సాక్షి, రంగారెడ్డి : పాలమాకుల జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. హాస్టల్‌లో మొత్తం 45 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కరోనా పాజిటివ్ విద్యార్థులను ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సదరు హాస్టల్‌లో మొత్తం 1000మంది విద్యార్ధులు ఉన్నారు. కరోనా భయంతో పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు.
నిర్మల్ జిల్లాలోని ముథోల్ గిరిజన బాలికల గురుకులంలోనూ కరోనా కేసులు బయటపడ్డాయి. 121 మంది విద్యార్థినిలకు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా పదిహేను మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న ఇదే పాఠశాలలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఇరవై నాలుగు కేసులు నమోదు కావటంతో విద్యార్థినుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.
చదవండి : మాస్కులతో మంచీ చెడులు తెలుసుకోండి!
Comments
Please login to add a commentAdd a comment