బీసీ హాస్టల్లో జూనియర్లపై సీనియర్ల దాడి | Senior Students Attacked On Juniors In Nizamabad BC Hostel | Sakshi
Sakshi News home page

బీసీ హాస్టల్లో జూనియర్లపై సీనియర్ల దాడి

Published Sun, Aug 19 2018 2:57 PM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

Senior Students Attacked On Juniors In Nizamabad BC Hostel - Sakshi

నిజామాబాద్‌ :  తమ బట్టలు ఉతకాలంటూ సెకండియర్‌ విద్యార్థులు, జూనియర్‌ విద్యార్థులపై దాడి చేసిన సంఘటన నిజామాబాద్‌ బీసీ హాస్టల్లో చోటుచేసుకుంది. సీనియర్‌ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేక నిజామాబాద్‌ 3వ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో జూనియర్‌ విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సీనియర్ల వేధింపులు ఎక్కువై ఐదుగురు విద్యార్థులు కూడా హాస్టల్‌ వదిలి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. బీసీ హాస్టల్‌ వార్డెన్‌ నిర్లక్ష్యం వల్లనే సీనియర్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement