సాక్షి, నెల్లూరు: నెల్లూరు మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుంచి కౌన్సిలర్లుగా, ఆ తరువాత కార్పొరేటర్లుగా వ్యవహరించిన పలువురు సీనియర్లు ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనంలో ఓటమిపాలయ్యారు. ఈ జాబితాలో సీనియర్ కౌన్సిలర్‌గా, నగర డిప్యూటీ మేయర్‌గా పని చేసిన సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లుతోపాటు సీనియర్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పనిచేసిన పిండి సురేష్‌బాబు, షేక్ అబ్దుల్ మునాఫ్ (కాంగ్రెస్), స్వర్ణ వెంకయ్య (టీడీపీ) ఉండగా, దారా జయరాజ్, మండ్ల ఈశ్వరయ్య, సంక్రాంతి కల్యాణ్, వారి కు టుంబసభ్యులు గతంలో కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా గెలుపొందినప్పటికీ ఈ సారి రిజర్వేషన్లు తారుమారు కావడం తో మళ్లీ వారి కుటుంబసభ్యులను ఎన్నికల బరిలో దింపినప్పటికీ ఓటమి తప్పలేదు.
చావుతప్పి కన్నులొట్ట బోయినకాంగ్రెస్
నగరంలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్‌పార్టీకి 54 డివిజన్లలో కేవలం 12వ డివిజన్ నుంచి ఆనం వివేకానందరెడ్డి కుమారుడు ఆనం రంగమయూర్‌రెడ్డి మాత్రమే గెలుపొందారు. దీంతో ఆ పార్టీకీ నగరంలో చావుతప్పి కన్నులొట్టబోయినట్లైంది. ఒకటి, రెండుచోట్ల మా త్రమే కాంగ్రెస్ అభ్యర్థులు రెండో స్థానం లో నిలవగా అధికభాగం డిపాజిట్లు కో ల్పోవడం గమనార్హం. కాంగ్రెస్‌పార్టీ ఘోర పరాజయం పాలుకావడంతో తగిన శాస్తి జరిగిందంటూ నగరవాసులు అంటున్నారు.
పలుచోట్ల ప్రధాన రాజకీయపార్టీల రెబల్ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు తమ సత్తా చాటారు. సీపీఎంకు కంచుకోటగా ఉండే నగరంలోని పలు డివిజన్‌లలో ఈ సారి ఆ పార్టీ అభ్యర్థులంతా ఓటమిపాలుకాగా కేవలం 25వ డివిజన్ నుంచి ఆ పార్టీ అభ్యర్థి బిరదవోలు పద్మజ ఒక్కరే గెలుపొందారు. బీజేపీ నుంచి నగరంలోని 23వ డివిజన్‌కు చెందిన ఎర్రబోలు అపర్ణ, 50వ డివిజన్ నుంచి కప్పిర ఉమామహేశ్వరి మాత్రమే గెలుపొందారు. టీడీపీ నుంచి సీటు ఆశించి చివరకు బీ-ఫారం దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దొడ్డపనేని రాజా విజయం సాధించారు.
ఎక్స్ అఫిషియో సభ్యులతో పనిలేదు
నగర మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఒక్కోసారి ఎక్స్‌అఫిషియో సభ్యుల ఓట్లు ఎంతో కీలకంగా పనిచేస్తాయి. ఈ సారి వారి అవసరం ఉంటుందని భావించినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 32 స్థానాలను చేజిక్కించుకోవడంతో ఇక వారితో పనిలేకుండా పోయింది.
సీనియర్లకూ తప్పని ఓటమి
Published Tue, May 13 2014 4:37 AM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM
Advertisement