సాక్షి,విజయనగరం: తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో జాబితాలో జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు వర్గానికి చంద్రబాబు షాకిచ్చారు. జాబితాలో కళా వెంకట్రావుకు చోటు దక్కలేదు. రాజాంలో కొండ్రు మురళిని వ్యతిరేకించి కళా వెంకట్రావు భంగపడ్డట్లు తెలుస్తోంది.
టీడీపీ రాజాం టికెట్‌ను మాత్రం కొండ్రు మురళీమోహన్ సాధించుకున్నారు. జిల్లాలోని చీపురుపల్లి సెగ్మెంట్‌లోనూ కిమిడి కళా వెంకటరావు తమ్ముడి కుమారుడు కిమిడి నాగార్జునను టీడీపీ అధిష్టానం పక్కనపెట్టడంపై కిమిడి వర్గం నేతలు పూర్తి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కిమిడి వర్గం నేతలుగా ముద్ర పడ్డ ఎవరికీ తొలి జాబితాలో చోటు దక్కకపోవడంపై ఆయన క్యాడర్ మొత్తం టీడీపీ పెద్దలపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, తొలి జాబితాలో జిల్లాలోని గజపతినగరం టీడీపీ టికెట్ కొండపల్లి శ్రీనివాస్‌కు దక్కింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడును టీడీపీ హై కమాండ్ పక్కన పెట్టింది. అధిష్టానం తీరుతో అప్పలనాయుడు వర్గం భగ్గుమంటోంది. జిల్లాలోని నెల్లిమర్ల స్థానం జనసేనకు కేటాయించడంపై టీడీపీ శశ్రేణులు భగ్గుమంటున్నారు. ఇక్కడ టికెట్ ఆశించిన టీడీపీ నేత శివరామకృష్ణ ఆశాభంగం చెందారు. జిల్లాలో మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామికి కూడా తొలిజాబితాలో చోటు దక్కలేదు.
ఇదీ చదవండి.. టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ పావలా వంతు కూడా ఇవ్వలేదు
Comments
Please login to add a commentAdd a comment