కుబీర్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌పై మంగళవారం ఏసీబీ దాడులు నిర్వహించింది.
కుబీర్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌పై మంగళవారం ఏసీబీ దాడులు నిర్వహించింది. ఏసీబీ డీఎస్పీ పాపాలల్ ఆధ్వర్యంలోఈ దాడులు జరిగాయి. హాస్టల్ నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని ముందస్తు సమాచారం రావడంతో ఈ దాడులను నిర్వహిస్తున్నామని డీఎస్పీ అన్నారు. హాస్టల్ హాజరుపట్టికలో 71 మంది విద్యార్థులు ఉన్నట్లు చూపగా..దాడుల సమయంలో కేవలం 11 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని వారు గుర్తించారు.