విందు చేసుకుంటున్న సిబ్బంది
విద్యారణ్యపురి : హన్మకొండ బాలసముద్రంలోని బీసీ హాస్టల్‌లో ఆదివారం ముగ్గురు సిబ్బంది విందు పార్టీ చేసుకున్నారు. మందుతాగుతూ, మాంసాహారాన్ని ఆరగించారు. ఆ సమయంలోనే ఎస్‌ఎఫ్‌ఐ బాధ్యులు అక్కడికి వెళ్లారు. ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో విద్యార్థులు ఉన్నారని, మీరు హాస్టల్‌లో మందు తాగడం సరికాదని సిబ్బందితో వారు అన్నారు. మా ఇష్టం అంటూ సిబ్బంది ఎస్‌ఎఫ్‌ఐ నాయకులతో వాగ్వాదం చేశారు.
ఆ సమయంలో హాస్టల్ వార్డెన్ విధుల్లో లేరు. హాస్టల్ వాచ్‌మన్ తిరుపతితో సహా మరో ఇద్దరు చంద్రయ్య, కొమురయ్య మందు తాగుతుండగా ఇదేమిటని ప్రశ్నిస్తే మా ఇష్టం అంటూ దురుసుగా మాట్లాడారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాషబోయిన సంతోష్ ఆరోపించారు. బీసీ హాస్టల్‌లో విద్యార్థులను గాలికి వదిలేసి సిబ్బంది పట్టపగలే విందు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
సంబంధిత హాస్టల్ వార్డెన్, ఆముగ్గురిని కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ హాస్టల్ ఎదుట పెద్ద ఎత్తున విద్యార్థులతో ధర్నా చేశారు. హాస్టల్ వార్డెన్‌కు, సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన హాస్టల్‌లో ఇలా సిబ్బంది మద్యం మత్తులో తూగారని ఆరోపించారు. వర్కర్లు తిరుపతిని, చంద్రయ్య, కొమురయ్య తాగుతున్న మందు బాటిల్‌ను కూడా ఎస్‌ఎఫ్‌ఐ నేతలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎస్‌ఎఫ్‌ఐ బాధ్యులు తెలిపా రు. ధర్నా కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ అర్బన్ జిల్లా బాధ్యులు ఎం.రాజేష్, టి.రఘు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment