బీసీ హాస్టల్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి-సిరిపురం బీపీ వసతిగృహంలో బుధవారం వెలుగుచూసింది.
బీసీ హాస్టల్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి-సిరిపురం బీపీ వసతిగృహంలో బుధవారం వెలుగుచూసింది. హాస్టల్‌లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్న హరికృష్ణ(14) మంగళవారం రాత్రి స్నేహితులతో కలిసి పాఠశాల తరగతి గదిలో పడుకున్నాడు.
బుధవారం నిద్రలేచిన తొటి విద్యార్థులు హరికృష్ణను లేపడానికి ప్రయత్నించగా.. ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉన్నాడు. దీంతో విద్యార్థులు హాస్టల్ వార్డెన్‌తో పాటు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. వసతిగృహం శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు ప్రహరిగోడ లేకపోవడంతో.. విష సర్పాలు సంచరిస్తుంటాయని స్థానికులు అంటున్నారు.