clear
-
CM YS Jagan: సీఎం జగన్ స్పష్టమైన సంకేతం.. ఇక తగ్గేదేలే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత పట్టుదలతో ఉంటారో మరోసారి రుజువైంది. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం అయిన విశాఖపట్నాన్ని రాజధానిగా ఎంపిక చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేయవచ్చన్న భావనతో ఉన్న జగన్ ఆ దిశగా ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చేశారు. విశాఖపట్నమే ఏపీ రాజధాని అని ఆయన డిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ సన్నాహక సదస్సులో పేర్కొన్నారు. రాబోయే నెలల్లో విశాఖ రాజధాని అవుతుందని, తాను విశాఖకు మారి అక్కడ నుంచే పాలన చేస్తానని ఆయన వెల్లడించారు. బహుశా ఈ మధ్యకాలంలో ఇంత క్లారిటీతో ఈ విషయాన్ని చెప్పడం ఇదే మొదటిసారి కావచ్చు. మూడేళ్ల క్రితం మూడు రాజధానుల అంశం ప్రకటించి సంచలనం సృష్టించిన జగన్ వివిధ కారణాలతో వెంటనే దానిని అమలు చేయలేకపోయారు. తెలుగుదేశం, జనసేన వంటి పక్షాలు ఇందుకు అడ్డపడడం, హైకోర్టుకు వెళ్లి మూడు రాజధానుల నిర్ణయానికి ఆటంకాలు సృష్టించడంతో, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్పటికి మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకోవడం జరిగాయి. కాని అప్పుడే మళ్లీ కొత్త బిల్లును మరింత ప్రయోజనకరంగా, మూడు ప్రాంతాలకు ఉపయోగపడేలా తీసుకువస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం అమరావతి పేరుతో విజయవాడ, గుంటూరు ల మధ్య గ్రామాలను రాజధానిగా ఎంపిక చేసుకుంది. అక్కడ లక్షల కోట్ల వ్యయం చేస్తేకాని రాజధాని నిర్మాణం పూర్తి చేయలేని పరిస్థితిని సృష్టించుకుంది. బలవంతంగా పలు చోట్ల రైతుల నుంచి భూములను సమీకరించింది. కొన్ని చోట్ల పంటలను కూడా దగ్దం చేసిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. సుమారు ఏభైవేల ఎకరాలలో రాజధాని నిర్మాణం అంటే లక్షల కోట్ల వ్యయం చేయల్సి ఉంటుంది. తొలి దశలో లక్షా తొమ్మిదివేల కోట్ల రూపాయల మేర మౌలిక వసతుల కోసం వెచ్చించాలని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. కాని కేంద్రం మాత్రం కేవలం 2500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనలతో ఆయన హడావుడి చేశారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల ప్రజలలో అమరావతిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. చివరికి ఆ గ్రామాలు ఉన్న తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలలో సైతం టీడీపీ ఓటమిపాలైంది. తదుపరి అదికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజధాని అంశంపై బోస్టన్ గ్రూప్ తో అధ్యయనం చేయించింది. ఆ తర్వాత నిపుణుల కమిటీని నియమించింది. అంతకుముందు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫారస్‌లను కూడా పరిగణనలోకి తీసుకుని విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా జగన్ సర్కార్ ప్రకటించింది. కాని దీనిని తెలుగుదేశం, జనసేన తదితర కొన్ని పక్షాలు వ్యతిరేకించాయి. అమరావతి రాజధానిని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చడం, ఇన్ సైడ్ ట్రేడింగ్ వంటి ఆరోపణలు రావడం నెగిటివ్ పాయింట్లుగా మారాయి. అంతేకాక జాతీయ రహదారికి సుదూరంగా మారుమూల గ్రామాలలో రాజధాని నిర్మించాలన్న ఆలోచనపై వివిధ వర్గాలు పెదవి విరిచాయి. అక్కడకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని గత ప్రభుత్వం ఆశించినా, అందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపలేదు. దానికి కారణం అమరావతిలో నగర వాతావరణం లేకపోవడం, కాస్మొపాలిటన్ కల్చర్ కాకుండా, సామాజికవర్గ ఆధిపత్య ధోరణి ఉండడమే అని వేరే చెప్పనవసరం లేదు. అదే విశాఖ అయితే పెద్ద నగరం కావడం, అక్కడ ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండడం, కాస్మోపాలిటన్ కల్చర్, కులాల రొంపి పెద్దగా లేకపోవడం వంటివి అడ్వాంటేజ్‌గా మారాయి. అక్కడకు పెట్టుబడిదారులు రావడం, ఐటీ వంటి పరిశ్రమలు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తుండడం కూడా కలిసి వస్తోంది. గతంలో సైతం పెట్టుబడుల సదస్సులను విశాఖలోనే నిర్వహించేవారు. తద్వారా ఆ నగర ప్రాముఖ్యతను అప్పటి ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్లయింది. కాని విశాఖ నగరం అయితే తమ రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలుగుదేశం పార్టీ ముఖ్యులు భావించి కృత్రిమ ఉద్యమం సృష్టించారు. కాని అది కాలక్రమేణా నీరుకారిపోయింది. తాజాగా మూడు రాజధానుల అంశం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. అసలు చట్టం చేసే అధికారమే అసెంబ్లీకి లేదని ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడం, అది కూడా చట్టం ఉపసంహరణ తర్వాత తీర్పు చెప్పడం ఆశ్చర్యం కలిగింది. దీనిపై గౌరవ అత్యున్నత స్థానం ఏమి చెబుతుందన్నది ఉత్కంఠ కలిగించే అంశం. చదవండి: లోకేష్ పాదయాత్రలో ఏం కనిపించింది?.. వర్కౌట్ అవుతుందా? ఈ నేపథ్యంలో జగన్ విశాఖను రాజధానిగా మరోసారి ఉద్ఘాటించడం ద్వారా తన ఆత్మ విశ్వాసాన్ని తెలియచెప్పారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో విశాఖ రాజధాని కావాలన్న ఆకాంక్ష బలంగా ఏర్పడింది. పలు చోట్ల ర్యాలీలు, సదస్సులు జరిగాయి. కాని విశాఖను రాజధాని కాకుండా అడ్డుకోవడానికి టీడీపీ, దాని అనుబంధ మీడియా విశ్వయత్నం చేస్తున్నాయి. అక్కడ ఎలాంటి అభివృద్దికి ప్రయత్నించినా, నిరోధించడానికి రకరకాల వ్యూహాలు పన్నుతున్నాయి. అయినా జగన్ ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ఏపీ దిశ,దశను మార్చే ఈ నిర్ణయాన్ని ఎంత త్వరగా అమలు చేస్తే అంత మంచిదని చెప్పాలి. ఏప్రిల్ నాటికి విశాఖ నుంచి సీఎం పాలన చేస్తారని టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ప్రకటించారు. ఇదే సమయంలో అమరావతి ప్రాంతంలో శాసన సభ ను ఉంచడమే కాకుండా, అక్కడ అభివృద్ది పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఏది ఏమైనా జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం కావాలని ఆకాంక్షిద్దాం. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ -
టీచర్స్ ట్రిప్ ఫైల్ని క్లియర్ చేయాల్సిందే! వెనక్కి తగ్గని ఆప్
ఉపాధ్యాయుల శిక్షణ కోసం విదేశాలకు పంపాలన్న ప్రతిపాదనపై ఆప్ వర్సెస్ గవర్నర్ మధ్య రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ వివాదం ముదురుతోందే తప్ప పుల్‌స్టాప్ పడటం లేదు. మరోవైపు ఆప్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మళ్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకి ఈ ప్రతిపాదనకు సంబంధించిన ఫైల్స్‌ని శుక్రవారం మళ్లీ పంపించింది. ఉపాధ్యాయుల శిక్షణ విషయంలో ఒక గవర్నర్ అడ్డంకిగా మారకూడదని ఆప్ గట్టిగా వాదిస్తోంది. ఆయన వెంటనే ఈ ప్రతిపాదనను క్లియర్ చేయాల్సిందేనని ఆప్ పట్టుబడుతోంది. అలాగే సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించాలని, ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఫైళ్లను గవర్నర్ అడిగే అవకాశం లేదని కౌంటర్ ఇచ్చింది. అంతేగాదు టీచర్ ట్రిప్‌కి సంబంధించిన ప్రతిపాదన ఫైల్ని క్లియర్ చేయమంటూ ఆప్ మళ్లీ గవర్నర్‌కి పంపించడం గమనార్హం. (చదవండి: ప్రైమరీ టీచర్లకు ఫిన్లాండ్లో శిక్షణ: ఆప్ వర్సస్ గవర్నర్ మధ్య రగడ) -
పీకల్లోతు మునిగిన వొడాఫోన్ ఐడియా: కస్టమర్లకు బ్యాడ్ న్యూస్
సాక్షి, ముంబై: దేశంలో మూడో అతిపెద్ద టెలికాం ప్రొవైడర్ వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. మీడియా నివేదికల ప్రకారం భారీగా అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం కంపెనీకి చెందిన 25 కోట్ల మంది కస్టమర్లు భవిష్యత్తులో భారీ షాకే తగలనుంది. కంపెనీ అప్పులు చెల్లించకపోవడంతో ఈ ముప్పు ఏర్పడింది. ఇండస్ టవర్స్ వొడాఫోన్-ఐడియా హెచ్చరించిన వైనం ఇపుడు సంచలనంగా మారింది. (హీరో పండుగ కానుక అదిరిందిగా!ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ 2.0) విషయం ఏమిటంటే.. టెల్కో వొడాఫోన్ ఐడియా ఇండస్ టవర్స్‌కు దాదాపు రూ. 7000 కోట్లు బకాయిపడింది. వీలైనంత త్వరగాఈ రుణాన్ని చెల్లించకపోతే, నవంబర్ నాటికి టవర్లనుఉపయోగించడాన్ని నిలిపివేస్తామని ఇండస్ టవర్స్ హెచ్చరించింది. ఈ చెల్లింపుల విషయంలో వొడాఫోన్-ఐడియా విఫలమైతే మొబైల్ నెట్‌వర్క్‌లను మూసి వేస్తుంది. ఫలితంగా యూజర్లకు కష్టాలు తప్పవు. (Tiago EV: టాటా టియాగో ఈవీ వచ్చేసింది, వావ్...తక్కువ ధరలో!) సోమవారం ఇండస్ టవర్స్ డైరెక్టర్ల బోర్డు సమావేశం కంపెనీ ఆర్థిక పరిస్థితిని సమీక్షించింది. ఈ సందర్బంగా సుమారు 7,000 కోట్ల రూపాయల బకాయిలను గుర్తించింది. దీనిపై ఆందోళన చెందిన డైరెక్టర్లు బకాయిల చెల్లింపుపై లేఖ రాశారు. ముఖ్యంగా ప్రస్తుత నెలవారీ బకాయిలలో 80 శాతం వెంటనే చెల్లించాలని వొడాఫోన్ ఐడియాకు సూచించినట్లు జాతీయ మీడియా నివేదించింది. నెలవారీ బకాయిల్లో 100 శాతం "సకాలంలో" చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. కాగా కంపెనీ మొత్తం టవర్ బకాయిలు రూ. 10,000 కోట్లు మించిపోయాయి. ఇందులో కేవలం ఇండస్ టవర్స్‌కే రూ.7,000 కోట్లు రావాల్సి ఉంది. అమెరికన్ టవర్ కంపెనీ (ఏటీసీ)కి రూ.3,000 కోట్లు బకాయి ఉంది. ఇదీ చదవండి: 28 రోజుల మొబైల్ రీఛార్జ్ ప్లాన్ వెనక మతలబు ఇదే! -
సాగునీటికెక్కడా ఇబ్బందులు లేవు
క్లోజర్ పనుల దారి పనులదే అసత్యాలు రాస్తున్నారంటూ మండిపాటు ‘దుమ్మురేపిన హామీలు–దమ్ముకేవి నీళ్లు’ సాక్షి కథనంపై చినరాజప్ప చిందులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో పంట కాలువలకు ఒకటో తేదీనే సాగునీరు ఇచ్చేశాం.. ఖరీఫ్ సాగుకు రైతులు ఇబ్బంది పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడక్కడా కాలువ పనులు జరుగుతున్నా సాగునీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం లేదు. అయినా కొన్ని పత్రికలు పనిగట్టుకుని అవాస్తవాలు రాస్తున్నాయని కాకినాడ ఆర్అండ్బి అతిథి గృహంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాలయ చినరాజప్ప పాత్రికేయులపై విరుచుకుపడ్డారు. చినరాజప్పకు కోపం రావడానికి ‘సాక్షి’లో శనివారం ‘దుమ్మురేపిన హామీలు–దమ్ముకేవి నీళ్లు’ శీర్షికన ప్రచురితమైన కథనమే కారణమైంది. కాలువలకు నీరు విడుదలచేసి రెండు వారాలు గడిచినా ఇప్పటి వరకు సాగునీరందని ఆయకట్టు పరిస్థితులపై ఫొటోలతో సహా ‘సాక్షి’లో ప్రచరితమవడంతో చినరాజప్పకు చిర్రెత్తుకు వచ్చింది. జిల్లా కేంద్రం కాకినాడలో ఎన్టీఆర్ ట్రస్టు పేరుతో పార్టీ జిల్లా కార్యాలయం కోసం అతి తక్కువ ధరకు సొంతం చేసుకున్న జెడ్పీ స్థలాన్ని మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప పరిశీలించారు. అనంతరం చినరాజప్ప విలేకర్లతో మాట్లాడుతుండగా సాగునీరు సరఫరా సక్రమంగా జరగక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పాత్రికేయులు పలు ప్రశ్నలు సంధించారు. అంతే హోంమంత్రి చినరాజప్పకు ఒక్కసారిగా కోపం కట్టలుతెంచుకుని మీరేమి మాట్లాడుతున్నారంటూ రుసరుసలాడారు. గతంలో ఎప్పుడూ లేనిది ఈ నెల ఒకటోతేదీ నాడే సాగునీరు విడుదల చేశాం ... అయినా ఇంకా సాగునీరందడం లేదని ఓ పత్రికలో (సాక్షి పేరు ఎత్తకుండా)ల్లో చూశానని, అవి అసత్యాలు రాస్తున్నాయని మండిపడ్డారు. క్లోజర్ పనులు జరుగుతుంటే పంట పొలాలకు సాగునీరు ఎలా సరఫరా అవుతుందనే ప్రశ్నకు పనులు దారి పనులవే, సాగునీరు దారి సాగునీరిదేనని చెప్పుకు వస్తూ అయినా మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటూ విలేకర్లపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. పంట పొలాలకు నీరు ఇచ్చేసినా ఇవ్వలేదని ఎలా రాస్తారంటూ ఎదురు ప్రశ్నించారు. క్లోజర్ పనులు జరుగుతున్నా సాగునీరు పూర్తిగా సరఫరా అవుతోందని చెప్పుకొచ్చారు. ఇదే విషయమై వివాదాలు లేకుండా అమలాపురం పరిసర ప్రాంతాల్లో కమిటీలు కూడా వేశామని చినరాజప్ప చెప్పారు. -
కాంతిమంతమైన కళ్లకోసం..
బ్యూటిప్స్ కీరా, బంగాళదుంప రెండిటినీ జ్యూస్ చేసి, కాటన్‌ను గుండ్రంగా చేసుకుని ఆ జ్యూస్‌లో వుుంచి కళ్లపై పెట్టుకోవాలి. 15–20 నిమిషాల తర్వాత కాటన్ తీసేసి నీటితో కడిగేయాలి. తర్వాత బేబీ ఆయిల్‌ని కంటి చుట్టూ అప్లై చేయాలి. ఇలా చేస్తే అలసిన కళ్ళు తిరిగి కాంతివంతంగా వూరతాయి కనురెప్పలు పొడవగా ఒత్తుగా పెరగాలంటే... ప్రతిరోజూ రాత్రి పడుకునే వుుందు క్యాస్టర్ ఆయిల్‌ని అప్లై చేయాలి. రెప్పలు రాలిపోకుండా దృఢంగా అవతాయి. నీటిలో కొంచెం ఉప్పు కలిపి ఆ నీటితో కళ్ళను కడిగితే కళ్ళు నిర్మలంగావూరి, మెరుస్తాయి. -
చంపేస్తాడని ముందే చంపేశారు..!
హత్య కేసును ఛేదించిన పిఠాపురం పోలీసులు నిందితుల అరెస్టు పిఠాపురం : పిఠాపురం మండలం జములపల్లి శివారు వీరరాఘవపురం పంట కాలువలో ఇటీవల దొరికిన మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించారు. తనను చంపేస్తాడన్న భయంతో ముందస్తుగానే ఒక వ్యక్తి మరొకరిని హత్య చేసినట్టు సీఐ అప్పారావు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన కార్యాలయంలో నిందితులను మీడియా ముందు హాజరుపర్చి వివరాలు వెల్లడించారు. పిఠాపురం మండలం పి.రాయవరానికి చెందిన చక్రవర్తుల నాగేశ్వరుడు (నాగేశ్వరరావు) ఆటో డ్రైవర్. తన భార్యతో అదే గ్రామానికి చెందిన కూరాకులు వీరబాబు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో తొమ్మిది నెలల క్రితం అతనితో గొడవ పడి చంపేస్తానని బెదిరించి ఆమెను కూడా కొట్టాడు. దీనిపై భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదై నాగేశ్వరుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. గ్రామ పెద్దల సలహా మేరకు వారు లోక్‌అదాలత్‌లో రాజీ పడ్డారు. అనంతరం గ్రామ పెద్దల సూచన మేరకు నాగేశ్వరుడు తన భార్యతో కలిసి పిఠాపురం మండలం నవఖండ్రవాడకు కాపురం మార్చాడు. కాగా సంక్రాంతి సందర్భంగా గత నెల 13న రాయవరం వచ్చి ఉన్నారు. అప్పటి నుంచి నాగేశ్వరరావు తనపై దాడి చేస్తాడని వీరబాబు భయపడ్డాడు. ఇటీవల రాయవరం రోడ్డులో మోటారు సైకిల్‌పై వెళుతున్న వీరబాబును నాగేశ్వరరావు తన ఆటోతో ఢీకొట్టగా గాయాలపాలై తనకు అతని వల్ల ప్రాణ భయముందని తన బంధువులకు చెప్పాడు. ఈ మేరకు ఆ రోజు రాత్రి తన బంధువులతో సమావేశమై నాగేశ్వరరావును మట్టుబెట్టేందుకు పథకం వేశారు. తునికి చెందిన లగిశెట్టి నరసింహారావు అలియాస్ జామ్‌ను నాగేశ్వరరావుపై నిఘా పెట్టాడు. గత నెల 16 వతేదీ రాత్రి పిఠాపురం నుంచి వెళ్తున్న నాగేశ్వరరావు పిఠాపురం మండలం జములపల్లి శివారు వీరరాఘవపురం పంట కాలువ దగ్గరకు వచ్చే సరికి అతనినే అనుసరిస్తున్న జామ్ తన బంధువులైన కూరాకుల వీరబాబు, కూరాకుల గంగాధర్, కూరాకుల అప్పారావు, పేకేటి వనగంగ, కూరాకుల అచ్చారావు, కూరాకుల కృష్ణ, కూరాకుల వెంకన్న, వేశలంక చిన్నయ్యలకు ఆ సమాచారం చేరవేశాడు. అక్కడకు దగ్గరలోనే ఉన్న వారంతా జామ్ సహాయంతో మెడకు ఉరి వేసి చంíపి పంట కాలువలో పడేశారు. తన భర్త కనిపించడం లేదని భార్య కృష్ణఅర్జవేణి ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులకు 23వ తేదీన పంట కాలువలో మృతదేహం సమాచారం అందింది. పిఠాపురం రూరల్ పోలీసులు విచారణ జరిపి మృతదేహం నాగేశ్వరరావుదిగా నిర్థారించారు. ఈ మేరకు వీరబాబును, మరో నలుగురిని గురువారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. మిగిలిన నలుగురు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. పిఠాపురం పట్టణ, రూరల్, ఎస్సైలు వి.కోటేశ్వరరావు, సుభాకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
సీనియర్ సిటిజన్లకు తీపికబురు
వయసు పైబడిన వారికి సామాజిక రక్షణగా తీసుకొచ్చిన పెన్షన్ స్కీమ్‌ను కేబినెట్ మంగళవారం ఆమోదించింది. ఈ స్కీమ్ కింద 10 ఏళ్ల పాటు, ఎల్ఐసీ 8 శాతం రిటర్న్‌లను గ్యారెంటీగా అందించనుంది. సోషల్ సెక్యురిటీ, ఫైనాన్సియల్ ఇక్లూజన్ ప్రొగ్రామ్ కింద ఎల్ఐసీ ఈ రిటర్న్‌లను సీనియర్ సిటిజన్లకు తప్పక ఇవ్వనుంది. వరిస్థ పెన్షన్ బీమా యోజన 2017 ఆవిష్కరిస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. ఈ స్కీమ్ కింద 10 ఏళ్ల పాటు 8 శాతం రిటర్న్‌లతో పెన్షన్‌ను అందించనున్నామని కేంద్రం హామినిచ్చింది. నెల/త్రైమాసికం/అర్థ సంవత్సరం, వార్షిక తరహాలో దేన్ని పెన్షనర్లు ఎంచుకుంటే, ఆ విధంగా రిటర్న్‌లను ఇస్తామని కేంద్రం చెప్పింది. ఈ ఏడాది నుంచి ఎల్ఐసీ ద్వారా ఈ స్కీమ్‌ను అమల్లోకి తేనున్నారు. మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ఆదాయాలు తగ్గుతాయి కాబట్టి 60 సంవత్సరాలు, ఆపై వయసు మీదపడిన వారికి ఈ స్కీమ్ ఎంతో సహకరించనుంది. -
'జల్లికట్టు' ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
-
'జల్లికట్టు' ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
చెన్నై: సంప్రదాయ జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని నిలిపివేసేలా రూపొందించిన ఆర్డినెన్స్‌కు తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు శనివారం ఆమోదం తెలిపారు. జల్లికట్టును పునరుద్ధరించాలంటూ గడిచిన ఐదు రోజులుగా తమిళనాడు వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో దిగివచ్చిన కేంద్రప్రభుత్వం.. శుక్రవారమే ఈ ఆర్డినెన్స్‌కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాలో కొద్దిపాటి మార్పులుచేసి కేంద్ర హోం, న్యాయ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు ఆమోదించాయి. అనంతరం ఆ ఆర్డినెన్స్‌ను తిరిగి రాష్ట్రానికి పంపారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా జంతుహింస నిరోధక చట్టాన్ని సవరించి, అందులోని ‘ప్రదర్శన జంతువులు(పర్ఫామింగ్ యానిమల్స్)' జాబితా నుంచి ఎద్దులను తొలగిస్తారు. ఈ ఆర్డినెన్స్‌ను జనవరి 23 నుంచి జరుగబోయే తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. సీఎం పన్నీర్ సెల్వం అళంగనలూర్లో ఈ ఆటను రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కూడా వారి సంబంధిత జిల్లాలో జల్లికట్టు ఆటకు స్వీకారం చుట్టనున్నారు. సీఎం పన్నీర్ సెల్వం పలు మార్లు విజ్ఞప్తి చేసినా వెనక్కి తగ్గని నిరసనకారులు.. ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించడంతో ఆందోళనలు విరమించే అవకాశంఉంది. (ఆర్డినెన్సుపై అనుమానాలు.. ఆగని నిరసనలు) -
వారం రోజుల్లో సమస్య పరిష్కారం
లీడ్ బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం బాలాజీచెరువు(కాకినాడ): మరో వారం రోజుల్లో నగదు సమస్య పరిష్కారమవుతుందని లీడ్ బ్యాంక్ మేనేజర్ బి.సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ నవంబర్ 8వ తేదీ నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో ఉన్న అన్ని బ్యాంకుల బ్రాంచీల ద్వారా దాదాపుగా ప్రజల నుంచి రూ.3,800 కోట్ల డిపాజిట్లు సేకరించగా రూ.1200 కోట్ల మార్పిడి చేశామని, వాటిలో ఆంధ్రాబ్యాంక్ బ్రాంచీల ద్వారా ఇప్పటి వరకూ రూ600 కోట్లకు పైగా నగదు మార్పిడి చేశామన్నారు. జిల్లాలో అన్ని ఏటీఎం బ్రాంచీలు కలిపి 931 ఉండగా వీటిలో దాదాపు 50 శాతం ఏటిఏంలు నిరంతరాయంగా 24 గంటలు పని చేస్తున్నాయని, వీటిలో అధికంగా ఎస్బీఐ ఏటీఎంలు ఉన్నాయన్నారు.ప్రభుత్వం నగదు రహిత విధానం ప్రవేశపెట్టిన నేపధ్యంలో ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా ప్రారంభించి రూపే కార్డు ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవాలని సూచించారు..ఖాతాల ప్రారంభానికి బ్యాంకులలో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుకు అదేశాలు జారీ చేశామని, స్వచ్ఛంద సంస్థలతోపాటు విద్యార్థుల సహకారం తీసుకుంటున్నామన్నారు. -
ఆరోపణలు చేసేప్పుడు క్లారిటీ అవసరం: రిజిజు
షిల్లాంగ్: పెద్ద నోట్ల రద్దుపై ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణల విషయంలో ముందుగా కాంగ్రెస్ పార్టీకి ఒక క్లారిటీ లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి తికమకకు గురికాకుండా ఒక స్పష్టతకు రావాల్సిన అవసరముందని మేఘాలయలో జరిగిన ఓ కార్యక్రమంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. ‘నోట్ల రద్దు విషయంపై కనీసం ఆర్థిక మంత్రికి కూడా చెప్పకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేశారని ఒకసారి.. ప్రకటనకు ముందే ప్రధాని నోట్లరద్దు విషయాన్ని లీక్ చేశారని ఇంకోసారి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు’ అని రిజిజు అన్నారు. ఏవైనా ఆరోపణలు చేసేటప్పుడు ఒక స్పష్టత అవసరమని ఆయన కాంగ్రెస్ నేతలకు సూచించారు. -
కర్ణాటకకు మళ్లీ ఎదురుదెబ్బ
♦ కావేరి నీళ్లు వదలాల్సిందేనని ♦ స్పష్టం చేసిన సుప్రీం కోర్టు సాక్షి, బెంగళూరు: కావేరి జలాల విషయంలో కర్ణాటకకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ. తమిళనాడుకు నీటిని వదలాల్సిందేనని కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. శనివారం నుంచి రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున ఆరు రోజుల పాటు మొత్తం 36 వేల క్యూసెక్కుల నీటిని వదలాలని ఆదేశించింది. ఈ నెల 4 లోపు కావేరి నిర్వహణ మండలిని ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. మండలిలో ప్రతినిధులుగా ఆయా రాష్ట్రాల నుంచి ఎవరెవరు ఉంటారనే వివరాలను శనివారంలోపు అందజేయాలని కావేరి నదీ పరివాహక రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలను ఆదేశించింది. నీటి పారుదల, వ్యవసాయ రంగాల నిపుణులతో కూడిన కమిటీ ఈ నెల 5ప ఇరు రాష్ట్రాల్లో పర్యటించాలనీ, వాస్తవ పరిస్థితులను తమకు తెలియజేయాలని పేర్కొంటూ విచారణను 6వ తేదీకి వాయిదా వేసింది. మీ వల్ల సుప్రీంకోర్టు గౌరవానికి భంగం ‘మీ వల్ల దేశ అత్యున్నత న్యాయస్థానం గౌరవానికి భంగం వాటిల్లింది’ అని కర్ణాటక సర్కారుపై కోర్టు మండిపడింది. మా ఆదేశాల్ని అన్ని రాష్ట్రాలు పాటించాల్సిందేనంది. ప్రధాని సమావేశం : కావేరి వివాదంపై ప్రధాని మోదీ శుక్రవారం సమావేశం నిర్వహించారు. కొంతమంది మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమస్య పరిష్కారానికి ఉన్న వివిధ మార్గాలేంటో వారు చర్చించారు. -
జిల్లా అధికారుల లెక్క తేలింది!
– జిల్లా కార్యాలయాల్లోని పోస్టుల సంఖ్య 2732 – జిల్లాస్థాయిలోని ఉద్యోగుల సంఖ్య 2030 – కొత్తగా సృష్టించాల్సిన పోస్టులు 777 – ఉద్యోగుల విభజనపై అధికారుల కసరత్తు ఖమ్మం జెడ్పీసెంటర్: కొత్త జిల్లాల ఏర్పాటు ముసాయిదా విడుదల చేసి, మ్యాప్‌లను సిద్ధం చేసిన అధికార యంత్రాంగం.. ఉద్యోగుల విభజనపై కసరత్తు చేస్తోంది. పునర్విభజనతో ఏర్పడనున్న ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు ఇంకా అందలేదు. అయినప్పటికీ, ఇప్పటివరకు 70 శాఖల్లోని ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వానికి పంపింది. దసరా రోజున (పునర్విభజన) తరువాత రెండు జిల్లాల్లో పాలన అమల్లోకి వస్తుంది. ఇప్పటికే డివిజన్లు, మండలాలు; సరిహద్దు మ్యాప్‌లు సిద్ధమయ్యాయి. పాలనకు అనుగుణంగా కార్యాలయాలను గుర్తించి, అవసరమైన బడ్జెట్‌ను కూడా ప్రభుత్వానికి పంపింది. ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేస్తే పూర్తిస్థాయి ఆ ప్రక్రియ(విభజన)ను త్వరగా పూర్తిచేసేందుకు జిల్లా అధికారులు సిద్ధంగా ఉన్నారు. –––––––––––––––– ఇదీ, ఉద్యోగుల లెక్క (ఉమ్మడి) జిల్లాలోని 70 ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాల్లో 2732 పోస్టులు ఉన్నాయి. 2030 మంది ఉద్యోగులు ఉన్నారు. 708 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు జిల్లాల్లోని ప్రధాన శాఖలలో మరో 777 పోస్టులను సృష్టించాల్సుంటుందని ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదికల్లో తెలిపారు. ప్రస్తుతమున్న ఉద్యోగులను రెండు జిల్లాలకు (ఖమ్మం జిల్లాకు 1170 మందిని, కొత్తగూడెం జిల్లాకు 712 మందిని) తాత్కాలికంగా విభజించారు. –––––––––––––––– ఎక్కడెక్కడ.. ఏయే శాఖలకు.. ఎంతెంతమంది.. జిల్లా అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికల ప్రకారం.. ఒక్కో కలెక్టరేట్‌కు 82 మంది ఉద్యోగులు అవసరమవుతారు. ప్రస్తుత కలెక్టరేట్లో 77 మంది మాత్రమే ఉన్నారు. పశుసంవర్థక శాఖలో 21 పోస్టులు ఉన్నాయి. మరో 15 కావాలి. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 15 పోస్టులు ఉన్నాయి. మరో 24 కావాలి. డీఆర్డీఏలో 84 పోస్టులకుగాను 46 మంది ఉన్నారు. వీరిని ఖమ్మానికి 31 మందిని, కొత్తగూడేనికి 15 మందిని కేటాయిస్తారు. డ్వామాలో 69 పోస్టులకుగాను 49 మంది ఉన్నారు. మరో 43 పోస్టులు కావాలి. ట్రెజరీలో 76 పోస్టులకుగాను 49 మంది ఉన్నారు. వీరిలో ఖమ్మానికి 41 మందిని, కొత్తగూడేనికి 35 మందిని సర్దుబాటు చేస్తారు. ట్రైబల్ వెల్ఫేర్‌లో 22 పోస్టులకుగాను ఖమ్మానికి ఏడు, కొత్తగూడేనికి 15 కేటాయిస్తారు. మరో 24 పోస్టులు కావాలి. టీఎస్ ఎన్పీడీసీఎల్లో 189 పోస్టులకుగాను 169 మంది ఉన్నారు. ఇంకా 177 పోస్టులు కావాలి. ఆత్మాలో 55 పోస్టులకుగాను 42 మంది ఉన్నారు. వీరిలో 39 మందిని ఖమ్మం జిల్లాకు, 16 మందిని కొత్తగూడెం జిల్లాకు పంచుతారు. ఎక్సైజ్ శాఖలో 347 పోస్టులకుగాను 267 మంది ఉన్నారు. వీరిలో 191 మందిని ఖమ్మం జిల్లాకు, 156 మందిని కొత్తగూడెం జిల్లాకు కేటాయిస్తారు. పోలీస్ శాఖలో 258 మందికిగాను 221 మంది ఉన్నారు. 115 మందిని ఖమ్మం జిల్లాకు,106 మందిని కొత్తగూడెంలో సర్దుబాటు చేస్తారు. రవాణా శాఖలో 44 పోస్టులకుగాను 31 మంది ఉన్నారు. వీరిలో ఖమ్మానికి 19 మందిని, కొత్తగూడేనికి 12 మందిని కేటాయిస్తారు. –––––––––––––– మార్గదర్శకాల ఆధారంగా సర్దుబాటు జిల్లావ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో జిల్లాస్థాయి కార్యాలయాల్లో 2,000 మంది పనిచేస్తున్నారు. మిగతా 28,000 మంది ఉద్యోగుల్లో 10,000 మందికి పైగా ఉపాధ్యాయులే ఉన్నారు. మిగతా 18,000 మందిలో గ్రామ, మండలస్థాయి ఉద్యోగులుæ ఉన్నారు. ఆయా శాఖల్లోని ఉద్యోగులను సీనియారిటీ జాబితా ప్రకారం కొత్త జిల్లాకు పంపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతానికి సర్దుబాటు మాత్రమే ఉంటుందని, నిబంధనలు వచ్చిన తరువాత విభజన పూర్తిస్థాయిలో విభజన ఉంటుందని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఆప్షన్లు, స్థానికతపై స్పష్టత ఆధారంగానే సర్దుబాటు ఉంటుందన్నారు. జిల్లా కార్యాలయాల్లోని ఉద్యోగులు మినహా మిగతావారంతా (డివిజన్, మండల, గ్రామస్థాయి ఉద్యోగులు) ఎక్కడివారు అక్కడే ఉంటారు. (ఉమ్మడి) జిల్లా కార్యాలయాల్లోని అధికారుల్లో మొదటి సీనియారిటీలోగల వారిని ఖమ్మంలో, రెండో సీనియారిటీలోగల వారిని కొత్తగూడెంలో, మూడో సీనియారిటీలోగల వారిని ఖమ్మంలో, నాలుగో సీనియారిటీగల వారిని కొత్తగూడెంలో (ఇలా ప్రతి క్యాడర్లో) సర్దుబాటు చేస్తారు. ––––––––––––––––– కొత్తగూడెం కలెక్టర్‌గా దివ్య? కొత్తగా ఏర్పడే జిల్లాలకు జాయింట్ కలెక్టర్ స్థాయి క్యాడర్ అధికారులను కలెక్టర్లుగా నియమించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. ఇదే నిజమైతే, కొత్తగూడెం కలెక్టర్‌గా ప్రస్తుత జాయింట్ కలెక్టర్ దేవరాజన్ దివ్య నియమితులవుతారు. ఆమె ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో, సమీక్ష సమావేశాల్లో పాల్గొంటున్నారు. పాలనావ్యవహారాలపై పట్టు బిగిస్తున్నారు. ఇటీవల జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యుల ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులిçస్తూ సజావుగా సాగేలా చూశారు. ఈ నేపథ్యంలో, కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా దివ్యను పంపాలని పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. -
చర్చలు సఫలం.. కుదిరిన ఒప్పందం
ఫలించిన ప్రైవేటు డ్రైవర్ల పోరాటం జీతాలు పెంచుతూ యాజమాన్యాల నిర్ణయం కనీస వేతనాల అమలుకు హామీ కరీంనగర్‌ఎడ్యుకేషన్ : కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థల వాహనాల డ్రైవర్లు చేస్తున్న పోరాటం ఫలించింది. వేతనాలు పెంచుతామని యాజమాన్యాలు హామీ ఇవ్వడంతో ఐదు రోజుల ఆందోళనకు తెరపడినట్లయ్యింది. మంగళవారం డెప్యుటీ లేబర్ కమిషనర్ గాంధీ తన కార్యాలయంలో సీఐటీయూ నాయకులు, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపారు. డ్రైవర్ల తరఫున డ్రైవర్ల సంఘం బాధ్యులు, సీఐటీయూ జిల్లా నాయకులు ఎరవెల్లి ముత్యంరావు, గుడికందుల సత్యం, ఎడ్ల రమేశ్, ప్రైవేట్ విద్యాసంస్థల తరఫున యాదగిరి శేఖర్‌రావు, వి.నరేందర్‌రెడ్డి, కె.సంజీవరెడ్డి, సరోజ, కేశిపెద్ది శ్రీధర్‌రాజు పాల్గొన్నారు. సమ్మె నోటీసులో పేర్కొన్న విధంగా డ్రైవర్లకు రూ.9,700తోపాటు డ్రైవర్ల పిల్లలకు ఉచిత విద్య, ఆర్నెల్లకోమారు రెండు జతల దుస్తులు, పీఎఫ్, ఈపీఎఫ్, గుర్తింపుకార్డులజారీ చేసేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి. అలాగే కక్షసాధింపు చర్యలకు పాల్పడబోమని, కనీస వేతనాలను ఆగస్టు1 నుంచి అమలు చేస్తామని ఒప్పందం రాసిచ్చారు. చర్చలు సఫలం కావడంతో ప్రైవేట్ స్కూల్స్, కాలేజీ వ్యాన్స్ డ్రైవర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు గుడికందుల సత్యం, అధ్యక్ష, కార్యదర్శులు దాసరి శ్రీనివాస్, తాళ్ల కిషన్, అమిరిశెట్టి శ్రీనివాస్, నరేశ్, ఆంజనేయులు, రామస్వామి, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌ను వీడేది లేదు: కె.ఆర్.సురేశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితిలో వీడేది లేదని మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనేలేదని, టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమని కొట్టిపారేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా.. 15 ఏళ్లు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశానని చెప్పారు. తెలంగాణ చర్చల సందర్భంగా ఒకసారి ఢిల్లీలో కేసీఆర్‌తో మాట్లాడానే తప్ప, రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆయనను కలవలేదన్నారు. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రచారం జరుగుతున్న వారందరితో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చర్చించారని ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో గంటకు పైగా చర్చించారని, మిగతా వారితో ఫోన్లో సంప్రదించారని పేర్కొన్నారు. -
టాక్స్ రిటర్న్స్ దాఖలుకు చివరి అవకాశం
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. పెండింగ్ టాక్స్ రిటర్న్స్ క్లియర్ చేయడానికి ప్రత్యక్షపన్నుల శాఖ మరో చివరి అవకాశాన్ని ప్రకటించింది. గత ఆరేళ్లుగా టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయనివారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. 2009 నుంచి 2016 వరకు ఇంకా తమ టాక్స్ రిటర్న్స్ ప్రాసెస్ చేయనివారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) మరో అవకాశం కల్పిస్తోంది. ఈ మొత్తం ఆరేళ్లకు కలిపి ఒకేసారి రిటర్న్స్ దాఖలు చేయడానికి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చింది. ఈలోగా తమ రిటర్స్ ను ఫైల్ చేయాలని, లేదంటే మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తోంది. అంతేకాదు ఇదే చివరి అవకాశమని కూడా స్పష్టం చేసింది. ఇప్పటికే ఆన్ లైన్ లో రిటర్న్స ఫైల్ చేసిన వారు 'ఐటీఆర్ ధ్రువీకరణ' (ఐటిఆర్ -వెరిఫికేషన్) పత్రాన్ని నిర్ధారించుకోవాలని సూచించింది. ఆదాయం పన్ను శాఖ బెంగళూరు ఆధారిత సేకరణ కేంద్రం నుంచి ఐటీఆర్-వి రసీదు కాపీ 120 రోజుల లోపుల పన్ను చెల్లింపుదారులకు చేరాలని, ఒకవేళ చేరకపోతే ఆ చెల్లింపును చెల్లనిదిగా పరిగణిస్తారని పేర్కొంది. కావాలంటే ఐటీఆర్ వీ స్టేటస్ ను టాక్స్ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చని తెలిపింది. దీనికి పాన్ నెంబర్, సంబంధిత అంచనా సంవత్సారాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రయోజనం పొందాలని టాక్స్ ప్లానర్.కామ్ ప్రతినిధి సుధీర్ కౌశిక్ తెలిపారు. ఇపుడు ఫైల్ చేయకపోతే, రిఫండ్స్ ప్రాసెస్ చేయడం జరగదన్నారు. వీటిని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అనుమతి ఉండదని కౌశిక్ వివరించారు. మరోవైపు ఇపుడు విఫలమైతే మొత్తం అన్నిసంవత్సరాలను పరిగణనలోకి తీసుకుంటారని, కనీసం రూ. 5,000 జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అందుకే మరింత ఆలస్యం లేకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కాగా గత ఏడాది ఆధార్ కార్డు ద్వారా ఐటీఆర్-వీ, ఓటీపీ వెరిఫికేషన్ పద్ధతిని ప్రవేశపెట్టింది. యూజర్లు ఇంట్లోనే ఉండి తేలికగా ఈ సదుపాయాన్ని వాడుకునేలా ఈ-ఫైలింగ్ ప్రక్రియను సులభతరం చేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో టాక్స్ రిటర్న్స్ 68.5 శాతం పెరిగి, రికార్డు సృష్టించాయి. 8.32 లక్షల మంది వినియోగదారులు, ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్(ఐటీఆర్స్) ను ఎలక్ట్రానిక్ గా ఫైల్ చేశారని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) గణాంకాలు తెలిపాయి. -
ఈసీలో తప్పులొద్దు!
సాక్షి, హైదరాబాద్: ఈసీ.. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఆస్తి కొనేటప్పుడు అక్కరకొచ్చే కీలకమైన పత్రం. ఈసీ కోసం దరఖాస్తు చేసేటప్పుడు వివరాలన్నీ స్పష్టంగా రాయాలి. మనం కొనాలనుకున్న ఆస్తి ఎక్కడుంది? దాని సర్వే నంబరు? విస్తీర ్ణం రాయాలి. వ్యవసాయ భూమి అయితే ఎన్ని ఎకరాల్లో ఉంది? ప్లాటు అయితే ఎన్ని గజాల్లో ఉందో రాయాలి. ఆ ఆస్తికి నలువైపులా గల హద్దులను పేర్కొనాలి. అంతేకాకుండా నాలుగువైపులా ఉన్న స్థల యజమానుల పేర్లు కూడా రాయాలి. అప్పుడే ఆస్తిపరంగా, వ్యక్తిపరంగా ఈసీ పత్రాన్ని అందుకోవచ్చు. -
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది
-
రెండో రోజు ప్రశాంతం
జగిత్యాల జోన్, న్యూస్‌లైన్ :జగిత్యాల మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థా నంలో నిర్వహిస్తున్న బీఎస్సీ అగ్రికల్చర్ వెబ్‌కౌన్సెలింగ్ మంగళవారం ప్రశాంతంగా జరిగింది. రెండో రోజు కౌన్సెలింగ్‌కు 32 మంది మాత్రమే హాజరయ్యూరు. ఇందులో వ్యవసాయ కోర్సులతోపాటు వెటర్నరీ, హార్టికల్చర్ కోర్సులకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో నోటిఫికేషన్లో ఇచ్చినట్లుగా ఉదయం, సాయంత్రం అని చూడకుండా ఎవరూ ముందువస్తే వారిని లోనికి అనుమతించారు. బుధవారం బీసీ(డి), బీసీ(ఇ), ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీల విద్యార్థులకు ఫార్మర్, నాన్ఫార్మర్ కోటా కింద, నోటిఫికేషన్లో ఇచ్చిన ర్యాంకుల మేరకు కౌన్సెలింగ్ జరగనుంది. రైతుల కోటాకు లేనిపోని నిబంధనలు..రైతుల కోటాకు వ్యవసాయ విశ్వవిద్యాలయం లేనిపోని నిబంధనలు పెట్టడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రైతు కోటా కింద సీట్లు పొందే విద్యార్థులకు తండ్రి లేదా తల్లి లేదా విద్యార్థి పేరు మీద మూడెకరాలకు తక్కువ కాకుండా భూమి ఉండాలి. దీనికి తోడు నాలుగేళ్లపాటు గ్రామీణ ప్రాంతాల్లో చదవాలనే నిబంధనతో చాలా మంది విద్యార్థులు రైతుల కోటా కిందకు రావడంలేదు. దీంతో కౌన్సెలింగ్ కేంద్రంలో నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులతో వాగ్వావాదం జరుగుతోంది. మంగళవారం ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన ఓ విద్యార్థినికి మూడెకరాలకు పైగా భూమి ఉన్నప్పటికీ ఎస్సెస్సీ వరకు పట్టణ ప్రాంతంలో చదవడంతో రైతుల కోటా వర్తించలేదు. లేనిపోని నిబంధనలు పెట్టి, విద్యార్థుల జీవితాలతో అడుకుంటున్నారని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రస్తుత రోజుల్లో అందరూ పట్టణ ప్రాంతాల్లోనే చదువుకుంటున్నారని, ఈ నిబంధన మార్చాలని వారు కోరారు. యూనివర్సిటీ నిబంధనల మేరకే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వెబ్కన్వీనర్ కిషన్ రెడ్డి, కోకన్వీనర్ తిప్పేస్వామి చెప్పారు. అగ్రిసెట్‌లో 100లోపు ర్యాంకుల వారికి కౌన్సెలింగ్ రెండేళ్ల వ్యవసాయ పాలిటెక్నిక్ చదివి, నాలుగేళ్ల బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో చేరేందుకు నిర్వహించిన అగ్రి సెట్ ప్రవేశపరీక్షలో 100 లోపు ర్యాంకు సాధించిన వారు ఈ నెల 12న హైదరాబాద్‌లోని హోంసైన్స్ కాలేజీ-సైఫాబాద్‌లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. సీడ్ టెక్నాలజీలో 50 లోపు ర్యాంకు సాధించిన వారు సైతం హాజరుకావచ్చు. -
రెండోరోజూ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రశాంతం
ఖమ్మం, న్యూస్‌లైన్ : ఎంసెట్ కౌన్సెలింగ్ రెండవరోజు మంగళవారం కూడా జిల్లాలోని మూడు సెంటర్లలో ప్రశాంతంగా జరిగింది. ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల, కొత్తగూడెం మండల పరిధిలోని రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, భద్రాచలం ఎటపాక ప్రభుత్వ పాలి టెక్నిక్ కళాశాలలో కౌన్సెల్సింగ్ నిర్వహించారు. 15,001 నుంచి 30 వేల లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు నిర్వహించిన కౌన్సెలింగ్‌కు ఖ మ్మం లో 252 మంది, కొత్తగూడెంలో 70 మంది, భద్రాచలంలో 29 మంది మొత్తం 351 మంది హాజరై తమ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకున్నారు. సీంమాధ్రలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కు వ్యతిరేకంగా సమ్మెలు, ఆందోళనలతో కౌన్సె లింగ్ నిలిచిపోయింది. ఉద్యోగులు, విద్యార్థి సం ఘాలు కౌన్సెలింగ్‌ను బహిష్కరించడంతో కృష్ణా, తూ ర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 61 మం ది విద్యార్థులు మన జిల్లాలో కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. బుధవారం జరిగే కౌన్సెలింగ్‌లో 30,001 నుంచి 45 వేల లోపు ర్యాంకు సాధించిన వారు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలని ఎం సెట్ జిల్లా కోఆర్డినేటర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. -
రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయాలి
తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ రాజధానిపై కేంద్రప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తెలంగాణపై స్పష్టత ఇవ్వకుం డా ఆంధ్రలో ఓ ప్రకటన చేస్తూ కాలయాపన చేస్తోందన్నారు. సోమవారం ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటులో కేంద్ర మంత్రుల మాటలకు పొందన లే కుండాపోయిందని, యూపీఏ చైర్ పర్స న్ సోనియా తెలంగాణపై కఠిన నిర్ణయం తీసుకుని డిమాండ్‌చేశారు. పది జిల్లాల తో కూడిన తెలంగాణ, అలాగే రా జధాని హైదరాబాద్ కావాలని డిమాండ్‌చేశారు. సీమాంధ్రలో ఆందోళనలతో విద్యార్థుల కు నష్టం జరుగుతుందన్నారు. వెంటనే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించి వి ద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. అధిష్టానం అనుమతితోనే సీ మాంధ్రలో ఉద్యమాలు జరుగుతున్నాయని, ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్న సీఎం, పీసీసీ చీఫ్‌లను వెంటనే డిస్మిస్ చేయాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఈ నెల 11న హైదరాబాద్‌లో జరిగే నవభార యువభేరి సభకు లక్షలాది మంది యువకులు హాజరవుతున్నారని తెలిపారు. నరేంద్రమోడీ ప్రధాని కావడం ఖాయం దేశంలో నరేంద్రమోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని, కచ్చితంగా ఆయన ప్రధానమంత్రి కావడం ఖాయమని బీ జేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తత్రేయ అన్నారు. యువత దేశంలో మార్పుకావాలని ఆకాంక్షిస్తున్నారని, అం దుకు నరేంద్రమోడీని సమర్థవంతుడిగా భావిస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం స్థానిక విజన్ ఫంక్షన్హాల్లో జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామగ్రామానా బీజేపీ ని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని కోరారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు తీసుకొచ్చేందుకు కేంద్రంపై బీజేపీ ఒత్తిడి తీసుకొస్తుందన్నారు. దేశంలో రానున్న రోజు ల్లో ఎన్డీఏ కూటమి ఏర్పాటు అవుతుం దని సర్వేలు తేల్చిచెప్పడంతోనే భయపడి తెలంగాణ ఇచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, సౌకర్యాలు సమకూరుతాయని చెప్పారు. నూతన సర్పంచ్‌లు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి, ఉపాధ్యక్షుడు ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ..బీజేపీ బలమైన శక్తిగా ఎదిగి విజ యపరంపర దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నరేంద్రమోడీ రాకతో రాష్ట్రంలో ఉత్సహంగా నెలకొందన్నారు. పాకిస్తాన్, చైనా ఉగ్రవాదులు దే శంలోకి చొరబడి, భూ ఆక్రమణకు పాల్పడుతున్నా కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. అనంతరం బం డారు దత్తాత్రేయ, ప్రేమేందర్‌రెడ్డిలను పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. జిల్లాలో నూతనంగా ఎంపికైన బీజేపీ సర్పంచ్‌లను కూడా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కె.రతంగపాండురెడ్డి, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీవర్ధన్‌రెడ్డి, పడాకుల బాలరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రాములు, నింగిరెడ్డి, బీజేపీ నాయకులు కొండయ్య, కృష్ణవర్ధన్‌రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.