టీడీపీ తొలి జాబితా: సీనియర్లు ఇంటికేనా..? | Chandrababu Shock To Tdp Seniors In First List | Sakshi
Sakshi News home page

టీడీపీ తొలి జాబితా: కనిపించని సీనియర్ల పేర్లు

Published Sat, Feb 24 2024 1:59 PM | Last Updated on Sat, Feb 24 2024 2:50 PM

Chandrababu Shock To Tdp Seniors In First List - Sakshi

సాక్షి,గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో చాలా వరకు పార్టీ సీనియర్లకు చోటు దక్కలేదు. పార్టీకోసం రక్త తర్పణం చేసిన బుద్దావెంకన్న, ఏపీ టీడీపీ మాజీ చీఫ్‌గా పనిచేసిన కిమిడి కళా వెంకట్రావు, గుంటూరు జిల్లాలో యరపతినేని, ఆలపాటి రాజా, పెద్దకూరపాడు నుంచి కొమ్మాలపాటి శ్రీధర్, ఉండి నుంచి వేటుకూరి శివరామరాజు పేర్లు తొలి జాబితాలో లేవు. ఈ ఎన్నికల్లో వీరందరికీ బాబు హ్యాండిచ్చినట్లేనన్న ప్రచారం జరుగుతోంది. 

విజయనగరం గజపతినగరం టీడీపీలో ఇప్పటికే అసంతృప్తి రగిలింది. కొండపల్లి శ్రీనివాసరావుకి టికెట్ కేటాయించి డా.కె.ఎ.నాయుడుకి టికెట్ ఇవ్వకపోవడంపై కేడర్ లో అసంతృప్తి భగ్గుమంది. భవిష్యత్ కార్యాచరణపై డా.కె.ఎ.నాయుడు కేడర్‌తో చర్చిస్తున్నారు. 

బుచ్చయ్య.. ఆక్‌ పాక్‌.. కరివేపాక్‌.!

రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్న పార్టీ సూపర్‌ సీనియర్‌ నేత బుచ్చయ్య చౌదరికి ఈసారి నో ఛాన్స్‌ అన్నట్లే కనిపిస్తోంది. రాజమండ్రి రూరల్ సీటు విషయంలో న్యాయం చేస్తామని చంద్రబాబు చెప్పినప్పటికీ నేతల్లో నమ్మకం కుదరని పరిస్థితి కనిపిస్తోంది. రాజమండ్రి రూరల్‌ నుంచి టీడీపీ, జనసేన ఆశావహులు ఇద్దరూ పోటీ చేస్తారని బాబు అన్నారు. వీరిలో ఒకరు రాజమండ్రి రూరల్, మరొకరు వేరే చోట పోటీ చేస్తారని చెబుతున్నారు. 

ఇదీ చదవండి.. టీడీపీ తొలి జాబితా: బండారు, గంటాకు హ్యాండ్‌ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement