ప్రతీకాత్మక చిత్రం
రోమ్ : పురుషులు తగిన మోతాదులో మద్యం తీసుకోవటం వల్ల వీర్యోత్పత్తి మెరుగ్గా ఉంటుందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. వీర్యోత్పత్తి, వీర్యకణాల సంఖ్యను మద్యం ప్రోత్సహిస్తుందని తేలింది. 323మంది రోగులపై జరిపిన ఈ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. మద్యం తాగని వారిలో కంటే.. వారానికి 4-7యూనిట్ల మద్యం తీసుకున్న వారిలో వీర్యోత్పత్తి బాగా ఉన్నట్లు గుర్తించారు. ఇటలీకి చెందిన పోలీక్లినికో ఆస్పత్రి వైద్యుడు ‘‘ఎలెనా రిచి’’ మాట్లాడుతూ.. చిన్న చిన్న మోతాదుల్లో మద్యం సేవించేవారిలో వీర్యోత్పత్తి చక్కగా ఉంటుందన్నారు. అతిగా మద్యం సేవించటం వల్ల అది విషంగా మారుతుందన్నారు. మద్యం ఎక్కువగా సేవించే మగవారిలో వీర్యోత్పత్తి క్షీణించటమే కాకుండా వ్యంధత్వం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment