BC hostel
-
బీసీ వసతిగృహంలో విద్యార్థి మృతి
విజయనగరం అర్బన్/సాక్షి, అమరావతి: జిల్లా కేంద్రం విజయనగరంలోని కాటవీధిలోగల బీసీ హాస్టల్లో ఓ విద్యార్థి ఆదివారం మృతిచెందాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేట రాజాం గ్రామానికి చెందిన కొణతాల శ్యామలరావు (12) ఏడో తరగతి చదువుతున్నాడు. శ్యామలరావు ఆదివారం ఉదయం అల్పాహారం తిన్న తరువాత మంచినీళ్లు తాగి దుస్తులు ఉతుక్కునేందుకు వెళ్తూ కళ్లు తిరిగి స్పృహతప్పి పడిపోయినట్టు వార్టెన్ జానకిరావు తెలిపారు. అతడిని వెంటనే నగరంలోని సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే విద్యార్థి మృతిచెందాడని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అప్పలనాయుడు తెలిపారు. సమీపంలో ఉన్న ఆస్పత్రిని కాదని దూరంగా ఉన్న పెద్దాస్పత్రికి తీసుకువెళ్లడం వల్లే తమ మేనల్లుడి ప్రాణాలు పోయాయని శ్యామలరావు మేనమామ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ శ్యామలరావు మృతికి కారణం ఏమిటనేది తెలియదని బీసీ సంక్షేమశాఖ ఇన్చార్జి ఈడీ పెంటోజీరావు చెప్పారు. హాస్టల్లో ఇటీవల నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో శ్యామలరావుకు ఎటువంటి అనారోగ్యం లేదని తేలిందన్నారు. ప్రస్తుతం హాస్టల్లో విద్యార్థులెవరికీ అనారోగ్య సమస్యలు లేవని ఆయన తెలిపారు. నివేదిక ఇవ్వండి: మంత్రి సవిత ఆదేశం విజయనగరంలోని బీసీ హాస్టల్ విద్యార్థి కొణతాల శ్యామలరావు మృతికి కారణాలపై తక్షణమే తనకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత అధికారులను ఆదేశించారు. విద్యార్థి మృతిపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ విద్యార్థి గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వాస్తవాలను విచారించి నివేదించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
తిరుపతి : బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ విద్యార్థులకు అస్వస్థత (ఫొటోలు)
-
ప్రాణం తీసిన కొట్లాట...బీసీ హాస్టల్ లో దారుణం
-
మంచాల బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్
-
పాలమాకుల బీసీ హాస్టల్లో 45 మందికి కరోనా
సాక్షి, రంగారెడ్డి : పాలమాకుల జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. హాస్టల్లో మొత్తం 45 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కరోనా పాజిటివ్ విద్యార్థులను ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సదరు హాస్టల్లో మొత్తం 1000మంది విద్యార్ధులు ఉన్నారు. కరోనా భయంతో పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. నిర్మల్ జిల్లాలోని ముథోల్ గిరిజన బాలికల గురుకులంలోనూ కరోనా కేసులు బయటపడ్డాయి. 121 మంది విద్యార్థినిలకు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా పదిహేను మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న ఇదే పాఠశాలలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఇరవై నాలుగు కేసులు నమోదు కావటంతో విద్యార్థినుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి : మాస్కులతో మంచీ చెడులు తెలుసుకోండి! -
ట్రంకు పెట్టెల గోల్మాల్
సాక్షి, అనంతపురం: బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలకు ట్రంకు పెట్టెల సరఫరాలో గోల్మాల్ జరిగింది. పెట్టెల సరఫరా పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. వంద, రెండొందలు కాదు.. ఏకంగా రూ.89,50లక్షలు ఏజెన్సీ ఖాతాలోకి జమ చేశారు. ఇప్పటికి నాలుగు నెలలు గడుస్తున్నా హాస్టళ్లకు పూర్తిస్థాయిలో ట్రంకు పెట్టెలు చేరకపోవడం చూస్తే.. అధికారుల పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. వాస్తవానికి పెట్టెలను హాస్టళ్లకు సరఫరా చేసిన తర్వాత నిబంధనల ప్రకారం నాణ్య తను పరిశీలించి ధ్రువీకరించుకున్న తర్వాతే బిల్లు మంజూరు చేయాల్సి ఉంది. అయితే బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండానే, ఒక్కటంటే ఒక్క పెట్టె సరఫరా చేయక ముందే బిల్లు చెల్లించడం గమనార్హం. ఫిబ్రవరిలో బిల్లు పెట్టిన అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 2న బిల్లు మంజూరు చేసిన అధికారులు ట్రెజరీకి పంపించారు. అయినా సదరు ఏజెన్సీ పెట్టెలు సరఫరా చేయలేదు. అనివార్య కారణాల వల్ల బిల్లు ట్రెజరీలో పెండింగ్ పడినా మే 2న ఏజెన్సీ ఖాతాలో జమ అయ్యింది. నాలుగు రోజులు గడిస్తే సరిగ్గా నాలుగు నెలలు అవుతుంది. ఇప్పటిదాకా 9,230 ట్రంకు పెట్టెలు సరఫరా చేసినట్లు ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. వీరి లెక్క ప్రకారమైనా ఇంకా 2,784 ట్రంకు పెట్టెలు సరఫరా చేయాల్సి ఉంది. 8వేల పెట్టెలు మాత్రమే సరఫరా చేశారనేది బీసీ సంక్షేమశాఖ అధికారుల లెక్క. అంటే.. ఇంకా 3,784 సరఫరా చేయాల్సి ఉంది. ఎవరి లెక్కలు వాస్తవమో వారికే తెలియాలి. టెండరు దక్కించుకున్న తర్వాత నెలలోపు సరఫరా చేయాల్సి ఉన్నా.. ఏడు నెలలవుతున్నా పూర్తిస్థాయిలో పెట్టెలు సరఫరా చేయకపోయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అర్థంకాని పరిస్థితి. బీసీ సంక్షేమశాఖ కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు ఈ వ్యవహరంలో కీలకంగా వ్యవహరించినట్లు చర్చ జరుగుతోంది. అన్నింటా ఇదే పరిస్థితి హాస్టళ్లకు ప్లేట్లు, గ్లాసులు, వంటపాత్రలు సరఫరా చేయడంలోనూ అధికారులు ఇదేరకంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. వస్తువులు సరఫరా చేయకముందే పునీత్ ఏజెన్సీకి రూ.73 లక్షల బిల్లు మంజూరుకు ఆమోదం తెలిపారు. ప్లేట్లు, గ్లాసులకు సంబంధించి రూ.13,81,610, వాటర్ డ్రమ్ములకు రూ.2,88,000, చార్జింగ్ లైట్లకు రూ.5,25000 చెల్లించారు. అలాగే వంటపాత్రల సరఫరాకు దాదాపు రూ.51 లక్షలు ముట్టజెప్పారు. ఈ బిల్లులను ఏకంగా జనవరి 10వ తేదీనే పెట్టారు. ట్రెజరీలో జాప్యం జరగడంతో వెనక్కు వచ్చాయి. తిరిగి 20 రోజుల కిందట ఈ మొత్తం బిల్లులు ట్రెజరీకి పంపించేశారు. ఏ క్షణమైనా ఏజెన్సీ ఖాతాలో జమ కావచ్చు. కానీ ఇప్పటిదాకా ఒక్క గ్లాసు కూడా సరఫరా చేయని పరిస్థితి. ఇంకా నెల పట్టొచ్చు హాస్టళ్లకు పూర్తిస్థాయిలో ట్రంకు పెట్టెలు సరఫరా చేసేందుకు ఇంకా నెల పట్టొచ్చు. ఇప్పటిదాకా 9,230 ట్రంకు పెట్టెలు సరఫరా చేశాం. ఇంకా 2,784 ఇవ్వాల్సి ఉంది. సచివాలయ పరీక్షల నిర్వహణకు వివిధ మెటీరియల్ అవసరమని జిల్లా అధికారులు చెప్పడంతో పెట్టెల తయారీని పక్కనపెట్టాం. – శతృసింగ్, పునీత్ ఏజెన్సీ నేను రాకముందే ఇచ్చేశారు ట్రంకు పెట్టెలకు సంబంధించిన బిల్లు నేను చార్జ్ తీసుకోకముందే ఇచ్చేశారు. పెట్టెలు సరఫరా చేయాలని ఏజెన్సీపై ఒత్తిడి తెస్తున్నాం. ఇప్పటిదాకా 8వేలు ఇచ్చారు. హాస్టళ్లకు ప్లేట్లు, గ్లాసులు, వంటపాత్రల సరఫరాకు సంబంధించిన బిల్లు ట్రెజరీకి పంపాం. ఇన్ ఆపరేషన్ అకౌంటులో ఉండేలా బ్యాంకు అధికారులతో మాట్లాడాం. వస్తువులు సరఫరా చేసిన తర్వాతే ఆ మొత్తం డ్రా చేసుకునేలా చూస్తాం. – యుగంధర్, బీసీ సంక్షేమ శాఖ డీడీ -
దాసరి ఆదిత్య హత్యకేసులో వీడిన మిస్టరీ
సాక్షి, అవనిగడ్డ : చల్లపల్లి బీసీ వసతి గృహంలో మూడో తరగతి విద్యార్థి దాసరి ఆదిత్య(8) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పదో తరగతి విద్యార్థే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు. సోమవారం ఆదిత్యతో జరిగిన గొడవ కారణంగా పథకం ప్రకారం చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. అతడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన పెన్సిల్ చెక్కే బ్లేడ్‌తో పాటు రక్తపు మరకలు ఉన్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిత్య తన మాట వినడం లేదనే కోపంతో నిందితుడు ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: మూడో తరగతి విద్యార్థి దారుణ హత్య ఈ సందర్భంగా పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదో తరగతి విద్యార్థి సోమవారం రాత్రి ఆదిత్యను బాత్రూమ్కు తోడు తీసుకు వెళ్లి అనంతరం బ్లేడ్‌తో గొంతు కోశాడు. గుంటూరు జిల్లాకు చెందిన నిందితుడు, ఆదిత్య కొన్నిరోజులు కలసి పడుకున్నారు. అయితే అతడి వికృత చేష్టలకు భయపడి ఆదిత్య అతడి దగ్గర పడుకోవడం మానేసినట్టు తెలిసింది. దీంతో కక్ష పెంచుకున్న నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇక నిందితుడితో పాటు హాస్టల్ వార్డెన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఇన్చార్జి వసతి గృహ అధికారి పీవీ నాగరాజు, వాచ్‌మన్ నాగబాబుని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సస్పెండ్ చేశారు. -
మూడో తరగతి విద్యార్థి దారుణ హత్య
చిన్నారిని చిదిమేశారు.. కర్కశంగా గొంతుకోసి చంపేశారు.. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తల్లికి గుండెకోతను మిగిల్చారు.. చల్లపల్లి బీసీ వసతి గృహంలో ఓ చిన్నారిని గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన దివిసీమలో సంచలనం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు మూడో తరగతి చదువుతున్న ఆదిత్య అనే విద్యార్థి గొంతు కోసి బాత్ రూమ్‌లో పడేశారు. రక్తపు మడుగులో పడిఉన్న ఆదిత్యను చూసి తల్లి తల్లడిల్లిపోయారు. అయితే బాలుడి తండ్రి వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తల్లి ఆరోపిస్తుండగా.. హాస్టల్లోని తోటి విద్యార్థులే హత్య చేసి ఉంటారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాక్షి, అవనిగడ్డ : బాలుడు దారుణ హత్యకు గురైన ఘటన బీసీ బాలుర వసతిగృహంలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. పోలీసులు అందించిన వివరాలు.. బాలుడు దాసరి ఆదిత్య(8) మూడో తరగతి చదువుకుంటూ హాస్టల్లో ఉంటున్నాడు. ఉదయానే డాబా పైకి వెళ్లిన తోటి విద్యార్థులు ఆదిత్య విగతజీవిగా పడి ఉండడంతో భయాందోళన చెంది, వెంటనే కాపలాదారుడు నాగబాబుకు చెప్పటంతో అధికారులకు సమాచారం అందించారు. పంచాయతీ పరిధిలోని చల్లపల్లి నారాయణరావు నగర్లో నివాసం ఉంటున్న దాసరి రవీంద్ర, ఆదిలక్ష్మి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు అశోక్, రెండో కుమారుడు ఆదిత్య(8) స్థానిక బీసీ వసతిగృహంలో ఉంటున్నారు. రవీంద్ర శుభకార్యాలకు మండపాలు డెకరేషన్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హాస్టల్లోకి వెళ్లింది సోమవారమే.. ఆదివారం ఇంటికి వచ్చిన ఆదిత్యకు తల్లి కొత్తబట్టలు కొనిచ్చి సోమవారం ఉదయం హాస్టల్‌కు తీసుకెళ్లింది. సోమవారం అర్ధరాత్రి పైఅంతస్తులో ఉన్న మరుగుదొడ్డిలో హత్యకు గురయ్యాడు. నిద్రలేపి చంపేశారా? ఆదిత్య హత్య ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. తొలుత ఆదిత్య అన్నయ్య అశోక్‌ని సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి నిద్రలేపి మూత్ర విసర్జనకు వెళ్లమని చెప్పాడు. నిద్రలో ఉన్న అశోక్ రావడం లేదని చెప్పి ప్రార్థన చేసి నిద్రపోయాడు. అనంతరం అదే వ్యక్తి ఆదిత్యను నిద్రలేపి వసతిగృహంపై అంతస్తులో ఉన్న బాత్రూంల వద్దకు తీసుకెళ్లి మెడకోసి హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. మెట్ల కింద రక్తపు మరకలు.. బీసీ వసతి గృహంలోని పై అంతస్తు బాత్రూంలో దాసరి ఆదిత్య హత్యకు గురి కాగా గ్రౌండ్‌ఫ్లోర్ మెట్లు కింద రక్తపు మరకలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారం లేకుండా నిందితుడు జాగ్రత్త పడ్డాడు. వసతిగృహంలో గ్రౌండ్ ఫ్లోర్లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ, అర్ధరాత్రి పై అంతస్తులోని మరుగుదొడ్లుకు ఆదిత్య ఎందుకు వెళ్లాడనే ప్రశ్న తలెత్తుతోంది. తండ్రి సంబంధాలపై అనుమానాలు.. మృతుడి తండ్రి రవీంద్రకు వేరొక మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆమె భర్త ఈ హత్యకు పాల్పడి ఉంటాడని మృతుడి తల్లి ఆదిలక్ష్మి ఆరోపించింది. ఈ విషయమై గతంలో రెండు కుటుంబాల మధ్య పలుమార్లు వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. పెద్దలు రాజీ కుదర్చడం జరిగింది. ఏఎస్పీ సత్తిబాబు విచారణ తొలుత డీఎస్పీ ఎం.రమేష్‌రెడ్డి, సీఐ ఎం.వెంకటనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఏఎస్పీ మోకా సత్తిబాబు çహత్య తీరును పరిశీలించారు. వసతిగృహంలో ఉన్న విద్యార్థులు, వాచ్మెన్, ఇన్చార్జి వార్డెన్ని ప్రశ్నించి వివరాలు రాబట్టారు. డాగ్‌స్క్యాడ్, క్లూస్‌టీంలు రంగంలో దిగి ఆధారాలు సేకరించాయి. బీసీ సంక్షేమశాఖ డీడీ ఐ.రమాభార్గవి బీసీ వసతిగృహానికి వివరాలు తెలుసుకున్నారు. ఆర్డీ ఓ పరిశీలన.. బాలుడి దారుణ హత్య విషయం తెలుసుకున్న మచిలీపట్నం ఆర్డీఓ జె.ఉదయభాస్కర్, తహసీల్దార్ కె.స్వర్ణమేరి హాస్టల్ వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. సిబ్బందిని ఆరా తీశారు. శవ పంచనామా అనంతరం పోలీసులు బాలుడి తండ్రి రవీంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ తరలించారు. నిందుతుడిని అరెస్ట్ చేయాలని ఆందోళన బాలుడిని కిరాతంగా హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసే వరకు మృతదేహానికి పోస్టుమార్టం చేయనివ్వమని మృతుడి బంధువులు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా ఉన్న వార్డెన్, వాచ్మన్ని సస్పెండ్ చేయాలని, మృతుడి కుటుంబానికి పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులతో ఏఎస్పీ సత్తిబాబు మాట్లాడుతూ వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని, మృతుడి కుటుంబానికి అన్ని విధాలా సాయపడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం ఆదిత్య మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విద్యార్థే ఈ ఘాతుకానికి పాల్పడ్డడా! దాసరి ఆదిత్య హత్య కేసులో పోలీసుల విచారణ భిన్న కోణాల్లో సాగుతోంది. హాస్టల్లో ఉంటున్న ఒక విద్యార్థే ఈ ఘాతుకానికి పాల్పడ్డడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పదునైన ఆయుధంతో మెడకోసి హత్య చేసినట్టు పోస్టుమార్టంలో తేలడంతో ధర్మాకోల్ కట్టర్(చిన్న పోల్టు చాకు)తో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ పదోతరగతి విద్యార్థ్ధి కొన్నిరోజులు కలసి పడుకున్నారు. ఆ విద్యార్థి వికృత చేష్టలకు భయపడి అతని దగ్గర పడుకోవడం మానేసినట్టు తెలిసింది. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న ఈ విద్యార్ధి తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. వార్డెన్, వాచ్‌మన్ సస్పెన్షన్జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అవనిగడ్డ: చల్లపల్లి బీసీ వసతి గృహంలో మూడో తరగతి విద్యార్థి దాసలి ఆదిత్య(8) హత్యకు గురైన నేపథ్యంలో ఇన్చార్జి వసతి గృహ అధికారి పీవీ నాగరాజు, వాచ్‌మన్ నాగబాబుని సస్పెండ్ చేసినట్టు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దుర్ఘటనపై విచారణ జరుగుతుందని, ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. -
కత్తి దూసిన ‘కిరాతకం’
అవనిగడ్డ/చల్లపల్లి: మూడో తరగతి చదువుతున్న బాలుడిని అత్యంత పాశవికంగా మెడకోసి హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చల్లపల్లి నారాయణరావు నగర్లో నివాసం ఉంటున్న దాసరి రవీంద్ర కుమారుడు దాసరి ఆదిత్య (8) బీసీ వసతి గృహంలో మూడో తరగతి చదువుతున్నాడు. ఇతని సోదరుడు ఇదే వసతి గృహంలో ఏడో తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి మూత్ర విసర్జనకు బయటకు వెళ్లిన ఆదిత్య వసతి గృహం పై అంతస్తులో ఉన్న మరుగుదొడ్డిలో దారుణ హత్యకు గురయ్యాడు. తెల్లవారుజామున ఐదు గంటలకు బక్కెట్ కోసం పైకి వెళ్లిన విద్యార్థి వాకలయ్య రక్తపు మడుగులో పడిఉన్న ఆదిత్యను చూసి వెంటనే కిందకు వచ్చి వాచ్మెన్ నాగరాజుతో చెప్పాడు. పైకి వెళ్ళిన వాచ్మెన్ ఆదిత్య పడిపోయి ఉంటాడని భావించి వైద్యశాలకు తీసుకెళ్ళేందుకు పైకిలేపగా, మెడ సగభాగం తెగి ఉండటం, అప్పటికే విగత జీవిగా ఉండటంతో ఆదిత్య మృత దేహాన్ని గోడకు కూర్చోబెట్టి ఇన్చార్జి వార్డెన్‌కు సమాచారం ఇచ్చాడు. ఏఎస్పీ ఎం.సత్తిబాబు, డీఎస్పీ ఎం.రమేష్‌రెడ్డి హత్యాస్థలిని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌ని రప్పించగా బాత్రూం నుంచి వెనకున్న ప్రహరీ గోడ వరకు వెళ్లి వెనక్కి వచ్చింది. హతుని తండ్రికి, పిన్నికి మధ్య ఉన్న అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య జరిగిందని అనుమానిస్తున్నారు. కాగా, ఆదిత్యను వసతి గృహ విద్యార్థే హతమార్చినట్లు సమాచారం. మృతుని కుటుంబ సభ్యుల ఆందోళన బాలుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన వారిని అరెస్ట్ చేసే వరకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తీసుకెళ్లనీయబోమని మృతుని బంధువులు వసతి గృహం గేటు వద్ద ఆందోళనకు దిగారు. ఏఎస్పీ సత్తిబాబు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
‘ఆదిత్యను దారుణంగా హత్య చేశారు’
సాక్షి, కృష్ణా : చల్లపల్లి బీసీ హాస్టల్లో అనుమానాస్పదంగా మృతి చెందిన దాసరి ఆదిత్యది(8) హత్యేనని అడిషినల్ ఎస్పీ మోకా సత్తిబాబు అన్నారు. రాత్రి రెండు గంటల తర్వాత ఈ హత్య జరిగిందని వెల్లడించారు. సంఘటన స్థలంలో ఎలాంటి ఆయుధాలు లభించలేదన్నారు. హత్య జరిగిన రోజు రాత్రి హాస్టల్ వాచ్మెన్ డ్యూటీలో లేడని, సంఘటన స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదని అడిషినల్ ఎస్పీ వెల్లడించారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టినా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఈ కేసు విచారణ కోసం 4 బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయని అడిషినల్ ఎస్పీ సత్తిబాబు పేర్కొన్నారు. (చదవండి : హాస్టల్లో అమానుషం ; బాత్రూంలో మృతదేహం) హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం మూడోతరగతి విద్యార్థి ఆదిత్య మృతిపై బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ డిప్యూటీ డైరెక్టర్ రమాభార్గవి స్పందించారు. హాస్టల్ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని వ్యాఖ్యానించారు. హత్య జరిగిన రాత్రి హాస్టల్లో వాచ్మెన్, వార్డెన్ లేరన్నారు. బయట వ్యక్తులు లోపలికి రావడం వల్లే ఈ హత్య జరుగొచ్చనే అనుమానం తనకు ఉందన్నారు. హాస్టల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పోలీసులు విచారణలో నిందితులెవరో తెలుస్తుందని రమా భార్గవి అన్నారు. మరిది, వాచ్మెన్పై అనుమానం వాచ్‌మెన్‌తో కలిసి తన మరిదే తన కొడుకును హత్య చేశారని ఆదిత్య తల్లి ఆదిలక్ష్మీ ఆరోపించారు. వారిద్దరిపైనే తమకు అనుమానం ఉందన్నారు. తన బిడ్డకు జరినట్లు ఏ బిడ్డకు జరుగొదంటూ కన్నీరుమున్నీరయ్యారు. తమ బిడ్డ చావుకు కారణమైన వారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. -
హాస్టల్లో అమానుషం ; బాత్రూంలో మృతదేహం
సాక్షి, కృష్టా : జిల్లాలోని చల్లపల్లి బీసీ హాస్టల్లో దారుణం జరిగింది. మూడో తరగతి విద్యార్థి ఆదిత్య అనుమానాస్పదంగా మృతి చెందారు. బాత్రూంలో రక్తపు మడుగులో ఆదిత్య మృతదేహం పడిఉంది. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చర్లపల్లి నారాయణనగర్‌కు చెందిన ఆదిత్య అన్న కూడా ఇదే హాస్టల్లో ఉంటున్నాడు. రోజు అన్న పక్కనే పడుకునే ఆదిత్య సోమవారం రాత్రి అతని గదికి రాలేదు. దీంతో పక్క గదిలో ఉండోచ్చన ఆదిత్య అన్న భావించారు. మంగళవారం ఉదయం చూసే సరికి ఆదిత్య బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హాస్టల్‌కు చేరుకొని కన్నీరుమున్నీరవుతున్నారు. గొంతు కింద కోసి ఉండడంతో ఆదిత్యను ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హాస్టల్ వార్డెన్‌తో పాటు తోటి విద్యార్థులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. -
పీలేరు బీసీ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు
-
అబిడ్స్ బీసీ హాస్టల్: నాన్ బోర్డర్స్ ధర్నా
-
బీసీ హాస్టల్లో జూనియర్లపై సీనియర్ల దాడి
నిజామాబాద్ : తమ బట్టలు ఉతకాలంటూ సెకండియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులపై దాడి చేసిన సంఘటన నిజామాబాద్ బీసీ హాస్టల్లో చోటుచేసుకుంది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేక నిజామాబాద్ 3వ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సీనియర్ల వేధింపులు ఎక్కువై ఐదుగురు విద్యార్థులు కూడా హాస్టల్ వదిలి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. బీసీ హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వల్లనే సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. -
బీసీ హాస్టల్లో సిబ్బంది మందు..విందు
విద్యారణ్యపురి : హన్మకొండ బాలసముద్రంలోని బీసీ హాస్టల్లో ఆదివారం ముగ్గురు సిబ్బంది విందు పార్టీ చేసుకున్నారు. మందుతాగుతూ, మాంసాహారాన్ని ఆరగించారు. ఆ సమయంలోనే ఎస్ఎఫ్ఐ బాధ్యులు అక్కడికి వెళ్లారు. ప్రభుత్వ బీసీ హాస్టల్లో విద్యార్థులు ఉన్నారని, మీరు హాస్టల్లో మందు తాగడం సరికాదని సిబ్బందితో వారు అన్నారు. మా ఇష్టం అంటూ సిబ్బంది ఎస్ఎఫ్ఐ నాయకులతో వాగ్వాదం చేశారు. ఆ సమయంలో హాస్టల్ వార్డెన్ విధుల్లో లేరు. హాస్టల్ వాచ్‌మన్ తిరుపతితో సహా మరో ఇద్దరు చంద్రయ్య, కొమురయ్య మందు తాగుతుండగా ఇదేమిటని ప్రశ్నిస్తే మా ఇష్టం అంటూ దురుసుగా మాట్లాడారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాషబోయిన సంతోష్ ఆరోపించారు. బీసీ హాస్టల్లో విద్యార్థులను గాలికి వదిలేసి సిబ్బంది పట్టపగలే విందు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సంబంధిత హాస్టల్ వార్డెన్, ఆముగ్గురిని కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ హాస్టల్ ఎదుట పెద్ద ఎత్తున విద్యార్థులతో ధర్నా చేశారు. హాస్టల్ వార్డెన్‌కు, సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన హాస్టల్లో ఇలా సిబ్బంది మద్యం మత్తులో తూగారని ఆరోపించారు. వర్కర్లు తిరుపతిని, చంద్రయ్య, కొమురయ్య తాగుతున్న మందు బాటిల్‌ను కూడా ఎస్ఎఫ్ఐ నేతలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎస్ఎఫ్ఐ బాధ్యులు తెలిపా రు. ధర్నా కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అర్బన్ జిల్లా బాధ్యులు ఎం.రాజేష్, టి.రఘు పాల్గొన్నారు. -
సమస్యల వలయంలో బీసీ హాస్టల్
గుండాయపాలెం (ఒంగోలురూరల్): మండలంలోని ఏకైక బాలుర వసతి గృహం సమస్యల వలయంలో చిక్కుకుని విలవిల్లాడుతుంది. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విద్యార్థుల వసతి గృహం అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోయింది. గత ఏడాది నీరు–చెట్టు కార్యక్రమంలో భాగంగా చెరువులో మట్టి హాస్టల్ ముందు ఉన్న ఆట స్థలంలో మూడు వంతుల భాగం వరకు మెరక చేశారు. పనులు చివరి దశలో ఉండగా అప్పటి బీసీ కార్పొరేషన్ డీడీ మయూరి సర్పంచ్ వెంకటేశ్వరమ్మకు హాస్టల్ అభివృద్ధి పనులు చేపట్టవద్దనీ, హాస్టల్లో ప్రవేశించవద్దనీ లేఖ రాశారు. దీంతో పనులు హాస్టల్ పనులు ఆగిపోయాయి. అనంతరం హాస్టల్‌ను సందర్శించిన బీసీ కార్పొరేషన్ డీడీ లక్ష్మిసుధ హాస్టల్ పరిస్థితులపై ఆరా తీశారు. దీనిపై స్పందించిన సర్పంచ్ హాస్టల్ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న పరిస్థితులు డీడీకి వివరించారు. దీనిపై స్పందించిన డీడీ లక్ష్మిసుధ స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి హాస్టల్‌కు నిధులు మంజూరుచేయిస్తామని అప్పట్లో వారికి హామీ ఇచ్చారు. కానీ నేటికి హాస్టల్లో నిర్మాణ పనులు కార్యరూపం దాల్చలేదు. పాములకు ఆవాసాలు హాస్టల్లో చిల్లచెట్లు పెరిగి పోవడంతో పాములకు, పురుగులకు ఆవాసంగా మారింది. సాయంత్రం 5 గంటలు దాటితే విద్యార్థులు బయటకు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. పాఠశాల ఆవరణలో మేక పోతును వధించడం, మద్యం సేవించి కోళ్లను విచ్చలవిడిగా కోయడంపై విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. దీనిపై గ్రామస్తులు లిఖిత పూర్వకంగా అధికారులకు అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
బీసీ హాస్టల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
పెద్దపల్లిరూరల్: రంగంపల్లిలోని వెనకబడిన తరగతుల వసతి గృహాన్ని కలెక్టర్ అలగు వర్షిణి మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. వసతిగృహ ఆవరణంతా కలియతిరిగిన కలెక్టర్ సౌకర్యాల కల్పనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంట గదిలోకి వెళ్లిన కలెక్టర్ విద్యార్థులకు వండిపెడుతున్న అన్నం, కూరలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా అని విద్యార్థులను ఆరా తీశారు. మరుగుదొడ్లను పరిశీలించడంతోపాటు నీటి సరఫరా, కరెంటు, గదులలో ఫ్యాన్ సౌకర్యాల ఏర్పాట్లను చూసిన కలెక్టర్ వసతుల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ హాస్టల్ విద్యార్థులకు చలి నుంచి రక్షణగా ఉండేందుకు గాయత్రీ విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ అందించిన రగ్గులనుమ కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. -
మళ్లీ పాత కథే..?
► బీసీ హాస్టళ్లలో బయోమెట్రిక్ ఫెరుుల్ ►మళ్లీ వినిపించనున్న ఎస్సార్, ప్రెజెంట్ సార్ పదాలు ► యంత్రాలు పని చేయడం లేదా.. ఉద్దేశపూర్వకంగానా..? సిమ్‌లు రాలేదు.. 9హాస్టల్స్‌లో బయెమెట్రిక్ విధానాన్ని ఆన్‌లైన్‌కు అనుసంధానం చేసేందుకు ట్యాబ్‌లు ఇచ్చారు. కానీ ఆ ట్యాబ్‌ల్లో వేసేందుకు సిమ్ కార్డులు రాలేదు. అలాగే వీటి కోసం మూడు నెట్‌వర్క్‌ల సిమ్ కార్డులు ఇచ్చారు. ఇందులో ఎరుుర్ టెల్ సిగ్నల్స్ ఉన్న ప్రాంతాలే ఎక్కువగా ఉన్నారుు. కానీ వచ్చిన సిమ్‌లు మాత్రం ఐడియా, బీఎస్ఎన్ఎల్ కావడంతో ట్యాబ్‌ల్లో వేయలేదు. జిల్లాలోని 4 డివిజన్లలో ఒక్కో హాస్టల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలించాల్సి ఉండగా అలా జరగలేదు. విజయనగరం కంటోన్మెంట్ : సంక్షమే హాస్టళ్లలో బయోమెట్రిక్‌ను అమలు చేసి తద్వారా అక్రమాలకు చెక్ పెట్టాలన్న ఉన్నతాధికారుల ఆశయం నెరవేర లేదు. ఈ విధానాన్ని అమలు చేయాలని ఉన్నతాధికారులు హాస్టళ్లకు ఆదేశాలిచ్చినప్పటికి ఆచరణకు మాత్రం అరుుష్టత వహిస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నారుు. 2 నెలల క్రితం జిల్లాకు 97 బయోమెట్రిక్ డివైస్‌లు రాగా వాటిలో 38 మెషీన్లు పనిచేయడం లేదు. మిగతా మెషీన్లకు సిమ్‌కార్డులు ఇవ్వలేదు. జిల్లాలో 88 బీసీ హాస్టల్స్ ఉండగా వీటిలో 28 కాలేజ్ విద్యార్థులవి. మిగిలిన 60 స్కూల్ విద్యార్థులవి. ఈ హాస్టళ్లలో హాజరును తప్పుగా చూపిస్తున్నారనే అనుమానాలు కలగడంతో పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని అధికారులు తలచారు. దీనిలో భాగంగా కార్వే సంస్థ ద్వారా జిల్లాకు బయోమెట్రిక్ పరికరాల్ని పంపిణీ చేశారు. సెప్టెంబర్ నాటికి జిల్లా వ్యాప్తంగా అమలు కావాల్సి ఉండగా ఎందుకో అమల్లోకి రాలేదు. రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా.. జిల్లాలోని 60 బీసీ బాలుర హాస్టల్స్‌కు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడంతో పాటు జిల్లాలోని 2 రెసిడెన్షియల్ స్కూళ్లకూ ఒకేసారి ఈ బయోమెట్రిక్ డివైస్‌లు అమర్చాలని నిర్ణరుుంచారు. చీపురుపల్లి, కోరపు కొత్తవలసల్లో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలకు ఈ పరికరాలు పంపిణీ చేశారు. కానీ అక్కడ కూడా నేటికి ఈ విధానం అమలు చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ మెషీన్లు, పరికరాలు వచ్చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నారుు. అన్ని కార్యాలయాలు, సంస్థల్లోనూ బయోమెట్రిక్ విధానం సక్రమంగా పనిచేస్తుంటే ఇక్కడే ఎందుకు పని చేయడం లేదన్న విమర్శలూ ఉన్నారుు. జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తాం. కార్వే సంస్థ ప్రతినిధులు ఇదిగో అదిగో అంటున్నారు. త్వరలోనే వారితో సమావేశం ఏర్పాటు చేసి డెమో నిర్వహిస్తాం. అనంతరం వాటిని ఆయా వసతి గృహాలకు తరలించి సక్రమంగా పనిచేసేటట్లు చర్యలు తీసుకుంటాం.- సీహెచ్. హరిప్రసాద్, డీబీసీడబ్లూ ్యఓ, విజయనగరం. -
విద్యార్థి గల్లంతైనా పట్టించుకోరా?
► అధికారుల తీరుకు నిరసనగా జమాదులపాలెం గ్రామస్తుల ఆందోళన ►ఎట్టకేలకు గాలింపు చర్యలు... మృతదేహం లభ్యం ►బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వినతి అనకాపల్లి రూరల్ : కశింకోట మండలం జమాదులపాలెం గ్రామానికి చెందిన ఒమ్మి శ్రీను అనే విద్యార్థి శారదానదిలో గల్లంతైన విషయం తెలిసినా అధికారులు వెంటనే స్పందించలేదని ఆగ్రహిస్తూ ఆ గ్రామస్తులు సోమవారం తుమ్మపాల ఏలేరు కాలువ వద్ద అనకాపల్లి - చోడవరం రహదారిపై బైటాయించారు. కశింకోట ఎంపీటీసీ కరక సోమునాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో ఆయన మాట్లాడుతూ గాంధీనగరం బీసీ వసతిగృహంలో 9వ తరగతి చదువుతున్న ఒమ్మి శ్రీను (14)ఆదివారం సెలవు కావడంతో స్నానం చేసేందుకు ఏలే రు కాలువలో దిగి గల్లంతయ్యాడన్నారు. ఈ సంఘటన జరిగి 24 గంటలు దాటినా పోలీసులు స్పందించకపోవడం దారుణమన్నారు. హాస్టల్ వార్డెన్‌కు సమాచారం తెలిసినా కనీసం బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదని ఆరోపించారు. రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినా సమయానికి ఎవరూ రాలేదన్నారు. వస తి గృహంలో సరైన పర్యవేక్షణ లేకే వి ద్యార్థి మరణించాడని, బాధిత విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాతో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో తహశీల్దార్ కృష్ణమూర్తి, ఎస్ఐ రామారావు, క్రైం ఎస్ఐ వెంకటేశ్వరరావు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఈ ఆందోళనలో మాజీ ఎంపీటీసీ కరక రాజు, కరక బాబూరావు, సంపతిపురం సర్పంచ్ నంబారు శ్రీను, రమణ, పల్లా శ్రీను, పంచదార్ల సూరిబాబు, మొల్లి వెంకటరమణ పాల్గొన్నారు. మృతదేహం లభ్యం: ఆందోళన నేపథ్యం లో అధికారుల్లో చలనం వచ్చింది. జాలర్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. ఆర్డీవో పద్మావతితోపా టు పోలీసులు వచ్చి పరిశీలించారు. గ్రామ స్తులతో మాట్లాడి మృతదేమాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించారు. ఒకే ఒక్క కుమారుడు విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి తల్లి అప్పలనర్స కుప్పకూలిపోరుుంది. ఆరు నెలల క్రితం భర్త, ఇప్పుడు కొడుకు మృతి చెందడంతో ఆమె ఒంటరైంది. జమాదులపాలెం గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు. అధికారులు ఆమెకు ఎంతోకొంత న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. -
23న బాలికల గురుకుల డిగ్రీ కాలేజీలో కౌన్సెలింగ్
నయీంనగర్ : మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో 2016–17 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈనెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని జిల్లా సమన్వయ అధికారి ఎస్.రూపాదేవి, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల వైస్ ప్రిన్సిపాల్ జి.శంకర్నాథ్ తెలిపారు. ఆన్లైన్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకున్న విద్యార్థినులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. -
బీసీహాస్టల్ మూసివేత: విద్యార్థుల రాస్తారోకో
యాడికి: అనంతపురం జిల్లా యాడికిలో బీసీ హాస్టల్ మూసివేతను నిరసిస్తూ సీపీఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకోకు దిగారు. టీడీపీ ప్రభుత్వం ఇటీవల 100లోపు విద్యార్థులున్న బీసీ హాస్టళ్లను మూసివేయాలని జారీ చేసింది. యాడికి బీసీ హాస్టల్లో 71 మంది మాత్రమే ఉండటంతో అధికారులు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి నిరసనగా విద్యార్థులు రాస్తారోకోకు దిగడంతో కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. -
బీసీ హాస్టల్‌పై ఏసీబీ దాడులు
కుబీర్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌పై మంగళవారం ఏసీబీ దాడులు నిర్వహించింది. ఏసీబీ డీఎస్పీ పాపాలల్ ఆధ్వర్యంలోఈ దాడులు జరిగాయి. హాస్టల్ నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని ముందస్తు సమాచారం రావడంతో ఈ దాడులను నిర్వహిస్తున్నామని డీఎస్పీ అన్నారు. హాస్టల్ హాజరుపట్టికలో 71 మంది విద్యార్థులు ఉన్నట్లు చూపగా..దాడుల సమయంలో కేవలం 11 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని వారు గుర్తించారు. -
విద్యార్థి అనుమానాస్పద మృతి
బీసీ హాస్టల్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి-సిరిపురం బీపీ వసతిగృహంలో బుధవారం వెలుగుచూసింది. హాస్టల్లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్న హరికృష్ణ(14) మంగళవారం రాత్రి స్నేహితులతో కలిసి పాఠశాల తరగతి గదిలో పడుకున్నాడు. బుధవారం నిద్రలేచిన తొటి విద్యార్థులు హరికృష్ణను లేపడానికి ప్రయత్నించగా.. ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉన్నాడు. దీంతో విద్యార్థులు హాస్టల్ వార్డెన్‌తో పాటు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. వసతిగృహం శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు ప్రహరిగోడ లేకపోవడంతో.. విష సర్పాలు సంచరిస్తుంటాయని స్థానికులు అంటున్నారు. -
బీసీ హాస్టల్లో ఏసీబీ సోదాలు
అనంతపురం జిల్లా తలుపుల మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంపై ఏసీబీ దాడి చేసింది. మంగళవారం ఉదయం హాస్టల్‌కు చేరుకున్న అధికారులు రికార్డులను పరిశీలించారు. ఈ వసతి గృహం సంక్షేమాధికారి చెన్నయ్యపై అవినీతి ఆరోపణలు రావటంతో సోదాలు జరుపుతున్నట్లు ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి తెలిపారు. -
వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం
అనంతపురం(హిందూపురం): తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక ఓ విద్యార్థి ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. చిలమత్తూరు మండల కేంద్రంలోని బీసీ హాస్టల్లో రమేశ్(12) ఉంటున్నాడు. అయితే, తోటి విద్యార్థులు వేధిస్తున్నారని మనస్తాపానికి గురై ఎలుకల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. దీంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థిని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.