ర్యాగింగ్‌లు... రీడింగ్‌లు... | FareWell | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్‌లు... రీడింగ్‌లు...

Published Tue, Jan 20 2015 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

ర్యాగింగ్‌లు... రీడింగ్‌లు...

ర్యాగింగ్‌లు... రీడింగ్‌లు...

టీనేజీ ఏజ్‌లో కాలేజీలో అడుగు పెట్టింది మొదలు... ఎన్నో అనుభవాలు, అనుభూతులు. ర్యాగింగ్‌లు... రీడింగ్‌లు... కొత్త వారికి స్వాగత సందడులు. ఇప్పుడా సరదాలు దాటి విద్యా సంవత్సరం చివరాంకానికి చేరుకుంది. కళాశాలలు వీడ్కోలు పార్టీలకు సన్నద్ధమవుతున్నాయి. ఆరంభంలో జూనియర్లకు సీనియర్ల వెల్కమ్... ఆఖర్లో సీనియర్లకు జూనియర్ల ఫేర్‌వెల్. నాడు ఉత్సాహంగా మొదలైన జర్నీ... నేడు బరువెక్కిన హృదయంతో టాటా చెబుతుంది.

ఈ మధుర క్షణాలను మెమరబుల్‌గా మార్చేందుకు కుర్రకారు ఎంతలా ప్రిపేర్ అవుతున్నారో తెలుసుకొనే ప్రయత్నమే ఈ వారం ‘క్యాంపస్ కబుర్లు’. ఇదే టాపిక్‌పై సికింద్రాబాద్ జాహ్నవి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల విద్యార్థులను కదిలిస్తే... ఎన్నెన్నో సంగతులు తలపోశారు.

అవి వారి మాటల్లోనే...  
నరేష్: ఈ నెలాఖర్లో సీనియర్స్‌కి ఫేర్‌వల్ డే ప్లాన్ చేస్తున్నాం. చాలా గ్రాండ్‌గా...
లోకేష్: లాస్ట్ ఇయర్ మా ప్రిపరేషన్ డేస్ గుర్తొకొస్తున్నాయి. ఈసారి మేం ఫైనలియర్ స్టూడెంట్స్ కాబట్టి పార్టీ తీసుకుని వెళ్లిపోవడం తప్ప ఏం చెయ్యలేం.
మౌనిక: వెళ్లిపోవడం అంటే కాలేజీలో నుంచే. తర్వాత కూడా సీనియర్స్ టచ్‌లో ఉంటారు. కనిపిస్తే పలకరించడంలాంటివి కాకుండా, కాలేజీలో ఫ్రెషర్స్
పార్టీ వేడుకలప్పుడు పిలుస్తుంటాం. వచ్చి మాతో ఎంజాయ్ చేస్తారు.
నరేష్: నేను సెకండ్ ఇయర్. మా సీనియర్స్ చాలా మంచివాళ్లు.   
అందరూ: ఓ... వేసేశాడు బిస్కెట్!
లోకేష్: లేదండి మేం నిజంగానే మంచివాళ్లం.
రోహిత్: నిజం చెప్పాలంటే... సీనియర్స్ ఎప్పుడూ బుద్ధిమంతులే! ర్యాగింగ్ రోజులు దాదాపుగా పోయినట్టే.
వీరవేంద్ర: ఉన్నా... మంచి ర్యాగింగే. మా కాలేజీ మొదటి రోజు ఫస్ట్ క్లాస్‌కి ఒక లెక్చర్ వచ్చి సీరియస్‌గా పాఠం చెప్పడం మొదలుపెట్టారు. ఇంతలో ఫైనలియర్ స్టూడెంట్స్ క్లాస్‌లో మమ్మల్ని చూసి నవ్వడం మొదలుపెట్టారు. పాఠం చెబుతున్నది లెక్చరర్‌కాదు. ఫైనలియర్ స్టూడెంట్. అదే పెద్ద ర్యాగింగ్.
తన్మయ్‌ఆనంద్‌రెడ్డి: ఫ్రెషర్స్ చాలా హుషార్. ఎదురుపడితే.. ఏం బావా అంటున్నారు.  
శ్రవంత్: బావ ఒక్కటేనా మావా, మచ్చా, జప్ఫా, డప్ఫా... కొంచెం క్లోజ్ అయితే చాలు సెకండ్స్‌లో లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది.  
చారి: ఓకే టాపిక్ డైవర్ట్ అవుతోంది.. వాటెబౌట్ ఫేర్‌వెల్?
శ్రవంత్: నో కాంప్రమైజ్.
చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేసుకుంటున్నాం. డ్యాన్సులు, గేమ్స్, కథలు, కవితలు... ఇంకా ఎన్నో!
రోహిత్: ఫుడ్ బాగుండాలిరా...
నరేష్: నా ఎస్టిమేషన్ రెండు లకారాల వరకూ అవుతుంది.
సుస్మిత: ఆ బడ్జెట్‌లో ఒకమ్మాయి పెళ్లయిపోతుంది.
శరత్: హలో... చికెన్‌కే సగం అయిపోయిందక్కడ.
వీరవేంద్ర: ఇంతకీ వెన్యూ ఎక్కడ?  
రాజశ్రీ: ఇంకా టైమ్ ఉంది కదా! ఈ నెల చివరి వారం రోజులు దానికే సరిపోతుంది.
సుస్మిత: ఇలాంటి సమయంలో ఒక్క ఫేర్‌వెలే కాదు ఫ్రెషర్స్ పార్టీ విషయాలను కూడా గుర్తుచేసుకోవాలి. మా జూనియర్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. కొత్తేమీ లేదు.. మాతో కలసి చక్కగా స్టెప్పులేసేశారు.
భార్గవి: సెలబ్రేషన్స్ మాటకొస్తే మా కాలేజీలో ఏడాదికి పది ఉంటాయి. మొన్న ఆగస్టులో ట్రెడిషనల్‌డే జరుపుకున్నాం. అమ్మాయిలంతా లంగావోణీ, చీరల్లో వచ్చారు. అబ్బాయిలు ట్రెడిషన్‌వేర్ ధరించారు.  
నరేష్: మా జూనియర్ మహేశ్ చక్కగా పంచె కట్టుకు వచ్చాడు. సీనియర్స్ పైజామా కుర్తాలాంటివి వేసుకొచ్చాం.
కిషన్‌కుమార్: బోనాలు, వినాయకచవితి, క్రిస్మస్, సంక్రాంతి... అన్ని పండగల్ని కాలేజీలో ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటాం.
కల్యాణి: పార్టీకి ఇంకా పదిరోజులు కూడా లేదు. ఒక పక్క ప్రాక్టికల్స్ దగ్గరపడుతున్నాయి. అయినా పార్టీ గ్రాండ్ సక్సెస్ చేయాల్సిందే. నేను క్లాసికల్ డ్యాన్సర్‌ని. నావంతుగా మంచి డ్యాన్స్ షో!
మౌనిక: ఆ రోజు అందరి టాలెంట్లు బయటొకొస్తాయన్నమాట...
నరేష్: నేనేమనుకుంటున్నానంటే... సీనియర్స్‌కి వీడ్కోలు పలికే సందర్భం కాబట్టి వారికి ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్‌లేమైనా ఇవ్వాలి
లోకేష్: లాస్టియర్.. మా సీనియర్స్‌కి మేం ఫొటో ఫ్రేమ్‌లు ఇచ్చాం. ఇప్పటికీ క్రికెట్ గ్రౌండ్‌లో కలుస్తుంటారు. వారిని చూడగానే సొంతవారిని చూసిన ఫీలింగ్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement