ఎర్రన్నాయుడి కుటుంబ సభ్యులను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు ప్రాధాన్యత రోజు రోజుకి పార్టీలోనూ, జిల్లాలోనూ తగ్గిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశిస్తున్న రామ్మోహన్నాయుడికి ఇప్పటినుంచి బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిది కూడా అదే పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు విషయమై కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని మధ్య విభేదాలు తలెత్తాయి. తన సోదరుడు సేవా కార్యక్రమాల పేరుతో ఎదిగితే తనకు తన కుమార్తె రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి అధిష్టానంతో నాని గొడవ పెట్టుకున్నారు. ఇదండీ వెన్నుపోట్ల చరిత్ర వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబానికి ఒకే సీటు ఇస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ సీట్ కోసం కేఈ కృష్ణమూర్తి, ఆయన సోదరుడు కేఈ ప్రభాకర్ పోటీ పడుతున్నారు. కృష్ణమూర్తి తన కుమారుడు శ్యాంబాబు సీటు కోసం సోదరుడు ప్రభాకర్ ను ఇప్పటి నుంచే తొక్కేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భూమా ఫ్యామిలీకి కూడా ఒకే సీట్ అని టిడిపి అధిష్టానం స్పష్టం చేసింది. నంద్యాల సీటు కోసం భూమా అఖిలప్రియ, ఆమె పెదనాన్న కొడుకు బ్రహ్మానందరెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇద్దరు ఒకే సీటు కోసం పోటీ పడుతున్నారు.. బ్రహ్మానందరెడ్డిని పక్కకు తప్పించేంకు అఖిలప్రియ ఇప్పటినుంచే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం లో పనిచేస్తున్న టీడీపీ సీనియర్ నేతలంతా ఆయన బాటలోనే నడుస్తూ తమకు మేలు చేసిన వారిని.. తమను నమ్మి వెంట ఉన్న వారిని చంద్రబాబు తరహాలోని వెన్నుపోటు పొడుస్తున్నారు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఏఐసీసీ కార్యక్రమానికి అందరూ హాజరు కావాల్సిందే: బోసు రాజు
-
ఇది కాంగ్రెస్ అధికారిక కార్యక్రమం.. అంతా రావాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరగబోయే శిక్షణా తరగతులకు సీనియర్లు హాజరు కావడంపై సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ పరిణామంపై ఏఐసీసీ సభ్యులు బోసు రాజు స్పందించారు. ఇది ఏఐసీసీ కార్యక్రమం అందరూ హాజరు కావాల్సిందేనని బోసు రాజు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కొంతమంది సీనియర్లు పార్టీలోని వివిధ కార్యక్రమాల్లో ఉన్నారని ఏఐసీసీ నేత బోస్‌రాజు తెలిపారు. ఉత్తమ్ డిఫెన్స్ కమిటీ సమావేశానికి వెళ్లారు. శ్రీధర్‌బాబు కర్ణాటక పీసీసీ మీటింగ్‌కు వెళ్లారు. మరికొందరు ఇతర కార్యక్రమాల్లో ఉన్నారని తెలిపారు. పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే ఎవరికి ఫోన్ చేశారనేది తన దగ్గర సమాచారం లేదని చెప్పారు. ఏఐసీసీ కార్య క్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసలు తనకు పిలుపు రాలేదన్న కామెంట్‌పై.. ఆయనతో మాట్లాడాల్సి ఉందని చెప్పారాయన. ఇక కాంగ్రెస్ ప్రతి ఇంటికి చేరేందుకే హాత్ సే జోడో అభియాన్ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. హాత్ సే హాత్ అభియాన్‌పై కార్యచరణ రూపొందిస్తామని బుధవారం ఆయన తెలిపారు. సీనియర్ల సమస్యకు, ఈ సదస్సుకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. నిన్న(మంగళవారం) ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నాకు ఫోన్ చేశారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ సన్నాహాక సమావేశంలో పాల్గొనాలని చెప్పారని వివరించారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి చేపట్టబోయే యాత్రపై సీనియర్లు భిన్నంగా స్పందించారు. రేవంత్ యాత్ర చేపట్టబోతున్నారా? యాత్ర ప్రకటించాడా? అని బోస్‌రాజు ఎదురు ప్రశ్నించగా, యాత్రపై స్పందించేందుకు భట్టి నిరాకరించడం విశేషం. రేవంత్ రెడ్డి ఏక పక్ష నిర్ణయాలు, వ్యవహార శైలితో ఆయన పాల్గొనే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీనియర్లు కొందరు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. పీసీసీ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో సమావేశం జరగనుంది. ధరణి పోర్టల్‌పై పార్టీ నేతలకు అవగాహన కల్పించడంతో పాటు జనవరి 26న ప్రారంభం కానున్న హాత్‌సే హాత్‌జోడో యాత్రలు, పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా అమలు, ఎన్నికల నిబంధనలపై చర్చించనున్నారు. సాయంత్రం కల్లా సీనియర్ల వ్యవహారశైలిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
IBS ర్యాగింగ్ కేసులో వెలుగు చూస్తున్న మరిన్ని నిజాలు
-
పార్టీ కోసం జీవితాలు ధారపోశాం.. ఇప్పుడిలా! : గులాం నబీ ఆజాద్
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి శరాఘాతం అయ్యింది. పంజాబ్‌లో అధికారం కోల్పోయి.. యూపీలో అవమానకరమైన ఫలితాల్ని చవిచూసింది గ్రాండ్ ఓల్డ్ పార్టీ. ఈ నేపథ్యంలో పార్టీకి సంస్కరణలు ‘ఇప్పటికైనా అవసరమ’నే విషయాన్ని ఇటు సీనియర్లు, అటు జూనియర్లు గుర్తు చేస్తున్నారు. ‘‘ఫలితాలతో దిగ్భ్రాంతికి లోనయ్యా. ఒక్కో రాష్ట్రంలో మా ఓటమిని చూసి నా గుండె రక్తమోడుతోంది. పార్టీ ఇలా పతనం అవుతుండడం చూడలేకపోతున్నా’’ అని CWC సభ్యుడు గులాం నబీ ఆజాద్ భావోద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్ కోసం మా యవ్వనాన్ని, జీవితాన్ని ధారపోశాం. పార్టీలోని బలహీనతలను గురించి నేను మరియు నా సహచరులు చాలా కాలంగా మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా పార్టీ నాయకత్వం గమనించి.. దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా’’ అని గులాం నబీ ఆజాద్ తెలిపారు. మరో సీనియర్ నేత శశిథరూర్ కూడా ‘మార్పు అనివార్యం..సంస్కరణ అవసరం’ అంటూ ట్వీట్ చేశారు. 1/2 All of us who believe in @INCIndia are hurting from the results of the recent assembly elections. It is time to reaffirm the idea of India that the Congress has stood for and the positive agenda it offers the nation — and (contd) — Shashi Tharoor (@ShashiTharoor) March 10, 2022 ‘‘అంతా తప్పు జరిగింది. కాంగ్రెస్‌లో సీరియస్‌గా పోటీ చేయాలనే ఉద్దేశ్యం లేదు...నరేంద్ర మోదీ, అమిత్ షా లాగా పూర్తి బలంతో పోరాడి ఉండాల్సింది. పంజాబ్‌లో నాయకత్వాన్ని మార్చుకోవడంతో సంస్థలో గందరగోళం నెలకొంది. మా ఇన్నింగ్స్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అయితే కాంగ్రెస్‌లో యువకుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది’’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్(75). జీ-23 భేటీ 2014 నుంచి ఇప్పటిదాకా 45 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెల్చింది కేవలం ఐదు మాత్రమే. ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే అధికారంలో ఉంది. నాయకత్వ.. వ్యవస్థీకృత లోపాలు, కొత్తవారికి అవకాశం ఇవ్వకపోవడం, కష్టపడి పనిచేసేవారిని పక్కనబెట్టడం లాంటివి కాంగ్రెస్‌లో లుకలుకలకు కారణం అవుతున్నాయి. దీన్ని గమనించిన 23 మంది పార్టీ సీనియర్ నేతలు అధిష్ఠానానికి లేఖ రాశారు. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. ఆ హెచ్చరికలను మరోలా అర్థం చేసుకుని.. జీ-23గా పేరుపెట్టి సీనియర్లను వేరుగా చూడటం ప్రారంభించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటమి నేపథ్యంలో.. ఈ జీ-23లోని కొందరు సభ్యులు.. గులాంనబీ ఆజాద్ ఇంట్లో శుక్రవారం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఏమని ప్రచారం చేయాలి? యూపీ ఎన్నికల్లో భాగంగా.. ఒక్క ప్రియాంక గాంధీనే ఆ రాష్ట్రంలో 209 ర్యాలీల్లో పాల్గొంది. లఖింపురీ రైతుల హత్య గురించి హత్రాస్‌కు వెళ్లి మరీ రాహుల్‌తో గళం వినిపించారామె. కానీ, ఏదీ పని చేయలేదు. ఈ నేపథ్యంలో యువ వర్గం.. సమర్థవంతమైన మార్పు కావాలనుకుంటోంది. ‘హిందూ-ముస్లిం కార్డుతో బీజేపీ గెలుస్తోందని పదే పదే చెప్తూ వస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రచారానికి ఆస్కారం ఎక్కడ ఉంది? పంజాబ్‌లో ముస్లిం ఓటర్ల శాతం ఎంత? సామర్థ్యం లేని నాయకత్వం వల్లే ఇలాంటి ఫలితాల్ని చూడాల్సి వస్తోంది. అది పార్టీ అధినాయకత్వం కూడా అంగీకరించాల్సిందే. నానాటికీ సంక్షోభంలోకి జారుకొంటున్న పార్టీని కాపాడుకోవాలంటే.. పాత రక్తాన్ని తప్పించి.. తమకు అవకాశం ఇవవ్వాలని కోరుకుంటోంది యువరక్తం. ఒకవైపు సీనియర్ల సలహాలు.. సీనియర్ల గోల పరిణామాల నేపథ్యంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ వర్కింగ్ కమిటీ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. -
చెప్పేవారు లేరు... చెబితే వినేవారు లేరు!
ముంబై: యువరాజ్ సింగ్ 2000 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. 19 ఏళ్ల కెరీర్ తర్వాత గత ఏడాది అతను ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలు చవిచూసిన యువీ... పలువురు దిగ్గజాలతో కలిసి ఆడాడు. ఈ క్రమంలో ఆటలో, మైదానం బయట కూడా వచ్చిన పలు మార్పులకు అతను ప్రత్యక్ష సాక్షి. తాను ఆడిన సమయానికి, ఇప్పటి తరానికి మధ్య పలు వ్యత్యాసాలు వచ్చినా... సీనియర్లకు గౌరవం ఇచ్చే విషయంలో మాత్రం ఈతరం ఒకరకమైన నిర్లక్ష్య ధోరణి కనబడుతోందని అతను అభిప్రాయపడ్డాడు. భారత ఓపెనర్ రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్‌లో సాగిన సంభాషణలో అతను ఈ వ్యాఖ్య చేశాడు. నిజానికి మార్గనిర్దేశనం ఇచ్చేందుకు కూడా ఇప్పుడు ఎక్కువ మంది సీనియర్లు లేరని యువరాజ్ అన్నాడు. యువీ తొలి మ్యాచ్ ఆడే సమయానికి జట్టులో సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్, కుంబ్లేలాంటి దిగ్గజాలు ఉన్నారు. ‘మా సీనియర్లు ఎంతో క్రమశిక్షణతో ఉండేవారు. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి ఏకాగ్రత చెదిరే అవకాశాలు కూడా తక్కువ. సీనియర్లను చూసి మేం చాలా నేర్చుకునేవాళ్లం. ఎలా ఆడతారు, ఎంతగా కష్టపడతారు, జనంతో ఎలా మాట్లాడతారు, మీడియాతో ఎలా మాట్లాడతారు అనేవి తెలుసుకున్నాం. వారిలాగే ఉండేలా ప్రయత్నించేవాళ్లం. వచ్చే పదేళ్లు భారత్‌కు ఆడాలంటే మీరు ఇలా ఉండాలి అంటూ వారు మార్గనిర్దేశనం చేశారు’ అని యువరాజ్ గుర్తు చేసుకున్నాడు. ఆ ఇద్దరి తప్ప... నాటితో పోలిస్తే ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదని అతను అన్నాడు. మూడు ఫార్మాట్లు ఆడే వారిలో కోహ్లి, రోహిత్ తప్ప సీనియర్లు ఎవరూ లేరని చెప్పాడు. ‘ఈతరం కుర్రాళ్లను చూస్తే కొంత బాధ వేస్తుంది. మనకు అండగా నిలిచి సరైన దారిని చూపే వారు ఎవరన్నా ఉన్నారేమోనని చూస్తే జట్టులో అలాంటివారే కనిపించడం లేదు. ఫలితంగా సీనియర్లంటే గౌరవం కూడా తగ్గింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మేం ఎవరినైనా ఏదైనా అన్నట్లుగా యువ ఆటగాళ్లు తయారయ్యారు’ అని ఈ మాజీ ఆల్‌రౌండర్ ఆవేదన వ్యక్తం చేశాడు. జూనియర్ల ఇష్టారాజ్యం... ఒక టీవీ షోలో వివాదాస్పద వ్యాఖ్యలతో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ నిషేధానికి గురి కావడానికి ఇది కూడా కారణమని యువరాజ్ విశ్లేషించాడు. ‘సోషల్ మీడియా, పార్టీలులాంటివే పాండ్యా, రాహుల్ ఘటనకు కారణం. మా రోజుల్లో అయితే ఇలాంటిది కచ్చితంగా జరిగి ఉండకపోయేది. అసలు ఊహించలేం కూడా. మేం సీనియర్లకు ఇచ్చే గౌరవం కారణంగా వారు సరైన దారిలో పెట్టేవారు. ఇలాంటి పనులు చేయకండి. ఇది మంచిది కాదు అని చెప్పేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జూనియర్లు తాము ఏమనుకుంటే అది చేస్తున్నారు’ అని 2011 వరల్డ్‌కప్ విన్నర్ అభిప్రాయపడ్డాడు. అకస్మాత్తుగా వచ్చే డబ్బుతోనే... అయితే తాను కుర్రాళ్లను పూర్తిగా తప్పు పట్టడం లేదని, ఐపీఎల్ కారణంగా అకస్మాత్తుగా వచ్చి పడుతున్న భారీ మొత్తం వారితో ఇలాంటి పనులు చేయిస్తోందని యువరాజ్ వ్యాఖ్యానించాడు. ‘కొద్దిగా గుర్తింపు వచ్చిందంటే చాలు ఐపీఎల్ కాంట్రాక్ట్‌ల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు లభిస్తోంది. చిన్న వయసులోనే ఏకాగ్రత చెదిరి వేరే అంశాలపై దృష్టి మరలుతోంది. వారు కెరీర్ ఆరంభంలోనే ఉన్నారు. ఇంకా భారత్ తరఫున కూడా ఆడలేదు కానీ ఆర్జన మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇంత డబ్బును ఏం చేసుకోవాలో వారికి తెలియడం లేదు. అందుకే తప్పుడు మార్గాల్లో వెళుతున్నారు. ఇలాంటప్పుడు సీనియర్లు, కోచ్‌ల మార్గనిర్దేశనం కావాలి. మైదానంలో శ్రమించాలని, దేశానికి ఆడటమే ముఖ్యమని వారికి తెలియాలి. నువ్వు బాగా ఆడితే చాలు మిగతావన్నీ నీ వెంటే వస్తాయి అని సచిన్ నాతో ఎప్పుడూ చెబుతూ ఉండేవారు’ అని యువీ చెప్పాడు. ‘టెస్టు’లపై నేటితరం అనాసక్తి... ఇటీవల జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి వెళ్లినప్పుడు కొందరు యువ ఆటగాళ్లను పరిశీలించానని, వారు టెస్టులు ఆడాలని ఏమాత్రం కోరుకోవడం లేదనే విషయం తనకు అర్థమైందని యువరాజ్ అన్నాడు. తమ రాష్ట్రం తరఫున రంజీల్లో కూడా ఆడాలని భావించడం లేదని, ఐపీఎల్ ఉంటే చాలనుకుంటున్నారని అతను పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనప్పుడు దేశవాళీ క్రికెట్ తప్పనిసరిగా ఆడాలని సూచించిన యువరాజ్... వివిధ పిచ్‌లపై ఆడి రాటుదేలితే భారత్ తరఫున కూడా బాగా ఆడగలరని అభిప్రాయ పడ్డాడు. యువీతో సంభాషించే క్రమంలో రోహిత్ శర్మ కూడా ... తన పరిధిలో జూనియర్లతో మాట్లాడుతుంటానని, వారికి సరైన దిశ చూపించేందుకు ప్రయత్నిస్తుంటానని వివరించాడు. -
సీనియర్ల వేధింపులు : మెడికో ఆత్మహత్య
సాక్షి,ముంబై : సీనియర్ల వేధింపులకు తాళలేక గైనకాలజీ పోస్ట్-గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు సీనియర్ వైద్యుల చేతిలో కులపరమైన వేధింపులకు ఎదుర్కొన్న మెడికో పాయల్ సల్మాన్ తద్వీ(26) హాస్టల్ గదిలో ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నారు. ముంబై సెంట్రల్ బీవైఎల్ నాయర్ ఆసుపత్రిలోబుధవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం జల్గావ్కు చెందిన డా. పాయల్ ఎంబీబీఎస్ పూర్తి చేసిన అనంతరం బీవైఎల్ నాయర్ ఆసుపత్రిలో ఎండీ (గైనకాలజీ) చేస్తున్నారు. అయితే ఎస్సీ కులానికి చెందిన పాయల్‌పై ముగ్గురు మహిళా డాక్టర్లు గత కొంతకాలంగా కులపరమైన వివక్ష చూపుతూ వేధింపులకు దిగారు. రిజర్వ్డ్ కేటగిరీ అంటూ పలుసార్లు ఎద్దేవా చేసేవారు. అంతేకాదు వాట్సాప్ గ్రూపులో ఆమెను తీవ్రంగా అవమానించేవారు. అయితే ఈ వేధింపులపై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన ఎలాంటి ఫలితం లభించలేదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో డిప్రెషన్‌కు గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. సీనియర్ వైద్యుల వేధింపులు, యాజమాన్య నిర్లక్ష వైఖరి కారణంగా తమ బిడ్డ ప్రాణాలు తీసుకుందని పాయల్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే వేధింపులకు సంబంధించి తమకు రాతపూర్వక ఫిర్యాదు ఏదీ అందలేదని ఆసుపత్రి సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వివరాలను పరిశీలిస్తున్నామన్నారు. కులం పేరుతో వేధించేవారనీ,లంచ్ విరామంలో భోజనం చేయడానికి అనుమతినిచ్చేవారు కాదని పాయల్ సోదరుడు నీలేష్ ఆరోపించారు. అంతేకాదు ఎండీ కోర్స్ ఎలా పూర్తి చేస్తావో చూస్తామంటూ బెదరించేవారని తెలిపారు. కనీసం భర్తను కలవడానికి కూడా పాయల్‌కు అనుమతినిచ్చేవారు కాదని ఆయన ఆరోపించారు. ఇదే హాస్పిటల్‌కు తాను ట్రీట్మెంట్కు వచ్చినపుడు పలుసార్లు వేధింపులకు పాల్పడ్డారని పాయల్ తల్లి, కాన్సర్‌తో బాధపడుతున్న అబీదా సలీం(53) కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే విషయంలో బుధవారం సాయంత్రం తనతో చెప్పుకుని బాధపడిందనీ, తాము వచ్చేలోపే అంతా జరిగిపోయిందని వాపోయారు. మరోవైపు కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా హేమా ఆహుజా, భక్తి మెహరే, అంకిత ఖండేల్వాల్ అనే ముగ్గురు సీనియర్ డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఐస్‌క్రీమ్ ర్యాగింగ్
దాదాపు ముప్పయ్యేళ్ల కిందటి సంఘటన. అవి నేను వాకాడులో ఇంజనీరింగ్ కోర్సులో జాయినయ్యాను. ర్యాగింగ్ ఎక్కవనే చెప్పాలి. ఇంకా ఫ్రెషర్స్ డే జరగకపోవడంతో సీనియర్స్ కంట కనబడటానికి భయపడే వాళ్లం. ఆ సంవత్సరం సీట్లు పెంచడంతో పాటు ఉన్న కాలేజీలకు కొత్త బ్రాంచెస్కు అనుమతి రావడంతో కౌన్సెలింగ్ ఆగకపోవడంతో నాలాంటి వారికి ఏదో మూల ఆశ. కౌన్సెలింగ్ కోసం హైదరాబాద్‌కు వెళ్లాలి. కారణం కంప్యూటర్స్ కోర్సుపై ఉన్న క్రేజ్ అలాంటిది. అందుకోసం కాలేజీ క్లాసులు ముగిసిన తర్వాత అతి కష్టం మీద సీనియర్స్ కంట కనబడకుండా తప్పించుకుని గూడూరు వెళ్లే బస్సులో కూర్చున్నాను. డబ్బులు బొటాబొటిగా మాత్రమే ఉండటంతో గూడూరులో బస్సు దిగిన తర్వాత రైల్వేస్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లాను. ట్రైన్ రావడానికి ఇంకా సమయం ఉండటంతో టికెట్ తీసుకుని మొదటి నంబర్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చి పచార్లు ప్రారంభించాను రేపటి కౌన్సెలింగ్ గురించి ఆలోచిస్తూ. ఎందుకు వచ్చారో తెలియదు, కాని అక్కడకు వచ్చిన మా సీనియర్స్ కంటబట్టాను సరిగ్గా ఐస్‌క్రీమ్ షాపు ముందు. అది ప్లాట్‌ఫామ్‌పైనే. అంతే నా పైప్రాణాలు పైనే పోయాయి. తప్పించుకుని పారిపోదామా అనిపించింది. వారు ఒక్కసారిగా నా మీద పడ్డంత పని చేశారు. ‘ఇంకా ఫ్రెషర్స్ డే కాలేదు. అప్పుడే సినిమాలకు తయారయ్యావా?’ అని ఒకరు.. ‘గూడురుకు రావద్దని తెలియదా?’ అని మరొకరు.. ఈలోగా సెల్యూట్ చెయ్యబోతే వారించి, అతి వినయం పనికిరాదని గదమాయించారు. వారు నార్మల్ అయ్యాక అసలు విషయం వివరించి చెప్పాను. ‘సరే గూడురు వచ్చినందుకు నీకు జరిమానా.. అందరికీ ఐస్‌క్రీమ్స్ ఇప్పించు’ అన్నారు. అంతే నా గుండె గుభేల్మంది. కారణం డబ్బులు తక్కువగా ఉండటమే. ఐస్‌క్రీమ్ షాపులో పది కప్పులు ఇవ్వమని చెప్పాను. కానీ అందులో ఉన్న ఒక సీనియర్‌కి ఇంకా కోపం తగ్గలేదు కాబోలు. అందుకే నా కప్పు తీసుకుని, దాంతో తినడానికి ఇచ్చిన వెదురు స్పూన్‌ను పట్టాలపైకి విసిరేసి, కప్పు మాత్రమే ఇచ్చాడు. ఐస్‌క్రీమ్ కరగకముందే తినమన్నాడు. చేతివేళ్లు ఉపయోగించవద్దని షరతు విధించాడు. ఒకవేళ నేను అలా తినకపోతే బిల్లు నేనే చెల్లించాలని, తింటే తాను చెల్లిస్తానని ఆఫర్ కూడా ఇచ్చాడు. షాపతను, సీనియర్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఒక్కక్షణం ఆలోచించి, కప్పు మీదనున్న మూత తీసి, దాన్ని స్పూన్‌లా మలచి తినడం మొదలుపెట్టాను. వారు కాస్త కంగుతిన్నట్టనిపించింది. ‘నువ్వు కంప్యూటర్స్ కోర్సుకి బాగా సూటవుతావు’ అని మెచ్చుకున్నారు. సీనియర్ బిల్లు పే చేయక తప్పలేదు. ర్యాగింగ్ గురించి విన్నప్పుడల్లా ఈ సంఘటన గుర్తుకొచ్చి, నవ్వొస్తుంది. కొసమెరుపు ఏమిటంటే.. నాకు కంప్యూటర్స్ కోర్సులో సీటు రాకపోవడం. – కె. వెంకటరమణారావు, కరీంనగర్ -
బీసీ హాస్టల్లో జూనియర్లపై సీనియర్ల దాడి
నిజామాబాద్ : తమ బట్టలు ఉతకాలంటూ సెకండియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులపై దాడి చేసిన సంఘటన నిజామాబాద్ బీసీ హాస్టల్లో చోటుచేసుకుంది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేక నిజామాబాద్ 3వ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సీనియర్ల వేధింపులు ఎక్కువై ఐదుగురు విద్యార్థులు కూడా హాస్టల్ వదిలి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. బీసీ హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వల్లనే సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. -
కింకర్తవ్యం
ఎమ్మెల్సీ ఆశావహులకు భంగపాటు అసంతృప్తితో రగులుతున్న టీడీపీ సీనియర్ నేతలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎమ్మెల్సీ పదవులు ఆశించిన టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రిక్తహస్తం చూపించారు. జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలతోపాటు స్థానిక సంస్థల్లోనూ మెజారిటీ స్థానాల్లో ఆ పార్టీ విజయం కోసం అహరహం శ్రమించిన నాయకులకు చంద్రబాబు విలువ ఇవ్వకపోవడంతో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. బెదిరించిన అనంతపురం, ప్రకాశం జిల్లా నేతలకు ఎమ్మెల్సీ సీట్లు కేటాయించిన పార్టీ అధినేత అన్ని సీట్లూ కట్టబెట్టి అభిమానాన్ని, స్వామి భక్తిని చాటుకున్న పశ్చిమ గోదావరి జిల్లా నేతలను చిన్నచూపు చూడటంతో కార్యకర్తల్లో సైతం వ్యతిరేకత వ్యక్తమఽవుతోంది. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కనీసం నిలబెట్టుకోలేకపోవడంపై పార్టీ నేతలు మదనపడుతున్నారు. జిల్లాలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి రెండు ఎమ్మెల్సీ స్థానాలలో ఒకటి పాత వారికే ఇవ్వగా, రెండో సీటును క్షత్రియ సామాజిక వర్గానికి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈ సీటు కోసం చాలామంది ఆశలు పెట్టుకున్నారు. అదనంగా తమకు ఎమ్మెల్యేల కోటాలో ఒక సీటు కేటాయిస్తారని ఆశావహులు భావించారు. అయితే చంద్రబాబు ఈ జిల్లాను పట్టించుకోలేదు. మహిళల కోటాలో తనకు సీటు లభిస్తుందని చివరివరకూ ఎదురుచూసిన ముళ్లపూడి రేణుకకు నిరాశే మిగిలింది. 2014లో ఇచ్చిన హామీ మేరకు తనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని భావించిన ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ పేరును అసలు పరిగణనలోకి తీసుకోకుండా చంద్రబాబు అవమానించారు. వైశ్య సామాజిక వర్గం అంతా సమావేశమై గట్టిగా డిమాండ్ చేసినా చంద్రబాబు ఖాతరు చేయకపోవడంపై ఆ సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని వదులుకుని టీడీపీలో చేరిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుకు, పొత్తు ధర్మంలో సీటును కోల్పోయిన తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, భీమవరానికి చెందిన సీనియర్ నేత మెంటే పార్థసారథికి నిరాశే మిగిలింది. ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చి తణుకు మాజీ మున్సిపల్ ఛైర్మన్ దొమ్మేటి సుధాకర్‌ను ఆ పార్టీ మోసం చేయడంతో శెట్టి బలిజ సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. వీరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. స్థానిక సంస్థల కోటాలో కాకపోయినా కనీసం ఎమ్మెల్యేల కోటాలో అయినా తమకు న్యాయం జరుగుతుందని ఎదురుచూసిన వారందరికి నిరాశే మిగలటంతో టీడీపీలో అసమ్మతి పెరుగుతోంది. ఈ పరిస్థితి ఎటు దారి తీస్తుందోనని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. -
సీనియర్ సిటిజన్లకు తీపికబురు
వయసు పైబడిన వారికి సామాజిక రక్షణగా తీసుకొచ్చిన పెన్షన్ స్కీమ్‌ను కేబినెట్ మంగళవారం ఆమోదించింది. ఈ స్కీమ్ కింద 10 ఏళ్ల పాటు, ఎల్ఐసీ 8 శాతం రిటర్న్‌లను గ్యారెంటీగా అందించనుంది. సోషల్ సెక్యురిటీ, ఫైనాన్సియల్ ఇక్లూజన్ ప్రొగ్రామ్ కింద ఎల్ఐసీ ఈ రిటర్న్‌లను సీనియర్ సిటిజన్లకు తప్పక ఇవ్వనుంది. వరిస్థ పెన్షన్ బీమా యోజన 2017 ఆవిష్కరిస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. ఈ స్కీమ్ కింద 10 ఏళ్ల పాటు 8 శాతం రిటర్న్‌లతో పెన్షన్‌ను అందించనున్నామని కేంద్రం హామినిచ్చింది. నెల/త్రైమాసికం/అర్థ సంవత్సరం, వార్షిక తరహాలో దేన్ని పెన్షనర్లు ఎంచుకుంటే, ఆ విధంగా రిటర్న్‌లను ఇస్తామని కేంద్రం చెప్పింది. ఈ ఏడాది నుంచి ఎల్ఐసీ ద్వారా ఈ స్కీమ్‌ను అమల్లోకి తేనున్నారు. మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ఆదాయాలు తగ్గుతాయి కాబట్టి 60 సంవత్సరాలు, ఆపై వయసు మీదపడిన వారికి ఈ స్కీమ్ ఎంతో సహకరించనుంది. -
సీనియర్లు కొట్టడంతో విద్యార్థులు పలాయనం
గుడ్లవల్లేరు : మచిలీపట్నంలోని ఒక ప్రైవేట్ గురుకుల పాఠశాలలో సీనియర్లు కొట్టడంతో జూనియర్లు పారిపోయి గుడ్లవల్లేరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. గుడివాడకు చెందిన పెద్దిబోయిన బాలాజీ, మండవల్లికి చెందిన రేమల్లి విశాల్ మచిలీపట్నంలోని ఒక ప్రైవేట్ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు. అస్తమానం 8వ తరగతికి చెందిన విద్యార్థులు వారిని కొడుతున్నారు. దీంతో బాలాజీ, విశాల్ అక్కడి నుంచి గురువారం పారిపోయారు. రోడ్డు వెంట వెళ్తే ఎవరైనా పట్టుకుంటారని చిలకలపూడి నుంచి రైల్వే ట్రాక్ వెంబడి నడిచి వచ్చారు. వడ్లమన్నాడు రైల్వేస్టేషన్లో ఈ విద్యార్థులను గుర్తించిన స్థానికులు వారిని గుడ్లవల్లేరు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఆ పిల్లల నుంచి సమాచారం రాబట్టిన ఎస్ఐ ఎ.ఉమామహేశ్వరరావు వారి తల్లిదండ్రులకు అప్పగించటంతో కథ సుఖాంతమైంది. -
రేపు సీనియర్స్ కబడ్డీ జట్ల ఎంపిక
కాకినాడ సిటీ: సామర్లకోటలోని బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లో ఈ నెల 11న జిల్లా సీనియర్స్ స్త్రీ, పురుషుల కబడ్డీ జట్లను ఎంపిక చేయనున్నట్టు జిల్లా కబడ్డీ సంఘ కార్యదర్శి ఎం.శ్రీనివాసకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారుల్లో పురుషుల బరువు 80 కేజీల లోపు, స్త్రీల బరువు 70 కేజీల లోపు ఉండాలన్నారు. ఎంపికైన క్రీడాకారులు 64వ రాష్ట్ర సీనియర్స్ స్త్రీ, పురుషుల కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలలో జిల్లా తరఫున పాల్గొంటారన్నారు. ఆసక్తిగల క్రీడాకారులుటి.వైకుంఠం (పీఈటీ, సామర్లకోట)ను 99590 27375 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
జూనియర్లను ఈడ్చిఈడ్చి రాడ్లతో కొట్టారు
నోయిడా: ఢిల్లీలో దారుణం జరిగింది. ఇద్దరు జూనియర్లను సీనియర్ విద్యార్థులు ఈడ్చిఈడ్చి కొట్టారు. ఇనుప రాడ్లతో మోదారు. ఈ ఘటనలో 18మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ధ్రువ్ అగర్వాల్, యాశ్ ప్రతాప్ సింగ్ అనే విద్యార్థులు హాస్టల్లో డిన్నర్ పూర్తి చేసుకొని టీవీ హాల్ కు తిరిగొచ్చారు. వారు అలా రాగానే.. పెద్ద మొత్తంలో సీనియర్ విద్యార్థులు తలుపులు వేసి వారిని లోపల పడేసి బాగా కొట్టారు. గంటపాటు అలా ఇష్టమొచ్చినట్లు కొట్టిన తర్వాత వారి బట్టలు విప్పేయండంటూ బలవంత పెట్టారు. సీనియర్లతో పెట్టుకుంటే ఏం జరిగిద్దో వాళ్లు మాకు చూపించాలని అనుకున్నారు. వాళ్లు ప్రతి రోజు మమ్మల్ని ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారు. తినే వద్ద కూడా వదిలిపెట్టడం లేదు. కవర్లలో ఆహారం దాచేసి అందులో ఏముందని అడుగుతూ అలా చెప్పకుంటే ముఖంపై విసిరేసి అవమానిస్తారు. ఇలా రోజు జరుగుతుంది' అని గాయాలపాలయిన విద్యార్థుల్లో ఒకరు మీడియాకు చెప్పారు. కాగా, ఇంత పెద్ద మొత్తంలో సంఘటనలు జరుగుతున్నా తమకు కనీస సమాచారం అందించడం లేదంటూ తల్లిదండ్రులు మండిపడుతున్నారు.