సంప్రదాయ జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని నిలిపివేసేలా రూపొందించిన ఆర్డినెన్స్కు తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు శనివారం ఆమోదం తెలిపారు. జల్లికట్టును పునరుద్ధరించాలంటూ గడిచిన ఐదు రోజులుగా తమిళనాడు వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో దిగివచ్చిన కేంద్రప్రభుత్వం.. శుక్రవారమే ఈ ఆర్డినెన్స్‌కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాలో కొద్దిపాటి మార్పులుచేసి కేంద్ర హోం, న్యాయ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు ఆమోదించాయి. అనంతరం ఆ ఆర్డినెన్స్ను తిరిగి రాష్ట్రానికి పంపారు.
Published Sat, Jan 21 2017 7:26 PM | Last Updated on Thu, Mar 21 2024 8:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement