జూనియర్లను ఈడ్చిఈడ్చి రాడ్లతో కొట్టారు | Class 11 Students Of DPS Noida Ragged By Seniors, Beaten With Rods | Sakshi
Sakshi News home page

జూనియర్లను ఈడ్చిఈడ్చి రాడ్లతో కొట్టారు

Published Wed, May 11 2016 12:48 PM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM

జూనియర్లను ఈడ్చిఈడ్చి రాడ్లతో కొట్టారు

జూనియర్లను ఈడ్చిఈడ్చి రాడ్లతో కొట్టారు

నోయిడా: ఢిల్లీలో దారుణం జరిగింది. ఇద్దరు జూనియర్లను సీనియర్ విద్యార్థులు ఈడ్చిఈడ్చి కొట్టారు. ఇనుప రాడ్లతో మోదారు. ఈ ఘటనలో 18మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ధ్రువ్ అగర్వాల్, యాశ్ ప్రతాప్ సింగ్ అనే విద్యార్థులు హాస్టల్లో డిన్నర్ పూర్తి చేసుకొని టీవీ హాల్ కు తిరిగొచ్చారు. వారు అలా రాగానే.. పెద్ద మొత్తంలో సీనియర్ విద్యార్థులు తలుపులు వేసి వారిని లోపల పడేసి బాగా కొట్టారు. గంటపాటు అలా ఇష్టమొచ్చినట్లు కొట్టిన తర్వాత వారి బట్టలు విప్పేయండంటూ బలవంత పెట్టారు.

సీనియర్లతో పెట్టుకుంటే ఏం జరిగిద్దో వాళ్లు మాకు చూపించాలని అనుకున్నారు. వాళ్లు ప్రతి రోజు మమ్మల్ని ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారు. తినే వద్ద కూడా వదిలిపెట్టడం లేదు. కవర్లలో ఆహారం దాచేసి అందులో ఏముందని అడుగుతూ అలా చెప్పకుంటే ముఖంపై విసిరేసి అవమానిస్తారు. ఇలా రోజు జరుగుతుంది' అని గాయాలపాలయిన విద్యార్థుల్లో ఒకరు మీడియాకు చెప్పారు. కాగా, ఇంత పెద్ద మొత్తంలో సంఘటనలు జరుగుతున్నా తమకు కనీస సమాచారం అందించడం లేదంటూ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement