ఇద్దరు హాస్టల్ విద్యార్థినులు అదృశ్యం | BC hostel student goes missing in kothagudem | Sakshi
Sakshi News home page

ఇద్దరు హాస్టల్ విద్యార్థినులు అదృశ్యం

Published Fri, Jan 24 2014 12:56 PM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM

BC hostel student goes missing in kothagudem

కొత్తగూడెం : ఖమ్మం జిల్లా కొత్తగూడెం బీసీ హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. వీరిద్దరు తప్పిపోయారా..లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్నది మిస్టరీగా మారింది. ఏడవ తరగతి చదువుతున్న అనిత, త్రివేణి  సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లారు.

సెలవుల అనంతరం హాస్టల్‌కి తిరిగి రాకపోవడంతో వార్డెన్ ...విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. ఒక్కసారిగా షాక్‌కి గురైన తల్లిదండ్రులు తమ పిల్లలు హాస్టల్‌కే వచ్చారని చెప్పారు. వెంటనే కొత్తగూడెం వచ్చిన తల్లిదండ్రులు పిల్లల జాడ కోసం వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement