
సాక్షి,విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితాలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు సీనియర్లకు చోటు దక్కలేదు. బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు లాంటి బడా నేతలతో పాటు పల్లా శ్రీనివాస్‌కు కూడా తొలి జాబితాలో చంద్రబాబు మొండిచేయి చూపించారు.
మరోపక్క అనకాపల్లిలో పీలా గోవింద్, బుద్ధ నాగ జగదీష్ అనకాపల్లిలో సీటు ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించడంపై తమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు. అసలు బలమేలేని జనసేనకు అనకాపల్లి సీటు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు.
కిమిడి వర్గానికి షాక్ ..
తొలి జాబితాలో జాబితాలో జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు వర్గానికి చంద్రబాబు షాకిచ్చారు. జాబితాలో కళా వెంకట్రావుకు చోటు దక్కలేదు. రాజాంలో కొండ్రు మురళిని వ్యతిరేకించి కళా వెంకట్రావు భంగపడ్డట్లు తెలుస్తోంది. కళా వెంకట్రావు వర్గాన్ని మొత్తం బాబు దూరం పెట్టినట్లు చెబుతున్నారు.
కొణతాలకు టికెట్టా..? జనసేన సీనియర్ల ఆగ్రహం
కాగా, ఉమ్మడి విశాఖలో అటు జనసేనకు చెందిన పలువురు సీనియర్లు పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డారు. వీరిలో పంచకర్ల రమేష్, తమ్మిరెడ్డి శివశంకర్, బోలిశెట్టి సత్య, సుందరపు విజయ్ కుమార్, సుందరపు సతీష్, వంశి, కోన తాతారావు తదితరులున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు అనకాపల్లి సీటు కేటాయించడంపై టికెట్ దక్కని జనసేన నేతలంతా ఆగ్రహంతో ఉన్నారు.
ఇదీ చదవండి.. టీడీపీ తొలి జాబితా.. కిమిడి వర్గానికి షాక్
Comments
Please login to add a commentAdd a comment