రేపు సీనియర్స్ కబడ్డీ జట్ల ఎంపిక
Published Fri, Sep 9 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
కాకినాడ సిటీ:
సామర్లకోటలోని బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్‌లో ఈ నెల 11న జిల్లా సీనియర్స్ స్త్రీ, పురుషుల కబడ్డీ జట్లను ఎంపిక చేయనున్నట్టు జిల్లా కబడ్డీ సంఘ కార్యదర్శి ఎం.శ్రీనివాసకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారుల్లో పురుషుల బరువు 80 కేజీల లోపు, స్త్రీల బరువు 70 కేజీల లోపు ఉండాలన్నారు. ఎంపికైన క్రీడాకారులు 64వ రాష్ట్ర సీనియర్స్ స్త్రీ, పురుషుల కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలలో జిల్లా తరఫున పాల్గొంటారన్నారు. ఆసక్తిగల క్రీడాకారులుటి.వైకుంఠం (పీఈటీ, సామర్లకోట)ను 99590 27375 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
Advertisement
Advertisement